Posts

Showing posts from March, 2024

ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ || Prema Kosam Rajasabha Varaku Vachhina Alamkaravathi Katha || Episode - 14 || Bhatti Vikramarka Kathalu

Image
  ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ అలంకారవతి చంద్రవర్మను వెంటబెట్టుకొని రాజసభకు వెళ్ళింది. రాజుకు నమస్కరించి అక్కడ నిలబడింది. చంద్రవర్మ ఆ రాజును ఆశీర్వదించాడు. అందగాడైన చంద్రవర్మ గొప్ప తేజస్సుతో, మన్మథుడిలా ప్రకాశిస్తూ ఉండటం చూసి, ఆ పట్టణ ప్రభువైన మహేంద్రవర్మ ఆశ్చర్యపోయాడు. రాజు వారిని కూర్చోమని చెప్పి, వేశ్య కూతురైన అలంకారవతిని చూసి ఇలా అడిగాడు: "ఓ అందగత్తె! నువ్వు ఎవరివి? ఈ నగరంలోనే ఉంటావా? నిన్ను నేనెప్పుడూ చూడలేదే! ఈ బ్రాహ్మణోత్తముడు ఎవరు? ఇతడిని ఇప్పుడు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? మీరు వచ్చిన కారణం ఏంటో వివరించు." అందుకు అలంకారవతి రాజుతో ఇలా అంది: "మహాప్రభూ! నేను ఈ నగరంలోనే పేరుపొందిన ఒక వేశ్య కుమార్తెను. నా పేరు అలంకారవతి. నేను ఒక వ్రతాన్ని నియమంగా పెట్టుకుని, మా వేశ్య కుల మర్యాద అయిన వ్యభిచార వృత్తిని వదిలేశాను. బయటి ప్రపంచానికి కూడా తెలియకుండా ఇప్పటివరకు ఇంట్లోనే కాలం గడిపాను. అందుకే మీరు నన్ను చూసే అవకాశం రాలేదు." ఆ తర్వాత ఆమె తన వ్రతం వివరాలను, ఆ బ్రాహ్మణుడు తన ఇంటికి రావడం, అతడిని చూసి తాను మోహించి, నిద్ర లేపడానికి పడిన తాపత్రయాన్ని, తన మనసులోన...

దయ్యాల భవంతిని కొనుగోలు చేయుట (part 4) || Deyyala Bhavanthini Konugolu Cheyadam (part 4 ) || Tenali Ramakrishna Stories || తెనాలి రామకృష్ణ కథలు

Image
  దయ్యాల భవంతిని కొనుగోలు చేయుట ( part 4) రాజాధిరాజులైన మీ నీడన బతుకీడ్చు ఈ బ్రాహ్మణుడు తప్పు చేయటం,అది తమరు విశ్వసించుటయా! ఎంతటి ప్రారబ్దం ఈ క్షణం  అనుభవిస్తున్నాను. హతవిధీ! సత్యనిరూపణ కావలి ...... ఇక విషయం తమకు తెలిసేలా చేస్తాను. అయ్యా! నా ఇంటి వాకిట కూర్చుని ఉండగా ఓ చాటింపు విని ఆరా తీసిన నేరానికి ఈ వ్యాపార ప్రముఖుడు లింగిశెట్టి తన అనుయాయులను నా వద్దకు పంపి ఆ భవనం కొనుగోలు చేయమని మిక్కిలి ప్రోత్సహించారు. అతి తక్కువ ధరకు లభ్యం కాగలదని ప్రలోభపెట్టారు. పెద్ద ఎత్తున ధనం ఖర్చుచేసి ఇంత స్వల్ప ధరకు ఎలా అమ్ముతున్నారని అడిగాను. పొంతనలేని మాటలు చెప్పారు. ఇందులో  ఏదో మోసం ఉన్నదని గ్రహించి ఈ లింగిశెట్టిని కలిశాను. ఈ గృహంలో దయ్యాలు, పిశాచాలున్నాయి. వాటితో నువు వేగలేవని, చెప్తునే షరతులపై నాకుఅమ్మాడు. సభా మధ్యలో నిల్చొని కంచుగంట మ్రోగినట్లు అద్భుతమైన కంఠధ్వనితో చెప్పాడు. అంతా చెవులు రిక్కించి మరీ విన్నారు. "నీవు చెప్పునది సరే. ముందు షరతుల ప్రకారం నీవు ఈ సరికి మిగిలిన మొత్తం చెల్లించాల్సి ఉంది. మరెందుకు ఇవ్వకుండా మొండి కేస్తున్నావు. రాయల వారికి చెప్పుకున్నా నీకు ఒక్క రూక రాదని పదేపదే ...

బ్రహ్మ రాక్షసుడు చంద్రవర్ణుడితో సంభాషించడం || Brahmarakshasudu Chhandravarnuditho Sambhashinchadam || Bhatti Vikramarka Kathalu || PART 7

Image
బ్రహ్మరాక్షసుడు చంద్రవర్ణుడితో సంభాషించడం  చంద్రవర్ణుడు ఏ చెట్టు నీడలో పడుకున్నాడో ఆ రావి చెట్టుపై చాలా సంవత్సరాల నుండి ఒక బ్రహ్మ రాక్షసుడు నివసిస్తున్నాడు. అతడు ప్రతిరోజు మధ్యాహ్న కాలం దిగివచ్చి మనిషి రూపం దాల్చి ఆ జలాశయంలో స్నానం చేసి అతని నిత్య కృత్యాలు పూర్తి చేసి మరలా తిరిగి ఆ చెట్టు ఎక్కి అతడు తపస్సు చేస్తూ ఉండేవాడు. ఆ రోజు కూడా ఆ బ్రహ్మ రాక్షసుడు తన అలవాటుగా చెట్టుపై నుండి దిగివచ్చి ఆ వృక్షం దగ్గర పడుకుని నిద్రపోతూ ఉన్నా ఆ అందమైన బ్రాహ్మణుని చూసి ఆశ్చర్యపోయాడు, కొంతసేపు అతనినే అలాగే చూస్తూ నిలుచున్నాడు పిమ్మట ఆ జలాశయం లోకి వెళ్లి నిత్య కృత్యాలు చేసి మరల చెట్టు దగ్గరికి వచ్చి గాఢ నిద్రపోతున్న అతని వృత్తాంతం అడిగి తెలుసుకోవాలని అనుకొని అతని తట్టి నిద్రలేపాడు. అంతలో చంద్రవర్ణుడు టక్కున లేచి కూర్చొని కన్నులు నలుపుకొని తన ముందు నిలుచుని ఉన్న మహా తేజస్వియైన బ్రహ్మరాక్షసుడిని చూసి అంతట నిర్మానుష్యమైన చోట హఠాత్తుగా అతడు కనబడే సరికి ఆశ్చర్యపోయి అతనిని చూసి తనలో తను ఇలా అనుకున్నాడు:  ఇతడు ఎవరో మహాత్ముడి లాగా ఉన్నాడు, అని అనుకొని లేచి బ్రహ్మ రాక్షసుడికి నమస్కరించి నిలుచున్నాడు. అప...

పరశురాముడు, రామునికి సవాలు విసరడం || Parasuramudu Ramuniki Savalu Visaradam || Ramayanam || రామాయణం

Image
    పరశురాముడు రామునికి సవాలు విసరడం పరశురాముడు రాముడితో ఇలా అన్నాడు : రామా! నీవు గొప్ప పరాక్రమవంతుడవని విన్నాను. శివధనుస్సును విరిచావు అంట గదా! అది చాలా గొప్ప విషయమే. ఆశ్చర్యాన్ని కూడా కలిగిస్తోంది. అయితే నీ శక్తి  పరాక్రమాలేమిటో స్వయంగా చూడాలని ఒక ధనుస్సును తీసుకొచ్చాను. ఇది నాకు జమదగ్ని మహర్షి అయిన నా తండ్రి నుండి సంక్రమించింది. దీన్ని ఎక్కుపెట్టి బాణం వేస్తే, నేను కూడా నీ పరాక్రమాన్ని మెచ్చుకొని నీతో ద్వంద్వయుద్దానికి అంగీకరిస్తాను. ఎందుకంటే లోకంలో ఇద్దరు రాముళ్ళు ఉండకూడదు. రాముడో, పరశురాముడో ఎవరో ఒక్కరే ఉండాలి. దశరథ మహారాజు దీనుడై, వాడిపోయిన ముఖం పెట్టుకొని పరశురాముడితో  ఓ రామా! క్షత్రియులపై కోపాన్ని తొలగించుకొని చాలాకాలంగా శాంతంగా ఉంటున్నావు గదా? ఉన్నట్లుండి పసిబాలురైన నా కుమారులపై ఎందుకు కోపం ప్రదర్శిస్తున్నావు? నువ్వు భృగువంశీయ బ్రాహ్మణుడవు. దేవేంద్రుని ముందు శపథం చేసి అస్త్రసన్యాసం చేశావు. ఈ భూమినంతా కశ్యపునికి దానం చేసి గొప్ప ధార్మికుడవై, మహేంద్ర పర్వతంపైన తపస్సు చేసుకుంటున్నావు గదా! ఓ మహామునీ! ఈ రోజు అకారణంగా మా అందరిపైనా ఎందుకు కోపగించుకుంటున్నావు. మా విన...

దయ్యాల భవంతిని కొనుగోలు చేయుట || Deyyala Bhavanthini Konugolu Cheyadam (part 1) || Tenali Ramakrishna Stories || తెనాలి రామకృష్ణ కథలు

Image
  దయ్యాల భవంతిని కొనుగోలు చేయుట (part 1) విద్యలనగరమైన విజయనగరంలో రామలింగకవి తన భార్య ఇద్దరు పిల్లలతో రాయలు వారు ఇచ్చిన ఓ పురాతనమైన గృహంలో కాపురం పెట్టాడు. రాజాధిరాజు తలుచుకుంటే సౌకర్యాలకు కొదవ ఏముంటుంది. ఇంటినిండా పప్పులు, బియ్యాలు, పట్టువస్త్రాలు అంగడికి పోయి ఏమైనా కొనుగోలు చేయాలనుకుంటే అందుకు పదింతలు ధనం సమకూర్చ బడింది. తనకొత్త జీవితానికి తనే ఎంతో మురిసిపోతూ ఇంటి అరుగు మీద కూర్చున్నాడు రామలింగడు. ఇంట్లోంచి కమ్మటి నేతివంటకాల వాసనకు ముక్కుపుటాలు ఎగరేస్తున్న రామలింగని చెవికి ఓ చాటింపు వినిపించింది.  "పురజనులకు ఓ ముఖ్యవిన్నపం అయ్యా! నగరంలో అతిపెద్ద నగలవ్యాపారి లింగిశెట్టిగారు తను ఎంతో ముచ్చటపడి నిర్మించుకున్న అత్యాధునిక భవనాన్ని అమ్మేస్తున్నారహో! కొనగల శ్రీమంతులు ఎవరైనా ముందుకు రావచ్చు!"  అని అరిచి చెప్తున్నాడు. రామలింగకవి ఆ చాటింపు వేసే వాడిని పిలిచి ఆరా తీసి విషయం తెలుసుకున్నాడు. ఈలోగా అతని భార్య లోపలనుంచి వచ్చి “ఇక్కడైనా కాస్తా బుద్ధిగా ఉండండి. ఏదో రాయలవారి ధర్మమా అని ఓ గొప్ప బ్రతుకుదారి దొరికింది. వీధిగుమ్మంలో కూర్చున్నారంటే నాకు చచ్చేటంత భయం. దారిన పోయే అన్నిటిలో వేలు,...

Chandravarnudu Ane Brahmanudu Vidyabhyasamukai Velladam || చంద్రవర్ణుడు అనే బ్రాహ్మణుడు విద్యాభ్యాసముకై వెళ్లడం || Batti Vikramarka Kathalu || భట్టి విక్రమార్క కథలు

Image
  చంద్రవర్ణుడు అనే బ్రాహ్మణుడు విద్యాభ్యాసముకై వెళ్లడం రాజోత్తమా! భోజరాజా! నేను చెప్పబోయే విక్రమార్క మహారాజు చరిత్ర అత్యద్భుతమైనది. అతనికి గల సాహస,ధైర్య, స్తైర్య,గాంభీర,పరాక్రమ, చాతుర్య, విద్యా వివేకంలో, ఔదార్య,దయ, సత్యం, పరులకు ఉపకారం చేయడం లాంటి శుభ గుణాలు ఈ ప్రపంచంలో మరి ఏ మనిషికి ఉండవు.అనంత సద్గుణ గుణాలు శోభితుడై నిరంకుశముగా రాజ్యాన్ని చాలా కాలం ధర్మ పాలన చేస్తున్నాడు. లోకంలో అతని కీర్తి చంద్రుడుతో సమానమై నిలుచున్నట్టు చేసి భూమి పై సకల జనులలో చిరస్మరణీయుడై ఉన్నాడు. రాజాధిరాజకు విక్రమార్కుని లక్షణాలు ఎంత వర్ణించినా తృప్తి కలగదు. అటువంటి ఆ పుణ్యాత్ములు చరిత్ర మొదటి నుండి నేను నీకు చెప్తాను సావధాన మనస్సు కలిగి విను అని ఇలా చెప్పింది. అఖండ ప్రకృతి శోభా విరాజితమైన ఈ భూమిపైన సకల ఐశ్వర్యం, జన సమృద్ధి, పాడి పంటలతో ప్రసిద్ధి చెందిన నందిపురం అను పట్టణం ఒకటి కలదు. అందులో వేదాలలో ప్రవీణులైన బ్రాహ్మణోత్తములు, శత్రు జనాలకు భయంకరులై మహా పరాక్రమముచే పేరు గలిగిన క్షత్రియలు, ధన ధాన్య రత్నాలు అధికంగా కలిగి ఉండి సకల వస్తు సముదాయాలు క్రయవిక్రయాలు జరుపుతున్న ధనికులైన వైశ్యులు, సంపన్నులై దైవభక్తి కలి...