Posts

Showing posts from January, 2021

ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ || Prema Kosam Rajasabha Varaku Vachhina Alamkaravathi Katha || Episode - 14 || Bhatti Vikramarka Kathalu

Image
  ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ అలంకారవతి చంద్రవర్మను వెంటబెట్టుకొని రాజసభకు వెళ్ళింది. రాజుకు నమస్కరించి అక్కడ నిలబడింది. చంద్రవర్మ ఆ రాజును ఆశీర్వదించాడు. అందగాడైన చంద్రవర్మ గొప్ప తేజస్సుతో, మన్మథుడిలా ప్రకాశిస్తూ ఉండటం చూసి, ఆ పట్టణ ప్రభువైన మహేంద్రవర్మ ఆశ్చర్యపోయాడు. రాజు వారిని కూర్చోమని చెప్పి, వేశ్య కూతురైన అలంకారవతిని చూసి ఇలా అడిగాడు: "ఓ అందగత్తె! నువ్వు ఎవరివి? ఈ నగరంలోనే ఉంటావా? నిన్ను నేనెప్పుడూ చూడలేదే! ఈ బ్రాహ్మణోత్తముడు ఎవరు? ఇతడిని ఇప్పుడు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? మీరు వచ్చిన కారణం ఏంటో వివరించు." అందుకు అలంకారవతి రాజుతో ఇలా అంది: "మహాప్రభూ! నేను ఈ నగరంలోనే పేరుపొందిన ఒక వేశ్య కుమార్తెను. నా పేరు అలంకారవతి. నేను ఒక వ్రతాన్ని నియమంగా పెట్టుకుని, మా వేశ్య కుల మర్యాద అయిన వ్యభిచార వృత్తిని వదిలేశాను. బయటి ప్రపంచానికి కూడా తెలియకుండా ఇప్పటివరకు ఇంట్లోనే కాలం గడిపాను. అందుకే మీరు నన్ను చూసే అవకాశం రాలేదు." ఆ తర్వాత ఆమె తన వ్రతం వివరాలను, ఆ బ్రాహ్మణుడు తన ఇంటికి రావడం, అతడిని చూసి తాను మోహించి, నిద్ర లేపడానికి పడిన తాపత్రయాన్ని, తన మనసులోన...

అయోధ్యని పరిపాలించిన రాజులు ఎవరు ?

Image
  అయోధ్యని పరిపాలించిన రాజులు  మనకి సాధారణముగా తెలుసు కదా ! రాముని వంశాన్ని రఘువంశం అని అంటారు. రఘు వంశాన్ని సూర్య వంశం, ఇష్వాకు వంశం అని కూడా అంటారు.  రఘు వంశానికి ఆ పేర్లు ఎలా వచ్చాయో తెలుసుకుందాం  సూర్యుని కొడుకు వివస్వంతుడు  వివస్వంతుడి తరువాత వైవస్వత మనువు అయోధ్యా నగరాన్ని పరిపాలించారు.  వైవస్వత మనువు కుమారుడు ఇష్వాకుడు . ఇష్వాకుడు పరిపాలించిన కాలం నుంచి రఘు వంశాన్ని ఇష్వాకు వామాసం అని కూడా అంటారు.  ఇష్వాకుడి కి నూరుగురు పుత్రులు. వారిలో ఒకరు వికుక్షి.  వికుక్షి కి వశిష్ట మహర్షి అనుగ్రహము వలన రాజ్యాధికారం లభించింది.  వికుక్షి తన కుమారులలో ఒకరైన అయోధునికి రాజ్యాభిషేకం చేస్తాడు.  అయోధనుడు తన కుమారులలో ఒకరైన కకుస్తుడికి రాజ్యాభిషేకం చేస్తాడు.  కకుస్తుడు తన కుమారులలో జేష్ఠుడైన కువలాశ్వునికి రాజ్యాభిషేకం చేసారు.  కువలాశ్వుడు తన కుమారులలో ఒకరైన దృడాశ్వునికి, దృడాశ్వుడు తన పుత్రులలో ఒకరైన హర్యశ్వునికి రాజ్యాభిషేకం చేస్తారు.  హర్యశ్వుడు తన మనుమడైనా సంహతాశ్వునికి  రాజ్యాభిషేకం చేస్తారు. సంహతాశ్వునికి 2 పుత్రులు ,1 కూతురు...

వాల్మీకి మహర్షికి రామాయణం వ్రాసే అవకాశం ఎలా వచ్చింది ?

Image
 చాలా మందికి తెలిసే ఉంటుంది కదా ! రామాయణం ను వాల్మీకి మహర్షి రచించారు.  అసలు వాల్మీకి మహర్షికి రామాయణం వ్రాసే అవకాశం ఎలా వచ్చిందో తెలుసుకుందాం ! నారద మహాముని ఒకరోజు వాల్మీకి మహర్షి ఆశ్రమానికి వచ్చి రాముని కథను వివరముగా చెప్పారు . దాని తరువాత వాల్మీకి మహాముని తన శిష్యుడైనా భరద్వాజుడిని వెంట తీసుకుని తమసా నది తీరానికి వెళ్లారు,  అక్కడ ఆయనకు క్రౌంచ పక్షుల జంట కనిపించింది (క్రౌంచ పక్షులు అంటే ఏమిటో అనుకోకండి అవి కొంగలండి ). ఆ పక్షులు చాలా ఆనందముగా ప్రేమలో మునిగిపోయి పాటలు పాడుతూ , గెంటుతూ కనిపించాయి . సాదారణముగా మనము జంట పక్షులను చుస్తే ఆనందిస్తాము కదా ! అలాగే వాల్మీకి మహర్షి కూడా ఆనందించారు.  ఇంతలో ఒక బోయవాడు ఒక బాణం తీసుకుని మగపక్షి ని కొట్టాడు. అది కొట్టుకుంటూ కిందపడి చనిపోయింది, ఆడపక్షి ఆర్తనాదాలు చేస్తుంది.  అప్పుడు వాల్మీకి మహర్షికి పక్షి పైన జాలి అలాగే క్రూరుడైన బోయవాడిపై కోపం వచ్చాయి,  ఆ సమయంలో వాల్మీకి మహర్షికి తెలియకుండానే మొట్టమొదటిసారిగా తన నోటి నుండి ఒక శ్లోకం వెలువడింది. ఆ శ్లోకం అర్ధం ఏమి అనగా !ఓరి కిరాతకుడా !ఆనందంలో ఉన్నా క్రౌంచ పక్షుల జంటలో ఒకద...

తెలుగు సామెతలు

Image
  తెలుగు సామెతలు అత్తా ఒక ఇంటి  కోడలే  అడవి కాచిన వెన్నెల  అడకత్తెరలో పోకచెక్కలాగా  అడిగేవాడికి చెప్పేవాడు లోకువ  అడుగులోనే హంసపాదు  అతిరహస్యం బట్టబయలు  అటైతే కందిపప్పు ఇటైతే పెసరపప్పు  అచ్చి పెళ్లి బుచ్చి చావుకు వచ్చిందట  అందని మని పండ్లకు అర్రులు చాచినట్లు  అందరూ అందలమెక్కితే మోసేవాళ్ళెవరూ ? అందరూ ఒక ఎతైతే అగస్త్యుడు ఒక్కడూ ఒక ఎత్తు అతని కమండలం ఒక ఎత్తు  అంతా శ్రీవైష్ణవులే కానీ బుట్ట రొయ్యలు ఏమైనాయో ! అంబలి త్రాగేవారు కొందరైతే  మీసాలు ఎగబట్టేవారు కొందరట ! అక్క మనదైతే మాత్రం బావ మనవాడా ? అగ్ని కి వాయువు తోడైనట్లు  అద్దంలో ముడుపు అరచేతి స్వర్గం  అణువుగానిచోట అధికులమనరాదు  అప్పిచ్చినోడు బాగు కోరతాడు తీసుకున్నవాడు చెడు కోరతాడు  అభ్యాసం కూసువిద్య  అమ్మ గృహప్రవేశం అయ్యా అగ్ని ప్రవేశం  అమ్మబోతే అడవి కొనబోతే కొరివి  అల్లుడికి వండిన అన్నం కొడుక్కి పెట్టిందట  అల్లుడికి ఐశ్వర్యం వస్తే అర్థరాత్రి వేళ గొడుగు పట్టమన్నట్ట   ఆర్తి దుఃఖం ఆరు నెలలు కడుపు దుఃఖం కలకాలం  అవ్వ వడికిన నూలు...

తెలుగు సామెతలు

Image
  తెలుగు సామెతలు   మానవసేవే మాధవసేవ  బూడిదలో పోసిన పన్నీరు  అడగనిదే అమ్మ అయినా పెట్టదు దూరపు కొండలు నునుపు  ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా  ఊరంతా ఒక దారి ఉలిపిరి కట్టేది మరొక దారి   ఇంటికి జేష్ఠా దేవి పొరుగింటికి లక్ష్మీదేవి  ఆలస్యము అమృతం విషం  అతి వినయం ధూర్త లక్షణం  అంత్య నిష్ఠురం కన్నా ఆది నిష్ఠురం మేలు  చచ్చిన వాడి కన్నులు చారడేసి  చంకన బిడ్డను పెట్టుకుని ఊరంతా వెతికినట్లు  చింత చచ్చినా పులుపు చావదు  చూసి రమ్మంటే కాల్చి వచ్చినట్టు  చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు  చెవిటివాని ముందు శంఖం ఊదినట్లు  తన్ను మాలిన ధర్మము మొదలు చెడ్డ బేరము  తా చెడ్డ కోతి వనమెల్లా చెరిచినట్లు  తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టినట్లు  తీగలాగితే డొంక అంతా కదిలినట్లు  దిన దిన గండం నూరేళ్లాయుష్షు  దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకున్నట్లు  దేవుడు వరమిచ్చినా పూజారి వరమివ్వడు  దొంగలు పడ్డ ఆర్నెల్లకు కుక్కలు మొరిగినట్లు  నారు పోసిన వాడు నీరు పోయాడా...