ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ || Prema Kosam Rajasabha Varaku Vachhina Alamkaravathi Katha || Episode - 14 || Bhatti Vikramarka Kathalu

Image
  ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ అలంకారవతి చంద్రవర్మను వెంటబెట్టుకొని రాజసభకు వెళ్ళింది. రాజుకు నమస్కరించి అక్కడ నిలబడింది. చంద్రవర్మ ఆ రాజును ఆశీర్వదించాడు. అందగాడైన చంద్రవర్మ గొప్ప తేజస్సుతో, మన్మథుడిలా ప్రకాశిస్తూ ఉండటం చూసి, ఆ పట్టణ ప్రభువైన మహేంద్రవర్మ ఆశ్చర్యపోయాడు. రాజు వారిని కూర్చోమని చెప్పి, వేశ్య కూతురైన అలంకారవతిని చూసి ఇలా అడిగాడు: "ఓ అందగత్తె! నువ్వు ఎవరివి? ఈ నగరంలోనే ఉంటావా? నిన్ను నేనెప్పుడూ చూడలేదే! ఈ బ్రాహ్మణోత్తముడు ఎవరు? ఇతడిని ఇప్పుడు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? మీరు వచ్చిన కారణం ఏంటో వివరించు." అందుకు అలంకారవతి రాజుతో ఇలా అంది: "మహాప్రభూ! నేను ఈ నగరంలోనే పేరుపొందిన ఒక వేశ్య కుమార్తెను. నా పేరు అలంకారవతి. నేను ఒక వ్రతాన్ని నియమంగా పెట్టుకుని, మా వేశ్య కుల మర్యాద అయిన వ్యభిచార వృత్తిని వదిలేశాను. బయటి ప్రపంచానికి కూడా తెలియకుండా ఇప్పటివరకు ఇంట్లోనే కాలం గడిపాను. అందుకే మీరు నన్ను చూసే అవకాశం రాలేదు." ఆ తర్వాత ఆమె తన వ్రతం వివరాలను, ఆ బ్రాహ్మణుడు తన ఇంటికి రావడం, అతడిని చూసి తాను మోహించి, నిద్ర లేపడానికి పడిన తాపత్రయాన్ని, తన మనసులోన...

Jittula Marina Nakka

జిత్తులమారిన నక్క

 ఇప్పుడు మనం జిత్తులమారి నక్క అనే కథ గురించి తెలుసుకుందాం  !

అనగనగా ఒక అడవి ఆ అడవిలో ఒక నక్క ఉండేది. ఆ నక్క చాలా మోసం చేస్తూ ఉంటది అందరిని.ఆ నక్క ఆ అడవిలోకి ఎలా వచ్చిందో,ఎక్కడ్నించి వచ్చిందో ఎవరికీ తెలీదు.

మిగిలిన జంతువులకు ఆ నక్క ప్రవర్తన చాలా విచిత్రంగా ఉండేది.

అందుకని మిగతా నక్కలన్నీ నీవు మా దానివి కాదు అని అన్నవి అంతేకాదు దానితో మాట్లాడ్డం కూడా మానేశాయి.

ఇక ఆ నక్క దాని ఆటలు సాగక ఏమి చేయాలో అని ఆలోచించి దగ్గరలో ఉన్న ఊరికి  పోయి  ఒక మంగలి వాణితో స్నేహం  చేసుకున్నది పాపం అతను చాలా మంచివాడు.అతను ఆ నక్క మాటలన్నీ నిజమనుకొని నక్కను నమ్మి దానితో స్నేహం చేశాడు.

 వారు మంచి స్నేహితులయ్యారు. ఒకనాడు నక్క మంగలితో ఇలా అన్నది: మంగలిమామా! మంగలిమామా! మనం పండ్ల తోట వేసుకుంటే ఎలా ఉంటుంది , మనకి కావలసిన వన్నీ పళ్లు  తిని మిగతా వాటితో వ్యాపారం చెయ్యొచ్చు కదా అన్నది. పాపం అతడు నమ్మి రకరకాల మొక్కలు తెచ్చి తోట వేసాడు.

అందులో మామిడి,సపోట,అరటి పండ్ల మొక్కలను అలాగే గుమ్మడి,దోస కూరగాయల చెట్లను నాటారు.  తాను అతని భార్య జాగ్రత్తగా పెంచి నీళ్లుపోసేవారు. నక్కా మాత్రం పైకి పెత్తనం చేస్తూ అడిగితే కాపలా కాస్తున్నాను అని అనేది. కొన్ని రోజులకు తోట కాపుకు వచ్చింది, రాత్రికి రాత్రే అవి అన్నీ తిని  ఒక పండు కాని కాయ కానీ కనిపించనీయకుండా చేసేది.

అలా రోజులు జరుగుతూ ఉండగా మంగలి నక్కబావా! నక్కబావా! తోటల్లో కాయలు ఏమైనా వున్నాయా అని అడిగాడు. అప్పుడు నక్క ఇలా అన్నది : ఇప్పుడెందుకు వస్తాయి వానాకాలం వస్తే  కాయలు కాస్తాయి అని అన్నది మంగలి నమ్మి వానాకాలం వచ్చాక అడిగితే చలికాలంలో వస్తాయి అని అన్నది, అలా చలికాలం వచ్చాక అడిగితే వేసవికాలంలో వస్తాయి అని అన్నది. ఇలా ఎప్పటికప్పుడు మంగలిని మోసం చేస్తూ వచ్చింది.

ఇంతలో వేసవి కాలం వచ్చింది కాయలు కాచాయి. నక్క ఒకరోజు అడివికి పోయి  మిగతా నక్కలతో స్నేహం చెయ్యాలని వాటన్నింటినీ విందుకు పిలిచింది .

అవి కావాలసిన అన్నిటినీ మిగతా పండ్లని మరియు కూరగాయలని పాడుచేశాయి. పాపం మరునాడు పొద్దున మంగలి వచ్చి తోట చూసి బాధపడ్డాడు. ఎక్కడ  ఒక పండు కానీ కాయకానీ లేదు. ఒక మూలన మాత్రం ఒక గుమ్మడికాయ  ఉంది ఆకులు కప్పి ఉండటం వలన  ఆ గుమ్మడికాయ  నక్కలకు కనపడలేదు.

మంగలికి నక్క చేసిన మోసం అంతా తెలిసి  దానిని శిక్షించాలి  అని అనుకున్నాడు మంగలి ఇంటికి వెళ్లి కత్తులు తీసి బాగా సాన పెట్టి గుమ్మడికాయకు చుట్టూ కట్టాడు

 ఆ కత్తులు కనబడకుండా  ఆకులు అడ్డం పెట్టి ఇంటికి వెళ్లి హాయిగా నిద్రపోయాడు. మరునాడు రాత్రి  నక్క తీరికగా వచ్చింది దానికి బాగా ఆకలి వేసింది.తోటలో కాయలన్నీ  తన తోటి అస్సలు ఇంతకుముందే పాడుచేశాయి తోట అంతా గాలించడం మొదలు పెట్టింది  ఎక్కడైనా ఏమైనా దొరికిందేమో అని ! ఆఖరికి ఆ గుమ్మడికాయ కనబడింది. అది ఆశతో  ఒక్కమాటుగా ఆ గుమ్మడికాయ మీదకు దూకింది ఇంకేమీ దాని ఒళ్లంతా  తెగిపోయింది. నెత్తురు కారడం మొదలయింది ఒళ్లంతా మంటలు వచ్చేశాయి ఏడ్చుకుంటూ  కాలు ఈడ్చుకుంటూ పోయి ఒక రాయి మీద కూర్చున్నది.

చాలా సేపటిదాకా  దానికి నెత్తురు కారుతూనే ఉన్నది ఇలా ఇంకెప్పుడూ తప్పుడు పనులు చేయకూడదని మనసులో అనుకున్నది. 

మంగలిని  బాగా తిట్టింది ఎన్ని తిట్టినా, ఎవరిని తిట్టినా దాని నెప్పి తగ్గుతుందా నెత్తురు కారకుండా వుంటుందా! అవన్నీ జరుగుతూనే ఉంటాయి .

నెత్తురు కారడం ఆగిన తరువాత బయలుదేరామని అనుకున్నది  కానీ ఆ నెత్తురు ఎండీ గడ్డకట్టి అందులోనే ఇరుక్కుపోయింది అందులోనుంచి కదలలేకపోయింది . నక్కకి మంగలి మీద బాగా కోపం వచ్చింది  నేను కనుక ఇక్కడ నించి బయటికి వస్తే ఆ మంగలి పని పట్టకపోతే చూడు అని తనకి తానే శపధం చేసుకున్నది .

పాపం ముందు అది బయటపడితే కదా మంగలి పని పట్టడానికి!

←Prev                                                                                                                                                                                                                                                                                                    Next→

Comments

Popular posts from this blog

Dasarathudu Ayodhyaku Cheratam || దశరథుడు అయోధ్యకు చేరటం || Episode 34 || Ramayanam

Ramayanam || Shiva Dhanassu

Goppa Thyagam || గొప్ప త్యాగం || Moral Stories || నీతి కథలు