Posts

Showing posts from April, 2026

ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ || Prema Kosam Rajasabha Varaku Vachhina Alamkaravathi Katha || Episode - 14 || Bhatti Vikramarka Kathalu

Image
  ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ అలంకారవతి చంద్రవర్మను వెంటబెట్టుకొని రాజసభకు వెళ్ళింది. రాజుకు నమస్కరించి అక్కడ నిలబడింది. చంద్రవర్మ ఆ రాజును ఆశీర్వదించాడు. అందగాడైన చంద్రవర్మ గొప్ప తేజస్సుతో, మన్మథుడిలా ప్రకాశిస్తూ ఉండటం చూసి, ఆ పట్టణ ప్రభువైన మహేంద్రవర్మ ఆశ్చర్యపోయాడు. రాజు వారిని కూర్చోమని చెప్పి, వేశ్య కూతురైన అలంకారవతిని చూసి ఇలా అడిగాడు: "ఓ అందగత్తె! నువ్వు ఎవరివి? ఈ నగరంలోనే ఉంటావా? నిన్ను నేనెప్పుడూ చూడలేదే! ఈ బ్రాహ్మణోత్తముడు ఎవరు? ఇతడిని ఇప్పుడు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? మీరు వచ్చిన కారణం ఏంటో వివరించు." అందుకు అలంకారవతి రాజుతో ఇలా అంది: "మహాప్రభూ! నేను ఈ నగరంలోనే పేరుపొందిన ఒక వేశ్య కుమార్తెను. నా పేరు అలంకారవతి. నేను ఒక వ్రతాన్ని నియమంగా పెట్టుకుని, మా వేశ్య కుల మర్యాద అయిన వ్యభిచార వృత్తిని వదిలేశాను. బయటి ప్రపంచానికి కూడా తెలియకుండా ఇప్పటివరకు ఇంట్లోనే కాలం గడిపాను. అందుకే మీరు నన్ను చూసే అవకాశం రాలేదు." ఆ తర్వాత ఆమె తన వ్రతం వివరాలను, ఆ బ్రాహ్మణుడు తన ఇంటికి రావడం, అతడిని చూసి తాను మోహించి, నిద్ర లేపడానికి పడిన తాపత్రయాన్ని, తన మనసులోన...

రాముడి వనవాసం....కైకేయి వరాల నిజం || Ramudi Vanavasam.....Kaikeyi Varala Nijam || Ramayanam || Epsode 52

Image
   కైకేయి తను కోరిన వరాలను గూర్చి రాముడితో చెప్పడం రాముడు మందిరంలోనికి ఒంటరిగా ప్రవేశించాడు. అక్కడ ముఖాన కళాకాంతులు లేకుండా, వాడిపోయిన ముఖంతో పక్కపై పడుకొని ఉన్న దశరథుణ్ణి చూశాడు. వెంటనే ఆయన పాదాలకు సమస్కరించాడు. పిదప కైకేయి పాదాలకు సమస్కరించాడు. దశరథుడు 'రామా' అని మాత్రం అన్నాడు. ఆపై గొంతు పెగల్లేదు. కళ్లు నీటితో నిండిపోయి, బొటబొటా నీరు కారసాగింది. తండ్రిని ఇదివరకెప్పుడూ అంత దీనంగా చూడలేదు. తండ్రి పరిస్థితికి రాముడు కూడా కలత చెందాడు.  అప్పుడు రాముడు కైకేయితో అమ్మా! తండ్రిగారు సంతోషం లేనివారై కృశించిపోయి ఉన్నారు. గ్రహణం పట్టిన సూర్యునిలా, అబద్దమాడిన మహర్షిలా కాంతిహీనుడై ఉన్నాడు. తండ్రిగారు ఏదో ఊహించటానికి వీలుకానంత దుఃఖంలో ఉన్నారు. పూర్ణిమ నాటి సముద్రునిలా అమిత అశాంతితో ఉన్నారు. అమ్మా! తండ్రిగారు నన్ను చూడటంతోనే సంతోషంగా పలకరించేవారు. అంతకుపూర్వం కోపంగా ఉన్న నన్ను చూడగానే కోపం అంతా పోయి ప్రశాంతంగా మారిపోయేవారు. అమ్మా! అజ్ఞానంచేత నేను ఏమైనా తండ్రిగారి మనస్సు కష్టపెట్టానా? ఎప్పుడూ నేనంటే ప్రేమగా ఉండే వారు ఈనాడు ఒక్కమాటైనా నోటి వెంట రావడంలేదు. పైగా ముఖమంతా వాడిపోయి ఉంది. శరీ...

రామునిపై అయోధ్య ప్రజల ప్రేమ!💓 || Ramunipai Ayodhya Prajala Prema || Ramayanam || Epsode 51

Image
  రామునిపై అయోధ్య ప్రజల ప్రేమ!💓 రాముడు రథంలో అయోధ్యానగర వీరుల గుండా వివిధరకాలైన చందన, అగరు ధూపాలచే నిండిపోయిన సుగంధాలను దాటుకుంటూ పోయాడు. వివిధ దేశాలనుండి తనను చూడటానికి వచ్చిన జనసమూహాల్ని చూశాడు. వారంతా తనను, తన వంశాన్ని స్తుతించడం. విన్నాడు. వీధులకు రెండు ప్రక్కలా ఉన్న రకరకాల అంగళ్ళను చూశాడు. అంగళ్ళలో రాసులుగా పోసిన పట్టువస్త్రాలను, నూలువస్త్రాలను చూశాడు. కొత్తముత్యాలను, పగడాలను చూశాడు. వాటికి ఇంకా బెజ్జాలైనా వేయలేదు. సరికొత్తవి. స్పటికాల్లాంటి రత్నరాసుల్ని చూశాడు. పరిమళ ద్రవ్యాలనమ్మే అంగళ్లను, తినుబండారలనమ్మే అంగళ్ళను, వాటిని విరివిగా కొంటున్న జనాన్ని చూశాడు. ఇంకొన్ని అంగళ్ళలో నిత్యపూజలకోసం పెరుగు, అక్షతలు, పేలాలు, చందనం, పూలు, పండ్లు మొదలైన వస్తువులను విక్రయిస్తున్నారు. వీధుల రెండు వైపులా ఆకాశాన్నంటే పెద్ద పెద్ద మేడల్ని చూశాడు. బ్రాహ్మణులు ఆశీర్వచనాలు పలుకుతూ ఉంటే రాముడు ముందుకు సాగిపోయాడు. దేవేంద్రుని రాజవీథుల్లాగా ఉన్న అయోధ్యాపుర వీధుల్లో జానపదులు గుంపులు గుంపులుగా చేరారు. రామరాజ్యాన్ని గురించి గానం చేశారు. "దశరథ మహారాజు మన రాముణ్ణి యువరాజును చేస్తున్నాడు. అతడి పాలనలో మనం ఏ...

శ్రీరాముడు దశరథ దర్శనానికి బయలుదేరటం || Sriramudu Dasaratha Darsananiki Bayaluderatam || Ramayanam || Episode - 50

Image
   శ్రీరాముడు దశరథ దర్శనానికి బయలుదేరటం సుమంత్రుడు అంతఃపురంలోని ఏకాంతవాస ప్రాంతాన్ని చేరాడు. ఆ కక్ష్యలో జనసమ్మర్ధం ఎక్కువగాలేదు. సుశిక్షితులు, రామభక్తి పరాయణులైన రక్షకభటులు మాత్రమే ఉన్నారు. వారిని పర్యవేక్షిస్తూ కాషాయ వస్త్రాలు ధరించిన వృద్ధులున్నారు. వారితో సుమంత్రుడు "రామదర్శనానికి వచ్చా" నని చెప్పమన్నాడు. సుమంత్రుడు తండ్రికి సన్నిహితుడు, వృద్ధుడు, తనకు అత్యంత గౌరవపాత్రుడు కావటం వలన రాముడు సీతతో కలసి ఏకాంతగృహంలో ఉన్నా కూడా వెంటనే తన వద్దకు తీసుకురమ్మని ద్వారపాలకునికి చెప్పి పంపాడు. రాముడు తెల్లటి దుప్పటికప్పిన బంగారుపాన్పుపై కూర్చున్నాడు. ఒంటినిండా శ్రేష్టమైన చందనాన్ని అలదుకున్నాడు. ఆ చందనం వరాహరక్తంలా సుగంధాన్ని వెదజల్లుతోంది. చక్కగా అలంకరించుకొని కుబేరునిలా కూర్చున్నాడు. ప్రక్కనే సీత నిలబడి వింజామరతో విసురుతూ ఉంది. రాముణ్ణి చూస్తూ ఉంటే చిత్రానక్షత్రంలో చంద్రునిలా ప్రకాశిస్తున్నాడు. అటువంటి మహాతేజస్సుతో సూర్యునిలా వెలిగిపోతున్న రాముడికి సుమంత్రుడు వినయంగా నమస్కారం చేశాడు. సుమంత్రుడు ఆసనంపై కూర్చున్నాడు. అప్పుడు సుమంత్రుడు రామునితో ఇలా అన్నాడు:కౌసల్యా పుత్రా! రామా! దశరథ మహా...

సుమంత్రుడు రామ మందిరానికి చేరడం || Sumanthrudu Raama Mandiraniki Raavadam || Ramayanam || Episode - 49

Image
  సుమంత్రుడు రామ మందిరానికి చేరడం సూర్యోదయం అయింది, వసిష్ఠుడు, బ్రాహ్మణులు, వర్తక ప్రముఖులు, రాజోద్యోగులంతా రాముని భవంతి ముందు వేచి ఉన్నారు. పుష్యమీ నక్షత్రాన రాముడి జన్మలగ్నమైన కర్కాటక లగ్నంలో రామరాజ్యాభిషేకం జరగాల్సి ఉంది. ఏర్పాట్లన్నీ అయ్యాయి. అభిషేకం కోసం భద్రపీఠాన్ని (రాజాసనం) తెచ్చారు. నాలుగు గుర్రాలు పూన్చిన రథం సిద్ధంగా ఉంది. రథంలో కూర్చోవటానికి పులితోలు పరిచారు. బోయీలతో పల్లకీ కూడా సిద్ధంగా ఉంది. గంగోదకం, ఇతర నదుల్లో నుంచి తెప్పించి ఉంచిన పవిత్ర జలాలు, పవిత్ర సరస్సులనుండి, బావులనుండి, సప్తసముద్రాలనుండి తెప్పించిన జలాలన్నీ బంగారు కలశాల్లో నింపి సిద్ధంగా ఉంచారు. ఆ కలశాలను రావి ఆకులతోను, తామరపూలతోను, కలువపూవులతోను మూసి ఉంచారు. తేనె, నెయ్యి, పాలు, నవధాన్యాలు, దర్భలు, నవరత్నాలు, ఖడ్గం, ధనుస్సు మున్నగునవన్నీ సిద్ధంచేశారు. తెల్లని ఆబోతును తెచ్చారు. దాని పెద్ద మూపురానికి తెల్లటి వస్త్రాన్ని ధరింపజేశారు. మెడ నిండా జూలు వేళ్ళాడుతున్న నాలుగు గుర్రాలు, పర్వతం అంత ఎత్తున ఉన్న మదించిన ఏనుగు, ఆవులు, మృగాలు, అనేక రకాలైన పక్షుల్నీ సిద్ధంగా ఉంచారు. చక్కగా అలంకరించుకొన్న అందమైన వేశ్యలున్నారు...