Posts

Showing posts from December, 2024

ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ || Prema Kosam Rajasabha Varaku Vachhina Alamkaravathi Katha || Episode - 14 || Bhatti Vikramarka Kathalu

Image
  ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ అలంకారవతి చంద్రవర్మను వెంటబెట్టుకొని రాజసభకు వెళ్ళింది. రాజుకు నమస్కరించి అక్కడ నిలబడింది. చంద్రవర్మ ఆ రాజును ఆశీర్వదించాడు. అందగాడైన చంద్రవర్మ గొప్ప తేజస్సుతో, మన్మథుడిలా ప్రకాశిస్తూ ఉండటం చూసి, ఆ పట్టణ ప్రభువైన మహేంద్రవర్మ ఆశ్చర్యపోయాడు. రాజు వారిని కూర్చోమని చెప్పి, వేశ్య కూతురైన అలంకారవతిని చూసి ఇలా అడిగాడు: "ఓ అందగత్తె! నువ్వు ఎవరివి? ఈ నగరంలోనే ఉంటావా? నిన్ను నేనెప్పుడూ చూడలేదే! ఈ బ్రాహ్మణోత్తముడు ఎవరు? ఇతడిని ఇప్పుడు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? మీరు వచ్చిన కారణం ఏంటో వివరించు." అందుకు అలంకారవతి రాజుతో ఇలా అంది: "మహాప్రభూ! నేను ఈ నగరంలోనే పేరుపొందిన ఒక వేశ్య కుమార్తెను. నా పేరు అలంకారవతి. నేను ఒక వ్రతాన్ని నియమంగా పెట్టుకుని, మా వేశ్య కుల మర్యాద అయిన వ్యభిచార వృత్తిని వదిలేశాను. బయటి ప్రపంచానికి కూడా తెలియకుండా ఇప్పటివరకు ఇంట్లోనే కాలం గడిపాను. అందుకే మీరు నన్ను చూసే అవకాశం రాలేదు." ఆ తర్వాత ఆమె తన వ్రతం వివరాలను, ఆ బ్రాహ్మణుడు తన ఇంటికి రావడం, అతడిని చూసి తాను మోహించి, నిద్ర లేపడానికి పడిన తాపత్రయాన్ని, తన మనసులోన...

Goppa Thyagam || గొప్ప త్యాగం || Moral Stories || నీతి కథలు

Image
గొప్ప త్యాగం  శివానందుడు అనే వ్యక్తి ఒకనాడు అరణ్య మార్గంలో వస్తుండగా ఒక రాక్షసుడు అతనికి ఎదురొచ్చి “ఓయి మానవుడా! నేను మిక్కిలి ఆకలితో ఉన్నాను. నిన్ను తినేస్తాను" అన్నాడు. శివానందుడు చేతులు జోడించి "రాక్షసోత్తమా! నేను నా కుమారై వివాహం కోసం ఆభరణాలు తీసుకుని వెళుతున్నాను. ఇవి ఇంటిలో ఇచ్చి మరల వచ్చి నీకు ఆహారం కాగలను” అన్నాడు, "వెళ్లి త్వరగా రా” అన్నాడు రాక్షసుడు. శివానందుడు త్వరగా ఇంటికివెళ్లి నగలు తన భార్య చేతికిచ్చి "అమ్మాయి వివాహం చక్కగా జరిపించు. నేను రాక్షసునికి ఆహారంగా వెళుతున్నాను." అని విషయం వివరించాడు. చాటునుండి ఇది విన్న శివానందుడి తనయుడు తండ్రి కంటే ముందుగానే పరుగుపరుగున రాక్షసుడి వద్దకు వచ్చి “నా తండ్రికి బదులుగా నన్ను ఆహారంగా స్వీకరించు" అన్నాడు. అంతలో శివానందుడు వచ్చి కుమారుడిని వదిలివేసి, తనను తినమని అన్నాడు. వీరిద్దరూ వాదులాడుకుంటూ ఉండగానే దూరం నుంచి కర్ర సాయంతో ఒక వృద్ధుడు వచ్చి "నేను శివానందుడి తండ్రిని. నన్ను తిని వాళ్లను వదిలేయి" అన్నాడు. అంతలో ఒక ముత్తయిదువ వచ్చి "భర్తనో, కొడుకునో కోల్పోయి నేను జీవించ లేను, నన్ను తిను"...