ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ అలంకారవతి చంద్రవర్మను వెంటబెట్టుకొని రాజసభకు వెళ్ళింది. రాజుకు నమస్కరించి అక్కడ నిలబడింది. చంద్రవర్మ ఆ రాజును ఆశీర్వదించాడు. అందగాడైన చంద్రవర్మ గొప్ప తేజస్సుతో, మన్మథుడిలా ప్రకాశిస్తూ ఉండటం చూసి, ఆ పట్టణ ప్రభువైన మహేంద్రవర్మ ఆశ్చర్యపోయాడు. రాజు వారిని కూర్చోమని చెప్పి, వేశ్య కూతురైన అలంకారవతిని చూసి ఇలా అడిగాడు: "ఓ అందగత్తె! నువ్వు ఎవరివి? ఈ నగరంలోనే ఉంటావా? నిన్ను నేనెప్పుడూ చూడలేదే! ఈ బ్రాహ్మణోత్తముడు ఎవరు? ఇతడిని ఇప్పుడు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? మీరు వచ్చిన కారణం ఏంటో వివరించు." అందుకు అలంకారవతి రాజుతో ఇలా అంది: "మహాప్రభూ! నేను ఈ నగరంలోనే పేరుపొందిన ఒక వేశ్య కుమార్తెను. నా పేరు అలంకారవతి. నేను ఒక వ్రతాన్ని నియమంగా పెట్టుకుని, మా వేశ్య కుల మర్యాద అయిన వ్యభిచార వృత్తిని వదిలేశాను. బయటి ప్రపంచానికి కూడా తెలియకుండా ఇప్పటివరకు ఇంట్లోనే కాలం గడిపాను. అందుకే మీరు నన్ను చూసే అవకాశం రాలేదు." ఆ తర్వాత ఆమె తన వ్రతం వివరాలను, ఆ బ్రాహ్మణుడు తన ఇంటికి రావడం, అతడిని చూసి తాను మోహించి, నిద్ర లేపడానికి పడిన తాపత్రయాన్ని, తన మనసులోన...
ఋష్యశృంగుని ఎలా తీసుకురావాలి అని ఆలోచిస్తూ ఉండగా రోమపాద మహారాజుకి పురోహితుడు ఈ విధముగా చెప్పాడు.
మహారాజా ఋష్యశృంగుడు పసితనం నుండి అడవులలోనే ఉండి వేదాద్యము లోను,తపస్సు చేయటము లోను జీవితాన్ని గడిపాడు.
అతనికి ఆడవాళ్లు ఎలా ఉంటారో కూడా తెలియదు. మనం కొంతమంది వేశ్యలను అలంకరించి, పూలు పెట్టి, సుగంధాలు వెదజల్లేలా తయారుచేసి పంపినట్లయితే వారు సులువుగా ఋష్యశృంగ మహర్షి ని ఆకర్షించి తమ వెంట తీసుకురాగలుగుతారు.
రోమపాద మహారాజు ఆ ఉపాయాన్ని ఒప్పుకొని కొంతమంది వేశ్యలను చక్కగా అలంకరింప చేసి ఋష్యశృంగుడి ఆశ్రమానికి పంపాడు.
వారు ఆశ్రమము బయట ఉండి ఋష్యశృంగుడు ఎప్పుడు కనిపిస్తాడా అని వేచి చూస్తున్నారు.
ఆ ఋష్యశృంగుడు ఎల్లప్పుడూ తండ్రికి సేవలు చేస్తూ ఉంటాడు. ఎప్పుడు ఆశ్రమము దాటి వెళ్ళేవాడు కూడా కాదు.
అలాంటిది ఒకనాడు ఎందుకో ఆశ్రమం బయటకి వచ్చాడు. వెంటనే వేశ్యలు పాటలు పాడుతూ అతని దగ్గరకి వచ్చారు.
వారు అందమైన ఆకారాలు,అలంకరణలు, పాటలు, శ్రావ్యమైన గొంతులు విని ఋష్యశృంగుడు ఆశ్చర్యపోయి ఆకర్షించబడ్డాడు.
కానీ వారు స్త్రీలు అని కూడా అతనికి తెలియరు.
వేశ్యలు అతని దగ్గరకు వెళ్లి ఓ బ్రాహ్మణోత్తమా! మీరు ఎవరు?
ఎందుకు ఈ అడవిలో ఒంటరిగా తిరుగుతున్నారు అని అడిగారు.
అప్పుడు ఋష్యశృంగ ముని ఇలా చెప్పారు: నేను విభుండక మహాముని కొడుకును, అదే మా ఆశ్రమం.
మీరు మా ఆశ్రమానికి వచ్చినట్లైతే మీకు పద్దతి ప్రకారం పూజలు చేస్తాను అని అన్నాడు.
అప్పుడు వేశ్యలు అతని వెంట ఆశ్రమానికి వెళ్లి అతను ఇచ్చినా కందమూలాలు మరియు ఫలాలు తిన్నారు.
అక్కడ ఎక్కువసేపు ఉంటే విభుండకముని శపిస్తారని బయపడి వేశ్యలు వెళ్ళిపోతూ అతనికి తమ వెంట తెచ్చినా భక్ష్యాలు ఇచ్చి ఇవి మా పండ్లు, వీటిని కూడా రుచి చూడు అని చెప్పి ఇక మేము వెళ్లి తపస్సు చేసుకోవాలి అని చెప్పి ఋష్యశృంగుడి ని ఆలింగనం చేసుకొని ఆశ్రమము దాటి వెళ్లిపోయారు.
ఋష్యశృంగుడు వారు పెట్టిన భక్ష్యాలు తిని అవి పండ్లే అనుకున్నాడు.
తనలో తానూ ఇలా అనుకున్నాడు: ఆ పండ్లు తానూ రోజు తినే పండ్ల కంటే చాలా తియ్యగా ఉన్నాయి, అలాగ తన ఆతిధ్యం తీసుకున్నవారు మాములు మునులు కంటే చల్ల అందముగా ఉన్నారు అని అనుకున్నాడు .
ఆరోజంతా అతను వికలమైన మనస్సుతో గడిపాడు.
మరునాడు వారు కనిపించవచ్చు అని ఆశతో కిందటి రోజు వారు కనిపించిన చోటుకే వెళ్ళాడు.
అతనిని చూడగానే వేశ్యలు తమ పని నెరవేరింది అనుకున్నారు.
వారు అతనితో అయ్యా ! నువ్వు కూడా మా ఆశ్రమానికి రా, అక్కడ నీకు చక్కగా మర్యాదలు చేస్తాము అన్నారు.
ఋష్యశృంగుడు దానికి చాలా సంతోషించి ఒప్పుకొని ఆశ్రమము విడిచి వారి వెంట బయలుదేరాడు.
ఋష్యశృంగుడు అంగదేశానికి వచ్చిన వెంటనే అక్కడ వర్షం కురిసింది.
రోమపాద మహారాజు ఋష్యశృంగునికి ఎదురు వచ్చి, సాష్టాంగ నమస్కారం చేసి తాను అతనిని ఈ విధముగా అంగదేశానికి రప్పించినందుకు క్షమాపణ చెప్పి తన కూతురైన శాంతను ఇచ్చి శాస్త్రం ప్రకారం పెళ్లి చేసాడు.
ఋష్యశృంగుడు శాంతతో కూడా సకల సుఖాలు అనుభవిస్తూ అంగదేశములోనే ఉండిపోయారు.
సుమంతుడు చెప్పిన ఈ కథ విని దశరథ మహారాజు సంతోషించి వసిష్ఠుని అనుమతి తీసుకొని తన భార్యలు, మంత్రులు సమేతముగా
అంగదేశానికి వెళ్ళాడు .
రోమపాదుడు దశరథుణ్ణి సాదరముగా ఆహ్వానించి అతిధి సత్కారాలు చేసాడు.
అంగరాజు పక్కన అగ్ని వలే ప్రకాశిస్తున్న ఋష్యశృంగుడిని చూసాడు.
రోమపాద మహారాజు దశరథుడికి ఋష్యశృంగుడు ని పరిచయం చేసాడు.
దశరథుడు అంగ రాజ్యములో 7 రోజులు ఉన్నాడు.
ఎనిమిదోవ రోజున తానూ వచ్చిన పని తెలిపాడు.
ఆ పని ఏమిటంటే ఓ అంగరాజా ! నేను ఒక యజ్ఞం చేయ సంకల్పించాను. ఆ యజ్ఞంకు నే కుమార్తె శాంతను, అల్లుడు ఋష్యశృంగ మహర్షిని అయోధ్య కు పంపవలిసింది అని ప్రార్థించాడు. దానికి అంగరాజు ఒప్పుకున్నారు.
ఋష్యశృంగ మహర్షి సతిసమేతముగా అయోధ్యకు ప్రయాణమయ్యాడు.
దశరథ మహారాజు ముందుగానే అయోధ్య ప్రజలకు ఋష్యశృంగ మహార్షి ఆహ్వానానికి ఘనముగా స్వాగతము పలకాలని చెప్పి ఆదేశించారు.
అలాగే అయోధ్య ప్రజలు,దశరథ మహారాజు ఋష్యశృంగ మహార్షి కి శాంతా కి ఘనముగా స్వాగతము పలికారు.
శాంత, ఋష్యశృంగలు అయోధ్య లో కొంతకాలం ఉన్నారు.
ఇంతలో వసంత ఋతువు వచ్చింది.
వసంత ఋతువు లో తాను తలపెట్టిన యజ్ఞం చెయ్యాలని దశరథ మహారాజు సంకల్పించారు.
దశరథుడు ముని శ్రేష్ఠుడైన ఋష్యశృంగుడి వద్దకు వెళ్లి తనకు పుత్ర సంతానం కలిగేలా యజ్ఞం చేయవలిసిందిగా ప్రార్థించారు.
దానికి ప్రధాన ఋత్విక్కుగా ఋష్యశృంగుడిని ఉండవల్సిందిగా అభ్యర్దించాడు.
దశరథుడు అయోధ్యకు చేరటం పరశురాముడు. వెళ్ళగానే రాముడు. విష్ణుధనుస్సును, బాణాలను. వరుణ దేవునికి సమర్పించాడు. దశరథునికి వసిష్టాది. మహర్షులకు నమస్కరించి తండ్రిని వ్యాకులపాటు చెందవలదని ఊరడించాడు. అప్పుడు రాముడు దశరథుడితో ఇలా అన్నాడు: తండ్రీ! పరశురాముడు వెళ్లిపోయాడు. ఇక నీవు ఆతడిని గూర్చి చింతించటం మాను. మనమందరమూ అయోధ్యకు పోదాం. వాన చినుకులకు ఎదురు చూచే చాతక పక్షులవలె సైన్యమంతా నీ ఆజ్ఞలకై వేచి ఉంది. వారందరికీ అయోధ్య వైపు ప్రయాణానికి అనుమతి ఇవ్వు అని అన్నాడు. రాముని మాటలు విన్న దశరథుడు స్పృహని తిరిగి పొందాడు. పుత్రుని ప్రేమానురాగాలతో కౌగలించుకున్నాడు. ఆయనకంతా ఒక కలలాగా అనిపించింది. రాముడు పునర్థన్మ ఎత్తినట్లుగా ఆనందపడిపోయాడు. దశరథుని పరివారమంతా అయోధ్యా నగరం చేరుకున్నారు. నగర వీథులన్నీ నీళ్ళుచల్లి, వీథి వీథికీ తోరణాలు కట్టారు. ప్రజలంతా ఆనందోత్సాహాలతో నాట్యం చేశారు. మంగళవాద్యాలెన్నో మోగించారు. ప్రజలు, మంత్రులు ఎదురు వచ్చి స్వాగత వచనాలు పలికారు. వారంతా అంతఃపురానికి చేరుకున్నారు. కౌసల్య, సుమిత్ర, కైకేయిలు ఎదురువచ్చి సీత, ఊర్మిళ, మాండవీ, శృతకీర్తులను అనురాగంతో అ...
శివ ధనస్సు పూర్వం దక్ష ప్రజాపతి శివుడికి హవిస్సులు ఇవ్వని యాగము ప్రారంభించాడు. శివుడులేని చోట మంగళం ఎలా ఉంటుందని దక్షుని కుమార్తె అయిన సతీదేవి (పార్వతీదేవి); యోగాగ్నిలో శరీరాన్ని వదిలింది. ఆగ్రహించిన శివుడు రుద్రుడయ్యాడు. అసలు ఇలాంటి యాగానికి దేవతలు ఎందుకు వెళ్ళారని ఆయన ధనుస్సు పట్టుకున్నాడు, వెంటనే దేవతలు ప్రార్థించగా ఆయన శాంతించాడు. ఆ ధనుస్సుని జనక మహారాజు వంశములో పుట్టిన దేవరాతుడు అనే రాజు దగ్గర న్యాసంగా (అంటే కొంతకాలం ఉంచారు) ఉంచారు. అప్పుడా దేవరాతుడు ఆ ధనుస్సుని ఒక మంజుషలో (పెద్ద పెట్టె) పెట్టాడు. చక్రాలున్నా ఆ మంజుషలో శివ ధనుస్సు ఉండగా తొయ్యాలంటే దాదాపు 5000 మంది కావాలి. అలా ఆ విదేహ వంశీయులు ఆ శివ ధనుస్సుని రోజు పూజిస్తూ, పరమ పవిత్రంగా చూసుకుంటూ ఉన్నారు. అలాగే నేను ఒకప్పుడు యజ్ఞము చేద్దామని భూమిని దున్నుతున్నాను. అలా దున్నుతున్నప్పుడు నాగటి చాలుకి తగిలి ఒక బాలిక తనంత తానుగా పైకి లేచింది. నాగటి చాలుకి తగిలి పైకి వచ్చింది కనుక, అలాగే భూమికి ఉన్నంత ఓర్పు ఉన్నది కనుక ఆమెని సీతా అని పిలిచాము (జనకుని కూతురు కనుక జానకి, మిథిలానగరంలో పుట్టింది కనుక మైథిలి, దేహం మీద భ్రాంతిలేన...
గొప్ప త్యాగం శివానందుడు అనే వ్యక్తి ఒకనాడు అరణ్య మార్గంలో వస్తుండగా ఒక రాక్షసుడు అతనికి ఎదురొచ్చి “ఓయి మానవుడా! నేను మిక్కిలి ఆకలితో ఉన్నాను. నిన్ను తినేస్తాను" అన్నాడు. శివానందుడు చేతులు జోడించి "రాక్షసోత్తమా! నేను నా కుమారై వివాహం కోసం ఆభరణాలు తీసుకుని వెళుతున్నాను. ఇవి ఇంటిలో ఇచ్చి మరల వచ్చి నీకు ఆహారం కాగలను” అన్నాడు, "వెళ్లి త్వరగా రా” అన్నాడు రాక్షసుడు. శివానందుడు త్వరగా ఇంటికివెళ్లి నగలు తన భార్య చేతికిచ్చి "అమ్మాయి వివాహం చక్కగా జరిపించు. నేను రాక్షసునికి ఆహారంగా వెళుతున్నాను." అని విషయం వివరించాడు. చాటునుండి ఇది విన్న శివానందుడి తనయుడు తండ్రి కంటే ముందుగానే పరుగుపరుగున రాక్షసుడి వద్దకు వచ్చి “నా తండ్రికి బదులుగా నన్ను ఆహారంగా స్వీకరించు" అన్నాడు. అంతలో శివానందుడు వచ్చి కుమారుడిని వదిలివేసి, తనను తినమని అన్నాడు. వీరిద్దరూ వాదులాడుకుంటూ ఉండగానే దూరం నుంచి కర్ర సాయంతో ఒక వృద్ధుడు వచ్చి "నేను శివానందుడి తండ్రిని. నన్ను తిని వాళ్లను వదిలేయి" అన్నాడు. అంతలో ఒక ముత్తయిదువ వచ్చి "భర్తనో, కొడుకునో కోల్పోయి నేను జీవించ లేను, నన్ను తిను"...
Comments