Posts

Showing posts from February, 2025

ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ || Prema Kosam Rajasabha Varaku Vachhina Alamkaravathi Katha || Episode - 14 || Bhatti Vikramarka Kathalu

Image
  ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ అలంకారవతి చంద్రవర్మను వెంటబెట్టుకొని రాజసభకు వెళ్ళింది. రాజుకు నమస్కరించి అక్కడ నిలబడింది. చంద్రవర్మ ఆ రాజును ఆశీర్వదించాడు. అందగాడైన చంద్రవర్మ గొప్ప తేజస్సుతో, మన్మథుడిలా ప్రకాశిస్తూ ఉండటం చూసి, ఆ పట్టణ ప్రభువైన మహేంద్రవర్మ ఆశ్చర్యపోయాడు. రాజు వారిని కూర్చోమని చెప్పి, వేశ్య కూతురైన అలంకారవతిని చూసి ఇలా అడిగాడు: "ఓ అందగత్తె! నువ్వు ఎవరివి? ఈ నగరంలోనే ఉంటావా? నిన్ను నేనెప్పుడూ చూడలేదే! ఈ బ్రాహ్మణోత్తముడు ఎవరు? ఇతడిని ఇప్పుడు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? మీరు వచ్చిన కారణం ఏంటో వివరించు." అందుకు అలంకారవతి రాజుతో ఇలా అంది: "మహాప్రభూ! నేను ఈ నగరంలోనే పేరుపొందిన ఒక వేశ్య కుమార్తెను. నా పేరు అలంకారవతి. నేను ఒక వ్రతాన్ని నియమంగా పెట్టుకుని, మా వేశ్య కుల మర్యాద అయిన వ్యభిచార వృత్తిని వదిలేశాను. బయటి ప్రపంచానికి కూడా తెలియకుండా ఇప్పటివరకు ఇంట్లోనే కాలం గడిపాను. అందుకే మీరు నన్ను చూసే అవకాశం రాలేదు." ఆ తర్వాత ఆమె తన వ్రతం వివరాలను, ఆ బ్రాహ్మణుడు తన ఇంటికి రావడం, అతడిని చూసి తాను మోహించి, నిద్ర లేపడానికి పడిన తాపత్రయాన్ని, తన మనసులోన...

మంథర దుర్భోధ - 2 || Manthara Dhurbhodha || Ramayanam || Episode - 42

Image
  మంథర దుర్బోధ - 2 కైక తనకు బహుమానముగా ఇచ్చిన ఆభరణమును విసిరి కొట్టింది మంధర. "అయ్యో ఎంత తెలివి తక్కువదానివమ్మా నువ్వు, దుఃఖించ తర్ల సమయంలో సంతోషంతో కేరింతలు కొడుతున్నావు. ముంచు కొస్తున్న ఆపదను గుర్తింలేకున్నావు. నిన్ను, నీ అమాయకత్వాన్ని చూచి నాకు నవ్వు వస్తోంది. అది కాదమ్మా! నాకు తెలియక అడుగుతాను. సవతి కొడుక్కు పట్టాభిషేకం జరుగుతుంటే సంతోషించే దానివి నువ్వు ఒక్కదానివే కనపడుతున్నావు. నీ చావును నువ్వే కొనితెచ్చుకుంటున్నావు. ఈ రాజ్యము ఎవరిది? దశరథునిది. ఆయనకు రాముడొక్కడే కాదు కదా! భరతుడు కూడా కుమారుడే కదా! భరతునికి కూడా రాజ్యాధి కారము ఉన్నది కాబట్టి రామునికి భరతుని చూస్తే భయము. అందుకే భరతుడు ఇంటలేని సమయములో పట్టాభిషేకము చేసుకుం టున్నాడు. ఈ విషయం ఆలోచించే కొద్దీ నాకు దు:ఖము ఆగటం లేదు తల్లీ నీకు ఎలా ఉందో గాని. ఇంకో విషయం గమనించావా! రాముడు లక్ష్మణుడు ఒకటి. భరతుడు శత్రుఘ్నుడు ఒకటి. రాముని తరువాత భరతుడు పుట్టాడు. అందుకనీ, రాముని తరువాత రాజ్యాధికారము భరతునికే చెందాలి. లక్ష్మణుడు, శత్రుఘ్నుడు చిన్నవాళ్లు. రాముడు విద్వాంసుడు. రాజనీతి కోవిదుడు. ధనుర్విద్యాపారంగతుడు. అందుకే, నీ కొడుకు భరతుని ...

మంథర దుర్భోధ || Manthara Dhurbhodha || Ramayanam || Episode - 41

Image
మంథర దుర్భోధ  దశరథుని ముగ్గురు భార్యలలో మూడవ భార్య కైక, కేకయ రాజ కుమార్తె. ఆమెకు దశరథునితో వివాహం అయిన తరువాత ఆమెకు తోడుగా మంథర అనే దాసి ఆమె వెంట అయోధ్యకు వచ్చింది. మంధర కైకేయికి ఆంతరంగిక దాసి, సలహాదారు. అటువంటి మంధర ఆ రోజు మేడ మీదికి ఎక్కి అయోధ్యానగరాన్ని చూచింది. అయోధ్య అంతా కోలాహలంగా కనపడింది. రాజమార్గములు అన్నీ తోరణములతోనూ పతాకములతోనూ అలంకరింపబడి ఉన్నాయి. పౌరులందరూ హడావిడిగా రాజనగరానికి వస్తున్నారు. ఇదంతా చూచిన మంథరకు ఏమి జరుగుతూ ఉందో అర్ధం కాలేదు. పక్కను ఉన్న ఒక దాసీని పిలిచి "అయోధ్యలో ఏమి జరుగుతూ ఉంది? ఆ కౌసల్య ఒట్టి పిసినారి కదా. ఆమె కూడా దానధర్మములు చేస్తూ ఉందా? ఏమి కారణం? దశరథుడు ఏమైనా ఘనకార్యం చేసాడా!" అని అడిగింది. ఆ దాసి మంథరతో ఇలా అంది. " అవును. దశరథమహారాజు గారు రేపు ఉదయం పుష్యమీ నక్షత్రంలో రామునికి యువరాజుగా పట్టాభిషేకము జరిపిస్తున్నాడు." అని చెప్పి హడావిడిగా వెళ్లిపోయింది. ఎదుటి వారి ఉన్నతిని చూచి ఓర్వలేని మంథరలో కోపము, అసూయ ప్రవేశించాయి. వెంటనే విసా విసా కైకేయి మందిరమునకు వెళ్లింది. ఆ సమయంలో కైకేయి మెత్తటి పరుపు మీద పడుకొని ఉంది. కైకను చూచి మంథర కోపం...

శ్రీరాముడు సీతసమేతుడై వ్రతం ఆచరించడం || Sreeramudu Seethasamethudai Vratam Aacharinchadam || Ramayanam || Episode - 40

Image
  శ్రీరాముడు సీతసమేతుడై వ్రతం ఆచరించడం వసిష్ఠుడు తన మందిరము నుండి వెళ్లిపోయిన తరువాత రాముడు, సీతతో కలిసి మంగళ స్నానము చేసి, భక్తితో శ్రీ మహా విష్ణువును పూజించాడు. తరువాత అగ్నికార్యము నిర్వర్తించాడు. శ్రీ మహావిష్ణు మంత్రములు జపిస్తూ అగ్నిలో నేతిని హెూమం చేసాడు. అగ్నిలో వేయగా మిగిలిన హవిస్సును తాను భుజించాడు. తరువాత తన భార్య సీతతో కూడా దర్భలతో చేసిన చాప మీద పడుకున్నాడు. మరునాడు తెల్లవారుజామునే నిద్రలేచాడు. తన మందిరమును చక్కగా అలంకరింపచేసాడు. ఇంతలో వంది మాగధులు వచ్చి స్తోత్రపాఠములతో వారి వంశచరిత్రను చక్కగా రామునికి వినిపించారు. రాముడు ప్రాత:కాల సంధ్యావందనము నిర్వర్తించాడు. గాయత్రీ మాతను ఉపాసించాడు. బ్రాహ్మణులు పుణ్యాహవాచనము చేసారు. రామపట్టాభిషేకము జరుగబోవుచున్నదని అయోధ్యా నగర పౌరులందరూ తెల్లవారుజామునే మేల్కొన్నారు. పురమును అంతా అలంకరించారు. రాజ ప్రాసాదముల మీద, కార్యాలయముల మీద, దేవాలయముల మీద పతాకములను ఎగురవేసారు. గాయకులు పాటలు పాడుతున్నారు. నర్తకులు చక్కగా తయారయి రాజభవనమునకు వెళ్లుటకు సిద్ధమవుతున్నారు. నర్తకులు నర్తిస్తున్నారు. అందరూ మంగళకరమైన మాటలు మాట్లాడు కుంటున్నారు. ఎవరి నోట విన్న...