Posts

Showing posts from June, 2026

ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ || Prema Kosam Rajasabha Varaku Vachhina Alamkaravathi Katha || Episode - 14 || Bhatti Vikramarka Kathalu

Image
  ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ అలంకారవతి చంద్రవర్మను వెంటబెట్టుకొని రాజసభకు వెళ్ళింది. రాజుకు నమస్కరించి అక్కడ నిలబడింది. చంద్రవర్మ ఆ రాజును ఆశీర్వదించాడు. అందగాడైన చంద్రవర్మ గొప్ప తేజస్సుతో, మన్మథుడిలా ప్రకాశిస్తూ ఉండటం చూసి, ఆ పట్టణ ప్రభువైన మహేంద్రవర్మ ఆశ్చర్యపోయాడు. రాజు వారిని కూర్చోమని చెప్పి, వేశ్య కూతురైన అలంకారవతిని చూసి ఇలా అడిగాడు: "ఓ అందగత్తె! నువ్వు ఎవరివి? ఈ నగరంలోనే ఉంటావా? నిన్ను నేనెప్పుడూ చూడలేదే! ఈ బ్రాహ్మణోత్తముడు ఎవరు? ఇతడిని ఇప్పుడు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? మీరు వచ్చిన కారణం ఏంటో వివరించు." అందుకు అలంకారవతి రాజుతో ఇలా అంది: "మహాప్రభూ! నేను ఈ నగరంలోనే పేరుపొందిన ఒక వేశ్య కుమార్తెను. నా పేరు అలంకారవతి. నేను ఒక వ్రతాన్ని నియమంగా పెట్టుకుని, మా వేశ్య కుల మర్యాద అయిన వ్యభిచార వృత్తిని వదిలేశాను. బయటి ప్రపంచానికి కూడా తెలియకుండా ఇప్పటివరకు ఇంట్లోనే కాలం గడిపాను. అందుకే మీరు నన్ను చూసే అవకాశం రాలేదు." ఆ తర్వాత ఆమె తన వ్రతం వివరాలను, ఆ బ్రాహ్మణుడు తన ఇంటికి రావడం, అతడిని చూసి తాను మోహించి, నిద్ర లేపడానికి పడిన తాపత్రయాన్ని, తన మనసులోన...

శ్రీరాముని ధృఢచిత్తం - లక్ష్మణుని కోపం || Sriramuni Drudachittam.... Lakshmanudi Kopam || Ramayanam || Episode 56

Image
  శ్రీరాముని ధృఢచిత్తం - లక్ష్మణుని కోపం    రాముడు ధృఢచిత్తంతో ఉన్నాడు. తనకు కావలసిన పట్టాభిషేకము అర్ధాంతరంగా ఆగిపోయినా చలించలేదు. తన లోపల ఉన్న భావాలను బయటకు కనిపించకుండా జాగ్రత్త పడుతున్నాడు. ఆవేశంతో ఊగిపోతున్న లక్ష్మణునితో ఇలా అన్నాడు. "తమ్ముడా లక్ష్మణా! నీ కోపాన్ని విడిచిపెట్టు. కోపము ప్రదర్శించడానికి ఇది సమయము కాదు. ధైర్యంగా ఉండు. ఆనందంగా ఉండు. ఈ రోజు నాకు పట్టాభిషేకము అన్న విషయము మరిచిపో, నా పట్టాభిషేకమునకు సేకరించిన వస్తువులు అన్నీ పక్కన పెట్టు. పాపము నా తల్లి కైక నాకు పట్టాభిషేకము జరుగబోవుచున్నది అని బాధపడిపోతూ ఉంది. ఆమె బాధను మనము పోగొట్టాలి. పట్టాభిషేకము ఆగిపోయింది అని ఆమెకు తెలియజెయ్యాలి. ఎందుకంటే నా తల్లి కైక మనసులో బాధ, అనుమానము ఉంటే నేను సహించలేను. నేను పుట్టిన తరువాత నా తల్లులకు గానీ నా తండ్రికి గానీ మనసు బాధపెట్టలేదు. నా తండ్రి సత్యమునే పలుకుతాడు. ఆడిన మాట తప్పడు. ఆయన నా తల్లి కైకకు ఇచ్చిన మాట నెరవేర్చడం నా కర్తవ్యము. మీరు అనుకున్నట్టు నాకు పట్టాభిషేకము జరిగితే నా తండ్రి నా తల్లి కైకకు ఇచ్చిన మాట తప్పిన వాడు అవుతాడు. అది నాకు ఇష్టం లేదు. కాబట్టి, నా పట్టాభ...