Posts

Showing posts from May, 2021

ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ || Prema Kosam Rajasabha Varaku Vachhina Alamkaravathi Katha || Episode - 14 || Bhatti Vikramarka Kathalu

Image
  ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ అలంకారవతి చంద్రవర్మను వెంటబెట్టుకొని రాజసభకు వెళ్ళింది. రాజుకు నమస్కరించి అక్కడ నిలబడింది. చంద్రవర్మ ఆ రాజును ఆశీర్వదించాడు. అందగాడైన చంద్రవర్మ గొప్ప తేజస్సుతో, మన్మథుడిలా ప్రకాశిస్తూ ఉండటం చూసి, ఆ పట్టణ ప్రభువైన మహేంద్రవర్మ ఆశ్చర్యపోయాడు. రాజు వారిని కూర్చోమని చెప్పి, వేశ్య కూతురైన అలంకారవతిని చూసి ఇలా అడిగాడు: "ఓ అందగత్తె! నువ్వు ఎవరివి? ఈ నగరంలోనే ఉంటావా? నిన్ను నేనెప్పుడూ చూడలేదే! ఈ బ్రాహ్మణోత్తముడు ఎవరు? ఇతడిని ఇప్పుడు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? మీరు వచ్చిన కారణం ఏంటో వివరించు." అందుకు అలంకారవతి రాజుతో ఇలా అంది: "మహాప్రభూ! నేను ఈ నగరంలోనే పేరుపొందిన ఒక వేశ్య కుమార్తెను. నా పేరు అలంకారవతి. నేను ఒక వ్రతాన్ని నియమంగా పెట్టుకుని, మా వేశ్య కుల మర్యాద అయిన వ్యభిచార వృత్తిని వదిలేశాను. బయటి ప్రపంచానికి కూడా తెలియకుండా ఇప్పటివరకు ఇంట్లోనే కాలం గడిపాను. అందుకే మీరు నన్ను చూసే అవకాశం రాలేదు." ఆ తర్వాత ఆమె తన వ్రతం వివరాలను, ఆ బ్రాహ్మణుడు తన ఇంటికి రావడం, అతడిని చూసి తాను మోహించి, నిద్ర లేపడానికి పడిన తాపత్రయాన్ని, తన మనసులోన...

Droupadiki aiduguru Bhartalu enduku unnaru? || Why Droupadi have 5 husbands?

Image
 ద్రౌపదికి ఐదుగురు భర్తలు ఎందుకు ఉన్నారు? మనం ఇప్పటికీ చాలాసార్లు మహాభారతం వినే ఉంటాం కదా! అలాగే మహాభారతం సీరియల్స్ లో కూడా చూస్తుంటాం.   సాధారణంగా మహాభారతం అనగానే  గుర్తు వచ్చేది  పాండవులు, కౌరవులు, ద్రౌపది, కురుక్షేత్ర యుద్ధం.   ఇప్పుడు మనం ద్రౌపది కి ఎందుకు ఐదుగురు భర్తలు ఉన్నారో  తెలుసుకుందాం! పూర్వము త్వష్ట ప్రజాపతి పుత్రుడు త్రిశిరుడు. త్రిశిరుడు మాయవి అయి తపస్సు చేస్తుండగా ఆ విషయాన్ని దేవేంద్రుడు తెలుసుకొని త్రిసురుడి తలని తన వజ్రాయుధంతో ఖండించి వేశాడు. అందువలన ఇంద్రుడికి బ్రహ్మహత్యాపాతకం చుట్టుకుంది, ఆ బ్రహ్మ హత్య వలన ఇంద్రుని తేజస్సు నాలుగు భాగాలుగా విడిపోయింది. అందులో ఒక భాగము యమధర్మరాజు లో, రెండవ భాగము వాయుదేవుడిలో, మూడు నాలుగు భాగాలు అశ్వినీ దేవతల లో ప్రవేశించింది. తరువాత ఈ 4 తేజస్సులు భూలోకములో కుంతీదేవికి పుత్రులుగా జన్మించారు. వారే ధర్మరాజు, భీముడు, నకులసహదేవులు, దేవేంద్రుడు స్వయముగా అర్జునుడిగా పుట్టాడు.   దేవేంద్రుడి భార్య అయిన శచి దేవి ద్రుపద మహారాజు తో చేయబడిన యాగములో అగ్ని గుండం నుంచి ద్రౌపదిగా పుట్టింది, అందుకని ద్రౌ...

Sanatkumarudu evaru? Atadu sivudiki ichina varam emiti?

Image
సనత్కుమారుడు ఎవరు? అతడు శివుడికి ఇచ్చిన వరం ఏమిటి? ఇంతకుముందు మనం కుమారస్వామి జననం వెనకాల ఒక కథ ఉంది అనుకున్నాము కదా! అదేనండి సనత్కుమారుడు కథ అది ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం! సనత్కుమారుడు అని బ్రహ్మ మానసపుత్రుడు, అతను గొప్ప జ్ఞాని. అతనికి ఒక రోజు ఒక కల వచ్చింది, ఆ కలలో అతనికి రాక్షస సైన్యాలపై యుద్ధం చేస్తున్నట్లు కల వచ్చింది. వెంటనే తన తండ్రి అయిన బ్రహ్మ దగ్గరకు వెళ్లి నాకు ఇలా కల ఎందుకు వచ్చింది అని అడిగాడు. అప్పుడు బ్రహ్మ నీవు పూర్వజన్మలో వేదాలు చదివేవాడివి, వేదాలలో దేవదానవ యుద్ధాలు గురించి చదివే వాడివి. కానీ నీకు అప్పుడు రాక్షసులు ఎప్పుడూ ఎందుకు ఇలా వ్యతిరేకిస్తారు అని కోపం తెచ్చుకున్నావు, అందుకే ఇలా కలగా వచ్చింది అది తీరాలంటే నీవు ఇప్పుడు దేవసేనకు అధిపతిగా కావాలి అని అన్నాడు. ఇది ఇలా ఉండగా పరమశివుడు ఇలా అనుకున్నారు తన కన్నా గొప్ప జ్ఞాని అయిన వాడు తనకు కొడుకుగా పుడితే బాగుండు అని అనుకుంటూ శ్రీశైలం పర్వతం మీద తిరుగుతూ ఉన్నప్పుడు వారికి సనత్కుమారుడు తపస్సు చేసుకుంటూ కనబడతాడు. ఉమా శంకరులు సనత్కుమారుడి  దగ్గరికి వెళ్లగా  సనత్కుమారుడు తపస్సులో ఉండి వారిని పలకరించలే...

Kumarasambhavam Ela jarigindi? || How did lord kumaraswamy birth happened?

Image
కుమారసంభవం ఎలా జరిగింది? కుశ వంశం గురించి తెలుసుకున్న రామలక్ష్మణులు ఆనాడు అక్కడే నిద్రపోయి, మరునాడు అందరూ ప్రాతఃకాలమున నిద్రలేచి సంధ్యావందనం చేసి ప్రయాణానికి సిద్ధమయ్యారు, మధ్యాహ్న సమయానికి గంగా నది తీరానికి చేరుకున్నారు. అందరూ గంగ ని చూసి సంతోషించి అక్కడున్న మునులు పితృదేవతలకు తర్పణాలు చేసి, అగ్నిహోత్రము విశ్వామిత్రుడు చుట్టూ కూర్చున్నారు. అప్పడు  శ్రీరాముడు గంగకి త్రిపథగ అన్న పేరు ఎలా వచ్చిందో చెప్పమన్నాడు, అప్పుడు విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు. పూర్వ కాలములో హిమవంతుడు అనే పర్వతరాజు ఆయన భార్య మనోరమ ఉండేవారు. వాళ్ళ పెద్ద కుమార్తె గంగ రెండవ కుమార్తె ఉమ. స్వేచ్ఛగా ప్రవహించే గలిగి గుణం ఉన్న గంగను స్వర్గలోకానికి పంపిస్తే ఆ నదీ జలాలని ఉపయోగించుకొని మేము తరిస్తాము అని దేవతలు హిమవంతుడిని అడుగగా దైవకార్యం కనుక హిమవంతుడు సరే అన్నాడు. అలా దేవనదిగా గంగ స్వర్గలోకంలో ప్రవహించేది, ఆయన రెండవ కుమార్తె అయిన ఉమా తపస్సు చేత శివుడికి భార్య అయి హైమవతి గా తన తండ్రి పేరు నిలబెట్టింది. పరమ పావని అయిన గంగ ఒకనాడు భూలోకానికి తీసుకురాబడి పాతాళానికి చేరింది, మూడు లోకములలో ప్రవహించింది కనుక గంగను త్రిపథగ...

Sivudi nataraja rupam venuka unna charitra emiti?

Image
శివుడి నటరాజ రూపం వెనుక ఉన్న చరిత్ర ఏమిటి?  ఇప్పుడు మనం శివుడిని నటరాజస్వామి రూపంలో ఎందుకు కొలుస్తారో తెలుసుకుందాం! పురాణాల ప్రకారం నటరాజస్వామి రూపం గురించి రెండు కధలు ఉన్నాయి,అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా మొదట   మనమంతా నటరాజ స్వామి విగ్రహాన్ని చాలాసార్లు చూసే ఉంటాం కదా! కానీ మీరు ఎప్పుడైనా గమనించారా నటరాజస్వామి కుడి కాలు కింద ఒక రాక్షసుడు ఉంటాడు.  నిజానికి అతను ఎవరో తెలుసుకుందాం నటరాజ స్వామి పాదం కింద ఉండే రాక్షసుడి పేరు అపస్మారుడు, అతనిని ముయలక అని కూడా అంటారు. అతను ఒక మరుగుజ్జు రాక్షసుడు, ఇతడు అజ్ఞానం అజ్ఞానం మరియు అత్యాశ, స్వార్ధానికి గుర్తు. అపస్మారుడు తనకు తాను అందరికంటే శక్తివంతమైన వాడి గా ప్రకటించుకున్నాడు అలాగే మిగతా అందరినీ హీనులుగా చూసేవాడు. స్కందపురాణంలో అతను అమరుడు అని చెబుతున్నారు అంటే తనకు చావు లేదు. ఇతనికి ఒక వరం ఉంది అది ఏమిటంటే ఇతను ఎవరిని అయినా అపస్మారక స్థితిలోకి అంటే స్పృహ లేకుండా చేయగలడు, మరియు వారిని అజ్ఞానులుగా అలాగే మర్చిపోయేలాగా చేయగలడు. అపస్మారుడి ఈ శక్తి వలన ప్రజలు చాలా బాధపడుతూ ఉండేవారు, దీని వలన ప్రజలు చాలా కష్టాలు అనుభవించే వాళ...

Jamadagni maharshi mariyu viswamitra maharshi jananam ela jarigindi?

Image
  జమదగ్ని మహర్షి మరియు విశ్వామిత్ర మహర్షి జననం ఇప్పుడు మనం జమదగ్ని మహర్షి మరియు విశ్వామిత్ర మహర్షి జననం గురించి తెలుసుకుందాం! బ్రహ్మకు కుశుడు అనే కొడుకు గాధి అనే మనమడు ఉన్నారు కదా! గాధికి ఒక కూతురు ఉంది తన  పేరు సత్యవతి, ఋచికా మహర్షి సత్యవతి ని చూసి ఇష్టపడి పెళ్ళి చేసుకోవాలని అనుకొని, సత్యవతిని తనకిచ్చి పెళ్ళి చేయమని కోరాడు.గాధి రాజుు కి యవ్వనవతి మరియు అందమైన తన కూతురిని వృద్ధుడైన మరియు కోపిష్టి అయిన ఋచికా మహర్షికి ఇచ్చి పెళ్లి చేయడం ఇష్టం లేేదు. అందుకని గాధిరాజు  ఋచికా మహర్షి తో ఇలా అన్నాడు: ఏమని అంటే నువ్వు వెయ్యి తెల్ల గుర్రాలు  ఇవ్వాలి అయితే  తెలుపు గుర్రాలకిి ఒక నలుపు చెవి ఉండాలి అని కోరాడు. ఇది సాధ్యం కాదు అని అనుకొని గాధిరాజు చాలా ధైర్యంగా ఉన్నాడు. కానీ ఋచికా మహర్షి వెంటనే తపస్సుచేసి వరుణ దేవుడిని ప్రసన్నం చేసుకుుని, వరుణదేవుడు సహాయంతో గుర్రాలను సంపాదించి వాటిని ఆయన గాధిరాజుకి ఇచ్చి  సత్యవతిని పెళ్లిచేసుకున్నాడు. వారు  సంతోషంగా ఆశ్రమంలో వారి జీవితాన్ని గడుపుతున్నాారు.  కొ...

viswamitrunni kousikudu ani enduku antaru?

Image
  విశ్వామిత్రుణ్ణి కౌశికుడు అని ఎందుకు అంటారు? ఇప్పుడు మనం విశ్వామిత్రుని కౌశికుడు అని ఎందుకంటారో తెలుసుకుందాం! సుబాహు మా రుచులను వధించాక  వారు మిథిలా నగరానికి వెళుతూ ఉంటారు కదా.  దారి మధ్యలో అక్కడ ఒక దేశం ఉంది కదా,ఆ దేశం ఏమిటి అని రాముడు అడుగుతాడు కదా ఇప్పుడు ఆ దేశం గురించి తెలుసుకుందాం. విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు ఆ దేశం గురించి ఇలా చెప్తాడు: పూర్వం బ్రహ్మయొక్క కుమారుడు కుశుడు అనే మహా తపస్వీ ఉండేవాడు. ఆయన వైదర్భీ అని రాజు కుమార్తెను వివాహం చేసుకున్నాడు వారికి నలుగురు కుమారులు వారి పేర్లు కుశాంబుడు, కుశనాభుడు, ఆధూర్త రజసుడు,   వసువు. తరువాత అతను తన రాజ్యాన్ని  తన నలుగురు కుమారులు పంచి న్యాయంగా పరిపాలన చెయ్యాలి అని ఆజ్ఞాపించాడు, వారు తండ్రి మాటను అనుసరించి నాలుగు నగరాలను నిర్మించారు. ఆ నగరాల పేర్లు ఏమిటంటే : కుశాంబుని  చేత నిర్మించబడిన నగరం కౌశింబి  కుశనాధునిచేత నిర్మింపబడిన నగరం మహోదయము  ఆధూర్త రజసుని చేత నిర్మింపబడిన నగర ధర్మారణ్యము వసువు చేత నిర్మింపబడిన నగరం గిరివజ్రపురం. మనం ఇప్పుడు ఉన్న ప్రాంతం గిరివజ్రపురం, ఈ దేశం చుట్టూ అయిదు పర్వతా...