Posts

Showing posts from February, 2024

ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ || Prema Kosam Rajasabha Varaku Vachhina Alamkaravathi Katha || Episode - 14 || Bhatti Vikramarka Kathalu

Image
  ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ అలంకారవతి చంద్రవర్మను వెంటబెట్టుకొని రాజసభకు వెళ్ళింది. రాజుకు నమస్కరించి అక్కడ నిలబడింది. చంద్రవర్మ ఆ రాజును ఆశీర్వదించాడు. అందగాడైన చంద్రవర్మ గొప్ప తేజస్సుతో, మన్మథుడిలా ప్రకాశిస్తూ ఉండటం చూసి, ఆ పట్టణ ప్రభువైన మహేంద్రవర్మ ఆశ్చర్యపోయాడు. రాజు వారిని కూర్చోమని చెప్పి, వేశ్య కూతురైన అలంకారవతిని చూసి ఇలా అడిగాడు: "ఓ అందగత్తె! నువ్వు ఎవరివి? ఈ నగరంలోనే ఉంటావా? నిన్ను నేనెప్పుడూ చూడలేదే! ఈ బ్రాహ్మణోత్తముడు ఎవరు? ఇతడిని ఇప్పుడు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? మీరు వచ్చిన కారణం ఏంటో వివరించు." అందుకు అలంకారవతి రాజుతో ఇలా అంది: "మహాప్రభూ! నేను ఈ నగరంలోనే పేరుపొందిన ఒక వేశ్య కుమార్తెను. నా పేరు అలంకారవతి. నేను ఒక వ్రతాన్ని నియమంగా పెట్టుకుని, మా వేశ్య కుల మర్యాద అయిన వ్యభిచార వృత్తిని వదిలేశాను. బయటి ప్రపంచానికి కూడా తెలియకుండా ఇప్పటివరకు ఇంట్లోనే కాలం గడిపాను. అందుకే మీరు నన్ను చూసే అవకాశం రాలేదు." ఆ తర్వాత ఆమె తన వ్రతం వివరాలను, ఆ బ్రాహ్మణుడు తన ఇంటికి రావడం, అతడిని చూసి తాను మోహించి, నిద్ర లేపడానికి పడిన తాపత్రయాన్ని, తన మనసులోన...

Nuthana Vadhuvarulaku Janakuni Veedukolu || నూతన వధూవరులకు జనకుని వీడుకోలు || Ramayanam || రామాయణం

Image
  నూతన వధూవరులకు జనకుని వీడుకోలు రాత్రంతా ఒక్క క్షణంలా గడచిపోయింది. ఎవరూ కునుకు తీయలేదు. తెల్లవారింది. అనుష్టానాలన్నీ ముగిశాయి. విశ్వామిత్రుడు వధూవరులను ఆశీర్వదించి హిమాలయాలకు తపస్సు చేసుకోవటానికి వెళ్లిపోయాడు. అంతట దశరథ మహారాజు కూడా జనకాదుల వద్ద సెలవు తీసుకొని అయోధ్యకు బయలుదేరాడు. జనక మహారాజు తన కుమార్తెలకు లక్షలకొద్దీ ఆవులను, శ్రేష్టమైన కంబళీలు, కోట్లకొద్దీ పట్టువస్త్రాలను, ఏనుగులు, అశ్వాలు, రథాలు, చతురంగ సైన్యాన్ని, శ్రేష్ఠులైన దాసీలను, వెండి, బంగారు ఆభరణాలను విలువైన రత్నాలను కానుకగా సమర్పించాడు. జనకాది బంధువులంతా దశరథుని పరివారాన్ని చాలా దూరం అనుసరించి సాగనంపి తిరిగి ఇళ్లకు చేరారు. దశరథుడు, రామలక్ష్మణ భరత శత్రఘ్నులతో కలసి ప్రయాణం చేస్తూ ఉండగా పక్షులు భయంతో వికృతమైన ధ్వనులు చేశాయి. జంతువులన్నీ ప్రదక్షిణలు చేస్తున్నాయి. దశరథుడు ఇవన్నీ దుశ్శకునాలని తలచి తన మనస్సు ఏదో కీడు శంకిస్తున్నదని వసిష్టునితో అన్నాడు. అప్పుడు వసిష్ట మహర్షి  మహారాజా! ఆకస్మికంగాను, దైవికంగాను, భయంకరమైన ఆపదలు ఏవైనా సంభవించేటప్పుడు పక్షులు ముందుగా పసిగట్టి భయంకరంగా అరుస్తాయి. అయితే భయపడవలసిన పనిలేదు. మ...

Sri Krishnadevarayala Koluvulo Cherika 2 || Tenali Ramakrishna Stories || తెనాలి రామకృష్ణ కథలు

Image
  శ్రీ కృష్ణదేవరాయల కొలువులో చేరిక  రాయలవారు ఆ భక్తుడిని మీరు మీరు ఎవరు అని అడిగినప్పుడు ఆ భక్తుడు “నేను ఆంధ్ర దేశమందు తెనాలి వాస్తవ్యుడను. నా తల్లి అక్క మాంబ, తండ్రి రాయనామాత్యులు. నాపేరు రామలింగకవి. కానీ, రామకృష్ణ కవిగా నాకువిద్య నేర్పే గురువుచే పిలవబడేవాడిని. ఇంటి పేరు గార్లపాటి వారు, కౌండిన్య గోత్రానికి చెందిన యజుశ్శాఖా నియోగి బ్రాహ్మణుడను, వివాహితుడను. ఇరువురు బిడ్డలకు తండ్రిని. ఉదరపోషణకై తమ వంటి వారి కొలువును ఆశించి మిక్కిలి ఆశతో తమ వద్దకు వస్తున్నాను. కాలము నాతో చేతులు కలుపునట్లు తమ ముందు నిలిపినది” అని చేతులు జోడించాడు రామలింగకవి. “కవిశేఖరా! మీరు లీలాశుకుడు పై ప్రత్యేక గౌరవము కలిగినవారై ఉన్నారు. అమృత తుల్యమైన గానాన్ని వినిపించారు. అందులో కొన్ని మార్పులు బహుచక్కగా కుదిరినవి. దానికి మీ గాత్రం తోడైనది. ” “ఓసార్వభౌమా! నేను పాండురంగ మహత్యం అను కావ్యం రాస్తున్నాను. అందులో ఈ శ్లోకం ఈ విధంగా సరి  చేసి రాసాను. ఆ కావ్యం ఆ పాండురంగని దయతో పూర్తిచేయగలనని నమ్ముచున్నాను. భీమరధీ నదిలో స్నానం చేసినపుడు ఓ గొప్పఅనుభూతిని అనుభవించాను. ఈ పండరీ క్షేత్రం ఎంతో విశిష్టమైనది. నా కావ్య రచన...

మొదటి సాలభంజిక భోజరాజుని ఆక్షేపించుట || Modati Salabanjika Bhojarajuni Aakshepinchuta || Batti Vikramarka Kathalu

Image
  మొదటి సాలభంజిక భోజరాజుని ఆక్షేపించుట  భోజరాజు సింహాసనం ఎక్కడానికి మొదటి మెట్టుపై పాదం పెట్టగానే ఆ మెట్టుపై ఉన్న రత్న ప్రతిమా భోజరాజుని చూసి అతడు అత్యంత ఆశ్చర్యం చెందేలాగా మనుష్య వ్యాఖ్యలతో ఇలా అన్నది. ఓ భోజరాజా! నీవు ఈ సింహాసనాన్ని అతికుతూహలంతో ఎక్కుటకు ప్రయత్నించి వచ్చిన వాడివి కానీ దీనిని ఆరోహించటానికి గాని, దీనిపై ఆసీనుడు అగుటుకు గాని సామాన్యులకు సాధ్యము కాదు. ఇది సాహసం మరియు దానాలలో గొప్పవాడు, జగత్తులో ప్రసిద్ధి చెందిన వాడు, రాజులలో పరమేశ్వరుడైన విక్రమార్క రాజశేఖరుని సింహాసనం. దీనిపై అతడు కానీ అతనితో సమానమైన వారు కానీ ఎక్కాలి కానీ ఇతరులు అర్హులు కాదు. విక్రమార్కునికి ఇది  దేవేంద్రుడిచే ఇవ్వబడింది కానీ మనుషులచే నిర్మించబడింది కాదు. ఆ పృథ్వీ నాయకుడు గతించిన తర్వాత ఇది భూమిలో పూడ్చిపెట్టబడింది. అలా చేయటానికి కారణం కలుదు. నా లాగానే ఈ సింహాసనానికి కల 32 మెట్లపై ఉన్న 32 బొమ్మలు మాట్లాడగలవు. దీని కొరకు నువ్వు ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదు. బొమ్మలుగా ఉండి కూడా మాకు మాట్లాడే శక్తి కలగడానికి కారణం లేకపోలేదు, మెల్లగా నీకు అన్ని విషయాలు తెలుస్తాయి. ఇప్పుడు చెప్పేది ఏంటంటే, దిగాంత...

శ్రీరామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల వివాహం || Sree Rama Lakshmana Bharatha Satrugnala Vivaham || Ramayanam || రామాయణం

Image
  శ్రీరామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల వివాహం దశరథ మహారాజు పుత్రుల కొరకై గోదాన వ్రతాన్ని చేయించాడు. ఇంతలో కైకేయ  మహారాజు కుమారుడు, భరతుని మేనమామ అయిన యూధాజిత్తు వచ్చాడు. యూధాజిత్తు మహారాజు జనక మహారాజుతో ఇలా అన్నాడు:  మహారాజా! మా తండ్రి గారు మీ క్షేమ సమాచారాన్ని విచారించి రమ్మని  నన్ను పంపారు. అక్కడ మేము, మా పరివారం అంతా క్షేమమే. ముఖ్యంగా మనుమడైన  భరతుని క్షేమం తెలుసుకొని రమ్మన్నారు. అందు కొరకు అయోధ్యకు వెళ్లాను . మీరంతా  వివాహానికై ఇక్కడ ఉన్నారని తెలిసింది. వెంటనే బయలుదేరి వచ్చాను. అంతట దశరథ మహారాజు తన ప్రియాతిప్రియమైన అతిథికి ఉచితరీతిన గౌరవమర్యాదలు చేశాడు. రాత్రంతా కులాసా కబుర్లతో గడిపారు. ఉదయానే దశరథుడు తన  పుత్రులందరినీ, వెంటబెట్టుకొని, వసిష్టాది మహర్షులు ముందు నడువగా యజ్ఞవాటికకు  బయలుదేరాడు. జనక మహారాజు వచ్చి దశరథుని ప్రక్కనే కూర్చున్నాడు. రాముడు, సోదరులంతా కలసి చక్కగా అలంకరించుకొని తండ్రి వద్దకు వచ్చారు.  అప్పుడు వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో ఇలా అన్నాడు : ఓ జనక మహారాజా!  దశరథ మహారాజు తన పుత్రులతో వివాహానికై తరలివచ్చారు. కన్యాదాత కొరకు ఎదుర...

Sri Krishnadevarayala Koluvulo Cherika || Tenali Ramakrishna Stories || తెనాలి రామకృష్ణ కథలు

Image
  శ్రీ కృష్ణదేవరాయల కొలువులో చేరిక  కస్తూరీ తిలకం లలాటఫలకే వక్షస్థలే కౌస్తుభం  నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం  సర్వాంగే హరిచందనంచ కలయన్ కంఠేచ ముక్తావళీ గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడమణి  అని రాగయుక్తంగా పాడుతున్న ఆ గొంతు విని, విజయనగర సామ్రాట్ శ్రీకృష్ణదేవరాయలు ఒక్కసారి ఉలికిపడ్డాడు. గజారూఢుడై సాగుతున్న ఆయన ఎందుకో తన ప్రయాణాన్ని నిలుపుదల చేసుకుని చెవులు రిక్కించి, ఏనుగు దిగి మెల్లగా అడుగులు వేసుకుని ఓ ఆలయంలో ప్రవేశించాడు. చూస్తే ఎన్నిసార్లయినా చూడాలనిపించే శ్రీకృష్ణుని విగ్రహం ముందు చేతులు జోడించి పై శ్లోకం కర్ణపేయంగా ఆలపిస్తున్న ఓభక్తుని చూసి అతన్ని సమీపించాడు. రాయలను చూసిన ఆలయపూజారులు సర్దుకుని, ఆభక్తున్ని గర్భగుడిలోంచి పక్కకు నెట్టారు. అప్పుడు కళ్లువిప్పి చూసాడాభక్తుడు. "అయ్యా! లీనమై ఆ దేవదేవున్ని తనివి తీరా కొలుచుకుంటున్న నన్ను నెట్టడానికి కారణం? నేనేమైనా తెలియని అపరాధం చేసి ఉన్నానా?”అని అడిగాడు. "స్వామీ! ఆ వచ్చినది విజయనగర పురాధీశులు. ఇపుడే వచ్చి వెళ్ళారు. మరళ విచ్చేయడానికి కారణం తెలియదు. అందుకే భయపడుతున్నాం” బదులిచ్చి రాయలువారి ముందుకు ప...