ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ || Prema Kosam Rajasabha Varaku Vachhina Alamkaravathi Katha || Episode - 14 || Bhatti Vikramarka Kathalu
ఇప్పుడు మనం అశ్వమేథయాగం మరియు పుత్రకామేష్టియాగం గురించి తెలుసుకుందాం!
దశరథుడు ఋష్యశృంగుడు వద్దకు వచ్చి ప్రధాన ఋత్విక్కుగా ఉండమని అడిగాక ఋష్యశృంగుడు దశరథ మహారాజు తో ఇలా అన్నాడు:
ఓ దశరథ మహారాజా ! అటులనే జరగనివ్వు నేను మీ చేత అశ్వమేధయాగం జరిపిస్తాను, తరువాత పుత్రసంతానం కోసం మరొక యాగం చేపిస్తాను అని అన్నారు. మీరు ముందుగా అశ్వమేథయాగముకు కావాల్సినవి అన్ని సమకూర్చు. ముందుగా ఒక ఉత్తమ అశ్వాన్ని చూసి దానిని యజ్ఞాశ్వముగా వదులు అని అన్నారు. ఋష్యశృంగుడు అన్న మాటలకూ సంతోషించి వెంటనే తన మంత్రి అయిన సుమంతుడిని పిలిపించాడు.
అశ్వమేథ యాగం కోసం ఘనముగా ఏర్పాట్లు చేసారు.
యజ్ఞాలు చేసేవారు , వేదాలు చదివేటందుకు సుయజ్ఞుడు, వామదేవుడు , బాబాలి మరియు కశ్యపుడు మొదలైన మునులను, బ్రాహ్మణ శ్రేష్ఠులను పిలిపించారు.
ఏమేమి వస్తువులు సమకూర్చాలో వసిష్ఠుడు మొదలైన వారు చెప్పారు.
సమృద్ధులైన వారిని గుర్రము వెంట పంపారు.
సరయు నది ఉత్తరపు గట్టున యజ్ఞశాల నిర్మించారు.
యజ్ఞ కార్యక్రమం లో పాల్గొనడానికి వడ్రంగులను, బేలుదారీలను, చిత్రకారులను మరియు నాట్యశాస్త్రములో ప్రావీణులను పిలిపించారు.
యాగానికి వచ్చే రాజులకు మేడలు కట్టారు.
బ్రాహ్మణులకు కుటీరాలు, భోజనాలకు విశాలమైన పందిళ్లు తయారుచేసారు.
సమస్త రాజులకు, చతుర వర్ణాల వారికి ఆహ్వానాలు వెళ్లాయి.
మిథిలా రాజు అయిన జనకుడికి, కాశీరాజుకు మరియు దశరథుడి మామగారైన కేకేయ రాజుకి ,రోమపాద మహారాజుకి ప్రత్యేక ఆహ్వానాలు వెళ్లాయి.
అనేక మంది రాజులను సుమంతుడు స్వయముగా వెళ్లి ఆహ్వానించాడు.
రావాల్సిన వారంతా వచ్చి విడిది చేసారు.
దశరథుడు యజ్ఞం చేయుటకు మంచి ముహూర్తం చూసి ఆ ముహూర్తం ఆసన్నం అయ్యే సమయానికి దశరథుడు యజ్ఞశాల కు చేరుకుంటాడు .
అశ్వమేథ యాగం కోసం విడిచి పెట్టిన యాగాశ్వం తిరిగి వచ్చింది.దానికోసం ఒక సంవత్సరకాలం పట్టింది.యజ్ఞం మొదలైంది.
మొదటి హావిర్భాగం ఇంద్రుడికి అర్పించి యాగం సాగించారు.
యజ్ఞశాల అతిథులతో కళాకలాడింది.
అక్కడకు వచ్చిన అందరకి యాగం జరిగిన అన్ని రోజులు బ్రాహ్మణలకి, రాజాధిరాజులకి, వారి వెంట వచ్చినా ఉద్యోగులకి, భటులకి, సన్యాసులకు మరియు తాపసలకు అందరకి తృప్తిగా భోజనాలు పెట్టి, వస్త్రాలు కూడా ఇచ్చి సత్కరించారు.
యాగం లో ఊపాస్తంభం నిలుపవలిసిన సమయం వచ్చింది.
ఊపాస్తంభం అంటే పూర్వకాలములో యాగాలు జరిగేటప్పుడు బలులు ఇచ్చేవారు కదా ! బలులు ఇవ్వడానికి వాడే స్తంభాలను ఊపాస్తంభాలు అంటారు.
ఆ ఊపాస్తంభాలు ఎలా ఉన్నాయంటే బిల్వవృక్షం కర్రతో చేసినా ఊపాస్తంభాలు ఆరు, చంద్రకర్రతో చేసినవి ఆరు, మోదగా కర్రతో చేసినవి ఆరు, శేషాత్మక కర్రతో చేసినవి ఒకటి, దేవదారు కర్రతో చేసినవి రెండు యాగవాటికలో పాతారు.
ఒకదానికి మరొకదానికి బారెడు వెడల్పు ఉండేలా పాతారు.
వాటిని బంగారముతో అలంకరించారు.
ఆ 21 ఊపాస్తంభాలను రంగు రంగు వస్త్రములతో అలంకరించారు.
వేదాలలో చెప్పిన విధముగా యజ్ఞకుండలాను ఏర్పాటుచేశారు.
దశరథుడు ఆయన భార్యలు కూర్చోడానికి గరుడుని ఆకారములో ఒక వేదిక నిర్మించారు.
అప్పుడు బలులు బాగా ఇస్తారని చెప్పుకున్నాం కదా ! అలాగే ఆ యాగములో దేవతలకు బాలి ఇవ్వడం కోసం 21 ఊపాస్తంభాలు నాటారు కదా! ఆ ఊపాస్తంభాలకు రకరకాల పక్షులను, పశువులను,పాములను కట్టారు.
యజ్ఞం కొరకు వదిలిన అశ్వమును ఒక ఊపాస్తంభనికి కట్టారు.
మొత్తము 300 పశువులను, ఒక యాగాశ్వమును వాటికి కట్టారు.
తరువాత దశరథుడి పట్టమహిషి కౌసల్య అక్కడకి వచ్చింది.
యజ్ఞాశ్వమును కట్టిన ఊపాస్తంభానికి 3 సార్లు ప్రదక్షిణ చేసి 3 కత్తులతో బలిఇచ్చింది.
శాస్త్రం ప్రకారం కౌసల్య ఆ రాత్రంతా ఆ గుర్రము పక్కనే ఉన్నది.
అశ్వమేధయాగం అయిపోగానే దశరథుడు తన చేత యాగం చేపించినా ఋత్వికులకు భూమి మొత్తం దానం చేసాడు.
మహారాజా భూమిని పాలించడం మా వల్ల అయ్యే పని కాదు అందుచేత భూమికి బదులు మణులో, బంగారమో, గోవులో మరొకటో ఏది సిద్ధముగా ఉంటె అది ఇప్పించండి అన్నారు.
దశరథుడు వారికి పది లక్షల గోవులను, నూరు కోట్ల బంగారమును, నాలుగు వందల కోట్ల వెండిని దానం చేసాడు.
వారు గోవులను, ధనమును వసిష్ఠుడికి మరియు ఋష్యశృంగుడికి ఇచ్చారు వారు ఆ ధనమును న్యాయప్రకారముగా పంచిపెట్టారు.
ఇంతలో ఒక దరిద్ర బ్రాహ్మణుడు వచ్చి దశరథుని ముందు చెయ్యి చాచాడు.
దశరథుడు వెంటనే తన చేతి కడియం తీసి ఆ బ్రాహ్మణుడికి ఇచ్చేసాడు.
బ్రాహ్మణులందరు దశరథుడిని దీవించారు. దీనితో అశ్వమేధయాగం పూర్తి అయింది.
అశ్వమేధయాగం పూర్తి అయిన తరువాత ఋష్యశృంగుడు దశరథుని చేత పుత్రకామేష్టి యాగం చేపించాడు.
ఆయన అగ్నిలో వేసే హవిస్సులు పుచ్చుకోవడానికి సమస్త దేవతలు అక్కడకు వచ్చి తమ ఉచిత స్థానాలలో కూర్చున్నారు.
అప్పుడు దేవతలు బ్రహ్మాతో రావణాసురుడు తమని పెడుతున్న కష్టాలను వివరముగా చెప్పుకున్నారు.
దానికి బ్రహ్మా దుర్మార్గుడైనా రావణుడు దేవా దానవ గంధర్వ యక్ష రాక్షసుల చేత చావు లేకుండా వరం అడిగాడు కానీ మనుషుల మీద తేలిక భావం కొద్ది వారి వల్లా చావు లేకుండా వరం కోరలేదు.
దానికి మహావిష్ణువు నేను దశరథుని భార్యలలో ఒకరికి కొడుకుగా పుట్టి రావణాసురుడిని సంహరిస్తాను అని దేవతలతో చెప్తాడు.
అది వినగానే దేవతలు సంతోషించారు.
ఇంతలో హోమగుండం నుంచి కళ్ళు జిగేలుమనే ఒక మహాభూతం పైకి వచ్చింది.
ఆ భూతం తన చేతులతో ఒక కలశాన్ని పట్టుకుని ఉన్నది.
కలశం బంగారముతో చేసినది దానిపై మూత వెండి తో చేసినది.
ఆ భూతం దశరథ మహారాజుతో ఓ రాజా!
దేవతలు ఈ కలశములో తమ చేతులతో వండిన పాయసాన్ని నింపి ఇచ్చారు.
ప్రజాపతి ఆజ్ఞపై నేను దీనిని తీసుకువచ్చాను.
ఈ పాయసాన్ని నీ భార్యలకు ఇచ్చినట్లైతే వారికి సంతానం కలుగుతుంది అని చెప్పారు.
దశరథుడు ఆనందముతో ఆ కలశాన్ని అందుకుని భూతానికి ప్రదక్షిణ నమస్కారము చేసాడు.
వెంటనే భూతం మాయం అయిపోతుంది.
తరువాత దశరథుడు ఆ కలశం లో ఉన్న పాయసం తన భార్యలు అయినా కౌసల్యకు, సుమిత్రకు మరియు కైకేయి కు ఇచ్చాడు.
త్వరలోనే కౌసల్య,సుమిత్ర, కైకేయి గర్భవతులు అయ్యారు.
ఒకవైపు మహావిష్ణువు మానవుడిగా జన్మించటానికి ప్రయత్నాలు జరుగుతుంటే ఇంకోవైపు బ్రహ్మా ఆజ్ఞ మేరకు దేవతలు వానరులను సృష్టించారు.
దేవేంద్రుడికి వాలి
సూర్యుడికి సుగ్రీవుడు
బృహస్పతికి తారుడు
కుబేరుడికి గంధమాదనుడు
విశ్వకర్మకు సలుడు
అగ్నికి నీలుడు
అశ్వనీ దేవతలకు మైంద్వివిదులు
వరుణుడికి సుషేణుడు
ప్రజన్యుడికి శరభుడు
వాయుదేవుడికి హనుమంతుడు పుట్టారు.
వీరందరూ మహాబలులైన వానర శ్రేష్ఠులు. ఇతర దేవతలకు వేలసంఖ్యలో వానరసేన పుట్టింది.
వానరలతో పాటు ఎలుగుబంట్లు, కొండముచ్చులు కూడా రావణవధ కోసం పుట్టాయి
ఈ వానరులు ఋష్యమూక అనే పర్వతము దగ్గర స్థిరపడి వాలిసుగ్రీవలను రాజులుగా చేసుకొని, సలుడు,నీలుడు మరియు హనుమంతుడిని మంత్రులుగా చేసుకొని జీవించసాగారు.
పుత్రకామేష్టియాగం జరిగిన 12 నెలల తరువాత చైత్ర శుద్ధ నవమి రోజు పునర్వసు నక్షత్రములో కౌసల్య రాముడికి జన్మ ఇచ్చింది.
పుష్యమి నక్షత్రంలో కైకేయి భరతుడికి జన్మ ఇచ్చింది.
ఆశ్లేష నక్షత్రములో మిట్ట మధ్యాహ్నం వేళా సుమిత్రకు లక్ష్మణ శతృజ్ఞలు జన్మించారు.
అయోధ్య నగర ప్రజలు సంతోషముతో ఉత్సవాలు చేసుకున్నారు.
దశరథుడు అంతులేని గోదానాలు,అన్నదానాలు చేయించాడు.
నలుగురు పిల్లలు క్రమముగా ఎదిగి పెద్దవారు అవుతున్నారు.
ఒకే తల్లి బిడ్డలు కాకపోయినా రామలక్ష్మణులు ఎప్పుడు కలిసివుండేవారు, ఒకేసారి భోజనం చేసి ఒకేచోట నిద్రపోయేవారు.
రామలక్ష్మణులు లాగ భరత శత్రుజ్ఞులు ఎప్పుడు జంటగా ఉండేవారు.
అలా ఉండగా దశరథ మహారాజు వారి వివాహాలు గురించి మంత్రులతో, పురోహితులతో ఆలోచనలు ప్రారంభించాడు.
ఇంతలో ద్వారపాలకులు వచ్చి తడపాటు పడుతూ మహారాజా ! కుశిక వంశం వాడు గాదె రాజు కుమారుడు విశ్వామిత్రుడు తమ దర్శనం కోసం వచ్చి ద్వారం దగ్గర ఉన్నాడు అని చెప్పాడు.
Comments