Posts

Showing posts from April, 2023

ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ || Prema Kosam Rajasabha Varaku Vachhina Alamkaravathi Katha || Episode - 14 || Bhatti Vikramarka Kathalu

Image
  ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ అలంకారవతి చంద్రవర్మను వెంటబెట్టుకొని రాజసభకు వెళ్ళింది. రాజుకు నమస్కరించి అక్కడ నిలబడింది. చంద్రవర్మ ఆ రాజును ఆశీర్వదించాడు. అందగాడైన చంద్రవర్మ గొప్ప తేజస్సుతో, మన్మథుడిలా ప్రకాశిస్తూ ఉండటం చూసి, ఆ పట్టణ ప్రభువైన మహేంద్రవర్మ ఆశ్చర్యపోయాడు. రాజు వారిని కూర్చోమని చెప్పి, వేశ్య కూతురైన అలంకారవతిని చూసి ఇలా అడిగాడు: "ఓ అందగత్తె! నువ్వు ఎవరివి? ఈ నగరంలోనే ఉంటావా? నిన్ను నేనెప్పుడూ చూడలేదే! ఈ బ్రాహ్మణోత్తముడు ఎవరు? ఇతడిని ఇప్పుడు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? మీరు వచ్చిన కారణం ఏంటో వివరించు." అందుకు అలంకారవతి రాజుతో ఇలా అంది: "మహాప్రభూ! నేను ఈ నగరంలోనే పేరుపొందిన ఒక వేశ్య కుమార్తెను. నా పేరు అలంకారవతి. నేను ఒక వ్రతాన్ని నియమంగా పెట్టుకుని, మా వేశ్య కుల మర్యాద అయిన వ్యభిచార వృత్తిని వదిలేశాను. బయటి ప్రపంచానికి కూడా తెలియకుండా ఇప్పటివరకు ఇంట్లోనే కాలం గడిపాను. అందుకే మీరు నన్ను చూసే అవకాశం రాలేదు." ఆ తర్వాత ఆమె తన వ్రతం వివరాలను, ఆ బ్రాహ్మణుడు తన ఇంటికి రావడం, అతడిని చూసి తాను మోహించి, నిద్ర లేపడానికి పడిన తాపత్రయాన్ని, తన మనసులోన...

Ramayanam || Viswamitrudu Trishanku Rajuku Emani Maata Ichhadu ?

Image
విశ్వామిత్రుడు త్రిశంకు రాజుకు ఏమని మాట ఇచ్చాడు? విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అవుతానని తన భార్యతో కలిసి దక్షిణ దిక్కుకి వెళ్లి తపస్సు చేయడం ప్రారంభిస్తాడు. ఈ కాలంలోనే విశ్వామిత్రుడికి హవిష్యందుడు, మధుష్యందుడు., దృఢనేత్రుడు, మహారథుడు అనే నలుగురు కుమారులు పుట్టారు. విశ్వామిత్రుడు తపస్సు చేయడం మొదలు పెట్టి 1000 సంవత్సరాలు పూర్తి అయ్యింది. విశ్వామిత్రుడి తపస్సుకు సంతోషించి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యి ఇలా అన్నారు : " నీ తపస్సుకి సంతోషించాను, ఇప్పటినుండి నిన్ను విశ్వామిత్ర మహారాజుగా కాకుండ రాజర్షి విశ్వామిత్రగా పిలుస్తారు" అని చెప్పారు. ఇన్ని సంవత్సరాలు తపస్సు చేస్తే రాజర్షిని అయ్యాను, ఇక బ్రహ్మర్షిని ఎప్పుడు అవుతానో అని విశ్వామిత్రుడు దిగులుపడ్డాడు.  బహ్మర్షి అయ్యేదాకా తపస్సు చేస్తాను అని మళ్ళీ తపస్సు చేయడం ప్రారంభిస్తాడు.  అదే కాలములో ఇక్ష్వాకు వంశంలో త్రిశంకు అనే రాజు పరిపాలన చేసేవాడు. ఆయనకి శరీరం మీద ఉన్న ఇష్టం వలన స్వర్గానికి శరీరంతో వెళ్ళాలి అన్నా కోరిక పుట్టింది. వెంటనే కులగురువైనా వసిష్ఠుడికి తన కోరిక చెప్పాడు. నువ్వు ఎంత గొప్ప రాజువైనా కానీ, ఎంత గొప్ప యాగాలన్నా చెయ్యి, కాని శ...

Mahadevudaina Shivudu Viswamitrudiki Emi Varam Ichhadu?

Image
 మహాదేవుడైనా శివుడు విశ్వామిత్రుడికి ఏమి వరం ఇచ్చాడు? విశ్వామిత్రుడు హిమాలయాలకు వెళ్ళి మహాదేవుడైనా శివుడి కోసం తపస్సు చేశాడు. కొన్ని సంవత్సరాలకు విశ్వామిత్రుడి తపస్సుకు సంతోషించి శివుడు విశ్వామిత్రుడి ఎదుట ప్రత్యక్షం అయ్యాడు .  తరువాత శివుడు విశ్వామిత్రుడితో నీవు ఎందుకు ఇంత ఘోర తపస్సు చేస్తున్నావు. నీకు ఏమి వరం కావాలో కోరుకో అని అడిగాడు.  మహాదేవా! నువ్వు నిజంగా నా తపస్సుకు ప్రీతి చెందిన వాడివైతే నేను ఎవరి దగ్గరకి వెళ్ళి ధనుర్వేదాన్ని ఉపదేశం పొందకుండా నాకు ఆ ధనుర్వేదంలోని అస్త్రాలన్నీ అంటే దేవతలకు, దానవులకు, మహర్షులకు, యక్ష, రాక్షస, గంధర్వ, కిన్నెర, కింపురుషలకు తెలిసిన అన్నీ అస్త్రాలన్నీ రహస్యాలతో సహా తెలిసేలా అనుగ్రహించమని శివుడిని కోరాడు. దానికి శివుడు తథాస్తు అన్నాడు.  పౌర్ణమి రోజు సముద్రం ఎలా పొంగుతుందో, అలాగే విశ్వామిత్రుడు పొంగిన ఆత్మ విశ్వాసంతో రథమెక్కి వశిష్ఠుడి ఆశ్రమానికి వెళ్తాడు. ఆయన ఆశ్రమానికి వెళ్ళి వశిష్ట మహర్షి ఆశ్రమాన్ని నాశనం చేయడం ప్రారంభిస్తాడు. దానితో ఆశ్రమంలోని మునులు అందరు తలా ఒక దిక్కుగా పారిపోయారు. పక్షులు, జంతువులు కొన్ని చనిపోగా మరి కొన్ని పా...

Viswamitra Maharshi Nunchi Sabala Tanani Tanu Ela Kapadukundi?

Image
  శబళ తనని తను ఎలా కాపాడుకుంది? వశిష్ఠుడు శబళని రక్షించుకోమని చెప్పాక కామధేనువు ఒక్కసారి అంబా అని అన్నది. దానితో చాలా సేనలు సృష్టించబడ్డాయి. ఆ సేనలు విశ్వామిత్రుడి సేనలను నాశనం చేయడం మొదలుపెట్టాయి.  విశ్వామిత్రుడి కళ్ళ ఎదుట తన సేనలు నాశనం అవ్వడం చూసి అతనే స్వయముగా రథం ఎక్కి కామధేనువు సృష్టించిన సేనలను నాశనం చేశాడు.  కామధేనువు సృష్టించిన సేనలను విశ్వామిత్రుడు నాశనం చేయడంతో కామధేనువుకి కోపం వచ్చి ఇంకా సేనలను సృష్టించింది. ఆ సేనలు మళ్ళీ విశ్వామిత్రుడి సేనలను నాశనం చేశాయి. దానితో విశ్వామిత్రుడు దివ్య అస్త్రాలను ఉపయోగించి కామధేనువు సృష్టించిన సేనలను నాశనం చేసాడు.  కామధేనువు సేనలను విశ్వామిత్రుడు నాశనం చేయడం చూసి వశిష్ఠుడు కామధేనువుతో ఇంకా సేనలను సృష్టించమన్నాడు. అప్పుడు కామధేనువు మరల అంబా అని అరిచింది. అలా అరవడంతో సూర్య తేజస్సుతో సమానమైన కాంభోజ వీరులు, ప్లవులు, యవనులు, శకులు, మ్లేచ్చులు పుట్టారు. వారందరు కలిసి విశ్వామిత్రుడి సేనని నాశనం చేసారు.  విశ్వామిత్రుడి సేనలు నాశనం కావడం చేత విశ్వామిత్రుడి 100 మంది కుమారులు వశిష్ఠుడి మీదకి వెళ్లారు. వశిష్ఠుడు తనకున్న తపః శక్తు...

Viswamitrudu Raju Nunchi Maharshila Ela Maaradu?

Image
  విశ్వామిత్రుడు రాజు నుంచి మహర్షిగా ఎలా మారాడు?  గాధి కుమారుడైనా విశ్వామిత్రుడు చాలాకాలం రాజ్యపాలన చేసాడు. ఒకనాడు అయన ఒక అక్షౌహిణి సైన్యముతో భూమి అంతా తిరుగుతూ తన రాజ్యంలోనే ఉన్న వశిష్ఠుడి ఆశ్రమానికి వెళ్లారు. వశిష్ట మహర్షి ఆశ్రమంలో జంతువులు పరస్పర వైరం మరిచి జీవిస్తుంటాయి. పులి-జింక, ఎలుక-పాము, కుక్క- పిల్లి ఒక దానిని ఒకటి తరమదు, చంపదు. ఆ ఆశ్రమంలో కొన్ని వేలమంది శిష్యులున్నారు. ఎన్నో పర్ణశాలలతో, చెట్లతో, జంతువులతో ఆ ఆశ్రమం చాలా అందంగా ఉంది. ఆ ఆశ్రమంలో శబళ అనే కామధేనువు ఉంది. అది అమృతంతో సమానమైన పాలు ఇస్తూ ఉండేది. ఆ పాలతోనే ఆ ఆశ్రమంలో యజ్ఞయాగాదులు చేసేవారు. అంత పవిత్రమైన ఆశ్రమంలోకి విశ్వామిత్ర మహారాజు తన సైన్యాన్ని బయట వదిలిపెట్టి ఆశ్రమంలోకి వెళ్లారు. అప్పుడు విశ్వామిత్ర మహారాజు వశిష్ఠ మహర్షితో ఇలా అన్నారు. అయ్యా! మీరు ఎలా ఉన్నారు? యజ్ఞయాగాదులు బాగా జరుగుతున్నాయా? మీకు ఎలాంటి కష్టం లేదు కదా అని కుశల ప్రశ్నలు అడిగారు. అప్పుడు ఆ ప్రశ్నలకు వశిష్ఠ మహర్షి సంతోషించి నేను బాగున్నాను నువ్వు ఎలా ఉన్నావు. నీ రాజ్యం ఎలా ఉంది? నీవు న్యాయంగా రాజ్యపాలన చేస్తున్నావా? అని వశిష్ఠ మహర్షి కుశల ...