Posts

Showing posts from September, 2024

ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ || Prema Kosam Rajasabha Varaku Vachhina Alamkaravathi Katha || Episode - 14 || Bhatti Vikramarka Kathalu

Image
  ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ అలంకారవతి చంద్రవర్మను వెంటబెట్టుకొని రాజసభకు వెళ్ళింది. రాజుకు నమస్కరించి అక్కడ నిలబడింది. చంద్రవర్మ ఆ రాజును ఆశీర్వదించాడు. అందగాడైన చంద్రవర్మ గొప్ప తేజస్సుతో, మన్మథుడిలా ప్రకాశిస్తూ ఉండటం చూసి, ఆ పట్టణ ప్రభువైన మహేంద్రవర్మ ఆశ్చర్యపోయాడు. రాజు వారిని కూర్చోమని చెప్పి, వేశ్య కూతురైన అలంకారవతిని చూసి ఇలా అడిగాడు: "ఓ అందగత్తె! నువ్వు ఎవరివి? ఈ నగరంలోనే ఉంటావా? నిన్ను నేనెప్పుడూ చూడలేదే! ఈ బ్రాహ్మణోత్తముడు ఎవరు? ఇతడిని ఇప్పుడు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? మీరు వచ్చిన కారణం ఏంటో వివరించు." అందుకు అలంకారవతి రాజుతో ఇలా అంది: "మహాప్రభూ! నేను ఈ నగరంలోనే పేరుపొందిన ఒక వేశ్య కుమార్తెను. నా పేరు అలంకారవతి. నేను ఒక వ్రతాన్ని నియమంగా పెట్టుకుని, మా వేశ్య కుల మర్యాద అయిన వ్యభిచార వృత్తిని వదిలేశాను. బయటి ప్రపంచానికి కూడా తెలియకుండా ఇప్పటివరకు ఇంట్లోనే కాలం గడిపాను. అందుకే మీరు నన్ను చూసే అవకాశం రాలేదు." ఆ తర్వాత ఆమె తన వ్రతం వివరాలను, ఆ బ్రాహ్మణుడు తన ఇంటికి రావడం, అతడిని చూసి తాను మోహించి, నిద్ర లేపడానికి పడిన తాపత్రయాన్ని, తన మనసులోన...

రాముడు కౌసల్యాదేవిని సందర్శించటం || Raamudu Kowsalyadevini Sandarshinchatam || Ramayanam || Episode 38

Image
  రాముడు కౌసల్యాదేవిని సందర్శించటం రాముడూ, సభాసదులు ఎవరి ఇళ్ళకు వారు వెళ్లారు. పిదప దశరథుడు మంత్రులతో ఆలోచించి “రేపే పుష్యమీ నక్షత్రం. రాముని రాజ్యాభిషిక్తుని చేయాలి. నా మనస్సు ఇంకొకసారి రాముణ్ఞి చూడాలని వేధిస్తోంది. ఓయీ! సుమంతా ! నువ్వు వెళ్లి నా మాటగా చెప్పి రాముణ్ణి ఇక్కడకు తీసుకొని రా అన్నాడు. దశరథుని ఆజ్ఞ మేరకు సుమంతుడు రాముని అంతఃపురానికి వెళ్ళి మహారాజు ఆదేశాన్ని రామునికి తెలిపాడు. తరువాత రాముడు తండ్రి ఎందుకు ఇంత తక్కువ వ్యవధిలో మళ్లీ పిలిపిస్తున్నాడని విస్తుపోతూ సుమంత్రుని వెంట రాజప్రాసాదానికి వెళ్తాడు. తండ్రిని చూడగానే రాముడు దోసిలి ఒగ్గి నమస్కరించాడు. అప్పుడు దశరథుడు రాముణ్ణి లేవనెత్తి కౌగలించుకొని అతడికి ఆసనం చూపి కూర్చోమన్నాడు. అప్పుడు రాముడిని చూసి దశరథుడు ఇలా పలికాడు: రామా! దీర్జాయుష్మంతుడనైన నేను వృద్ధడనయ్యాను. అన్నదానాలు, వందలాది. యజ్ఞాలు, భూదానాలు, సత్కార్యాలన్నీ చేశాను. బ్రాహ్మణులకు పుష్కలంగా దక్షిణలిచ్చాను. రామా! సమస్త సుఖాలను అనుభవించాను. యజ్ఞాలు చేసి దేవతాఋణాలు తీర్చాను. రకరకాలైన దానాలు చేసి ఋషిబుణాన్ని తీర్చాను. సంతానాన్ని కని పితృ రుణాన్ని తీర్చాను. శరీరధర్మంగ...

Manchivaadu - Cheddavaadu || మంచివాడు – చెడ్డవాడు || Jaanapada Kathalu || Telugu Stories || 1

Image
  మంచివాడు – చెడ్డవాడు ఒక ఊళ్లో ఇద్దరు ముసలివాళ్లు ఉండేవాళ్లు. ఒకడు మంచివాడు. ఒకడు చెడ్డవాడు. ఒక ఏడు సంవత్సరాది రోజున ఆ ఇద్దరూ కలుసుకున్నారు. "నాకు రాత్రి చిత్రమైన కల వచ్చింది. నా అదృస్టం ఆకాశం నుంచి వచ్చి పడిందట." అన్నాడు మంచివాడు. "చిత్రంగానే ఉన్నది. ఎందుకంటే, నాకూ నా అదృష్టం కలలో వచ్చింది. అది భూమిలో నుంచి వచ్చిందట." అన్నాడు చెడ్డవాడు. "ఎవరి అదృష్టం ఎలా వస్తుందో చూద్దాం." అని మంచివాడు తన ఇంటికి వెళ్ళిపోయాడు. కొన్నిరోజులు గడిచాక చలిరోజులు వెనకపడ్డాయి. ఇవాళ పొలం పని ఆరంభించవచ్చు." అనుకుని మంచివాడు పారా, పలుగూ తీసుకుని పొలానికి వెళ్లి  , తవ్వటం మొదలుపెట్టాడు. ఉన్నట్టుండి పలుగుకు ఏదో తగిలి ఖంగుమన్నది. పొలంలో పలుగురాళ్లు ఎలావచ్చాయా అని ఆశ్చర్యపడుతూ, తవ్వి తీసి చూస్తే అది ఒక బిందె ! మంచివాడు దాని మూత తీసి చూసేసరికి, అందులో బంగారు కాసులూ, మొహరీలూ, కనిపించాయి. మంచివాడు ఆ బిందెను తిరిగి యథాప్రకారం పెట్టేశాడు. "పాపం, ఈ నిధి ఆ ముసలాడిది అయి ఉంటుంది. తన అదృష్టం భూమిలో దొరికినట్టు సంవత్సరాదినాడు అతను కల వచ్చిందన్నాడు. వెళ్ళి అతనితో చెబుతాను," అనుకుని ...