ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ || Prema Kosam Rajasabha Varaku Vachhina Alamkaravathi Katha || Episode - 14 || Bhatti Vikramarka Kathalu
రాముడు విశ్వామిత్రుని ఆ వనం గురించి చెప్పమని అడుగుతాడు కదా అప్పుడు విశ్వామిత్రుడు రామునితో ఇలా అంటాడు:
నాయన! పూర్వం విరోచనుడి కొడుకు అయినా బలి మహాపరాక్రమశాలి, అతనికి మూడు లోకాలను చేయించి స్వర్గలోకం ఆక్రమించే సరికి మహావిష్ణువు కశ్యపుడికి వామనుడిగా పుట్టి బలి చేసే మహాయజ్ఞానికి వెళ్లి బలిని మూడు అడుగుల భూమి ని అడుగుతాడు.
బలి ఆ మూడు అడుగులు ఇచ్చాడు, వామనుడు మూడు అడుగులు కొలిచి మూడులోకాలు తీసుకొని బలిచక్రవర్తిని అధోలోకానికి పంపేశాడు.
ఆ వామనుడి తండ్రి అయిన కశ్యపుడు కూడా ఈ ఆశ్రమంలోనే బాగా తపస్సు చేశారు. అందుచేత నేను కూడా ఇక్కడే ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నాను, రాక్షసులు మాటి మాటికి వచ్చి నన్ను చాలా బాధపడుతున్నారు. వారందరినీ నీవు చంపాలి అని విశ్వామిత్రుడు శ్రీరామునితో అంటాడు.
విశ్వామిత్రుడు ఉంటున్న ఆ ఆశ్రమం పేరు సిద్ధాశ్రమం. విశ్వామిత్రుడు రామ లక్ష్మణులతో సహా ఆశ్రమంలోకి రాగానే అక్కడ ఉండే మిగతా మునులందరూ సంతోషముతో పరిగెత్తుకుంటూ వచ్చి విశ్వామిత్రుడ్ని పూజించి, రామ లక్ష్మణులకు అతిథి సత్కారాలు చేశారు. రామలక్ష్మణులు కొంచెంసేపు విశ్రమించారు.
తరువాత విశ్వామిత్రుడి దగ్గరకు వచ్చి నమస్కారం చేసి మహాముని ఇక మీరు యాగం ప్రారంభించే ప్రయత్నాలు చేయండి, మీ యాగాన్ని మేము రక్షిస్తాము అని చెప్పారు.
ఆ రాత్రి గడిచాక రామలక్ష్మణులు ఉదయాన్నే లేచి సంధ్యావందనాలు అన్నీ చేసి విశ్వామిత్రుడు దగ్గరకు వచ్చేసరికి ఆయన అప్పటికే హోమం ముందు కూర్చుని ఉన్నారు. వాళ్ళు విశ్వామిత్రుడికి నమస్కారాలుచేసి మహాత్మా! రాక్షసులు ఎప్పుడు వస్తారు ?
వారి కోసం మేము ఏ సమయంలో వేచి చూడాలి అని అడిగారు.
విశ్వామిత్రుడు సమాధానం చెప్పలేదు, కానీ యజ్ఞవేదిక చుట్టూ ఉన్న మునులు నాయనలారా! విశ్వామిత్రుడు యాగ దీక్షలో వుండడం చేత మౌనంగా ఉన్నారు. ఈ రోజు మొదలు ఆరు రోజుల దాకా మీరు మమ్మల్ని కాపాడాలి అని చెప్పారు.
రామ లక్ష్మణులు వారి ధనస్సులు ధరించి రాత్రివేళ నిద్ర కూడా మాని, అయిదు పగళ్లు, ఐదు రాత్రిళ్లు ఆశ్రమాన్ని కాపాడారు. ఆరువ రోజు వచ్చింది, యజ్ఞం చేసే స్థలంలో అగ్ని వెలుగుతూ ఉన్నది విధి ప్రకారం, మంత్రాల ప్రకారం యాగం జరుగుతూ ఉన్నది. ఆ సమయంలో ఆకాశం నుంచి పెద్ద పెద్ద ధ్వనులు వినిపించాయి. సుబాహు, మారీచులు వారి బలగానికి చెందిన రాక్షసులు కారు మేఘాలు లాగా ఆకాశం ఆవరించి యజ్ఞ వేదికపై రక్తవర్షం కురిపించాసాగారు.
రాముడు వారు చేసే శబ్దాలు విని తల ఎత్తి ఆకాశంలోని రాక్షసులను చూశాడు. రాముడు వారిపైకి మానవాస్త్రం ఎక్కుపెట్టాడు, అది మారీచుడుకి తగిలి మారీచుడు ఆ దెబ్బకి సముద్రంలో పడ్డాడు , తరువాత రాముడు ఆగ్నేయాస్త్రం తో సుబాహుని, వాయువ్య అస్త్రంతో మిగిలిన రాక్షసులను చంపేశాడు.
విశ్వామిత్రుడి యాగం పూర్తి అయ్యింది ఆయన రాముడితో నాయనా! నాకూ చాలా గొప్ప ఉపకారం చేసావు అని అంటూ శ్రీరాముణ్ణి ప్రశంసించాడు. తాటకను సంహరించి మారీచ సుబాహులు ను కొట్టి విశ్వామిత్రుడు యాగాన్ని ఏ ఆటంకమూ లేకుండా జరిగింది.
ఆ రోజు రాత్రి రామలక్ష్మణులు హాయిగా నిద్రపోయారు. తరువాత రోజు ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకుని విశ్వామిత్రుడు మరియు ఇతర మునులు ఉండే చోటుకి వెళ్లి వారందరికీ నమస్కారాలుచేసి, విశ్వామిత్రుడితో ఇలా అన్నాడు.
మీ ఆజ్ఞప్రకారం రాక్షసులను సంహరించాను ఇంకా చేయవలసిన పనులు ఏమైనా ఉంటే చెప్పండి అని అడిగారు అప్పుడు మునులు రామలక్ష్మణులతో ఇలా చెప్పారు:
మిథిలానగరాన్ని పరిపాలించే జనక మహారాజు ఒక గొప్ప యాగాన్ని చెయ్యబోతున్నారు మేమంతా బయలుదేరి అక్కడికి వెళుతున్నాము.
ఒకప్పుడు జనక మహారాజు ఒక యాగం చేసి దానికి ఫలితంగా దేవతలు నుంచి ఒక అద్భుతమైన ధనస్సును సంపాదించారు. ఆ ధనస్సు ఎప్పుడు వెలిగిపోతూ ఉంటుంది. మహారాజు ఆ ధనస్సును తన ఇంట్లో ఉంచుకొని సుగంధ ధూపదీపాల తో దానిని పూజిస్తూ ఉంటారు.
ఆ ధనస్సును దేవతలు కానీ, రాక్షసులు కానీ ఎక్కుపెట్టలేరు అంటే ఇక మనుషుల మాట చెప్పాలా!
మహా బలశాలురైన రాజులు, రాజకుమారులు ఎందరో ప్రయత్నించి కూడా దానిని ఎక్కుపెట్టలేక పోయారు. మీరు కూడా వచ్చినట్లయితే జనక మహారాజు చేసి యాగాన్ని ఆ అద్భుతమైన ధనుస్సును చూడగలుగుతారు అని మునులందరూ రామలక్ష్మణులతో చెప్పారు.
అప్పుడే ఆ ప్రయాణానికి కావలసిన ఏర్పాట్లు అన్నీ జరిగాయి. విశ్వామిత్రుడు వన పాలకులతో నేను మిగిలిన మునులందరినీ వెంటపెట్టుకుని గంగానదికి ఉత్తరంగా హిమాలయాలవైపు వెళుతున్నాను అని చెప్పి సిద్ధాశ్రమానికి ప్రదక్షిణం చేసి తిరిగి వచ్చారు. తరువాత మునులందరూ రామ లక్ష్మణులతో సహా ఉత్తర దిక్కున బయలుదేరారు, వారి వెనకాల కొన్ని వందల బండ్ల మీద సమిధలు,ఇంధనాలు మొదలైన అగ్ని సాధనాలు వచ్చాయి. వారు పగలంతా చాలా దూరం నడిచి సూర్యాస్తమయం వేళకు సోనా నది తీరానికి చేరుకున్నారు.
అక్కడ వారంతా స్నానాలు చేసి, సంధ్యావందనాలు చేసి రామ లక్ష్మణులు విశ్వామిత్రునికి ఎదురుగా కూర్చుని స్వామి అందమైనభవనాలు కలఈ దేశం ఏమిటి? దీని కథ ఏమిటి అని అడిగారు.
Comments