ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ || Prema Kosam Rajasabha Varaku Vachhina Alamkaravathi Katha || Episode - 14 || Bhatti Vikramarka Kathalu

Image
  ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ అలంకారవతి చంద్రవర్మను వెంటబెట్టుకొని రాజసభకు వెళ్ళింది. రాజుకు నమస్కరించి అక్కడ నిలబడింది. చంద్రవర్మ ఆ రాజును ఆశీర్వదించాడు. అందగాడైన చంద్రవర్మ గొప్ప తేజస్సుతో, మన్మథుడిలా ప్రకాశిస్తూ ఉండటం చూసి, ఆ పట్టణ ప్రభువైన మహేంద్రవర్మ ఆశ్చర్యపోయాడు. రాజు వారిని కూర్చోమని చెప్పి, వేశ్య కూతురైన అలంకారవతిని చూసి ఇలా అడిగాడు: "ఓ అందగత్తె! నువ్వు ఎవరివి? ఈ నగరంలోనే ఉంటావా? నిన్ను నేనెప్పుడూ చూడలేదే! ఈ బ్రాహ్మణోత్తముడు ఎవరు? ఇతడిని ఇప్పుడు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? మీరు వచ్చిన కారణం ఏంటో వివరించు." అందుకు అలంకారవతి రాజుతో ఇలా అంది: "మహాప్రభూ! నేను ఈ నగరంలోనే పేరుపొందిన ఒక వేశ్య కుమార్తెను. నా పేరు అలంకారవతి. నేను ఒక వ్రతాన్ని నియమంగా పెట్టుకుని, మా వేశ్య కుల మర్యాద అయిన వ్యభిచార వృత్తిని వదిలేశాను. బయటి ప్రపంచానికి కూడా తెలియకుండా ఇప్పటివరకు ఇంట్లోనే కాలం గడిపాను. అందుకే మీరు నన్ను చూసే అవకాశం రాలేదు." ఆ తర్వాత ఆమె తన వ్రతం వివరాలను, ఆ బ్రాహ్మణుడు తన ఇంటికి రావడం, అతడిని చూసి తాను మోహించి, నిద్ర లేపడానికి పడిన తాపత్రయాన్ని, తన మనసులోన...

Pillikunaki tana basha emito telisinda? || Ramalinganiki Vikatakavi ane peru ela vachhindi?

పిల్లి కూనకి తన భాష ఏమిటో తెలిసిందా?

ఇప్పుడు మనం  తల్లి లేని పిల్లికూన అనే కథ గురించి తెలుసుకుందాం !

అనగనగా ఒక ఊరు ఆ ఊరి బయట ఒక పిల్లి వుండేది దానికి ఒక పిల్లికూన పుట్టింది. పిల్లికూన పుట్టగానే ఆ పిల్లి చనిపోయింది తల్లిలేని పిల్లికూనకు పిల్లి భాష ఏమిటో తెలీదు. పిల్లికూనకు  బాగా ఆకలి వేసింది పిల్లికూనకు పాలు కావాలి అని ఎలా అడగాలో తెలియలేదు దానికి బాగా ఆకలి వేసి వీధుల్లో తిరుగుతూ,ఏడుస్తూ నడుస్తుంది. దారిలో దానికొక కుక్కపిల్ల కనబడింది కుక్కపిల్ల పిల్లికూనను ఇలా అడిగింది: అదేమిటంటే పిల్లికూనా! పిల్లికూనా! గళ్లగళ్ల పిల్లికూన కళ్ళనీళ్ళు ఎందుకమ్మా? ఏడుస్తూనే ఉంది పిల్లికూన.

అప్పుడు పిల్లికూనా ఇలా చెప్పింది :

కుక్కపిల్ల ! కుక్కపిల్ల ! ఒక సంగతి చెప్పగలవా ఆకలేస్తే పాలకోసం అమ్మని ఏమని అడుగుతావు? అని పిల్లికూనా కుక్కపిల్లని అడిగింది.

అప్పుడు కుక్కపిల్ల ఇలా అన్నది మా కుక్క భాషతో భౌ భౌ అని అరుస్తూ అని అరుస్తాను అని చెప్పింది. మీకు కూడా పాలు కావాలంటే భౌ భౌ అని అరవమన్నది. భౌభౌ అని అరవలెేను  బాగోలేదు కుక్క భాష నాకు నా మాతృభాష తప్ప మరో భాష వద్దే వద్దు అని వెళ్ళిపోయింది.

దారిలో ఒక కోడెదూడ కనబడింది దానిని కూడా అలాగే  మీకు పాలు కావాలంటే ఏమని అడుగుతావు అని అడిగింది పిల్లికూన. అప్పుడు దూడ అంబా అంబా అని అరవమన్నది. పిల్లికూన కి ఆ భాష కూడా నచ్చలేదు.

అక్కడి నుంచి కూడా వెళ్ళిపోతూవుంటే కాకిపిల్ల కనబడింది.

కాకిపిల్ల ని కూడా పిల్లికూన ఇలా అడిగింది. నీకు పాలు కావాలంటే ఏమని అడుగుతావు అని అడిగింది అప్పుడు కావుకావుమని అరవమంది. దానికి ఆ భాష కూడా నచ్చక  వెళ్లి పోయింది అప్పుడు కప్ప పిల్ల కనబడింది .

కప్ప పిల్లను కూడా అలాగే అడిగింది. అప్పుడు ఆ కప్ప పిల్ల బెక బెక మని పిలవమంది. దానికి ఆ కప్ప  భాష కూడా నచ్చక పిల్లికూన అక్కడి నుంచి వెళ్లి పోయింది.ఇంతలో ఒక మేక పిల్ల కనబడింది.

మేక పిల్లను కూడా ఇలాగే అడిగింది: నీకు కనుక పాలు కావాలంటే ఏమని అరుస్తావు? అని అప్పుడు  మేక ఏమనీ అన్నది అంటే మే మే అని అడగమని అంది. పిల్లికూన ఏడుస్తూ వెళ్ళిపోయింది. ఈ భాషాలేమి నాకొద్దు అని అనుకున్నది.

ఆఖరికి ఒక పెద్ద పిల్లి కనబడింది ఏడుస్తున్న ఆ పిల్లికూనను   బుజ్జగించి పిల్లికూనా! పిల్లికూనా! ఎందుకమ్మా ఏడుస్తావు? అని అడిగింది. ఆకలేస్తే పాలకోసం అమ్మని ఏమని అడుగుతావు అని అడిగింది పిల్లికూనా దానికి పెద్దపిల్లి మ్యావ్ మ్యావ్ అని అన్నది. 

పిల్లికూనా దానికి తల్లిభాష దొరికింది మ్యావ్ మ్యావ్ అని అనుకుంటూ ఒక ఇంట్లోకి వెళ్ళింది. ఆ ఇంట్లో  శారద అనే ఒక అమ్మాయి ఉంది. తల్లిలేని పిల్లికూనా మ్యావ్ మ్యావ్ అని అన్నది శారదకి  దాని భాష వెనక ఉన్న అర్థం తెలుసుకొని ఓహో! ఆకలేస్తుందా పిల్లికూన పాలు తెస్తాను తాగు అని  శారద ఒక పళ్ళెం నిండా పాలు పోసి తెచ్చింది. పిల్లికూనా సంతోషంతో పాలన్నీ తాగింది. తరువాత పిల్లికూనా శారదా చాలాసేపు ఆడుకున్నారు.

 ఆఖరికి అలసిపోయి శారదా నిద్రపోయింది. పిల్లికూన కూడా ఒక మూల హాయిగా నిద్రపోయింది.

వికటకవి అనే పేరు రామలింగానికి ఎలా వచ్చింది?

ఇప్పుడు మనం తెనాలి రామలింగ గురించి తెలుసుకుందాం  !

తెనాలి రామలింగని అని పేరు అందరూ వినే ఉంటారు కదా!

ఆయన శ్రీకృష్ణ దేవరాయల ఆస్థానంలో అతను ఒక మంత్రి.

అతనికి ఆ పేరు ఎలా వచ్చిందనుకున్నారు? తెనాలిలో పుట్టాడు కనుక తెనాలి రామలింగ అనే పేరు వచ్చింది.

ఆ రోజుల్లో తెనాలి చిన్న ఊరు. చిన్నప్పటినుంచీ రామలింగం తెగ అల్లరి చేస్తూ ఉండేవాడు. ప్రతి వాళ్లకు ఏదో ఒక పేరు పెట్టే వాడు అతనికి ఏ భయం కూడా ఉండేది కాదు.  

తనకు నచ్చిన దానిని వెక్కిరించడంలో ధైర్యవంతుడు. ఒకరోజున రామలింగం  వీధుల్లో ఆడుకుంటూ ఉన్నాడు

ఒక యోగి అటు వెళ్తూ రామలింగాన్ని చూశాడు. రామలింగం చూడటానికి అతని మాటల్లోనూ ఆ యోగికి రామలింగం తెలివితేటలు కనిపించాయి.

వెంటనే ఆయన రామలింగాన్ని దగ్గరకు పిలిచి ఒక శక్తి మంత్రం ఉపదేశించి ఇలా చెప్పాడు: నాయనా!   ఈ మంత్రం వెయ్యిసార్లు కనుక నీవు కాళికామాత గుడిలో జపిస్తే దేవీ నీకు దర్శనమిస్తుంది వేయి తలలతో కనిపిస్తుంది.

నీవు భయపడకూడదు అప్పుడు  దేవి సంతోషించి నీవు కోరుకున్న వరం ఇస్తుంది అని చెప్పి  ఆ యోగి అక్కడినుంచి వెళ్ళిపోయాడు.

రామలింగం మంచిరోజు వచ్చిన దాకా ఆగి ఆ రోజు ఆ నాటి  అర్ధరాత్రి పూట రామలింగం ఒంటరిగా కాళికాదేవి గుడికి వెళ్లి యోగిచెప్పిన మంత్రం  వెయ్యి సార్లు జపించాడు. కాళికాదేవి వెంటనే వేయి తలలతో ప్రత్యక్షమైంది.

రామలింగం భయపడలేదు అతనికి ఏమైందో తెలీదు కానీ వెంటనే నవ్వాడు.  దేవి రామలింగాన్ని ఎందుకు అబ్బాయి నవ్వుతున్నావు? అని అడిగింది  అప్పుడు రామలింగడు ఏమన్నాడంటే మీరు కోపం తెచ్చుకోనంటే చెబుతాను అని అన్నాడు.

దేవి సరే అని అన్నది రామలింగం అప్పుడు ఇలా చెప్తాడు: 

అమ్మ మాకు ఒకటి ముక్కు రెండుచేతులు ఉన్నాయి ఎప్పుడైనా జలుబు చేస్తే ఒక  ముక్కు చీదుకోవడానికి   రెండుచేతులూ సరిపోవట్లేదు,ఇక మీకు వెయ్యి తలలు  మీకు జలుబు చేస్తే వెయ్యి ముక్కులు చీదుకోవడానికి ఈ రెండు చేతులు ఎలా సరిపోతాయి! అని నవ్వు వచ్చింది. కాళికామాత కూడా అతని మాటకు నవ్వి నాయనా! నన్ను చూసి  నవ్విన వాడివి నీవు ఎవరిని చూసి అయినా నవ్వుతావు.

కనుక నీవు తప్పకుండా వికటకవివి అవుతావు అని అన్నది

రామలింగం నమస్కరించి తల్లి ఎటుతిప్పి చదివినా  చెడని మాట వరంగా ఇచ్చావు, ఇంతకంటే నాకు ఏమి కావాలి అని అన్నాడు. కాళికామాత అతని  తెలివితేటలకు మెచ్చుకుంది.

వికటకవి అనే పదం ఎటుతిప్పి చదివిన మారదు.

 దేవి సంతోషించి మరొక వరం   కూడా అతనికి ఇచ్చింది నీవు రాజాస్థానంలో విదూషకుడు అవుతావు అంతేకాదు  మీలాగా పద్యాలు చెప్పటం మరొకరికి చేతకాదు అని ఆశీర్వదించింది. రామలింగం వికటకవిగా   ప్రసిద్ధి చెందాడు ఆయన పేరుతో ఎన్నో హాస్య కథలు ఉన్నాయి ఇవికాక  రామలింగం రెండు మహా కావ్యాలు రాశారు ఉద్భటారాధ్య  చరిత్ర అందులో ఒకటి పాండురంగ మహత్యం ఒకటి.



←Prev                                                                                                                                                                                                                                                                                    Next→

Comments

Popular posts from this blog

Dasarathudu Ayodhyaku Cheratam || దశరథుడు అయోధ్యకు చేరటం || Episode 34 || Ramayanam

Ramayanam || Shiva Dhanassu

Goppa Thyagam || గొప్ప త్యాగం || Moral Stories || నీతి కథలు