Posts

Showing posts from May, 2026

ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ || Prema Kosam Rajasabha Varaku Vachhina Alamkaravathi Katha || Episode - 14 || Bhatti Vikramarka Kathalu

Image
  ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ అలంకారవతి చంద్రవర్మను వెంటబెట్టుకొని రాజసభకు వెళ్ళింది. రాజుకు నమస్కరించి అక్కడ నిలబడింది. చంద్రవర్మ ఆ రాజును ఆశీర్వదించాడు. అందగాడైన చంద్రవర్మ గొప్ప తేజస్సుతో, మన్మథుడిలా ప్రకాశిస్తూ ఉండటం చూసి, ఆ పట్టణ ప్రభువైన మహేంద్రవర్మ ఆశ్చర్యపోయాడు. రాజు వారిని కూర్చోమని చెప్పి, వేశ్య కూతురైన అలంకారవతిని చూసి ఇలా అడిగాడు: "ఓ అందగత్తె! నువ్వు ఎవరివి? ఈ నగరంలోనే ఉంటావా? నిన్ను నేనెప్పుడూ చూడలేదే! ఈ బ్రాహ్మణోత్తముడు ఎవరు? ఇతడిని ఇప్పుడు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? మీరు వచ్చిన కారణం ఏంటో వివరించు." అందుకు అలంకారవతి రాజుతో ఇలా అంది: "మహాప్రభూ! నేను ఈ నగరంలోనే పేరుపొందిన ఒక వేశ్య కుమార్తెను. నా పేరు అలంకారవతి. నేను ఒక వ్రతాన్ని నియమంగా పెట్టుకుని, మా వేశ్య కుల మర్యాద అయిన వ్యభిచార వృత్తిని వదిలేశాను. బయటి ప్రపంచానికి కూడా తెలియకుండా ఇప్పటివరకు ఇంట్లోనే కాలం గడిపాను. అందుకే మీరు నన్ను చూసే అవకాశం రాలేదు." ఆ తర్వాత ఆమె తన వ్రతం వివరాలను, ఆ బ్రాహ్మణుడు తన ఇంటికి రావడం, అతడిని చూసి తాను మోహించి, నిద్ర లేపడానికి పడిన తాపత్రయాన్ని, తన మనసులోన...

కౌసల్యా దుఃఖం… రాముని నిర్ణయం || Koushlya Dukham....Ramuni Nirnayam || Ramayanam || Epsode 55

Image
   రాముడు తల్లికి, లక్ష్మణునకు నచ్చచెప్పడం అప్పుడు లక్ష్మణుడు అమ్మా! కౌసల్యా! అన్నా రామా! దశరథమహారాజు వృద్దుడైపోయినా ఇంకా యౌవనంలోనే ఉన్నానను కొంటున్నాడు. అందువల్ల ఆయనలో భోగాసక్తి తగ్గలేదు. కామంచేత ఒక ఆడదాని మాటలకు బానిసై విపరీతపు నిర్ణయాలు తీసుకున్నాడు. అంతమాత్రం చేత రాముడు ఒక ఆడదానికిచ్చిన మాటకోసం రాజ్యలక్ష్మిని వదులుకోవటం నాకు బొత్తిగా ఇష్టంలేదు. ఆ మాటకు వస్తే రాముడు ఏం తప్పుచేశాడని దేశాన్నుంచి బహిష్కృతుడవుతున్నాడు. అరణ్యాలకు పంపాల్సినంత దోషం అతడు ఏమి చేశాడు? ఎంతటి శత్రువైనా రాముణ్ణి గూర్చి ఒక్క మాట. కూడా వ్యతిరేకంగా మాట్లాడలేడు. రాముడు దేవతలలో పరిగణించదగ్గవాడు. ధర్మబుద్ధి గలవాడు, ఇంద్రియనిగ్రహం కలవాడు, కపటం లేనివాడు. శత్రువులకు కూడా మేలు చేసే స్వభావం గల రాముణ్ణి ఎందుకొరకు అడవులకు పంపాలి? ఏ తండ్రి అయినా అటువంటి వాడికి ఇలాంటి ఏకపక్షమైన శిక్షను విధిస్తాడా? రామా! ఈ విషయం నలుగురికీ తెలియకమునుపే రాజ్యాధికారాన్ని చేజిక్కించుకుందాం. ధనుస్సును ధరించి, నేను నీ ప్రక్కన ఉంటే నిన్ను ఎదిరించే ధైర్యం ఎవరికుందో చూద్దాం. నా వాడిబాణాల ధాటికి ఈ అయోధ్యా నగరమే నిర్మానుష్యమైపోతుంది. భరతుని పక్షా...

కౌసల్య దేవి గుండె పగిలిన రోజు || Kowsalya Devi Gunde Pagilina Roju || Ramayanam || Epsode 54

Image
    రాముడు కౌసల్యకు తన వనవాసం గూర్చి తెలుపడం రాముడు దశరథునికి, కైకేయికి నమస్కరించి బయలుదేరగానే అంతఃపురంలోని స్త్రీలంతా ఘోల్లున ఏడ్చారు. రాముడు తండ్రి చెప్పినా చెప్పకపోయినా అందరికీ అన్ని పసులు చేసిపెడుతూ ఉండేవాడు. ఎవరి మీదా కోపగించుకొనేవాడు కాదు. ఒకవేళ ఎవరికైనా కోపం వస్తే వాళ్ళ కోపం మంచులా కరిగిపోయేట్లు మాటలు చెప్పేవాడు. అటువంటి రాముణ్ణి అడవులకు పంపుతున్నారు. మనమంతా దూడలు లేని అవుల్లాగా అయిపోతామే అంటూ ఏడవసాగారు. ఈ ఏడుపులన్నీ వింటూ దశరథుడు మళ్ళీ మూర్చపోయాడు. ఈ రోదన అంతా రాముడు కూడా విన్నాడు. కానీ మనోనిగ్రహంతో మదపుటేనుగులా మెల్లగా అడుగులు వేస్తూ ముందుకు సాగిపోయాడు. కౌసల్యాదేవి అంతఃపురంలోకి ప్రవేశిస్తూనే అక్కడ చాలాకాలంగా ఉంటున్న వృద్ధుడైన ద్వారపాలకుణ్ణి, మరికొందరిని చూశాడు. వారంతా రాముణ్ణి 'జయీభవా అని, అభినందించారు. అట్లా ముందుకు పోతూనే రెండవ ప్రాకారం దాటాడు. అక్కడ వృద్ధులైన బ్రాహ్మణులున్నారు. రాముడు వారందరికీ నమస్కారం చేశాడు. అట్లా ముందుకుపోయి మూడవ ప్రాకారంలో ప్రవేశించాడు. అక్కడంతా స్త్రీలే ద్వారపాలకులుగా ఉన్నారు. వారంతా పరుగెత్తుకుపోయి కౌసల్యాదేవికి రాముని రాకను తెలియజేశారు. కౌస...

రాముడు Vs కైకేయి సంభాషణ, భరతనుకి రాజ్యం రాముడికి అరణ్యం|| Ramudi vs Kaikeyi Sambhashana, Bharathuniki Rajyam Ramuniki Aranyam || Ramayanam || Epsode 53

Image
  రాముడు  వనవాసానికి అంగీకరించడం అప్పుడు రాముడు కైకేయితో  అమ్మా! నువ్వు చెప్పినట్లే నడచుకుంటాను. రాజు నీకు ఇచ్చిన వరాలు రెండూ తప్పక నెరవేర్చగలడు. ఆయన తన ప్రతిజ్ఞను నెరవేర్చి సత్యవ్రతాన్ని కాపాడుకోగలడు.. నువ్వు చెప్పినట్లుగా నారబట్టలు ధరించి, జటాధారినై అడవులందే నివసిస్తాను. ఈ మాత్రానికే నా తండ్రి నన్ను ప్రేమపూర్వకంగా పలకరించటం లేదా? నా హితం కోరేవాడు, పూజ్యుడు. అంతేగాక మహారాజు అయిన నా తండ్రి ఆజ్ఞాపిస్తే నేను ఆయన ఆజ్ఞను శిరసావహించనా? అది నా కర్తవ్యం కాదా? నేను ఎల్లప్పుడూ ఆయనకు కృతజ్ఞుడుగానే ఉంటాను. అమ్మా! భరతుని రాజ్యాభిషేకం గూర్చి తండ్రిగారు ఒక్క మాట నాతో చెప్పినా నేను సంతోషంగా అంగీకరించేవాడను. నన్ను ఎవరూ ప్రేరేపించకపోయినా, నేనే తమ్ముడైన భరతుని కోసం నా సర్వస్వాన్ని ఆఖరుకు నా ప్రాణాలను కూడా సంతోషంగా అర్పించేవాణ్ణి. అమ్మా! తండ్రిగారే స్వయంగా నీ ప్రియమైన కోరికను తీర్చమని అడిగితే, నా సర్వస్వాన్ని తండ్రిగారి ప్రతిజ్ఞ నెరవేర్పడానికి అర్పించడానికి సిద్ధంగా ఉన్నాను. నా తమ్ముడు భరతునికి సర్వస్వం ఇవ్వగలనని విడిగా చెప్పాలా? అమ్మా! నువ్వు తండ్రిగారిని ఓదార్పు. మహారాజు దైన్యంగా నేలచూపుల...