Posts

Showing posts from December, 2023

ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ || Prema Kosam Rajasabha Varaku Vachhina Alamkaravathi Katha || Episode - 14 || Bhatti Vikramarka Kathalu

Image
  ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ అలంకారవతి చంద్రవర్మను వెంటబెట్టుకొని రాజసభకు వెళ్ళింది. రాజుకు నమస్కరించి అక్కడ నిలబడింది. చంద్రవర్మ ఆ రాజును ఆశీర్వదించాడు. అందగాడైన చంద్రవర్మ గొప్ప తేజస్సుతో, మన్మథుడిలా ప్రకాశిస్తూ ఉండటం చూసి, ఆ పట్టణ ప్రభువైన మహేంద్రవర్మ ఆశ్చర్యపోయాడు. రాజు వారిని కూర్చోమని చెప్పి, వేశ్య కూతురైన అలంకారవతిని చూసి ఇలా అడిగాడు: "ఓ అందగత్తె! నువ్వు ఎవరివి? ఈ నగరంలోనే ఉంటావా? నిన్ను నేనెప్పుడూ చూడలేదే! ఈ బ్రాహ్మణోత్తముడు ఎవరు? ఇతడిని ఇప్పుడు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? మీరు వచ్చిన కారణం ఏంటో వివరించు." అందుకు అలంకారవతి రాజుతో ఇలా అంది: "మహాప్రభూ! నేను ఈ నగరంలోనే పేరుపొందిన ఒక వేశ్య కుమార్తెను. నా పేరు అలంకారవతి. నేను ఒక వ్రతాన్ని నియమంగా పెట్టుకుని, మా వేశ్య కుల మర్యాద అయిన వ్యభిచార వృత్తిని వదిలేశాను. బయటి ప్రపంచానికి కూడా తెలియకుండా ఇప్పటివరకు ఇంట్లోనే కాలం గడిపాను. అందుకే మీరు నన్ను చూసే అవకాశం రాలేదు." ఆ తర్వాత ఆమె తన వ్రతం వివరాలను, ఆ బ్రాహ్మణుడు తన ఇంటికి రావడం, అతడిని చూసి తాను మోహించి, నిద్ర లేపడానికి పడిన తాపత్రయాన్ని, తన మనసులోన...

Ramayanam || Dasarathudu Thana Parivaramtho Mithila Nagaraniki Velladam || రామాయణం

Image
  దశరథుడు తన పరివారంతో మిథిలా నగరానికి వెళ్లడం   జనకమహారాజు కొంతమంది పరివారాన్ని అయోధ్యకి పంపగా, వారు గుర్రాల మీద అయోధ్యకి చేరుకోవడానికి ౩ రోజులు పట్టింది. అక్కడకి చేరుకున్నాక బయట ఉన్న ద్వారపాలకులకు "మిథిలా నగరం నుండి జనకమహారాజు దూతలు వచ్చారని దశరథ మహారాజుకి తెలియజేయండి  అని వర్తమానం పంపారు. ఆ వర్తమానం అందుకున్న దశరథుడు వారిని లోపలకి రమ్మన్నాడు. లోనికి వెళ్ళగా, వృద్ధుడైన దశరథుడు సింహాసనం మీద దేవేంద్రుడు కూర్చున్నట్లు కూర్చున్నాడు. అప్పుడు వారు జరిగినదంతా చెప్పారు. మీ పెద్ద కుమారుడైన రాముడు విశ్వామిత్రుడితో మిథిలా నగరానికి వచ్చి జనకుడి దగ్గరున్న శివ ధనుస్సుని ఎక్కుపెట్టడమే కాకుండా, శివధనుర్భంగం కూడా చేశాడు. అందువలన ఆయన తన కుమార్తె అయిన సీతమ్మని నీ కుమారుడైన రాముడికిచ్చి వివాహం చెయ్యాలని అనుకుంటున్నారు. మీకు కూడా సమ్మతమైతే మీ కుమారులను చూసుకోవడానికి మా నగరానికి రావలసిందిగా జనకుడు ఆహ్వానం పంపాడని ఆ రాయబారులు చెప్పారు. వెంటనే దశరథుడు తన గురువులతో, పురోహితులతో సమావేశమై జనకుడి నడువడి ఎటువంటిది అని అడిగాడు. అప్పుడు వారు, "మహానుభావ దశరథ! విదేహ వంశంలో పుట్టిన జనకుడంటే సామాన్య...

మాండ్యవుడు || Mandyavyudu || Moral Storoes || నీతి కథలు

Image
  మాండ్యవుడు    మాండవ్యుడు ఒక బ్రాహ్మణ తపస్వి. సత్య, ధర్మములను ఆయన బహునిష్టతో ఆచరించేవాడు. మౌన వ్రతంతో ఆయన తన ఆశ్రమ సమీపంలోగల ఆక ఒకచెట్టు నీడన శీర్షాసనంతో తపస్సు ప్రారంభించాడు. అలా కొన్నిసంవత్సరాలు నిశ్చలంగా ఘోర తపస్సు చేశాడు. తపస్సు చేస్తున్న కాలంలో ఒకనాడు కొందరు దొంగలు ఆ ఆశ్రమ ప్రాంతానికి పరుగెత్తుకుంటూ వచ్చారు. రాజభటులు వారిని తరుముకుంటూ వస్తున్నారు. ఆ దొంగలకు ఏమి చేయాలో తోచలేదు. వారి వద్దనున్న దొంగిలింపబడిన వస్తువుల భారంతో వేగంగా పారిపోలేక ఆ వస్తువులను మాండవ్యుని ఆశ్రమంలో దాచి పారిపోయారు.  రాజభటులు తర్వాత అచ్చటకు చేరారు, దొంగలు ఆశ్రమంలో దాగి యుంటారని భావించి ఆ ఆశ్రమాన్ని వెదికారు. అక్కడ ఆ చోరులు దాచిన వస్తువులు కనిపించినవి. బయట వెతికారు. కొద్ది దూరంలో శీర్షాసనంతో తపస్సు చేస్తున్న మహర్షి కనిపించాడు. ఒక దొంగ తమను  మోసం చేయడానికే ఈ విధంగా తపస్వీవలె నటిస్తున్నాడని భావించారు. వెంటనే ఆ  దొంగల జాడ చెప్పమని గద్దించి అడిగారు. మౌన వ్రతంలో ఉన్న ముని మాట్లాడలేదు.  వారు పిదప దొంగలనందరనూ బంధించి వారితో మునిని కూడ బంధించి తీసుకువెళ్ళారు. అందరినీ రాజు సమక్షంలో నిల...

Bhojaraju || బ్రాహ్మణుడు భోజరాజు సేనకు జొన్న కంకులు ఇవ్వటం || Brahmanudu Bhojaraju Senaku Jonna Kankulu Ivvadam || Batti Vikramarka Kathalu

Image
  బ్రాహ్మణుడు భోజరాజు సేనకు జొన్న కంకులు ఇవ్వటం   భోజరాజు రాజ్యానికి తిరిగి వెళ్లే సమయంలో ఎండ చాలా ఎక్కువగా ఉండడం వలన రాజుగారు వెంట వచ్చిన జనాలు నడవలేక నడుస్తున్నారు. అలా వస్తున్న వారు మార్గమధ్యంలో జొన్న చేనుని ఒక దాన్ని చూశారు. అలాగే ఆ చేను యజమాని అయిన ఒక బ్రాహ్మణుడు చేను మధ్యలో నిర్మింపబడిన ఎత్తైన  మంచె మీద నుంచుని జొన్నకంకుల్ని తినడానికి వచ్చిన పక్షుల్ని తోలుతున్నాడు.  ఆ బ్రాహ్మణుడు అప్పుడు సేనతో వస్తున్న భోజరాజు ను చూసి రాజు గారిని పెద్దగా పిలిచి ఇలా అన్నాడు. రాజా! ఇంతటి ఎండలో నీ సేనతో వెళ్లడం సులువు కాదు కదా?  మీలాంటి గొప్ప ఉత్తమమైన రాజుకి ఆతిథ్యం ఇవ్వడం మా కర్తవ్యం కనుక ఇక్కడ ఆగండి.  ఇదిగో చూశారా నా జొన్న చేను బాగా పండింది. ఇప్పుడు ఈ గింజలు తినడానికి ఉపయోగపడతాయి. ఇక్కడికి వచ్చి అందరూ తృప్తిగా జొన్న కంకులు పోసి గింజలు దాల్చి తిని కొంచెం సేపు విశ్రమించాక మీరు మీ ప్రయాణాన్ని తిరిగి కొనసాగించండి.  నా కోరికను మన్నించి వద్దు అని అనకండి. ఇది బ్రాహ్మణుడు సొమ్ము కదా! తీసుకొని అలా తినవచ్చా అని అనుకోకండి. నేను మనస్పూర్తిగానే తినమంటున్నాను. దీనివలన మీకు పాపం...