Posts

Showing posts from June, 2023

ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ || Prema Kosam Rajasabha Varaku Vachhina Alamkaravathi Katha || Episode - 14 || Bhatti Vikramarka Kathalu

Image
  ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ అలంకారవతి చంద్రవర్మను వెంటబెట్టుకొని రాజసభకు వెళ్ళింది. రాజుకు నమస్కరించి అక్కడ నిలబడింది. చంద్రవర్మ ఆ రాజును ఆశీర్వదించాడు. అందగాడైన చంద్రవర్మ గొప్ప తేజస్సుతో, మన్మథుడిలా ప్రకాశిస్తూ ఉండటం చూసి, ఆ పట్టణ ప్రభువైన మహేంద్రవర్మ ఆశ్చర్యపోయాడు. రాజు వారిని కూర్చోమని చెప్పి, వేశ్య కూతురైన అలంకారవతిని చూసి ఇలా అడిగాడు: "ఓ అందగత్తె! నువ్వు ఎవరివి? ఈ నగరంలోనే ఉంటావా? నిన్ను నేనెప్పుడూ చూడలేదే! ఈ బ్రాహ్మణోత్తముడు ఎవరు? ఇతడిని ఇప్పుడు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? మీరు వచ్చిన కారణం ఏంటో వివరించు." అందుకు అలంకారవతి రాజుతో ఇలా అంది: "మహాప్రభూ! నేను ఈ నగరంలోనే పేరుపొందిన ఒక వేశ్య కుమార్తెను. నా పేరు అలంకారవతి. నేను ఒక వ్రతాన్ని నియమంగా పెట్టుకుని, మా వేశ్య కుల మర్యాద అయిన వ్యభిచార వృత్తిని వదిలేశాను. బయటి ప్రపంచానికి కూడా తెలియకుండా ఇప్పటివరకు ఇంట్లోనే కాలం గడిపాను. అందుకే మీరు నన్ను చూసే అవకాశం రాలేదు." ఆ తర్వాత ఆమె తన వ్రతం వివరాలను, ఆ బ్రాహ్మణుడు తన ఇంటికి రావడం, అతడిని చూసి తాను మోహించి, నిద్ర లేపడానికి పడిన తాపత్రయాన్ని, తన మనసులోన...

Neeti Kathalu || Moral Stories || Cheviti Maalokam || చెవిటి మాలోకం

Image
  చెవిటి మాలోకం శంకరయ్య చాలా అదృష్టవంతుడు. అతనికి చాల చక్కని అమ్మాయి భార్యగా. లభించింది. పెండ్లి అయిన తర్వాత కొన్నాళ్లకు అతనికి వినికిడి కొంచెం తగ్గింది. అది అంతటితో ఆగలేదు. క్రమేపీ వినికిడి సమస్య పెరుగుతు వచ్చింది. చివరకు బ్రహ్మచెముడుగా మారింది. రోజులు గడచినకొద్దీ అతనికి ప్రజలతో  సంబంధంలేకుండా పోయింది. అందరూ “చెవిటిమాలోకం! నీతో మాకు పనేమిటి” అనేవారు. ఒకరోజున అతని అత్తవారింటి నుండి వాళ్ళ మామగారి ఆరోగ్యం బాగోలేదు  అని కబురు వచ్చింది.  మామగారిని చూడటానికి వెళ్ళకుంటే "లోకులు కాకుల్లాగ" పొడుస్తారు, మాటలంటారు.  పైగా నాకు గర్వమని అంటారు. అందుచేత తప్పకుండా వెళ్లి ఆయన్ని చూసి రావాలి.” అనుకొన్నాడు.  కానీ తనకు ఉన్నా చెవుడుతో పెద్దకష్టమొచ్చి పడిందే! “దీంతో ఎలా నెగ్గుకురావాలి? ఏంచేయాలి?”  అని పదేపదే ఆలోచించి సాధారణ కుశలప్రశ్చలను కొన్నింటిని వ్రాసుకొని,  వాటికి ఏయే జవాబులు వస్తాయో కూడా వ్రాసుకొని అనేక మార్లు వాటిని చదివి పదే పదే చదువుకున్నాడు. మొదటిప్రశ్న _ :- ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలావుందీ?' జవాబు - ఇప్పుడు కొంచెం బాగుగానే ఉంది. తాను అనవలసినమాట _ :-నాకిప్పుడు చా...

Neeti Kathalu || Moral Stories || Govinduni Telivi

గోవిందుని తెలివి ఒక రోజున గోవిందుకి వాళ్ల నాన్న ఒక చిన్న వెండి పెట్టెను ఇచ్చి “గోవిందా! ఈ పెట్టెను తీసుకొనివెళ్లి ప్రక్క ఊరిలోనున్న మీ మామయ్యకు యిచ్చి తిరిగి త్వరగా వచ్చేయ్‌! నీవు పెందరాళే బయలుదేరివెళ్తే  మళ్లీ  పొద్దు పోయేలోపు యింటికి రావచ్చు!” అని చెప్పాడు. గోవిందు వెంటనే బయలుదేరి 2 గంటల్లో వాళ్ల మామయ్య గారింటికి చేరుకొన్నాడు. వాళ్ల మామయ్యకు ఆపెట్టెను యిచ్చివేశాడు. వాళ్ల అత్తయ్య గోవిందుకు పిండివంటలతో చక్కటి భోజనం పెట్టింది. కొంతసేపైన తర్వాత వాళ్ల  మామయ్య వచ్చి “నేను పెట్టెలోని వస్తువుల్ని తీసుకొన్నాను. ఇంక నీవీపెట్టెను తిరిగి తీసుకొని వెళ్లవచ్చును .” అని గోవిందుకు  ఆ వెండి పెట్టెను యిచ్చి “బాబూ! జాగ్రత్తగా వెళ్లు .  దారిలో టక్కరిదొంగలుంటారు.” అని చెప్పి గోవిందుని సాగనంపాడు. కొంతదూరం వెళ్లిన తర్వాత ఎవరో దొంగ తన వెనకే వస్తున్నట్లు గోవిందుకు అనుమానం వచ్చింది. ఏం చేయాలో తోచక పరుగులంకించుకొన్నాడు. ఆ దొంగ కూడా పరుగెత్తడం మొదలుపెట్టాడు.  దార్లో ఒక నుయ్యి కన్పించింది. కొంచెం   కొంచెం నీళ్లు త్రాగి వెళదామని  నూతి దగ్గరకు వెళ్లాడు . దొంగ అంతకంతకూ దగ్...

Viswamithrudu - Menaka Ela Kalisaru? || Ramayanam

Image
విశ్వామిత్రుడు - మేనక పరిచయం   కోపంతో తన కొడుకులను శపించానని విశ్వామిత్రుడు బాధపడ్డాడు. ఈ సారి ఎవరితో మాట్లాడకుండా తపస్సు చేస్తానని మళ్లీ తపస్సు చేయటం ప్రారంభించాడు. అలా పుష్కర క్షేత్రములో వేయి సంవత్సరాలు తపస్సు చేశాక అతని తపస్సును మెచ్చుకొన్న బ్రహ్మదేవుడు ఇతర దేవతలు అతనికి వరాలు ఇవ్వడానికి వచ్చారు.  విశ్వామిత్రుని చూచి బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు : " ఓ విశ్వామిత్రా! నీవు  ఆచరించిన తపస్సు వలన నీవు ఋషివి అయ్యావు" అని చెప్పి బ్రహ్మ తన లోకానికి వెళ్లిపోయాడు .  కానీ విశ్వామిత్రుడికి తృప్తి కలగలేదు. తాను కూడా వశిష్ఠ మహర్షిలాగా బ్రహ్మర్షి కావాలని ఆయన కోరిక. అందువల్ల మరల తపస్సు చేయడం మొదలు పెట్టాడు. కొన్ని సంవత్సరాలు గడిచాయి.  అలా ఒకరోజు  మేనక అనే అప్సరస విశ్వామిత్రుడు తపస్సు చేస్తున్న ఆశ్రమానికి దగ్గరలో ఉన్న ఒక కొలనులో స్నానం చేస్తూ ఉంది. విశ్వామిత్రుడు మేనకను చూసి తన అందచందాలకు మోహితుడైనాడు.  మేనక దగ్గరకు వెళ్లి " ఓ అప్సరస! నీకు నా ఆశ్రమానికి స్వాగతం. నిన్ను చూసి నేను పరవశుడను అయ్యాను. మన్మధ బాధకు తట్టుకోలేకున్నాను. నన్ను కరుణించు" అని వేడుకున్నాడు. ...