Posts

Showing posts from May, 2025

ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ || Prema Kosam Rajasabha Varaku Vachhina Alamkaravathi Katha || Episode - 14 || Bhatti Vikramarka Kathalu

Image
  ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ అలంకారవతి చంద్రవర్మను వెంటబెట్టుకొని రాజసభకు వెళ్ళింది. రాజుకు నమస్కరించి అక్కడ నిలబడింది. చంద్రవర్మ ఆ రాజును ఆశీర్వదించాడు. అందగాడైన చంద్రవర్మ గొప్ప తేజస్సుతో, మన్మథుడిలా ప్రకాశిస్తూ ఉండటం చూసి, ఆ పట్టణ ప్రభువైన మహేంద్రవర్మ ఆశ్చర్యపోయాడు. రాజు వారిని కూర్చోమని చెప్పి, వేశ్య కూతురైన అలంకారవతిని చూసి ఇలా అడిగాడు: "ఓ అందగత్తె! నువ్వు ఎవరివి? ఈ నగరంలోనే ఉంటావా? నిన్ను నేనెప్పుడూ చూడలేదే! ఈ బ్రాహ్మణోత్తముడు ఎవరు? ఇతడిని ఇప్పుడు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? మీరు వచ్చిన కారణం ఏంటో వివరించు." అందుకు అలంకారవతి రాజుతో ఇలా అంది: "మహాప్రభూ! నేను ఈ నగరంలోనే పేరుపొందిన ఒక వేశ్య కుమార్తెను. నా పేరు అలంకారవతి. నేను ఒక వ్రతాన్ని నియమంగా పెట్టుకుని, మా వేశ్య కుల మర్యాద అయిన వ్యభిచార వృత్తిని వదిలేశాను. బయటి ప్రపంచానికి కూడా తెలియకుండా ఇప్పటివరకు ఇంట్లోనే కాలం గడిపాను. అందుకే మీరు నన్ను చూసే అవకాశం రాలేదు." ఆ తర్వాత ఆమె తన వ్రతం వివరాలను, ఆ బ్రాహ్మణుడు తన ఇంటికి రావడం, అతడిని చూసి తాను మోహించి, నిద్ర లేపడానికి పడిన తాపత్రయాన్ని, తన మనసులోన...

కైకేయి కోపగృహం చేరటం || Kaikeyi Kopagruham Cheratam || Ramayanam || Episode - 43

Image
 కైకేయి కోపగృహం చేరటం కైకేయి మంథరతో ఇలా అన్నది : ఓ మంథరా! నీ మాటలలోని గూఢార్థం ఇప్పుడిప్పుడే బోధపడుతోంది. రాముని రాజ్యాభిషేకాన్ని ఎట్లాగైనా ఆపాలని నా మనస్సు తహతహలాడుతోంది. నా మనస్సు మొద్దుబారిపోయింది. నాకు ఏమీ తోచటంలేదు. నువ్వే ఏదైనా మంచి ఆలోచన చెప్పు. అప్పుడు మంథర అమ్మా! రాణీ! నీకు అన్నీ తెలుసు. నా నోటినుండి వినాలని ఈ విధంగా మాట్లాతున్నావు. అయినా అడిగావు కాబట్టి, నాకు తోచిన సలహా చెబుతాను, విను. పూర్వం దేవాసురులు యుద్ధం చేసే సమయంలో ఇంద్రుడు, ఇతర రాజర్షులతోపాటు నీ భర్త సహాయం కోరాడు. ఆ యుద్ధానికి దశరథ మహారాజు నిన్నుకూడా తీసుకొని వెళ్ళాడు. మీరంతా కలసి దండకారణ్య ప్రాంతంలో తిమిధ్వజుడనే రాక్షసుని బలగాలను ఎదుర్కొన్నారు. వారిలో శంబరుడనే వాడు బహు మాయావి. దేవతలందరినీ జయించి ఇంద్రునితో తలపడ్డాడు. ఆ మహాయుద్ధంలో గాయపడ్డ వారిని రాక్షసులు రాత్రిపూట నిర్దాక్షిణ్యంగా చంపడం మొదలుపెట్టారు. ఆ సమయంలో దశరథ మహారాజుకు కూడా యుద్ధంలో బాగా గాయాలయ్యాయి. ఒళ్ళు తెలియకుండా రథంలోనే పడి ఉన్న దశరథుని, నువ్వు రథసారథ్యం వహించి అతినేర్పుగా కాపాడావు. అయినా రాక్షసులు అక్కడకు కూడా వచ్చి దశరథుని చంపేందుకు ప్రయత్నించారు. అ...