Posts

Showing posts from July, 2025

ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ || Prema Kosam Rajasabha Varaku Vachhina Alamkaravathi Katha || Episode - 14 || Bhatti Vikramarka Kathalu

Image
  ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ అలంకారవతి చంద్రవర్మను వెంటబెట్టుకొని రాజసభకు వెళ్ళింది. రాజుకు నమస్కరించి అక్కడ నిలబడింది. చంద్రవర్మ ఆ రాజును ఆశీర్వదించాడు. అందగాడైన చంద్రవర్మ గొప్ప తేజస్సుతో, మన్మథుడిలా ప్రకాశిస్తూ ఉండటం చూసి, ఆ పట్టణ ప్రభువైన మహేంద్రవర్మ ఆశ్చర్యపోయాడు. రాజు వారిని కూర్చోమని చెప్పి, వేశ్య కూతురైన అలంకారవతిని చూసి ఇలా అడిగాడు: "ఓ అందగత్తె! నువ్వు ఎవరివి? ఈ నగరంలోనే ఉంటావా? నిన్ను నేనెప్పుడూ చూడలేదే! ఈ బ్రాహ్మణోత్తముడు ఎవరు? ఇతడిని ఇప్పుడు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? మీరు వచ్చిన కారణం ఏంటో వివరించు." అందుకు అలంకారవతి రాజుతో ఇలా అంది: "మహాప్రభూ! నేను ఈ నగరంలోనే పేరుపొందిన ఒక వేశ్య కుమార్తెను. నా పేరు అలంకారవతి. నేను ఒక వ్రతాన్ని నియమంగా పెట్టుకుని, మా వేశ్య కుల మర్యాద అయిన వ్యభిచార వృత్తిని వదిలేశాను. బయటి ప్రపంచానికి కూడా తెలియకుండా ఇప్పటివరకు ఇంట్లోనే కాలం గడిపాను. అందుకే మీరు నన్ను చూసే అవకాశం రాలేదు." ఆ తర్వాత ఆమె తన వ్రతం వివరాలను, ఆ బ్రాహ్మణుడు తన ఇంటికి రావడం, అతడిని చూసి తాను మోహించి, నిద్ర లేపడానికి పడిన తాపత్రయాన్ని, తన మనసులోన...

దశరథ మహారాజు కైకేయిని ఓదార్చడం || Dasaratha Maharaju Kaikeyini Odarchadam || Ramayanam || Episode - 44

Image
  దశరథ మహారాజు కైకేయిని ఓదార్చడం పాపాత్మురాలైన మంథర చేసిన దుర్బోధలన్నీ కైకేయికి తలకెక్కాయి. తాను దశరథమహారాజు వచ్చినప్పుడు నడుచుకోవలసిన తీరును గూర్చి మంథరతో చర్చించింది. అంతలోనే తాను తలపెట్టిన కార్యం సఫలమవుతుందా, కాదా? అని బేలవలె భయపడసాగింది. వారిద్దరూ కూడబలుక్కుని 'అంతా బాగుందని' అనుకున్నారు. కైకేయి తీసిపారవేసిన నగలన్నీ చిందరవందరగా పడి ఆకాశంలో నక్షత్రాల్లా ప్రకాశిస్తున్నాయి. మాసిన చీర కట్టుకుంది. చక్కగా అల్లుకున్న జడను విడదీసి జుట్టంతా విరబోసుకుంది. కటిక నేల మీద మరణించిన కిన్నర స్త్రీలా పడి ఉంది. దశరథమహారాజు రాముని పట్టాభిషేకం విషయంగా ఏర్పాట్లు చేయడంలో తలమునకలై ఉన్నాడు. మిగిలిన ఏర్పాట్లన్నింటినీ అతి సన్నిహితులైన వారికి, పురోహితులకు అప్పగించి తాను అంతఃపురానికి వెళ్ళాడు. ఇంతవరకు రాముని పట్టాభిషేకం విషయం తన గుప్పెట్లో పెట్టుకొని వ్యవహరిస్తూ వచ్చాడు. సమయం దగ్గర పడుతున్నకొద్దీ, విషయాలన్నీ ఒక్కొక్కటిగా బహిర్గతమవుతున్నాయి. ఇంకా అలస్యం చేయకూడదని అనుకున్నాడు. ఈ విషయాలన్నీ బయటకు వచ్చాయి కాబట్టి కైకేయికి తానే స్వయంగా చెప్పటం ఉచితంగా ఉంటుందని అనుకున్నాడు. ఈ విధంగా తనలో తానే అనుకుంటూ కైకేయి...