ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ || Prema Kosam Rajasabha Varaku Vachhina Alamkaravathi Katha || Episode - 14 || Bhatti Vikramarka Kathalu
ఇప్పుడు మనం ప్రముఖ భారతీయ కళాకారుడైన కరతోలువు చంద్రశేఖరన్ శివశంకరన్ గురించి తెలుసుకుందాం !
శివశంకరన్ గారు 2020 సెప్టెంబర్ 29 న చెన్నైలోని తన నివాసంలో 96 సంవత్సరాల వయస్సులో కన్నుమూశారు.
శివశంకర్ గారు భారతీయ పత్రిక అయిన చందమామకు చేసిన అమూల్యమైన కృషి కి చందమామ శంకర్ గా పేరు పొందారు.
అతను చందమామ పుస్తకంలో వచ్చినా విక్రమ భేతాళ కథలలో వేసిన బొమ్మలకు కాను తనకు మంచి పేరు వచ్చింది.
ఇతను ఇంకా చాలా రకాల బొమ్మలను చందమామ పుస్తకాలలో గీశారు కానీ అన్నిటికంటే విక్రమబేతాళ కథల వలన ఇతనికి మంచి పేరు వచ్చింది.
శంకర్ గారు తమిళనాడు రాష్ట్రంలో ఎరోడ్ ప్రాంతానికి దగ్గరలో ఉన్న గ్రామాల్లో 1927 లో జన్మించారు.
శంకర్ గారు అతని తల్లి, అతని సోదరుడు 1934 లో చెన్నైకి తరలివెళ్లారు.
శంకర్గారికి బొమ్మలు వేయడం అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం, అందుకే తన చిన్నప్పటి నుంచే బొమ్మలు వెయ్యడం నేర్చుకున్నాడు.
అతను తన చరిత్ర పరీక్షలు ప్రసిద్ధి చెందిన చరిత్రకారుల బొమ్మలు వేసేవాడు. తన గ్రేడ్ 12 పూర్తి అయ్యాక, గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ లో చేరారు. ఇది చెన్నైలో ఉంది.
అతని మొట్టమొదటి ఉద్యోగం అప్పటి ప్రముఖ పత్రిక అయిన కలైమాగలో పనిచేశారు.
1947లో నాగిరెడ్డి అనే దర్శకుడు, అలాగే చక్రపాణి అనేవారు చందమామను మొదలుపెట్టారు. అతని మొట్టమొదటి ఉద్యోగంలో పనిచేసిన ఐదు సంవత్సరాల తరవాత 1952లో చందమామ సంస్థలో చేరారు. చందమామ అనేది అతనికి ఇంటి పేరుగా మారింది, అతనికి చందమామ సంస్థతో చాలా అనుబంధం ఉంది. చందమామ ఆపేసే వరకు అంటే 2012 వరకు ఆయన చందమామతో పని చేశారు. మొత్తం చందమామతో అతనికి అరవై సంవత్సరాల అనుబంధం ఉంది. అతని ఇతర ముఖ్యమైన చిత్రాలలో రామాయణం మరియు మహాభారత పురాణాలకు ఆయనకు మంచి పేరు వచ్చింది.
Comments