ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ || Prema Kosam Rajasabha Varaku Vachhina Alamkaravathi Katha || Episode - 14 || Bhatti Vikramarka Kathalu
ఇప్పుడు మనం తాటకి ఎవ్వరూ తనకి వెయ్యి ఏనుగుల బలం ఎలా వచ్చిందో తెలుసుకుందాం!
ఆ రెండు దేశాలను అరణ్యంగా మార్చింది కదా ఆ అరణ్యాన్ని తాటక వనం అని కూడా అంటారు.
శ్రీ రాముడు తాటక కి అంత బలం ఎలా వచ్చింది అని విశ్వామిత్రుడ్ని అడగగా విశ్వామిత్రుడు అప్పుడు నీకు తాటక వృత్తాంతం కూడా చెబుతాను విను అని చెప్పి రామలక్ష్మణులకు చెబుతాడు.
సుకేతుడు అనే గొప్ప యక్షుడు వుండేవాడు. ఆయనకు బిడ్డలు లేరు ఆయన బిడ్డలను కోరి గొప్ప తపస్సు చేశాడు. బ్రహ్మ ఆయన తపస్సుకు సంతోషించి ఆయనకు కొడుకును ఇవ్వకుండా వెయ్యి ఏనుగుల బలం గల కూతురు కలిగేలాగా వరం ఇచ్చాడు బ్రహ్మ వర ప్రభావంచేత సుకేతుడు కి తాటక పుట్టి పెరగసాగింది.
ఆమె యుక్త వయసుకు వచ్చి మంచి అందగత్తె గా తయారయ్యింది, అప్పుడు సుకేతుడు ఆమెను సుందుడు అనే యక్ష కుమారుడికి ఇచ్చి వివాహం చేశాడు. వారిద్దరికీ మారీచుడు అనే కొడుకు కలిగాడు. అతను పరాక్రమములో ఇంద్రుడ్ని పోలినవాడు. చాలా గర్వం కలవాడు ఇలావుండగా ఒక సంగతి జరిగింది. ఈ ప్రాంతాములో తపస్సు చేసుకుంటున్న అగస్త్యుడు తాటక భర్త అయిన సుందుడుని చంపాడు.
అందుకని తాటకి మారీచుడు అగస్త్యుడు పై ఆగ్రహించి గట్టిగా అరుస్తూ ఆయనను తినేసేలా గా మీదకు వచ్చారు. అప్పుడు అగస్త్యుడు వారిద్దరినీ రాక్షసులు అవ్వమని శపించాడు.
మారీచుడు తాటక రాక్షసులైపోతారు. తాటక తన అందమంతా కోల్పోయి భయంకర ఆకారం ధరించి నరభక్షిని గా మారిపోయింది. తాటక అగస్త్యుడిని ఏమీ చేయలేక ఆయన సంచరించిన ఈ పుణ్యభూమిని పాడుచేస్తూ బీభత్సం కలిగిస్తున్నది. అందుచేత ఓ రామా! నీవు ఈ తాటకను వధించు ఆడదని సంకోచించకు. ఈమె చేస్తున్న దుర్మార్గానికి అంతేలేదు ఈమెను చంపినందువలన నీకు కొంచెం అయినా పాపం రాదు అని విశ్వామిత్రుడు చెప్పాడు.
పూర్వము విరోచనుని కుమార్తె, భూదేవిని చంపబోయింది. అప్పుడు దేవేంద్రుడు ఆమెను చంపేశాడు.
అలాగే శుక్రాచార్యుని తల్లి లోకములో ఇంద్రుడు ఉండకూడదని కోరికతో తీవ్రంగా తపస్సు చేసింది. ధర్మవిరుద్ధమైన ఆమె తపస్సును భగ్నం చేసి విష్ణువు శుక్రాచార్యుని తల్లిని కూడా చంపాడు. ఓ రామా! వీరేకాదు ధర్మవిరుద్ధంగా ప్రవర్తించిన స్త్రీలను ఎందరినో చంపారు కాబట్టి నీవు కూడా స్త్రీ అని సంకోచించక తాటకను సంహరింపుము అని విశ్వామిత్రుడు రామునితో అన్నాడు.
అప్పుడు రాముడు చేతులు జోడించి మహాముని! మా తండ్రి మీరు చెప్పిన ప్రతి పని చెయ్యమని ఆజ్ఞాపించి మీ మీ వెంట పంపారు. అందుచేత మీ ఆజ్ఞ ప్రకారమే తాటకను చంపుతాను అని రాముడు అన్నాడు.
ఆ తరువాత రాముడు ధనస్సు పట్టుకుని దాని తాడు బలంగా లాగి ఖంగుఖంగుమని మోగించాడు. ఆ చప్పుడు వినపడేసరికి తాటక అలాగే వనంలో ఉండేవారంతా ఉలిక్కిపడ్డారు. తాటక ఆగ్రహించిన ఆ ధ్వని వచ్చిన వైపు అతి వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చింది. అలా తమ వైపు వచ్చిన తాటకను చూసి రాముడు లక్ష్మణుడితో చూశావా లక్ష్మణ! ఈమె ఎంత వికారమైన ఆకారం కలిగి ఉందో ధైర్యవంతులు కూడా భీతి కలిగించే విధంగా ఉన్నది.
ఈ ఆడదాన్ని చంపడానికి నాకు చేతులు రావడం లేదు దగ్గరకు రాని ముక్కు, చెవులు కోసి పొగరు అణచి పంపించేద్దామని రాముడు లక్ష్మణుడితో అంటాడు.
తాటక ఈ మాటలు విని మరింత కోపం తెచ్చుకోని చేతులు పైకెత్తి రాముడు మీదకి వచ్చి దుమ్ము చిమ్ముతూ రామలక్ష్మణులు కప్పేసి వారిపై రాళ్ల వాన ను కురిపించసాగింది. రాముడు దాని చేతులు రెండూ తన బాణాలతో తెగకొట్టాడు. లక్ష్మణుడు అతి కోపముతో దాని ముక్కూచెవులు కోసేశాడు కానీ మాయావి అయిన తాటక వారిపై మళ్లీ రాళ్లవాన కురిపించసాగింది. అప్పుడు విశ్వామిత్రుడు రామా ఈ పాపాత్మురాలివి దయ చూస్తావేమిటి? ఇది ప్రాణాలతో ఉంటే ఇంకా ఎన్ని మాయలు అయినా చెయ్యగలదు. సాయంకాలం లోపల దీనిని చంపేయి.
సాయంకాలం తరువాత రాక్షసులకి బలం ఎక్కువగా ఉంటుంది ఆ సమయంలో వారిని జయించటం కష్టం అని విశ్వామిత్రుడు రాముణ్ణి హెచ్చరించాడు. ఈ మాట విని రాముడు తాటక రొమ్ములోకి ఒక బాణం బలంగా కొట్టాడు. ఆ దెబ్బతో అది నేలమీద పడి గిలగిలా తన్నుకుని ప్రాణాలను వదిలింది. విశ్వామిత్రుడు బాగా సంతోషించి రాముణ్ణి దగ్గరకు తీసుకొని నాయన! ఈ దుష్టురాలిని చంపి చాలా మేలు చేశావు. ఈ రాత్రికి మనం ఇక్కడ నీ ఉండి తెల్లవారి మన ఆశ్రమానికి వెళ్దాం అని అన్నాడు.
Comments