Posts

Showing posts from April, 2024

ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ || Prema Kosam Rajasabha Varaku Vachhina Alamkaravathi Katha || Episode - 14 || Bhatti Vikramarka Kathalu

Image
  ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ అలంకారవతి చంద్రవర్మను వెంటబెట్టుకొని రాజసభకు వెళ్ళింది. రాజుకు నమస్కరించి అక్కడ నిలబడింది. చంద్రవర్మ ఆ రాజును ఆశీర్వదించాడు. అందగాడైన చంద్రవర్మ గొప్ప తేజస్సుతో, మన్మథుడిలా ప్రకాశిస్తూ ఉండటం చూసి, ఆ పట్టణ ప్రభువైన మహేంద్రవర్మ ఆశ్చర్యపోయాడు. రాజు వారిని కూర్చోమని చెప్పి, వేశ్య కూతురైన అలంకారవతిని చూసి ఇలా అడిగాడు: "ఓ అందగత్తె! నువ్వు ఎవరివి? ఈ నగరంలోనే ఉంటావా? నిన్ను నేనెప్పుడూ చూడలేదే! ఈ బ్రాహ్మణోత్తముడు ఎవరు? ఇతడిని ఇప్పుడు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? మీరు వచ్చిన కారణం ఏంటో వివరించు." అందుకు అలంకారవతి రాజుతో ఇలా అంది: "మహాప్రభూ! నేను ఈ నగరంలోనే పేరుపొందిన ఒక వేశ్య కుమార్తెను. నా పేరు అలంకారవతి. నేను ఒక వ్రతాన్ని నియమంగా పెట్టుకుని, మా వేశ్య కుల మర్యాద అయిన వ్యభిచార వృత్తిని వదిలేశాను. బయటి ప్రపంచానికి కూడా తెలియకుండా ఇప్పటివరకు ఇంట్లోనే కాలం గడిపాను. అందుకే మీరు నన్ను చూసే అవకాశం రాలేదు." ఆ తర్వాత ఆమె తన వ్రతం వివరాలను, ఆ బ్రాహ్మణుడు తన ఇంటికి రావడం, అతడిని చూసి తాను మోహించి, నిద్ర లేపడానికి పడిన తాపత్రయాన్ని, తన మనసులోన...

చంద్రవర్ణుడు కన్యాకుబ్జాపురానికి వెళ్లడం || Chandravarnudu Kanyakubjapuraaniki Velladam || Episode 10 || Bhatti Vikramarka Kathalu

Image
  చంద్రవర్ణుడు కన్యాకుబ్జాపురానికి వెళ్లడం  బ్రహ్మరాక్షసుడు చంద్రవర్ణుడికి రాసి ఇచ్చిన రావి ఆకులు అన్నిటిని పోగొట్టకుండా భద్రంగా దాచి పెట్టాడు. కనుక ఆకులన్నింటిని చేర్చి మూటగట్టి వెంట తీసుకొని వెళ్ళాడు. ఎంత దూరం ప్రయాణం చేసిన ఏ గ్రామం కనబడలేదు దానితో అతను బాగా అలసిపోయి దప్పికి వేస్తుంది. అలా ప్రయాణం చేస్తున్న అతనికి కన్యాకుబ్జాపురం అనే పేరు గల పట్టణంగా కనిపించింది. ఆ పట్టణంలోకి ప్రవేశించిన తర్వాత ఒక వీధిలో అతనికి రమ్యమైన గృహం ఒకటి కనిపించింది, ఆ గృహం చాలా అందంగా సలక్షణముగా అలంకరించి విశ్రమించడానికి అనువుగా కనపడేసరికి ఆ గృహం ఎవరిది అని విచారించకుండా గొప్ప ధనవంతులు అని అనుకొని, భయం లేకుండా లోపలికి ప్రవేశించి అటూ ఇటూ చూసి అక్కడ ఆ సమయంలో మనుషులు ఎవరూ కనబడకపోవడం వలన తాను తీసుకువచ్చిన ఆకుల మూటను తలగడగా పెట్టుకొని అక్కడ అరుగుపై శయనించాడు. అతడు శయనించిన తరువాత తనలో తాను ఇలా అనుకున్నాడు: ఇక్కడ చాలా హాయిగా ఉంది. ఇది ఎవరో సంపన్నులు గృహము లాగా ఉన్నది, అయితే ఏంటి? కొంతసేపు పడుకున్న తర్వాత కొంచెం అలసట తీరిన  తర్వాత  చేయవలసిన కర్తవ్యం గురించి ఆలోచిస్తాను అని అనుకొని,ఆ  ఇంటి అల...

రాముని గుణగణాలు || Ramuni Gunaganalu || Ramayanam || రామాయణం || Episode 35 ||

Image
  రాముని గుణగణాలు భరతశత్రుఘ్నులిద్దరూ మేనమామతోపాటు గిరివ్రజపురానికి వెళ్ళారు. అక్కడ మేనమామ వారికి ఏ కొరతా రాకుండా కన్నబిడ్డల్లా అల్లారు ముద్దుగా చూచుకోసాగాడు. అక్కడ ఆనందంగా కాలక్షేపం చేస్తున్నా కూడా, వాళ్ల మనస్సులు వృద్ధుడైన తండ్రిపైన, ప్రేమపాత్రుడైన రాముడి పైనే ఉన్నవి. దశరథ మహారాజుకు నలుగురు కుమారులు నాలుగు భుజాలవంటివారు. అందరిపట్లా సమానమైన ప్రేమతో మెలగేవాడు. విష్ణు భగవానుడు ప్రాణులన్నిటి పట్లా సమాన ప్రేమ కలిగి ఉన్నా, బ్రహ్మపట్ల విశేష ప్రేమ కలిగి ఉంటాడట. అట్లాగే దశరథుడు కూడా నలుగురు పుత్రుల పట్లా నమానమైన ప్రేమ కలిగి ఉన్నా రాముడంటే ప్రాణం. ఎందుకంటే అతడు రావణ సంహారానికై మానవ రూపంతో వచ్చిన విష్ణుభగవానుడే గదా! రాముని చూసుకొని కౌసల్యాదేవి కూడా ఇంద్రుని చూసుకొని మురిసిపోయే అదితి లాగా మురిసిపోయేది. రాముని గుణగణాలు వర్ణించి చెప్పడం ఎవరి వల్ల సాధ్యపడుతుంది? తండ్రిలాగానే పరాక్రమవంతుడు, అందగాడు, అసూయ లేనివాడు. మృదువుగాను, మధురంగాను మాట్లాడతాడు. పరుషంగా మాట్లాడటం తనకు చేతకాకపోగా, ఎవరైనా మాట్లాడినా బదులు చెప్పేవాడు కాడు. రాముడిది ఎంత మంచి మనసంటే, ఏ పాటి చిన్న ఉపకారానికైనా పొంగిపోయేవా...

కుంటోడిపై పదవి ప్రభావం || Kunthodipai Padavi Prabhavam || Tenali Ramakrishna Stories || తెనాలి రామకృష్ణ కథలు || Episode 6 ||

Image
  కుంటోడిపై పదవి ప్రభావం   ( Part 2) అయ్య బాబోయ్ ఇదేదో ఇరుక్కుపోయినట్టున్నాను. అటు గొయ్యి - ఇటు నుయ్యిలా ఉంది, నేను అంతపనిసేయ్యలేను. ఆ బండ ఎత్తే మొకమా నాది. బట్టలమూటవరకు ఏదో పర్వాలేదు. కావాలంటే ఎత్తిసూస్తాను అని ఓ బండరాయిని ఎత్తేప్రయత్నంలో పడ్డాడు. చెమటలు పోసాయి. ఇంచు కూడా కదపలేక పోయాడు. చివరికి చతికిలపడ్డాడు. నావళ్ళకాదురోయ్ దేవుడా అని సన్నగా ఏడుపు లంకించుకున్నాడు. మళ్లీ రాయి ఎత్తే ప్రయ త్నంలో కాళీమాతా గండం దాటించు. నాకు శక్తి ఇయ్యి తల్లే ! అని నింగిలోకి చేతులు ఎత్తి దండాలు పెట్టసాగాడు. ప్రభూ, నాకో అవకాశం ఇవ్వండి. ఆ తిప్పడుచే ఈ తాళాలు పగుల గొట్టిస్తానుఅని రామలింగడు రాయలవారిని లోగొంతుతో అడిగాడు. లాభంలేదు రామలింగా, వాడో వింత పశువులా ఉన్నాడు. పైగా బాగా శారీరకంగా బలహీనుడు. ఆ రాయిని ఇంచు కూడా లేపలేకపోయాడు. వాడు నటించలేదు. నిజంగానే ఎత్తలేకపోయాడు. ఇక వీడివలన మనమీ చెరలోంచి తప్పుకోలేం. చూద్దాం ఈ లోగా మన వెనుకనే వస్తున్న మన సైన్యం ఈ సరికి ఈ పరిసరాలకు వచ్చేసి ఉంటుంది అని రాయలు తిప్పడు వలన కాదని ఓ నిర్ణయానికి వచ్చేసాడు. ప్రభూ నాకో అవకాశం ఇప్పించండి. కాదనకండి అని రాజు నుంచి అంగీకారంపొంది, ...

చంద్రవర్ణుడు బ్రహ్మారాక్షసుని దగ్గర విద్యని అభ్యసించడం || Chandravarnudu Brahma Rakshasuni Daggara Vidhyani Abhyasinchadam || Episode 9 || Bhatti Vikramarka Kathalu

Image
  చంద్రవర్ణుడు బ్రహ్మారాక్షసుని దగ్గర విద్యని అభ్యసించడం  బ్రహ్మ రాక్షసుడు చంద్రవర్ణుడికి సహాయం చేస్తానని చెప్పాక బ్రహ్మ రాక్షసుడు ఒక ఔషధాన్ని తీసుకొని వచ్చి దానిని చంద్రవర్ణుడికి ఇచ్చి దీనిని తిను దీని వలన నీకు ఆకలి కాని,దాహం కాని,శ్రమ కాని ఇలాంటివి ఏమీ నీకు కలుగనే కలగదు. మరియు దీని వలన ఉత్సాహం కలుగుతుంది అని చెప్పాడు. ఆ బ్రాహ్మణుడు సంతోషించి భక్తితో దానిని తీసుకొని భుజించి ఆహార నిద్రల నుండి సంకటం లేని వాడు అయ్యాడు. బ్రహ్మ రాక్షసుడు చంద్రవర్ణుడితో ఈ ఔషధ ప్రభావం వలన నీకు నా దగ్గర విద్యాభ్యాసం చేస్తున్నంతకాలం ఆకలి దప్పులు, నిద్ర కలుగదు. కానీ తరువాత అన్ని యధాప్రకారం సంభవించును. ఇంకా ఏ వ్యసనం లేకుండా అభ్యసించు అని చెప్పి రావి ఆకును ఒకదానిని తీసుకొని దానిపై శ్లోకాలు లిఖించి,వాటి తాత్పర్యం చెప్పి ప్రతి దినం ఇలాగే ఈ సమయానికి నేను చెట్టు దిగివచ్చి కొలను స్నానం చేసి, నా నిత్య కృత్యాలను తీర్చుకొని నీ దగ్గరకు వచ్చి నీకు కొత్త పాఠం చెప్పి వెళ్తాను. ఆ సమయంలో తప్ప తరువాత మరునాడు ఆ వేళ వరకు నేను నీకు కనబడను. నిర్జన ప్రదేశం అని భయపడకు. ఇక్కడ నీకు కీడు ఏది కలగదు అని ధైర్యం చెప్పి వృక్షంపై ఎక్...

Dasarathudu Ayodhyaku Cheratam || దశరథుడు అయోధ్యకు చేరటం || Episode 34 || Ramayanam

Image
    దశరథుడు అయోధ్యకు చేరటం పరశురాముడు. వెళ్ళగానే రాముడు. విష్ణుధనుస్సును, బాణాలను. వరుణ దేవునికి సమర్పించాడు. దశరథునికి వసిష్టాది. మహర్షులకు నమస్కరించి తండ్రిని వ్యాకులపాటు చెందవలదని ఊరడించాడు. అప్పుడు రాముడు దశరథుడితో ఇలా అన్నాడు: తండ్రీ! పరశురాముడు వెళ్లిపోయాడు. ఇక నీవు ఆతడిని గూర్చి చింతించటం  మాను. మనమందరమూ అయోధ్యకు పోదాం. వాన చినుకులకు ఎదురు చూచే చాతక పక్షులవలె సైన్యమంతా నీ ఆజ్ఞలకై వేచి ఉంది. వారందరికీ అయోధ్య వైపు ప్రయాణానికి అనుమతి ఇవ్వు అని అన్నాడు.  రాముని మాటలు విన్న దశరథుడు  స్పృహని తిరిగి పొందాడు. పుత్రుని ప్రేమానురాగాలతో కౌగలించుకున్నాడు. ఆయనకంతా ఒక కలలాగా అనిపించింది. రాముడు పునర్థన్మ ఎత్తినట్లుగా ఆనందపడిపోయాడు. దశరథుని పరివారమంతా అయోధ్యా నగరం చేరుకున్నారు. నగర వీథులన్నీ నీళ్ళుచల్లి, వీథి వీథికీ తోరణాలు కట్టారు. ప్రజలంతా ఆనందోత్సాహాలతో నాట్యం చేశారు. మంగళవాద్యాలెన్నో మోగించారు. ప్రజలు, మంత్రులు ఎదురు వచ్చి స్వాగత వచనాలు పలికారు. వారంతా అంతఃపురానికి చేరుకున్నారు. కౌసల్య, సుమిత్ర, కైకేయిలు ఎదురువచ్చి సీత, ఊర్మిళ, మాండవీ,  శృతకీర్తులను అనురాగంతో అ...

కుంటోడిపై పదవి ప్రభావం || Kunthodipai Padavi Prabhavam || Tenali Ramakrishna Stories || తెనాలి రామకృష్ణ కథలు || Part 5

Image
  కుంటోడిపై పదవి ప్రభావం ఒక రోజు రాయలు కొంతమంది సైన్యంతో అర్ధరాత్రి దొంగలను పట్టుకునేందుకు బయలుదేరాడు. దొంగలు అంతా కలిసి ఇరవై మంది వరకు ఉన్నారని గూఢచారులు ద్వారా తెలుసుకున్న రాయలు రెండు వందల మంది సైన్యాన్ని తీసుకుని నగరం దాటుతుండగా, రామలింగడు గుర్తుకురాగా, అతని ఇంటి తలుపు తట్టాడు. తలుపు తెరిచి బయటికి వచ్చాడు రామలింగడు. ఎదురుగా మారువేషంలో ఉన్నరాయలను చూసి క్షణంలో గుర్తుపట్టి లోపలికి రండి ప్రభూ! అని ఆహ్వానించాడు. నేను దొంగలను పట్టుకునేందుకు వెళ్తున్నాను. నీవు రాగలవా? దొంగలను తలచుకుని భయపడేలా అయితే వద్దు అని అన్నాడు.  తమరు పిలవడం నేను రాకపోవడమా! గండర గండనితో ఉంటే నాకేమి భయం ? తక్షణం బయలు దేరగలను అని చెప్పి తను మారువేషంలో అనుసరించాడు. అలా కొండలలోకి వెళ్లిపోయారు. తెలతెలవారుతుండగా రాయలు తన సైన్యాన్ని వెనుకనుంచి రమ్మనమనిచెప్పి రామలింగనితో తను బయలుదేరాడు. ఇద్దరూ చాలా దూరం వెళ్లాక ఒక్కసారి దొంగలు చుట్టుముట్టి కత్తులు చూపారు. రాయలు అవకాశం లేనందున వారిపై కత్తిదూయలేక పోయాడు. ఆ దొంగలనాయకుడు ఎగాదిగా చూసి ఎవర్రా మీరు? ఈ ఎర్రకొండలలోకి వచ్చారంటే ప్రాణాలపై ఆశ ఏమీలేనట్టున్నారు. మీరా కవులను వెంటేస...

Brahmaraakshasudu Chandravarnuditho Thana Vrutthantham Cheppadam || Bhatti Vikramarka Kathalu || PART 8

Image
  బ్రహ్మరాక్షసుడు చంద్రవర్ణుడితో తన వృత్తాంతం చెప్పడం  బ్రాహ్మణోత్తమా! చంద్రవర్ణా! నేను ఇప్పుడు ఉన్న ఆకృతిని పట్టి నన్ను నీవు మహాత్ముడైన ఋషివర్యుడువి అని అనుకుంటున్నావు కానీ నేను అటువంటి వాడిని కాదు. నా నిజమైన ఆకృతి ఇది కాదు. కామరూపధార శక్తి కలవాడిని కాబట్టి నా నిజమైన స్వరూపం తెలిస్తే నువ్వు భయపడతావని ఇలాంటి మనిషి రూపంలో వచ్చాను. నా స్వరూపం అతి భయంకరమైనది, నేను బ్రహ్మ రాక్షసుడుని. పరకాయ ప్రవేశం లాంటి సకల విద్యలు తెలిసిన మహావిధ్వాంసుడని గర్వించి ప్రసిద్ధులైన పండితులు అందరిని వాద ప్రతివాదాలలో ఓడించి కీర్తి పొందాను. నాకు తెలియని విద్య ఈ లోకమున లేనేలేదు.ఒకనాడు వేదాంతం గురించి ఆలోచిస్తున్న సమయంలో నేను ఒక మహా తపస్వి అయినా మునివరుని ప్రసంగం వినకుండా తిరస్కరించి అతనిని పరిహసించాను. దానికి అతడు కోపగించి నువ్వు విద్యా గర్వమున తేడా తెలియక నన్ను హేళన చేశావు కాబట్టి నువ్వు ఇక బ్రహ్మ రాక్షసుడువై ఉండు, నీ విద్య నిరుపయోగం అగుగాక అని ఘోరంగా శపించాడు. అంతటా నేను నా అవివేక ప్రవర్తన తెలుసుకొని, బాధపడి, అతనికి నమస్కరించి వినయముతో మహాత్మ నేను ఎంతటి పాండిత్యం కలవాడై ఉండి కూడా తగిన పరిజ్ఞానం లేక తప్ప...

Sree Ramudu Vaishnava Dhanassunu Sandhichatam || శ్రీరాముడు వైష్ణవ ధనుస్సును సంధించటం || Ramayanam || రామాయణం

Image
  శ్రీరాముడు వైష్ణవ ధనుస్సును సంధించటం రాముడు పరశురాముడితో ఇలా అన్నాడు: పరశురామా! నీవు నా తండ్రితో పలికిన మాటలన్నింటిని విన్నాను. నువ్వు స్వధర్మాన్ని పాటిస్తూ పితృబుణాన్ని తీర్చుకోవడం ఎంతైనా మెచ్చుకోదగ్గ విషయమే! అయినా, నన్ను పరాక్రమం లేని వాడిగా చులకన చేయడం, అవమానించడం నేను సహించను. ఇదుగో నా తేజస్సును, పరాక్రమాన్ని ప్రదర్శిస్తున్నాను చూడు. ఇదుగో నువ్వు చూపిన ఈ విష్ణు ధనుస్సును చేత పట్టి నారి సంధించి బాణం ప్రయోగించేందుకు సిద్ధంగా ఉన్నాను. ఓ పరశురామా! నీవు బ్రాహ్మణుడవయిపోయావు. అందునా, మీరు నా గురువులైన  విశ్వామిత్రునికి బంధువవడం చేత నేను సంధించిన బాణాన్ని నీపై ప్రయోగించి నీ ప్రాణం తీయను.  పరశురాముడు తండ్రి అయిన జమదగ్ని మహర్షి విశ్వామిత్రుని సోదరి అయిన సత్యవతి కుమారుడు. ఓ పరశురామా! ఎక్కుపెట్టిన విష్ణు బాణం వ్యర్థం కారాదు. చెప్పు! నీ గమన శక్తిని కొట్టమంటావా? లేక నీవు ఇంతవరకు పుణ్యకర్మలచే సంపాదించుకొన్న సాటిలేని ఉత్తమ లోకాలను కొట్టమంటావా? నిర్ణయం నీకే వదలుతున్నాను. రాముడు శ్రేష్టమైన ఆ ధనుస్సును ఎక్కుపెట్టగానే పరశురాముని తేజస్సు అంతా నిర్వీర్యమయింది. లోకమంతా స్తంభించిపోయింది. అ...