Posts

Showing posts from January, 2024

ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ || Prema Kosam Rajasabha Varaku Vachhina Alamkaravathi Katha || Episode - 14 || Bhatti Vikramarka Kathalu

Image
  ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ అలంకారవతి చంద్రవర్మను వెంటబెట్టుకొని రాజసభకు వెళ్ళింది. రాజుకు నమస్కరించి అక్కడ నిలబడింది. చంద్రవర్మ ఆ రాజును ఆశీర్వదించాడు. అందగాడైన చంద్రవర్మ గొప్ప తేజస్సుతో, మన్మథుడిలా ప్రకాశిస్తూ ఉండటం చూసి, ఆ పట్టణ ప్రభువైన మహేంద్రవర్మ ఆశ్చర్యపోయాడు. రాజు వారిని కూర్చోమని చెప్పి, వేశ్య కూతురైన అలంకారవతిని చూసి ఇలా అడిగాడు: "ఓ అందగత్తె! నువ్వు ఎవరివి? ఈ నగరంలోనే ఉంటావా? నిన్ను నేనెప్పుడూ చూడలేదే! ఈ బ్రాహ్మణోత్తముడు ఎవరు? ఇతడిని ఇప్పుడు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? మీరు వచ్చిన కారణం ఏంటో వివరించు." అందుకు అలంకారవతి రాజుతో ఇలా అంది: "మహాప్రభూ! నేను ఈ నగరంలోనే పేరుపొందిన ఒక వేశ్య కుమార్తెను. నా పేరు అలంకారవతి. నేను ఒక వ్రతాన్ని నియమంగా పెట్టుకుని, మా వేశ్య కుల మర్యాద అయిన వ్యభిచార వృత్తిని వదిలేశాను. బయటి ప్రపంచానికి కూడా తెలియకుండా ఇప్పటివరకు ఇంట్లోనే కాలం గడిపాను. అందుకే మీరు నన్ను చూసే అవకాశం రాలేదు." ఆ తర్వాత ఆమె తన వ్రతం వివరాలను, ఆ బ్రాహ్మణుడు తన ఇంటికి రావడం, అతడిని చూసి తాను మోహించి, నిద్ర లేపడానికి పడిన తాపత్రయాన్ని, తన మనసులోన...

భోజునికి భూమిలో సింహాసనం దొరకడం || Bojuniki Bhoomilo Simhasanam Dorakadam || Batti Vikramarka Kathalu || భట్టి విక్రమార్క కథలు

Image
  భోజునికి భూమిలో సింహాసనం దొరకడం భోజరాజు తనకు దొరికిన సింహాసనం చూసి ఇలా అనుకున్నాడు : ఈ సింహాసనం గలచోట మంచె వేసి ఉండడం వలన దానిపైన ఎక్కినప్పుడు బ్రాహ్మణుడికి అలా ఉదార గుణం కలిగి ఉన్నాడు.  పాపం!  అతడు ఇక్కడ నిధి ఉంటుంది అని ఎరుగడు అని అక్కడ ఉన్నవాళ్లు ఒకరు ఒకరితో ఒకరు అనుకుంటున్నారు.  అప్పుడు రాజుగారు మంత్రిని చూసి నీతిమంతా చూశావా! నువ్వు చెప్పినట్లే జరిగింది. ఈ సింహాసనాన్ని మనం అంత వైభవం కలిగిన చక్రవర్తి ఎవరో ఆసీనులు అయి వున్నది కానీ సామాన్యులది కాదు. దీని వలన బ్రాహ్మణుడికి ఇలాంటి మంచి గుణము వచ్చింది. ఈ సింహాసనం భూమి లోపల పూడ్పపడి పైన ఉన్న మంచె మీద కూర్చోవడం వలన ఆ బ్రాహ్మణుడికి ఆ విధంగా అంతటి ఔదార్యగుణం కలిగించింది. అంటే దీని ప్రభావం ఎంత గొప్పదో అనడంలో సందేహం లేదు, ఈ సింహాసనం మీద ఆసీనులైన వారికి ఇంకా ఎటువంటి శుభగుణాలు వస్తాయో కదా! నీతిమంతా! ఇది మన అదృష్టం వలన మనకు లభించింది. దీనిని మన రాజ్యానికి తీసుకువెళ్లి ఉపయోగించాలని నిర్ణయించాను అని చెప్పి, సింహాసనాన్ని జాగ్రత్తగా తీయించి నిపుణులైన పలువురు సేవకులచే మోయించుకొని ధారాపురానికి తీసుకువెళ్లి, తనకు రత్న సింహాసనం లభించ...

ఇద్దరు శిష్యులు || Iddaru Sishyulu || Moral Stories || నీతి కథలు

Image
  ఇద్దరు శిష్యులు పూర్వం గంగానదీ తీరంలో విజయానంద స్వామివారి ఆశ్రమం ఉండేది. ఆయన తన శిష్యులకు కేవలం జ్ఞానబోధ మాత్రమే చేసి వదిలేయకుండా సమాజాన్ని దగ్గర నుంచి పరిశీలించేలా తర్ఫీదు ఇచ్చేవారు. రవీంద్రుడు, జ్ఞానేంద్రుడు అనే ఇద్దరు శిష్యులను ఓ ఆరునెలలపాటు ఆయన దేశమంతా పర్యటించి రమ్మన్నారు. ఈక్రమంలో సమాజంలో ఎంతమంది మంచివాళ్లున్నారు.. ఎంతమంది చెడ్డవాళ్లున్నారో తెలుసుకోమని చెప్పారు. గురువు ఆశీర్వాదం తీసుకుని వాళ్లు బయలుదేరారు. పర్యటన తర్వాత శిష్యులిద్దరూ ఆశ్రమం చేరుకున్నారు. విజయానంద స్వామివారికి నమస్కరించిన తర్వాత... 'లోకంలో మంచితనం లేనే లేదు. నాకైతే ఒక్క మంచివాడు కూడా కనిపించలేదు' అని రవీంద్రుడు అన్నాడు. 'నువ్వేం గమనించావు.. జ్ఞానేంద్రా!' అని గురువు అడిగారు. 'నాకైతే చాలా మంది మంచివాళ్లు తారసపడ్డారు. నిజానికి ఒక్క చెడ్డవాడు కూడా కనిపించలేదు' అన్నాడు జ్ఞానేంద్రుడు. 'మీ ఇద్దరిలో ఎవరి అభిప్రాయం సరైనదో.. మీరే తేల్చుకొని చెప్పండి' అని స్వామీజీ అన్నారు. వాళ్లు కాసేపు చర్చించుకున్న తర్వాత, తాము చెప్పలేకపోతున్నామని గురూజీనే చెప్పమన్నారు. 'ప్రపంచమంతా పూర్తిగా చెడ...

Dasarathudu Mariyu Janaka Maharajula Vamsala Vivarana || Ramayanam

Image
  దశరథుడు మరియు జనక మహారాజుల వంశాల వివరణ దశరథుడితో పాటు వశిష్టుడు, కాత్యాయనుడు, జాబాలి, మార్కండేయుడు, కాశ్యపుడు, వామనుడు మొదలైన వారు, విశ్వామిత్రుడు, శతానందుడు మరియు మిగిలిన మహర్షులందరూ ఒకచోట చేరారు.  అలాగే సాంకాశ అనే నగరాన్ని పరిపాలిస్తున్న తన తమ్ముడైన కుశధ్వజడిని తీసుకురమ్మని జనకుడు ఆదేశించాడు. ఇంతమంది గొప్పవాళ్ళతో ఆ రాత్రి మిథిలా నగరం వెలిగిపోయింది. మరుసటి రోజు ఉదయాన్నే దశరథుడు జనకా మహారాజుతో ఇలా అన్నాడు:  మహానుభావుడైన విశ్వామిత్రుడి అనుమతితో నాకు ఎంతో కాలం పురోహితుడిగా ఉంటున్న, మా వంశాభివృధిని కోరుకునే వశిష్ట మహర్షి మా వంశం గురించి చెప్తారు" అన్నారు. అయోధ్య నగరాన్ని పరిపాలించిన దశరథ మహారాజుగారి పూర్వీకుల గురించి చెప్తాను అని వశిష్టుడు చెప్పడం మొదలుపెట్టాడు. మొదట బ్రహ్మగారు జన్మించారు, ఆ బ్రహ్మ నుండి మరీచి జన్మించాడు, మరీచికి కాశ్యపుడు, ఆయనకి సూర్యుడు, సూర్యుడికి మనువు పుట్టాడు. మనువు ప్రజాపతి అయ్యాడు. మనువుకి ఇక్ష్వాకు , ఆ ఇక్ష్వాకువు అయోధ్యను  మొట్ట మొదటి సరిగా పరిపాలించాడు.  ఇక్వ్వాకుకి కుక్షి, కుక్షికి వికుక్షి, వికుక్షికి బాణుడు, బాణుడికి అనరణ్యుడు, అనరణ...

Sibi Chakravarthi || శిబి చక్రవర్తి || Moral Stories || నీతి కథలు

Image
  శిబి చక్రవర్తి శిబి చక్రవర్తి గొప్ప దాత, దయా గుణం కల చక్రవర్తి. ఇతడు ఉశీనరుడు అనే మహారాజు కుమారుడు. భృగుతుంగ పర్వతం మీద ఓ సారి పెద్ద ఎత్తున యజ్ఞం చేసాడు శిబి చక్రవర్తి. ఎందరో మహర్షులు ఆ యజ్ఞానికి హాజరయ్యారు. అందరికీ ఘనంగా మర్యాదలు జరిగాయి. అందర్నీ గొప్పగా సత్కరించాడు చక్రవర్తి. ఆయన ఔదార్యానికి, దాననిరతికి తాపసులందరు ఆశ్చర్యపోయారు. శిబి చక్రవర్తి దానశీలతను పదే పదే ప్రజలందరూ ప్రశంసించారు. ఈ వార్త ఇంద్రుడి వరకూ వెళ్ళింది. ఆయన చక్రవర్తి ఔదార్యాన్ని పరీక్షిద్దామనుకున్నాడు. యజ్ఞ వేదిక మీద కూర్చుని ఉన్న శిబి చక్రవర్తి ఒడిలో ఒక పావురం వాలింది. అది మనుష్యభాషలో, "మహారాజా! రక్షించు! నన్ను ఒక డేగ తరుముకొస్తుంది. నన్ను చంపి తినాలని చూస్తుంది. దాని బారి నుంచి నన్ను కాపాడు. నాకు ప్రాణభిక్ష పెట్టు" అని దీనంగా వేడుకుంది. శిబి చక్రవర్తి పావురాన్ని ప్రేమగా నిమురుతూ, "నిన్ను కాపాడే బాధ్యత నాది. నీకు ఎవరి నుంచీ ప్రమాదం రాదు" అని హామీ ఇచ్చాడు. పావురం మనసు కుదుటపడింది. అంతలో అక్కడికి డేగ వచ్చింది. రాజుగారికి ఎదురుగా ఎత్తయిన చోట వాలి పావురం వైపు కొరకొర చూసింది. పావురం భయంతో వణికింది. డేగ...

భోజరాజు బ్రాహ్మణుడి జొన్న చేనుని కొనడం || Bhojaraju Brahmanudi Jonna Chenuni Konadam || Batti Vikramarka Kathalu

Image
  భోజరాజు బ్రాహ్మణుడి జొన్న చేనుని కొనడం బ్రాహ్మణుడు బాగా ఆలోచించి ఇప్పుడు ఏం చేయాలి?  చాలా ఎక్కువ మొత్తంలో ధనం ఇస్తానంటున్నాడు, ఈ పాడు చేనుని ఉంచుకొని నేనేమీ చేయాలి?  ఆ డబ్బును తీసుకొని సుఖంగా జీవింపవచ్చును. ఇది నాకు మంచి అవకాశం అని అనుకుంటున్నాను, అంతే కాకుండా రాజునే చేనుని అడుగుతున్నాడు కదా!  ఇంత కంటే ఏమైనా లాభం ఉన్నదా?  రాజు కోరి అడిగినప్పుడు తనకు అవసరమయ్యి  నన్ను కనుకరించి  ఇమ్మనప్పుడు దానివలన గొప్ప లాభం కలుగునప్పుడు పెద్దల వలనసంపాదింపబడిన భూమిని అభిమానం కొరకు ఉంచుకొని ఇచ్చుటకు నిరాకరింపవచ్చునా? ఇప్పుడు రాజు మాటకి ఎదురు చెప్తే రాజుగారు కోపగించుకుని ఈ భూమిని తన అధీనం చేసుకుంటే పిమ్మట నా గతి అధోగతియే అవును ఇప్పుడు రాజు మాటకి ఎదురు చెప్తే రాజుగారు కోపగించుకుని ఈ భూమిని తన అధీనం చేసుకుంటే పిమ్మట నా గతి అధోగతియే అవును.రాజుగారికి అడ్డు  చెప్పేవారెవరున్నారు అయినా రాజుగారు ఇచ్చే దానిలో గొప్ప లాభం కూడా వచ్చును.  కాబట్టి నేను ఈ భూమి రాజు గారికి ఇచ్చేసి ధనం తీసుకోవడం అన్ని విధాల మంచిదని అనుకుని రాజును చూసి వినయముతో,  ఓ రాజా! నీ మాటకు అడ్డు చెప...