ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ || Prema Kosam Rajasabha Varaku Vachhina Alamkaravathi Katha || Episode - 14 || Bhatti Vikramarka Kathalu

Image
  ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ అలంకారవతి చంద్రవర్మను వెంటబెట్టుకొని రాజసభకు వెళ్ళింది. రాజుకు నమస్కరించి అక్కడ నిలబడింది. చంద్రవర్మ ఆ రాజును ఆశీర్వదించాడు. అందగాడైన చంద్రవర్మ గొప్ప తేజస్సుతో, మన్మథుడిలా ప్రకాశిస్తూ ఉండటం చూసి, ఆ పట్టణ ప్రభువైన మహేంద్రవర్మ ఆశ్చర్యపోయాడు. రాజు వారిని కూర్చోమని చెప్పి, వేశ్య కూతురైన అలంకారవతిని చూసి ఇలా అడిగాడు: "ఓ అందగత్తె! నువ్వు ఎవరివి? ఈ నగరంలోనే ఉంటావా? నిన్ను నేనెప్పుడూ చూడలేదే! ఈ బ్రాహ్మణోత్తముడు ఎవరు? ఇతడిని ఇప్పుడు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? మీరు వచ్చిన కారణం ఏంటో వివరించు." అందుకు అలంకారవతి రాజుతో ఇలా అంది: "మహాప్రభూ! నేను ఈ నగరంలోనే పేరుపొందిన ఒక వేశ్య కుమార్తెను. నా పేరు అలంకారవతి. నేను ఒక వ్రతాన్ని నియమంగా పెట్టుకుని, మా వేశ్య కుల మర్యాద అయిన వ్యభిచార వృత్తిని వదిలేశాను. బయటి ప్రపంచానికి కూడా తెలియకుండా ఇప్పటివరకు ఇంట్లోనే కాలం గడిపాను. అందుకే మీరు నన్ను చూసే అవకాశం రాలేదు." ఆ తర్వాత ఆమె తన వ్రతం వివరాలను, ఆ బ్రాహ్మణుడు తన ఇంటికి రావడం, అతడిని చూసి తాను మోహించి, నిద్ర లేపడానికి పడిన తాపత్రయాన్ని, తన మనసులోన...

Dasarathudu ramalakshmanulanu viswamitruni venta enduku pampadu?

            దశరథుడు రామలక్ష్మణులను విశ్వామిత్రుని వెంట ఎందుకు పంపాడు?

సేవకులు వచ్చి విశ్వామిత్రుడు ద్వారం దగ్గర వేచి ఉన్నారు అని తెలిసాక దశరథుడు ఒక పురోహితుడుతో కలిసి 

విశ్వామిత్రునికి ఎదురు వెళ్లి నమస్కారాలు చేసి, ఆతిథ్యం ఇచ్చి సోత్రాలతో పూజించాడు. 

తరువాత విశ్వామిత్రుడు దశరథునితో ఇలా అన్నాడు:

 రాజా! నీవు నీ ప్రజలు బాగున్నారు కదా? శత్రుభయం ఏమి లేదు కదా? అని దశరథుణ్ణి అడిగాడు. 

అలాగే అక్కడ ఉన్న వశిష్ఠ మహర్షిని, అక్కడ ఉన్న అందరిని పలకరించి రాజభవనంలోకి వచ్చి తనకు సూచించిన స్థానములో కూర్చున్నాడు. 

అప్పుడు దశరథుడు ఇలా అన్నాడు: మహాముని ! మీరు అయోధ్య కి రావడం వలన నాకు చాలా సంతోషముగా ఉన్నది. 

నేను మీకు ఏ విధముగా సహాయము చేయగలను అని విశ్వామిత్రుడిని అడిగాడు?

విశ్వామిత్రుడు దశరథుని మాటలకు సంతోషించి రాజా! నేను ఎందుకు వచ్చానో తెలుసుకుని ఆ పని చేసి సత్యవంతుణ్ణి అని అనిపించుకో అని అన్నాడు. 

నేను ఒక యాగం అనుకోని మొదల పెట్టేసరికి ఇద్దరు బలమైన రాక్షసులు నా యజ్ఞ వేదికపై రక్తమాంసాలు పోసి అపవిత్రం చేసి నా యజ్ఞ సంకల్పం చెడకొట్టారు. అందుకని బయలుదేరి ఇక్కడకి వచ్చాను. నాతో నీ పెద్ద కొడుకైన రాముడిని పంపు అని అడిగాడు. 

నా యజ్ఞనాన్ని మారీచ, సుబాహు అను రాక్షసులు భగ్నం చెయ్యకుండా అతను రక్షిస్తాడు. 

రాముడు ఆ రాక్షసులను సులువుగా చంపగలడు, ఆ సంగతి వశిష్ఠుడికి కూడా తెలుసు. ఈ మాటలు విన్న దశరథనికి గుండె ఆగినంత పని అయ్యింది. అతనికి భయముతో కూడిన దుఃఖం వచ్చింది. 

అతను వెంటనే భయముతో సింహాసనం మీద నుంచి లేచి వణుకుతూ మహాముని! రాముడు ఇంకా చిన్న పిల్లవాడు. పదహారు సంవత్సరాలు కూడా నిండలేదు . వాడికి విలువిద్య కూడా సరిగా రాదు. వాడు రాక్షసులతో ఎలా యుద్ధం చేస్తారు? 

నా వద్ద ఒక అక్షౌహిణి సేన ఉంది. నేను వచ్చి యుద్ధం చేస్తాను అని అన్నాడు. 

అక్షౌహిణి  సేన అంటే చాల పెద్ద సైన్యం. ఇందులో 21870 రథాలు, 65610 గుర్రపు స్వారీలు చేసేవారు, 21870 ఏనుగులు, 109350 సైనికులు ఉంటారు. మొత్తం అక్షౌహిణి సేనలో 218700 మంది యుద్ధం చేసేవారుంటారు. ఇందులో రథసారధులు అంటే రథాన్ని నడిపేవారు కలపకుండానే ఇంతమంది సేన ఉంటారు.రథసారథులను ఎందుకు కలపలేదు అంటే వారు యుద్ధం చేయరు కదా అందుకని. 

ఇంకా దశరథుడు ఇలా అడిగాడు: ఇంతకూ ఆ రాక్షసులెవరూ? ఎలా ఉంటారు చూడటానికి? వారు ఎవరు కొడుకులు? అని అడిగాడు. 

అప్పుడు విశ్వామిత్రుడు దశరథ మహారాజుతో రావణుడు అనే రాక్షసుడు తెలుసు కదా! అతను బ్రహ్మాను మెప్పించి గొప్ప వరం పొందాడు. ఆ రావణుడు విశ్రవసుడి కొడుకు, కుబేరునికి సోదరుడు. 

అతను స్వయముగా యజ్ఞాభంగం చేయలేని సమయములో బలశాలులైన మారీచ సుబాహులను పంపుతాడు. 

అయ్యో రావణుడా! అతని ముందు నేనే నిలువలెను కదా! పసివాడైన రాముడు ఎలా నిలుస్తాడు 

ఆ మహాశక్తి వంతుడి పైకి రాముడిని పంపించడం ఎంతవరకు తగును అని అన్నాడు దశరథుడు. 

అప్పుడు విశ్వామిత్రుడికి చాల కోపం వచ్చింది. ఆ కోపములో విశ్వామిత్రుడి కళ్ళు ఎర్రపడ్డాయి. 

మహారాజా! ఆడినమాట తప్పినవాడిగా అపకీర్తి ని మోస్తూ సుఖముగా ఉండు అని కోపముతో లేచాడు. 

అప్పుడు వశిష్ఠుడు దశరథుణ్ణి మందలిస్తూ రాజా నీవు చేయరాని పని చేస్తున్నావు ఆడినమాట తప్పి రఘువంశానికి మాట తీసుకువస్తున్నావు అని అన్నాడు. 

విశ్వామిత్రుడంటే ఎవరు అనుకున్నావు, అతనికి తెలియని అస్త్రం లేదు. కొత్త అస్త్రాలు కూడా సృష్టించగలడు. 

ఆయన ఆ రాక్షసుని చంపలేక ఇంత దూరం వచ్చాడా? మీ కొడుకుకి మేలు చేయడానికి వచ్చాడు. 

రాముడిని ఏ బాధ, భయం లేకుండా అతని వెంట పంపు, విశ్వామిత్రుని తోడు ఉండగా రామునికి ఏ ప్రమాదం లేదు అని బోధించాడు. 

ఆ మాటలు  విని దశరథుడు రామలక్ష్మణలను పిలిపించి విశ్వామిత్రుడికి అప్పగిస్తాడు. వారు చక్కగా విశ్వామిత్రుని వెనక వెళ్లారు. 

వారి ఇద్దర దగ్గర విల్లులు  ఉన్నాయి. అలాగే వారి ఇద్దరి చేతులకు ఉడువు తోలుతో చేసిన తొడుగులు ఉన్నాయి 

వారి చేతులలో కత్తులు కూడా ఉన్నాయి. ఆలా నడుచుకుంటూ వాళ్ళు సరయు నది దక్షిణపు గట్టుకు వెళుతారు. 

అప్పుడు విశ్వామిత్రుడు రాముడుతో ఇలా అన్నాడు: 

నాయన రామా! నీవు ఆచమనం చేసిరా నీకు బల, అతిబల అనే మంత్రాలతో కూడిన విద్య నేర్పుతా అన్నాడు. ఈ రెండు విద్యలు నిన్ను ఆపదలు నుండి కాపాడతాయి. 

రాముడు సంతోషించి ఆచమనం చేశాక బల,అతిబల విద్యలను పొందుతాడు.

 ఆ రాత్రి వారు అక్కడే విశ్రాంతి తీసుకుంటారు. తెల్లవారుతూనే విశ్వామిత్రుడు వారిని నిద్రలేపి 
సరయూ నదిలో స్నానం చేసి తిరిగి వారి నడకను కొనసాగిస్తారు.  
అలా వారు నడుస్తూ సరయూనది గంగలో కలిసే చోటకి వస్తారు.
అక్కడ ఒక ఆశ్రమం ఉంది ఆ ఆశ్రమంలో ఒకప్పుడు శివుడు తపస్సు చేసుకుంటూ ఉంటే మన్మథుడు ఆ తపస్సు చెడగొట్టడానికి వచ్చి శివుడు తన మూడో కన్ను తెరిచే సరికి భస్మమైపోయాడు భస్మమైపోయాడు.
ఆ ఆశ్రమంలో శివుడు శిష్యులు ఉంటున్నారు.మన్మథుడు తన శరీరాన్ని అక్కడ పోగొట్టుకున్నాడు కనుక ఆ ప్రాంతానికి చేరుకుని  అంగదేశం అని పేరు వచ్చింది. 
ఈ విషయాలన్నీ విశ్వామిత్రుడు ద్వారా రామలక్ష్మణులు తెలుసుకుని ఆ రాత్రి ఆ ఆశ్రమంలో గడిపి  మరునాడు ఒక పడవలో గంగ ను దాటారు.
 ఆ తరువాత వారు కాలినడకన  ఒక భయంకరమైన  అడవికి వెళ్లారు. అక్కడ జనసంచారం లేదు ఆగకుండా కీచురాళ్ళ అరుపులు వినిపించాయి (కీచురాళ్ళు అంటే ఒక రకమైన కీటకం). సింహగర్జనలు, పులుల గాండ్రింపులు, అడవి పందుల గురగురలు, ఏనుగుల ఘీంకారాలు వినిపిస్తున్నాయి.
 చంద్ర,మద్ది,మారేడు,తుమ్మ ,వేగు చెట్లు దట్టంగా పెరిగి మనుషులు రాకుండా  వుంది ఆ అరణ్యం.
 రాముడు ఆ అరణ్యాన్ని చూసి ఆశ్చర్యపడి విశ్వామిత్రుడ్ని మహాముని ఈ అరణ్యం పేరేమిటి అని అడిగాడు.
  అప్పుడు విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు ఆ అరణ్యం కథను వివరంగా చెప్తాడు.
  ఈ ప్రాంతంలో ఒకప్పుడు మలదము,  కరూశము  అనే రెండు గొప్ప దేశాలుండేవి.
  ఈ ప్రాంతాలలో తాటక అనే యక్షిణి దానికొడుకు మారీచుడు అనేవాడు ఉండేవాడు.
వారిద్దరూ కలిసి రెండు దేశాలను నాశనం చేశారు.
 వారికి భయపడి మనుషులనే వారు అటుకేసి రావడం  లేదు.
తాటక సామాన్యురాలు కాదు వెయ్యి ఏనుగుల బలం కలది అందుచేత అది సుఖంగా వున్న రెండు దేశాలను మహా అరణ్యం గా మార్చింది.
 ఆ మాట విన్న రాముడు స్వామి యక్షులు అల్పశక్తిగలవారం అంటారు కదా !
మరి ఈ తాటక అనే యక్షిణి కి వెయ్యి ఏనుగుల బలం ఎలా వచ్చింది అని అడుగుతాడు? అప్పుడు విశ్వామిత్రుడు  ఆ తాటక వృత్తాంతాన్ని రాముడికి చెబుతాడు.


←Prev                                                                                                                                                                                                                                                                                Next→

Comments

Popular posts from this blog

Dasarathudu Ayodhyaku Cheratam || దశరథుడు అయోధ్యకు చేరటం || Episode 34 || Ramayanam

Ramayanam || Shiva Dhanassu

Goppa Thyagam || గొప్ప త్యాగం || Moral Stories || నీతి కథలు