Posts

Showing posts from May, 2023

ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ || Prema Kosam Rajasabha Varaku Vachhina Alamkaravathi Katha || Episode - 14 || Bhatti Vikramarka Kathalu

Image
  ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ అలంకారవతి చంద్రవర్మను వెంటబెట్టుకొని రాజసభకు వెళ్ళింది. రాజుకు నమస్కరించి అక్కడ నిలబడింది. చంద్రవర్మ ఆ రాజును ఆశీర్వదించాడు. అందగాడైన చంద్రవర్మ గొప్ప తేజస్సుతో, మన్మథుడిలా ప్రకాశిస్తూ ఉండటం చూసి, ఆ పట్టణ ప్రభువైన మహేంద్రవర్మ ఆశ్చర్యపోయాడు. రాజు వారిని కూర్చోమని చెప్పి, వేశ్య కూతురైన అలంకారవతిని చూసి ఇలా అడిగాడు: "ఓ అందగత్తె! నువ్వు ఎవరివి? ఈ నగరంలోనే ఉంటావా? నిన్ను నేనెప్పుడూ చూడలేదే! ఈ బ్రాహ్మణోత్తముడు ఎవరు? ఇతడిని ఇప్పుడు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? మీరు వచ్చిన కారణం ఏంటో వివరించు." అందుకు అలంకారవతి రాజుతో ఇలా అంది: "మహాప్రభూ! నేను ఈ నగరంలోనే పేరుపొందిన ఒక వేశ్య కుమార్తెను. నా పేరు అలంకారవతి. నేను ఒక వ్రతాన్ని నియమంగా పెట్టుకుని, మా వేశ్య కుల మర్యాద అయిన వ్యభిచార వృత్తిని వదిలేశాను. బయటి ప్రపంచానికి కూడా తెలియకుండా ఇప్పటివరకు ఇంట్లోనే కాలం గడిపాను. అందుకే మీరు నన్ను చూసే అవకాశం రాలేదు." ఆ తర్వాత ఆమె తన వ్రతం వివరాలను, ఆ బ్రాహ్మణుడు తన ఇంటికి రావడం, అతడిని చూసి తాను మోహించి, నిద్ర లేపడానికి పడిన తాపత్రయాన్ని, తన మనసులోన...

Sunahsepudu Evaru ? Sunahsepudini Viswamithrudu Ela Rakshinchadu ?

Image
శునఃశేపుడు ఎవరు? శునఃశేపుడిని విశ్వామిత్రుడు ఎలా రక్షించాడు?   విశ్వామిత్రుడు పశ్చిమ దిక్కున ఉన్న పుష్కర క్షేత్రానికి వెళ్లి తపస్సు చేయడం మొదలుపెట్టాడు. అదే సమయంలో అయోధ్య నగరాన్ని అంబరీషుడనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు.  అంబరీషుడు ఒక యాగం చేస్తున్నాడు. ఆయన అశ్వమేథ యాగము చేసి గుర్రాన్ని వదిలిపెట్టాడు. అంబరీషుడు యాగం చేయడం ఇష్టం లేని ఇంద్రుడు అశ్వాన్ని తీసుకెళ్లిపోయాడు. అశ్వం దొరకకపోతే తనకి మంచి జరగదు అని మహర్షులు చెప్పారు. నీవు యజ్ఞపశువుని అంటే అశ్వాన్ని అయినా తీసుకురా లేకపోతే దానికి బదులు ఒక మనిషిని అయినా తీసుకువస్తే యజ్ఞాన్ని పూర్తి చెయ్యవచ్చు అని మహర్షులు చెప్పారు. అది కూడా న్యాయముగా తీసుకు రావాలి అని చెప్పారు.  ఒక మనిషిని తీసుకురావడం కోసం అతను బయలుదేరాడు. అంబరీషుడు వేల కొలదీ ఆవులు ఇస్తాను ఒక్క మనిషిని ఇవ్వండి అని ఎందరినో అడిగాడు, కానీ ఎవరూ ఒప్పుకోలేదు.  అలా వెళ్తూ భృగుతుంగమనే ఒక పర్వత శిఖరం మీద ఋచీకుడనే ఒక ఋషి భార్య పిల్లలతో నివసిస్తూ ఉన్నాడు.  అంబరీషుడు ఋచీకమహర్షి దగ్గరకు వెళ్లి జరిగినది అంతా వివరించి మీ కుమారులలో ఒకరిని నాకు యజ్ఞ పశువుగా ఇవ్వగలరా?, దానికి బదు...

Ramayanam || Viswamithrudu Trishankudini Swarganiki Ela Pampinchadu?

Image
విశ్వామిత్రుడు త్రిశంకుడిని స్వర్గానికి ఎలా పంపించాడు? విశ్వామిత్రుడు త్రిశంకుడికి ఇచ్చిన మాట ప్రకారం తన శిష్యుల్ని, కొడుకుల్ని పిలిచి మీరు ఈ బ్రహ్మాండం అంతా తిరగండి, వశిష్ఠుడు చెయ్యలేని యాగము విశ్వామిత్రుడు చేస్తున్నాడు, త్రిశంకుడిని సశరీరంగా స్వర్గానికి పంపిస్తున్నాడు అని చెప్పి బ్రాహ్మణుల్ని, ఋషులను తీసుకురండి. విశ్వామిత్రుడు ఆజ్ఞమేరకు ఆయన శిష్యులు, కొడుకులు అందరు నలు దిక్కులకి వెళ్లి బ్రాహ్మణులను, ఋషులను ఆహ్వానించి వారిని తమ వెంట తీసుకొని వచ్చారు. అందరు విశ్వామిత్రుడికి భయపడి వచ్చారు. తరువాత విశ్వామిత్రుడి కొడుకులు వచ్చి వశిష్ట మహర్షి కుమారులు, అలాగే మహోదయుడనే బ్రాహ్మణుడు ఈ యాగానికి రానన్నారు అని విశ్వామిత్రుడితో చెప్పాడు. అలాగే వారు ఇలా అన్నారు "అది ఏమిటంటే, యాగం చేస్తున్నవాడు ఒక క్షత్రియుడు, యాగం చేయిస్తున్నవాడు ఒక ఛండాలుడు, ఇలాంటప్పుడు దేవతలు హవిస్సులని ఎలా తీసుకుంటారు, అసలు సశరీరంగా స్వర్గానికి పంపవచ్చు అని వేదాలలో ఎక్కడా లేదు", అందుకని రానన్నారు అని వారు అన్న మాటలు విశ్వామిత్రుడితో చెప్పారు.  ఆ మాటలు విన్న విశ్వామిత్రుడికి ఎక్కడ లేని కోపం వచ్చి వశిష్ట మహర్షి కొడుకులన...