ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ || Prema Kosam Rajasabha Varaku Vachhina Alamkaravathi Katha || Episode - 14 || Bhatti Vikramarka Kathalu

Image
  ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ అలంకారవతి చంద్రవర్మను వెంటబెట్టుకొని రాజసభకు వెళ్ళింది. రాజుకు నమస్కరించి అక్కడ నిలబడింది. చంద్రవర్మ ఆ రాజును ఆశీర్వదించాడు. అందగాడైన చంద్రవర్మ గొప్ప తేజస్సుతో, మన్మథుడిలా ప్రకాశిస్తూ ఉండటం చూసి, ఆ పట్టణ ప్రభువైన మహేంద్రవర్మ ఆశ్చర్యపోయాడు. రాజు వారిని కూర్చోమని చెప్పి, వేశ్య కూతురైన అలంకారవతిని చూసి ఇలా అడిగాడు: "ఓ అందగత్తె! నువ్వు ఎవరివి? ఈ నగరంలోనే ఉంటావా? నిన్ను నేనెప్పుడూ చూడలేదే! ఈ బ్రాహ్మణోత్తముడు ఎవరు? ఇతడిని ఇప్పుడు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? మీరు వచ్చిన కారణం ఏంటో వివరించు." అందుకు అలంకారవతి రాజుతో ఇలా అంది: "మహాప్రభూ! నేను ఈ నగరంలోనే పేరుపొందిన ఒక వేశ్య కుమార్తెను. నా పేరు అలంకారవతి. నేను ఒక వ్రతాన్ని నియమంగా పెట్టుకుని, మా వేశ్య కుల మర్యాద అయిన వ్యభిచార వృత్తిని వదిలేశాను. బయటి ప్రపంచానికి కూడా తెలియకుండా ఇప్పటివరకు ఇంట్లోనే కాలం గడిపాను. అందుకే మీరు నన్ను చూసే అవకాశం రాలేదు." ఆ తర్వాత ఆమె తన వ్రతం వివరాలను, ఆ బ్రాహ్మణుడు తన ఇంటికి రావడం, అతడిని చూసి తాను మోహించి, నిద్ర లేపడానికి పడిన తాపత్రయాన్ని, తన మనసులోన...

Chandamama Kathalu Pustakamlo Vachhina Modati Prachurana emiti?

 చందమామ పుస్తకము లో వచ్చిన మొదటి ప్రచురణ ఏమిటి అంటే ఆహ్వానం పాట. 

మొట్టమొదటిసారిగా చందమామ కథలు 1947 జులై లో మొదలు అయింది. 

 ఆహ్వానము

చందమామ రావే జాబిల్లి రావే
రైలెక్కి రావే రష్యాకథలు తేవే
ఇంజనెక్కీ శే ఇంగ్లీషు కథలు తేవే
బస్సెక్కి రావే, బాంగ్లా కథలు తేవే
కారెక్కి రావే కామ్రేడ్ కథలు తేవే
హారన్‌ ఊత్తూ రావే ఆకలి కథలు తేవే
కొండెక్కి రావే కోటివేలు తేవే
ఒలిచిన చొోకలేట్లు ఒళ్లో పెట్టుకొని
కరిగిన ఐస్‌ క్రిం చేత్తో పట్టుకొని
అలా అలా అలా వచ్చిమా
తెలుగు పిల్లల తీపి నోట్లో పోసిపోవే

ఇప్పుడు మనం కృష్ణ శాస్త్రి గారు వ్రాసిన ఉడత పాట తెలుసుకుందాం 
ఈ పాట దేని గురించి అంటే ఒక పాపకి మరియు ఉడత కి మధ్య జరిగిన సంభాషణ ఎలా ఉందో మీరే చూడండి 

ఉడత పాట

 
సీత  
ఏరోప్లేన్ తెచ్చావా, ఉడుతా, ఉడతా, నే 
యూరోపు వెళ్ళాలి ఉడతా, ఉడతా !

ఉడత  
హోరుగాలి కొట్టొచ్చు,
కారుమబ్బు పట్టొచ్చు,
ఏరోప్లేన్ తేలేను సీతా, సీతా!నే
యూరోపు రాలేను సీతా, సీతా!

సీత 
స్టీమరేనా తెచ్చావా ఉడతా ఉడతా , నే
సీమాకెళ్లి రావాలి ఉడతా, ఉడతా!

ఉడత 
ఏ తుఫాను వస్తుందో!
ఏ కెరటం లేస్తుందో!
స్టీమరేనా తేలేను, సీత ,సీతా!నే 
సీమకేన రాలేను సీతా, సీతా!

సీత 
రైలుబండి తెచ్చావా ఉడతా , ఉడతా, నే
రామేశ్వరం వెళ్లాలి ఉడతా ఉడతా !

ఉడత 
అడుగడుక్కి వంతెనలు,
నడుమ నడుమ సొరంగాలు,
రైలుబండి తేలేను సీతా, సీతా, నే 
రామేశ్వరం రాలేను సీతా,సీతా!

. సీత
కారుగాని తెచ్చావా ఉడతా, ఉడతా, నే
 కాకినాడ వెళ్లాలి ఉడతా , ఉడతా!

ఉడత
పెద్ద బస్సు లెదురొస్తయ్‌,
ఎద్దుబళ్లు అడ్జాస్తయ్‌,
కారేన తేలేను సీతా, సీతా, నే
కాకినాడ రాలేను సీతా సీతా!

సీత 
సైకిలేన తెచ్చావా ఉడతా, ఉడతా, నే
సరదాగా వెళ్ళాలి ఉడతా, ఉడతా!

ఉడత 
మలుపు గిలుపు తిరగాలి,
మనిషొస్తే ఒరగాలి ,
సైకిలేనా తేలేను సీతా,సీతా !నే 
                                                                              సరదాగా రాలేను సీతా, సీతా!                                




                                                                                                                                                                                                                                                                                                                       Next→

Comments

Popular posts from this blog

Dasarathudu Ayodhyaku Cheratam || దశరథుడు అయోధ్యకు చేరటం || Episode 34 || Ramayanam

Ramayanam || Shiva Dhanassu

Goppa Thyagam || గొప్ప త్యాగం || Moral Stories || నీతి కథలు