Posts

Showing posts from September, 2025

ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ || Prema Kosam Rajasabha Varaku Vachhina Alamkaravathi Katha || Episode - 14 || Bhatti Vikramarka Kathalu

Image
  ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ అలంకారవతి చంద్రవర్మను వెంటబెట్టుకొని రాజసభకు వెళ్ళింది. రాజుకు నమస్కరించి అక్కడ నిలబడింది. చంద్రవర్మ ఆ రాజును ఆశీర్వదించాడు. అందగాడైన చంద్రవర్మ గొప్ప తేజస్సుతో, మన్మథుడిలా ప్రకాశిస్తూ ఉండటం చూసి, ఆ పట్టణ ప్రభువైన మహేంద్రవర్మ ఆశ్చర్యపోయాడు. రాజు వారిని కూర్చోమని చెప్పి, వేశ్య కూతురైన అలంకారవతిని చూసి ఇలా అడిగాడు: "ఓ అందగత్తె! నువ్వు ఎవరివి? ఈ నగరంలోనే ఉంటావా? నిన్ను నేనెప్పుడూ చూడలేదే! ఈ బ్రాహ్మణోత్తముడు ఎవరు? ఇతడిని ఇప్పుడు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? మీరు వచ్చిన కారణం ఏంటో వివరించు." అందుకు అలంకారవతి రాజుతో ఇలా అంది: "మహాప్రభూ! నేను ఈ నగరంలోనే పేరుపొందిన ఒక వేశ్య కుమార్తెను. నా పేరు అలంకారవతి. నేను ఒక వ్రతాన్ని నియమంగా పెట్టుకుని, మా వేశ్య కుల మర్యాద అయిన వ్యభిచార వృత్తిని వదిలేశాను. బయటి ప్రపంచానికి కూడా తెలియకుండా ఇప్పటివరకు ఇంట్లోనే కాలం గడిపాను. అందుకే మీరు నన్ను చూసే అవకాశం రాలేదు." ఆ తర్వాత ఆమె తన వ్రతం వివరాలను, ఆ బ్రాహ్మణుడు తన ఇంటికి రావడం, అతడిని చూసి తాను మోహించి, నిద్ర లేపడానికి పడిన తాపత్రయాన్ని, తన మనసులోన...

దశరథుడి విలాపం || Dasarathudi Vilapam || Ramayanam || Episode - 47

Image
  దశరథుడి విలాపం దశరథుడు పుణ్యమంతా ఖర్చయిపోయి స్వర్గంనుండి భూమిపైపడిన యయాతిలా. నేలపై పడి ఉన్నాడు. ఇట్లా దీనంగా పడి ఉండటం గాని, కాళ్ళవేళ్ళా పడటంకాని ఆయన స్వభావం కాదు; ఆయనకు అలాంటి అనుభవమూ లేదు. కైకేయి భర్త అనే భయం, లజ్జ, బిడియం అన్నీ వదిలి వేసింది. పదే పదే అవే వరాలు కావాలని పట్టుపట్టింది. పైగా "నేను సత్యవంతుడననీ, చేసిన ప్రతిజ్ఞ నెరవేరుస్తాననీ బడాయి మాటలు మాట్లాడతావు. తీరా వాటిని ఇవ్వవలసి వచ్చే సమయానికి బీదఏడుపులు ఏడుస్తున్నావు. అసలు నా కిచ్చిన వరాలు ఎందుకు కాదంటున్నావు" అంటూ నిలదీసింది. రెచ్చగొట్టే మాటలు మాట్లాడింది. అప్పుడు దశరథుడు కోపంగా దుష్టురాలా! నీ కన్నా శత్రువులే నయం సుమా! రాముడు అడవులకు వెళ్లి, నేను మరణించిన తర్వాత నీవు ఒక్కతెవే సుఖంగా ఉండు. మరణానంతరం నేను స్వర్గానికి పోయినప్పుడు దేవతలంతా రాముడి క్షేమం అడుగుతారు. నేను ఏం చెయ్యాలి? యథార్థం. చెప్పకుండా దాటవేయనా? ఒకవేళ నేను నిజమే చెప్పినా వారు నమ్మరు. ఎందువల్లనంటే, “రాముడికి రాజ్యం ఇస్తానని దశరథుడు రాజులందరి ముందూ ప్రతిజ్ఞ చేశాడు. ఆ ప్రతిజ్ఞను భంగంచేస్తూ కైకేయి మాటలు వినవలసిన అవసరంలేదు కదా?” అంటారు. కైకా! ఎంతోకాలం మనమంతా ...

దశరథుడు కైకేయిని నిందించడం || Dasarathudu Kaikeyini Nindinchadam || Ramayanam || Episode - 46

Image
   దశరథుడు కైకేయిని నిందించడం కైకేయి మాటలకు దశరథుని తల గిర్రున తిరిగినట్లయింది. తాను విన్నదంతా కలా, నిజమా అన్న సందేహం కలిగింది. లేక మనస్సేమైనా చెదరి అట్లా వినిపిస్తోందా అన్న భ్రమ కలిగింది. కొద్దిసేపటికి తేరుకుని, కైకేయి వంక చూశాడు. ఆమెపై పెట్టుకొని వచ్చిన తీయని ఊహలన్నీ మటుమాయమయ్యాయి. ఎదురుగా ఒక ఆడపులి ఉన్నట్లు ఉలిక్కిపడ్డాడు. మహామంత్రంచే బంధించబడిన సర్పంలా విలవిలలాడిపోయాడు. కొద్దిగా స్పృహ వచ్చీ రాగానే "అయ్యో!" అని నిట్టూరుస్తూ, కైకేయిని చూసి "ఛీ ఛీ" అని చీదరించుకుంటూ మళ్ళీ స్పృహ కోల్పోయాడు. అప్పుడు దశరథుడు కళ్ళతో నిప్పులు చెరగుతూ క్రూరాత్మురాలా! మా వంశ నాశనానికి దాపురించావా? నేనుగాని, బాలుడైన రాముడుగాని నీకు ఏం అపకారం చేశాం? రాముడు నిన్ను కౌసల్యకన్నా ఎక్కువగా ప్రేమించాడు. నువ్వు విషసర్పానివని గ్రహించలేకపోయాను. రాజకుమార్తెవు గదా అని వలచి వివాహమాడాను. నా వంశాన్ని నేనే చేతులారా నాశనం చేసుకున్నట్లయింది గదా! లోకంలో  జనులంతా రాముని గుణగణాలను వేనోళ్ళ స్తుతిస్తున్నారు. నేను వారందరికీ ఏమని సమాధానం చెప్పగలను? కౌసల్య సుమిత్రలను, నా రాజ్యాన్ని, నా సర్వస్వాన్ని గడ్డిపరకలాగా విడి...