Posts

Showing posts from August, 2023

ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ || Prema Kosam Rajasabha Varaku Vachhina Alamkaravathi Katha || Episode - 14 || Bhatti Vikramarka Kathalu

Image
  ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ అలంకారవతి చంద్రవర్మను వెంటబెట్టుకొని రాజసభకు వెళ్ళింది. రాజుకు నమస్కరించి అక్కడ నిలబడింది. చంద్రవర్మ ఆ రాజును ఆశీర్వదించాడు. అందగాడైన చంద్రవర్మ గొప్ప తేజస్సుతో, మన్మథుడిలా ప్రకాశిస్తూ ఉండటం చూసి, ఆ పట్టణ ప్రభువైన మహేంద్రవర్మ ఆశ్చర్యపోయాడు. రాజు వారిని కూర్చోమని చెప్పి, వేశ్య కూతురైన అలంకారవతిని చూసి ఇలా అడిగాడు: "ఓ అందగత్తె! నువ్వు ఎవరివి? ఈ నగరంలోనే ఉంటావా? నిన్ను నేనెప్పుడూ చూడలేదే! ఈ బ్రాహ్మణోత్తముడు ఎవరు? ఇతడిని ఇప్పుడు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? మీరు వచ్చిన కారణం ఏంటో వివరించు." అందుకు అలంకారవతి రాజుతో ఇలా అంది: "మహాప్రభూ! నేను ఈ నగరంలోనే పేరుపొందిన ఒక వేశ్య కుమార్తెను. నా పేరు అలంకారవతి. నేను ఒక వ్రతాన్ని నియమంగా పెట్టుకుని, మా వేశ్య కుల మర్యాద అయిన వ్యభిచార వృత్తిని వదిలేశాను. బయటి ప్రపంచానికి కూడా తెలియకుండా ఇప్పటివరకు ఇంట్లోనే కాలం గడిపాను. అందుకే మీరు నన్ను చూసే అవకాశం రాలేదు." ఆ తర్వాత ఆమె తన వ్రతం వివరాలను, ఆ బ్రాహ్మణుడు తన ఇంటికి రావడం, అతడిని చూసి తాను మోహించి, నిద్ర లేపడానికి పడిన తాపత్రయాన్ని, తన మనసులోన...

శివధనుర్బంగం || Shivadhanurbhangam || Ramayanam ||రామాయణం

Image
  శివధనుర్బంగం  శివ ధనుస్సు ఉన్న పెట్టెను తీసుకు వచ్చాక విశ్వామిత్రుడు రాముని వంక చూచాడు. “రామా! ఈ ధనుస్సును చూడు” అన్నాడు. విశ్వామిత్రుని మాటలను విన్న రాముడు “అలాగే మహాత్మా!  తమరు చెప్పినట్టు నేను ఆ ధనుస్సు ఉన్న పేటికను తెరిచి ఆ ధనుస్సును చూస్తాను, తాకుతాను. ఆ ధనుస్సును ఎత్తడానికి, నాకు శక్తి ఉంటే దానిని ఎక్కుపెట్టడానికి ప్రయత్నిస్తాను” అని అన్నాడు. అంగీకార సూచకంగా విశ్వామిత్రుడు తల ఊపాడు. రాముడు ఆ ధనుస్సును అవలీలగా ఎత్తి పట్టుకున్నాడు. దానిని నిలబెట్టాడు. అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. రాముడు ఆ ధనుస్సును ఏ మాత్రం శ్రమపడకుండా ఎక్కుపెట్టాడు. ఆ ధనుస్సుకు ఉన్న నారిని పట్టుకొని తన చెవి దాకా లాగాడు. ఆ ధనుస్సు వంగి "ఫెడేల్‌"  మని మధ్యకు విరిగిపోయి రెండు ముక్కలు అయింది. ఆ ధనుస్సు విరిగినపుడు పిడుగు పడ్డట్టు భయంకర మైన శబ్దం వచ్చింది. భూమి కంపించినట్టయింది. ఆ శబ్దానికి జనకుడు, రామలక్ష్మణులు, విశ్వామిత్రుడు తప్ప  అక్కడ ఉన్న వారంతా కిందపడి మూర్ఛపోయారు. ఇదంతా తనకు ముందే తెలును  అన్నట్టు విశ్వామిత్రుడు చూస్తున్నాడు. తరువాత జనకుడు విశ్వామిత్రునితో ఇలా అన్నాడు. “ఓ మహర్షీ...

పురాణాల్లోని మిత్రులు || Puranalloni Mitrulu

Image
  పురాణాల్లోని మిత్రులు   హలో అందరికి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు  ఇప్పుడు మనం పురాణాల్లో  నాకు తెలిసిన కొన్ని స్నేహాలు గురించి చెప్పుకుందాం  మిత్రుడు అంటే దుర్మార్గమైన పనుల నుంచి నివారించే వ్యక్తి, సత్కార్యాలు చేయడానికి ప్రోత్సాహాన్నిచ్చేవాడు, రహస్యాలను కాపాడేవాడు, సద్గుణాలను కలిగి ఉండేవాడు, ఆపత్కాలంలో నీడలా అనుసరించి వచ్చేవాడే నిజమైన మిత్రుడు. మనిషి గుణం అతడు పాటించే మిత్రధర్మాన్ని బట్టి నిర్ణయించవచ్చు. ఐశ్వర్యం, విద్య, పదవిని దృష్టిలో పెట్టుకుని స్నేహం చేయకూడదు. శ్రీరాముడు-సుగ్రీవుడు  రామకథలో వాల్మీకి మహర్షి.. స్నేహితుడి గొప్పదనాన్ని, మైత్రీప్రాశస్త్యాన్ని రాముడి ద్వారా లోకానికి చాటాడు. రామాయణంలో గుహుడు, సుగ్రీవుడు, విభీషణుడు రాముడికి ఆప్తమిత్రులుగా కనిపిస్తారు. రాముడు చక్రవర్తి అయినుప్పటికీ... గిరిజనుడైన గుహునితో, వానరుడైన సుగ్రీవునితో, రాక్షసుడైన విభీషణుడితో స్నేహం చేసి మైత్రీధర్మానికి స్థాయీభేదాలు లేవని ప్రపంచానికి చాటిచెప్పాడు. కష్టాల్లో సహకారం అందించేవాడు నిజమైన మిత్రుడని రామసుగ్రీవులు చాటారు. వారిద్దరూ భార్యావియోగాన్ని అనుభవించినవారే. సుగ్రీ...

Bhojaraju || భోజరాజు || Batti Vikramarka Kathalu

Image
  భోజరాజు పూర్వము వైభవముగా అష్టైశ్వర్యాలు కలిగి ఉన్న ధారాపురం అనే నగరం ఉన్నది. ఆ నగరానికి భోజ మహీపాలుడు అధిపతి. అతను ధారానగరాన్ని తన దేశానికి రాజధానిగా చేసుకుని పాలిస్తున్నాడు. భోజరాజు తన దేశంలో ధర్మం తప్పకుండా ప్రజలను తన పిల్లలుగా చూస్తూ పరిపాలిస్తున్నాడు. ఆ కాలములో న్యాయములోను, ధైర్యములోను, శౌర్యములోను, గాంభీర్య, దయ, దాన పరాక్రమాది గుణాలలో అతడిని మించిన మరొక రాజు లేడు. అతను చాల సంతోషముగా ఏ బాధ లేకుండా "భూలోక దేవేంద్రుడు" అనే పేరును సంపాదించాడు.  ఒకరోజు భోజరాజు తన ప్రధానమంత్రిని పిలిచి ఇలా అన్నాడు:  మంత్రిగారు మన రాజ్యములో ఉన్న అడవిలో దుష్ట మృగముల వలన ప్రజలకి, పశువులకు, పంటలకు అధిక నష్టం కలుగుతుందని ప్రజలు వచ్చి చెప్పుకుంటున్నారు. ప్రజలు సుఖముగా ఉన్నప్పుడే కదా మనం సంతోషముగా ఉండేది. వారిని క్షేమముగా ఉంచడమే మన ముఖ్య కర్తవ్యం, ఆలస్యం చేయకుండా తగిన ప్రయత్నం చేసి ప్రజలకు, పంటలకు మృగముల వలన కలుగుచున్న ఆపదలని తొలిగించాలని నిశ్చయించాను.  కాబట్టి వేటకి వెళ్ళడానికి కావాల్సిన ఏర్పాటులను వెంటనే చేయించి నాకు తెలియచేయండి  అని మంత్రిని ఆజ్ఞాపించాడు. అలాగే అని మంత్రి అక్కడ నుం...