Posts

Showing posts from April, 2021

ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ || Prema Kosam Rajasabha Varaku Vachhina Alamkaravathi Katha || Episode - 14 || Bhatti Vikramarka Kathalu

Image
  ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ అలంకారవతి చంద్రవర్మను వెంటబెట్టుకొని రాజసభకు వెళ్ళింది. రాజుకు నమస్కరించి అక్కడ నిలబడింది. చంద్రవర్మ ఆ రాజును ఆశీర్వదించాడు. అందగాడైన చంద్రవర్మ గొప్ప తేజస్సుతో, మన్మథుడిలా ప్రకాశిస్తూ ఉండటం చూసి, ఆ పట్టణ ప్రభువైన మహేంద్రవర్మ ఆశ్చర్యపోయాడు. రాజు వారిని కూర్చోమని చెప్పి, వేశ్య కూతురైన అలంకారవతిని చూసి ఇలా అడిగాడు: "ఓ అందగత్తె! నువ్వు ఎవరివి? ఈ నగరంలోనే ఉంటావా? నిన్ను నేనెప్పుడూ చూడలేదే! ఈ బ్రాహ్మణోత్తముడు ఎవరు? ఇతడిని ఇప్పుడు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? మీరు వచ్చిన కారణం ఏంటో వివరించు." అందుకు అలంకారవతి రాజుతో ఇలా అంది: "మహాప్రభూ! నేను ఈ నగరంలోనే పేరుపొందిన ఒక వేశ్య కుమార్తెను. నా పేరు అలంకారవతి. నేను ఒక వ్రతాన్ని నియమంగా పెట్టుకుని, మా వేశ్య కుల మర్యాద అయిన వ్యభిచార వృత్తిని వదిలేశాను. బయటి ప్రపంచానికి కూడా తెలియకుండా ఇప్పటివరకు ఇంట్లోనే కాలం గడిపాను. అందుకే మీరు నన్ను చూసే అవకాశం రాలేదు." ఆ తర్వాత ఆమె తన వ్రతం వివరాలను, ఆ బ్రాహ్మణుడు తన ఇంటికి రావడం, అతడిని చూసి తాను మోహించి, నిద్ర లేపడానికి పడిన తాపత్రయాన్ని, తన మనసులోన...

Chandamama sankar ani evarini antaru?

Image
  చందమామ శంకర్ అని ఎవరిని అంటారు? ఇప్పుడు మనం ప్రముఖ భారతీయ కళాకారుడైన  కరతోలువు చంద్రశేఖరన్ శివశంకరన్ గురించి తెలుసుకుందాం ! శివశంకరన్ గారు   2020 సెప్టెంబర్ 29 న చెన్నైలోని తన నివాసంలో 96 సంవత్సరాల వయస్సులో  కన్నుమూశారు.  శివశంకర్ గారు భారతీయ పత్రిక అయిన చందమామకు చేసిన అమూల్యమైన కృషి కి చందమామ శంకర్ గా పేరు పొందారు. అతను చందమామ పుస్తకంలో వచ్చినా విక్రమ భేతాళ కథలలో వేసిన బొమ్మలకు కాను తనకు మంచి పేరు వచ్చింది.  ఇతను ఇంకా చాలా రకాల  బొమ్మలను చందమామ పుస్తకాలలో గీశారు కానీ అన్నిటికంటే విక్రమబేతాళ కథల వలన ఇతనికి మంచి పేరు వచ్చింది. శంకర్ గారు తమిళనాడు రాష్ట్రంలో ఎరోడ్ ప్రాంతానికి దగ్గరలో ఉన్న గ్రామాల్లో  1927 లో జన్మించారు.  శంకర్ గారు అతని తల్లి, అతని సోదరుడు 1934 లో  చెన్నైకి తరలివెళ్లారు.  శంకర్గారికి బొమ్మలు వేయడం అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం, అందుకే తన చిన్నప్పటి నుంచే బొమ్మలు వెయ్యడం నేర్చుకున్నాడు.  అతను తన చరిత్ర పరీక్షలు  ప్రసిద్ధి చెందిన చరిత్రకారుల బొమ్మలు వేసేవాడు. తన గ్రేడ్ 12 పూర్తి అయ్యాక, గవర్నమెంట్ కా...

subahu, marichulanu sriramudu ela champadu?

Image
సుబాహు మారీచులను శ్రీరాముడు ఎలా చంపాడు? రాముడు విశ్వామిత్రుని  ఆ వనం గురించి చెప్పమని అడుగుతాడు కదా అప్పుడు విశ్వామిత్రుడు రామునితో ఇలా అంటాడు: నాయన! పూర్వం విరోచనుడి  కొడుకు అయినా బలి మహాపరాక్రమశాలి, అతనికి మూడు లోకాలను చేయించి స్వర్గలోకం ఆక్రమించే సరికి మహావిష్ణువు  కశ్యపుడికి వామనుడిగా పుట్టి బలి చేసే మహాయజ్ఞానికి వెళ్లి బలిని మూడు అడుగుల భూమి ని అడుగుతాడు. బలి ఆ మూడు అడుగులు ఇచ్చాడు, వామనుడు మూడు అడుగులు కొలిచి మూడులోకాలు తీసుకొని  బలిచక్రవర్తిని అధోలోకానికి పంపేశాడు. ఆ  వామనుడి తండ్రి అయిన కశ్యపుడు కూడా ఈ ఆశ్రమంలోనే బాగా తపస్సు చేశారు. అందుచేత నేను కూడా ఇక్కడే ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నాను, రాక్షసులు మాటి మాటికి వచ్చి నన్ను  చాలా బాధపడుతున్నారు. వారందరినీ  నీవు చంపాలి అని విశ్వామిత్రుడు శ్రీరామునితో అంటాడు. విశ్వామిత్రుడు ఉంటున్న ఆ  ఆశ్రమం పేరు  సిద్ధాశ్రమం. విశ్వామిత్రుడు రామ లక్ష్మణులతో సహా ఆశ్రమంలోకి రాగానే  అక్కడ ఉండే మిగతా మునులందరూ సంతోషముతో పరిగెత్తుకుంటూ వచ్చి విశ్వామిత్రుడ్ని పూజించి, రామ లక్ష్మణులకు అతిథి సత్కారాలు...

viswamitrudu ramuniki ichina ayudhalu emiti?

Image
 విశ్వామిత్రుడు రామునికి ఇచ్చిన ఆయుధాలు ఏమిటి? ఇప్పుడు మనం విశ్వామిత్రుడు శ్రీరాముడికి ఏమేమి ఆయుధాలు ఇచ్చాడు తెలుసుకుందాం! తాటకను వధించిన రోజు వారు అక్కడే వున్నారు కదా ఆ తర్వాత రోజు ఉదయాన్నే వాళ్ళు సంధ్యా వందనం చేసాక విశ్వామిత్రుడు రామునితో రామా! నీకు అన్నీ దివ్యాస్త్రాలను ఇస్తాను. వాటితో నువ్వు అసురులను, గంధర్వులను, దేవతలను అందరినీ నీవు యుద్ధంలో చేయించగలవు అని చెప్తాడు.ఇప్పుడు ఆ దివ్యాస్త్రాలు ఏమిటో తెలుసుకుందాం. దండచక్రము, ధర్మచక్రము, కాలచక్రము, విష్ణుచక్రం అలాగే  ఇంద్రాస్త్రం, వజ్రాస్త్రం, శివుని శూలంతో సమానమైన శూలస్త్రం, బ్రహ్మశిరోనామకాస్త్రమును అలాగే అన్నింటికంటే గొప్పదైన బ్రహ్మాస్త్రమును నీకు ఇస్తాను.  అంతేకాకుండా నీకు  మోదకి,శిఖరి అనే రెండు గధా ఆయుధాలను కూడా ఇస్తాను. నీకు ఇంకా ధర్మపాశము, కాలపాశము, వారుణాస్త్రము ఇస్తాను. ఇంతేకాకుండా  నీకు ఇంకా రెండు  పిడిపాటులను అంటే తడిగా పిడుగు, పొడిగా ఉన్న పిడుగు  ఇస్తాను. ఇంకా నీకు పినాక అస్త్రమును, నారాయణ అస్త్రం ఇస్తాను అని విశ్వామిత్రుడు రామునితో అన్నాడు. అంతేకాకుండా ఇంకా ఏమేమి అస్త్రాలు విశ్వామిత్రుడ...

taatakanu sriramudu enduku champadu?

Image
తాటకను శ్రీరాముడు ఎందుకు చంపాడు?   ఇప్పుడు మనం తాటకి  ఎవ్వరూ తనకి వెయ్యి ఏనుగుల బలం ఎలా వచ్చిందో తెలుసుకుందాం! ఆ రెండు దేశాలను అరణ్యంగా మార్చింది కదా ఆ అరణ్యాన్ని తాటక వనం అని కూడా అంటారు.    శ్రీ రాముడు తాటక కి అంత బలం ఎలా వచ్చింది అని విశ్వామిత్రుడ్ని అడగగా  విశ్వామిత్రుడు అప్పుడు నీకు తాటక వృత్తాంతం కూడా చెబుతాను విను అని చెప్పి రామలక్ష్మణులకు చెబుతాడు. సుకేతుడు అనే గొప్ప యక్షుడు   వుండేవాడు. ఆయనకు బిడ్డలు లేరు ఆయన బిడ్డలను కోరి గొప్ప తపస్సు చేశాడు. బ్రహ్మ ఆయన తపస్సుకు సంతోషించి ఆయనకు కొడుకును ఇవ్వకుండా వెయ్యి ఏనుగుల బలం గల  కూతురు కలిగేలాగా వరం ఇచ్చాడు బ్రహ్మ వర ప్రభావంచేత సుకేతుడు కి తాటక పుట్టి పెరగసాగింది. ఆమె యుక్త వయసుకు వచ్చి మంచి అందగత్తె గా తయారయ్యింది, అప్పుడు సుకేతుడు ఆమెను సుందుడు అనే యక్ష కుమారుడికి ఇచ్చి వివాహం చేశాడు. వారిద్దరికీ మారీచుడు అనే కొడుకు కలిగాడు. అతను పరాక్రమములో ఇంద్రుడ్ని పోలినవాడు. చాలా గర్వం కలవాడు ఇలావుండగా ఒక సంగతి  జరిగింది. ఈ ప్రాంతాములో తపస్సు చేసుకుంటున్న అగస్త్యుడు తాటక భర్త అయిన సుందుడుని చంపాడు....

Pillikunaki tana basha emito telisinda? || Ramalinganiki Vikatakavi ane peru ela vachhindi?

Image
పిల్లి కూనకి తన భాష ఏమిటో తెలిసిందా? ఇప్పుడు మనం  తల్లి లేని పిల్లికూన అనే కథ గురించి తెలుసుకుందాం ! అనగనగా ఒక ఊరు ఆ ఊరి బయట ఒక పిల్లి వుండేది దానికి ఒక పిల్లికూన పుట్టింది. పిల్లికూన పుట్టగానే ఆ పిల్లి చనిపోయింది తల్లిలేని పిల్లికూనకు పిల్లి భాష ఏమిటో తెలీదు. పిల్లికూనకు  బాగా ఆకలి వేసింది పిల్లికూనకు పాలు కావాలి అని ఎలా అడగాలో తెలియలేదు దానికి బాగా ఆకలి వేసి వీధుల్లో తిరుగుతూ,ఏడుస్తూ నడుస్తుంది. దారిలో దానికొక కుక్కపిల్ల కనబడింది కుక్కపిల్ల పిల్లికూనను ఇలా అడిగింది: అదేమిటంటే పిల్లికూనా! పిల్లికూనా! గళ్లగళ్ల పిల్లికూన కళ్ళనీళ్ళు ఎందుకమ్మా? ఏడుస్తూనే ఉంది పిల్లికూన. అప్పుడు పిల్లికూనా ఇలా చెప్పింది : కుక్కపిల్ల ! కుక్కపిల్ల ! ఒక సంగతి చెప్పగలవా ఆకలేస్తే పాలకోసం అమ్మని ఏమని అడుగుతావు? అని పిల్లికూనా కుక్కపిల్లని అడిగింది. అప్పుడు కుక్కపిల్ల ఇలా అన్నది మా కుక్క భాషతో భౌ భౌ అని అరుస్తూ అని అరుస్తాను అని చెప్పింది. మీకు కూడా పాలు కావాలంటే భౌ భౌ అని అరవమన్నది. భౌభౌ అని అరవలెేను  బాగోలేదు కుక్క భాష నాకు నా మాతృభాష తప్ప మరో భాష వద్దే వద్దు అని వెళ్ళిపోయింది. దారిలో ఒక కోడెదూడ క...

Jittula Marina Nakka

Image
జిత్తులమారిన నక్క   ఇప్పుడు మనం జిత్తులమారి నక్క అనే కథ గురించి తెలుసుకుందాం  ! అనగనగా ఒక అడవి ఆ అడవిలో ఒక నక్క ఉండేది. ఆ నక్క చాలా మోసం చేస్తూ ఉంటది అందరిని.ఆ నక్క ఆ అడవిలోకి ఎలా వచ్చిందో,ఎక్కడ్నించి వచ్చిందో ఎవరికీ తెలీదు. మిగిలిన జంతువులకు ఆ నక్క ప్రవర్తన చాలా విచిత్రంగా ఉండేది. అందుకని మిగతా నక్కలన్నీ నీవు మా దానివి కాదు అని అన్నవి అంతేకాదు దానితో మాట్లాడ్డం కూడా మానేశాయి. ఇక ఆ నక్క దాని ఆటలు సాగక ఏమి చేయాలో అని ఆలోచించి దగ్గరలో ఉన్న ఊరికి  పోయి  ఒక మంగలి వాణితో స్నేహం  చేసుకున్నది పాపం అతను చాలా మంచివాడు.అతను ఆ నక్క మాటలన్నీ నిజమనుకొని నక్కను నమ్మి దానితో స్నేహం చేశాడు.  వారు మంచి స్నేహితులయ్యారు. ఒకనాడు నక్క మంగలితో ఇలా అన్నది: మంగలిమామా! మంగలిమామా! మనం పండ్ల తోట వేసుకుంటే ఎలా ఉంటుంది , మనకి కావలసిన వన్నీ పళ్లు  తిని మిగతా వాటితో వ్యాపారం చెయ్యొచ్చు కదా అన్నది. పాపం అతడు నమ్మి రకరకాల మొక్కలు తెచ్చి తోట వేసాడు. అందులో మామిడి,సపోట,అరటి పండ్ల మొక్కలను అలాగే గుమ్మడి,దోస కూరగాయల చెట్లను నాటారు.  తాను అతని భార్య జాగ్రత్తగా పెంచి నీళ...

Dasarathudu ramalakshmanulanu viswamitruni venta enduku pampadu?

Image
               దశరథుడు రామలక్ష్మణులను విశ్వామిత్రుని వెంట ఎందుకు పంపాడు? సేవకులు వచ్చి విశ్వామిత్రుడు ద్వారం దగ్గర వేచి ఉన్నారు అని తెలిసాక దశరథుడు ఒక పురోహితుడుతో కలిసి  విశ్వామిత్రునికి ఎదురు వెళ్లి నమస్కారాలు చేసి, ఆతిథ్యం ఇచ్చి సోత్రాలతో పూజించాడు.  తరువాత విశ్వామిత్రుడు దశరథునితో ఇలా అన్నాడు:  రాజా! నీవు నీ ప్రజలు బాగున్నారు కదా? శత్రుభయం ఏమి లేదు కదా? అని దశరథుణ్ణి అడిగాడు.  అలాగే అక్కడ ఉన్న వశిష్ఠ మహర్షిని, అక్కడ ఉన్న అందరిని పలకరించి రాజభవనంలోకి వచ్చి తనకు సూచించిన స్థానములో కూర్చున్నాడు.  అప్పుడు దశరథుడు ఇలా అన్నాడు: మహాముని ! మీరు అయోధ్య కి రావడం వలన నాకు చాలా సంతోషముగా ఉన్నది.  నేను మీకు ఏ విధముగా సహాయము చేయగలను అని విశ్వామిత్రుడిని అడిగాడు? విశ్వామిత్రుడు దశరథుని మాటలకు సంతోషించి రాజా! నేను ఎందుకు వచ్చానో తెలుసుకుని ఆ పని చేసి సత్యవంతుణ్ణి అని అనిపించుకో అని అన్నాడు.  నేను ఒక యాగం అనుకోని మొదల పెట్టేసరికి ఇద్దరు బలమైన రాక్షసులు నా యజ్ఞ వేదికపై రక్తమాంసాలు పోసి అపవిత్రం చేసి నా యజ్ఞ సంకల్పం చెడకొట...

Chandamama Kathalu Pustakamlo Vachhina Modati Prachurana emiti?

Image
 చందమామ పుస్తకము లో వచ్చిన మొదటి ప్రచురణ ఏమిటి అంటే ఆహ్వానం పాట.  మొట్టమొదటిసారిగా చందమామ కథలు 1947 జులై లో మొదలు అయింది.    ఆహ్వానము చందమామ రావే జాబిల్లి రావే రైలెక్కి రావే రష్యాకథలు తేవే ఇంజనెక్కీ శే ఇంగ్లీషు కథలు తేవే బస్సెక్కి రావే, బాంగ్లా కథలు తేవే కారెక్కి రావే కామ్రేడ్ కథలు తేవే హారన్‌ ఊత్తూ రావే ఆకలి కథలు తేవే కొండెక్కి రావే కోటివేలు తేవే ఒలిచిన చొోకలేట్లు ఒళ్లో పెట్టుకొని కరిగిన ఐస్‌ క్రిం చేత్తో పట్టుకొని అలా అలా అలా వచ్చిమా తెలుగు పిల్లల తీపి నోట్లో పోసిపోవే ఇప్పుడు మనం కృష్ణ శాస్త్రి గారు వ్రాసిన ఉడత పాట తెలుసుకుందాం  ఈ పాట దేని గురించి అంటే ఒక పాపకి మరియు ఉడత కి మధ్య జరిగిన సంభాషణ ఎలా ఉందో మీరే చూడండి  ఉడత పాట   సీత    ఏరోప్లేన్ తెచ్చావా, ఉడుతా, ఉడతా, నే  యూరోపు వెళ్ళాలి ఉడతా, ఉడతా ! ఉడత   హోరుగాలి కొట్టొచ్చు, కారుమబ్బు పట్టొచ్చు, ఏరోప్లేన్ తేలేను సీతా, సీతా!నే యూరోపు రాలేను సీతా, సీతా! సీత  స్టీమరేనా తెచ్చావా ఉడతా ఉడతా , నే సీమాకెళ్లి రావాలి ఉడతా, ఉడతా! ఉడత  ఏ తుఫాను వస్తుందో! ఏ కెరటం లేస్తుందో! స్టీమరే...

Aswamethayagam And Putrakamesti Yagam

Image
అశ్వమేథయాగం ఇప్పుడు మనం అశ్వమేథయాగం మరియు పుత్రకామేష్టియాగం గురించి తెలుసుకుందాం! దశరథుడు ఋష్యశృంగుడు వద్దకు వచ్చి ప్రధాన ఋత్విక్కుగా ఉండమని అడిగాక ఋష్యశృంగుడు దశరథ మహారాజు తో ఇలా అన్నాడు: ఓ దశరథ మహారాజా ! అటులనే జరగనివ్వు నేను మీ చేత అశ్వమేధయాగం జరిపిస్తాను, తరువాత పుత్రసంతానం కోసం మరొక యాగం చేపిస్తాను అని అన్నారు. మీరు ముందుగా అశ్వమేథయాగముకు కావాల్సినవి అన్ని సమకూర్చు. ముందుగా ఒక ఉత్తమ అశ్వాన్ని చూసి దానిని యజ్ఞాశ్వముగా వదులు అని అన్నారు. ఋష్యశృంగుడు అన్న మాటలకూ సంతోషించి వెంటనే తన మంత్రి అయిన సుమంతుడిని పిలిపించాడు.  అశ్వమేథ యాగం కోసం ఘనముగా ఏర్పాట్లు చేసారు. యజ్ఞాలు చేసేవారు , వేదాలు చదివేటందుకు  సుయజ్ఞుడు, వామదేవుడు , బాబాలి మరియు కశ్యపుడు మొదలైన మునులను, బ్రాహ్మణ శ్రేష్ఠులను పిలిపించారు.  ఏమేమి వస్తువులు సమకూర్చాలో వసిష్ఠుడు మొదలైన వారు చెప్పారు.  సమృద్ధులైన వారిని గుర్రము వెంట పంపారు.  సరయు నది ఉత్తరపు గట్టున యజ్ఞశాల నిర్మించారు.  యజ్ఞ కార్యక్రమం లో పాల్గొనడానికి వడ్రంగులను, బేలుదారీలను, చిత్రకారులను మరియు నాట్యశాస్త్రములో ప్రావీణులను పిలిపించారు....

Rishyasringunni Angadesaniki Tesukuvachina upayamu emiti?

Image
  ఋష్యశృంగుని అంగదేశానికి తీసుకువచ్చిన ఉపాయం ఏమిటి? ఋష్యశృంగుని ఎలా తీసుకురావాలి అని ఆలోచిస్తూ ఉండగా రోమపాద మహారాజుకి పురోహితుడు ఈ విధముగా చెప్పాడు.  మహారాజా ఋష్యశృంగుడు పసితనం నుండి అడవులలోనే ఉండి వేదాద్యము లోను,తపస్సు చేయటము లోను జీవితాన్ని గడిపాడు.  అతనికి ఆడవాళ్లు ఎలా ఉంటారో కూడా తెలియదు. మనం కొంతమంది వేశ్యలను అలంకరించి, పూలు పెట్టి, సుగంధాలు వెదజల్లేలా తయారుచేసి పంపినట్లయితే వారు సులువుగా ఋష్యశృంగ మహర్షి ని ఆకర్షించి తమ వెంట తీసుకురాగలుగుతారు.  రోమపాద మహారాజు ఆ ఉపాయాన్ని ఒప్పుకొని కొంతమంది వేశ్యలను చక్కగా అలంకరింప చేసి ఋష్యశృంగుడి ఆశ్రమానికి పంపాడు.  వారు ఆశ్రమము బయట ఉండి ఋష్యశృంగుడు ఎప్పుడు కనిపిస్తాడా అని వేచి చూస్తున్నారు.  ఆ ఋష్యశృంగుడు ఎల్లప్పుడూ తండ్రికి సేవలు చేస్తూ ఉంటాడు. ఎప్పుడు ఆశ్రమము దాటి వెళ్ళేవాడు కూడా కాదు.  అలాంటిది ఒకనాడు ఎందుకో ఆశ్రమం బయటకి వచ్చాడు. వెంటనే వేశ్యలు పాటలు పాడుతూ అతని దగ్గరకి వచ్చారు.  వారు అందమైన ఆకారాలు,అలంకరణలు, పాటలు, శ్రావ్యమైన గొంతులు విని ఋష్యశృంగుడు ఆశ్చర్యపోయి ఆకర్షించబడ్డాడు.  కానీ వారు స్త్రీలు...