ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ || Prema Kosam Rajasabha Varaku Vachhina Alamkaravathi Katha || Episode - 14 || Bhatti Vikramarka Kathalu

Image
  ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ అలంకారవతి చంద్రవర్మను వెంటబెట్టుకొని రాజసభకు వెళ్ళింది. రాజుకు నమస్కరించి అక్కడ నిలబడింది. చంద్రవర్మ ఆ రాజును ఆశీర్వదించాడు. అందగాడైన చంద్రవర్మ గొప్ప తేజస్సుతో, మన్మథుడిలా ప్రకాశిస్తూ ఉండటం చూసి, ఆ పట్టణ ప్రభువైన మహేంద్రవర్మ ఆశ్చర్యపోయాడు. రాజు వారిని కూర్చోమని చెప్పి, వేశ్య కూతురైన అలంకారవతిని చూసి ఇలా అడిగాడు: "ఓ అందగత్తె! నువ్వు ఎవరివి? ఈ నగరంలోనే ఉంటావా? నిన్ను నేనెప్పుడూ చూడలేదే! ఈ బ్రాహ్మణోత్తముడు ఎవరు? ఇతడిని ఇప్పుడు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? మీరు వచ్చిన కారణం ఏంటో వివరించు." అందుకు అలంకారవతి రాజుతో ఇలా అంది: "మహాప్రభూ! నేను ఈ నగరంలోనే పేరుపొందిన ఒక వేశ్య కుమార్తెను. నా పేరు అలంకారవతి. నేను ఒక వ్రతాన్ని నియమంగా పెట్టుకుని, మా వేశ్య కుల మర్యాద అయిన వ్యభిచార వృత్తిని వదిలేశాను. బయటి ప్రపంచానికి కూడా తెలియకుండా ఇప్పటివరకు ఇంట్లోనే కాలం గడిపాను. అందుకే మీరు నన్ను చూసే అవకాశం రాలేదు." ఆ తర్వాత ఆమె తన వ్రతం వివరాలను, ఆ బ్రాహ్మణుడు తన ఇంటికి రావడం, అతడిని చూసి తాను మోహించి, నిద్ర లేపడానికి పడిన తాపత్రయాన్ని, తన మనసులోన...

viswamitrudu ramuniki ichina ayudhalu emiti?

 విశ్వామిత్రుడు రామునికి ఇచ్చిన ఆయుధాలు ఏమిటి?

ఇప్పుడు మనం విశ్వామిత్రుడు శ్రీరాముడికి ఏమేమి ఆయుధాలు ఇచ్చాడు తెలుసుకుందాం!

తాటకను వధించిన రోజు వారు అక్కడే వున్నారు కదా ఆ తర్వాత రోజు ఉదయాన్నే వాళ్ళు సంధ్యా వందనం చేసాక విశ్వామిత్రుడు రామునితో రామా! నీకు అన్నీ దివ్యాస్త్రాలను ఇస్తాను. వాటితో నువ్వు అసురులను, గంధర్వులను, దేవతలను అందరినీ నీవు యుద్ధంలో చేయించగలవు అని చెప్తాడు.ఇప్పుడు ఆ దివ్యాస్త్రాలు ఏమిటో తెలుసుకుందాం.

దండచక్రము, ధర్మచక్రము, కాలచక్రము, విష్ణుచక్రం అలాగే  ఇంద్రాస్త్రం, వజ్రాస్త్రం, శివుని శూలంతో సమానమైన శూలస్త్రం, బ్రహ్మశిరోనామకాస్త్రమును అలాగే అన్నింటికంటే గొప్పదైన బ్రహ్మాస్త్రమును నీకు ఇస్తాను. 

అంతేకాకుండా నీకు  మోదకి,శిఖరి అనే రెండు గధా ఆయుధాలను కూడా ఇస్తాను.

నీకు ఇంకా ధర్మపాశము, కాలపాశము, వారుణాస్త్రము ఇస్తాను.

ఇంతేకాకుండా  నీకు ఇంకా రెండు  పిడిపాటులను అంటే తడిగా పిడుగు, పొడిగా ఉన్న పిడుగు  ఇస్తాను.

ఇంకా నీకు పినాక అస్త్రమును, నారాయణ అస్త్రం ఇస్తాను అని విశ్వామిత్రుడు రామునితో అన్నాడు.

అంతేకాకుండా ఇంకా ఏమేమి అస్త్రాలు విశ్వామిత్రుడు రాముడికి ఇచ్చాడో తెలుసుకుందాం.

రామా! నీకు హయశిరము, క్రౌంచ అస్త్రమూ అనే రెండు శక్తులను ప్రసాదిస్తాను. 

రాక్షసుడు వాడే అటువంటి అస్త్రములు అనగా కంకాళము, ముసలము, కపాలము, కంకణము నీకు ఇస్తున్నాను.

రామా నీకు ఇంకా విద్యాధరము అనే మహా అస్త్రమును,నందనము అనే ఖడ్గాన్ని ఇస్తున్నాను.

నీకు ఇంకా గాంధర్వ అస్త్రమును,సౌర అస్త్రమును ఇస్తున్నాను ఇవి నీకు నిద్ర కలిగేలాగా అలాగే నిద్ర రాకుండా ఉండేలా కూడా చూస్తాయి. 

నీకు ఇంకా  దర్పణ, శోషణ, సంతాపన, విలాపన మొదలగు అస్త్రములు,మన్మథుడు ఉపయోగించే మదన అస్త్రమును, పిశాచాలు వాడే మోహినీ అస్త్రం కూడా ఇస్తున్నాను.

 రామా నీకు ఇంకా తామస అస్త్రమును, సౌమనాస్త్రము,సంవర్ధాస్త్రము, ముసలము, సత్యము అనే అస్త్రం, పరమ శ్రేష్టమైన మాయాధరాస్త్రము, అత్యంత శక్తివంతం, భయంకరమైన త్వష్టురాస్త్రం  మొదలగు అస్త్రములు ను నీకు ఇస్తున్నాను.రామా ఇవన్నీ తనకు ఇష్టమైన రూపంలో మారగలవు.చాలా బలవంతమైనవి వాటిని వెంటనే తీసుకో అని  అన్నాడు.

ఈ అస్త్రాలు దేనికి ఉపయోగపడతాయో ఇప్పుడు తెలుసుకుందాం  

చక్రం  

చక్రం అంటే పైన చెప్పుకున్నాం కదా దండ చక్రము ధర్మచక్రము కాలచక్రమూ విష్ణుచక్రం.  చక్రం ఎలా ఉంటుందంటే 4.7 అంగుళాల నుంచి  12 అంగుళాల వ్యాసం కలిగి వృత్తాకార ఆయుధం ఈ ఆయుధాన్ని చూపుడు వేలుతో తిప్పడం  ద్వారా శత్రువుపై ఉపయోగిస్తారు.

ఇంద్రాస్త్రం  

ఇది ఆకాశాన్నుంచి బాణాల వర్షం కురుస్తోంది  

వజ్రాస్త్రం   

ఇది లక్ష్యాన్ని మెరుపులతో తిరిగి పుడుతుంది  

బ్రహ్మ శిరోనామకాస్త్రం  

ఈ బాణానికి బ్రహ్మయొక్క నాలుగు తలలూ ఒక చివర ఇంకో చివర అయిదువ తల ఉంటుంది ఇది మామూలు బ్రహ్మాస్త్రానికి నాలుగు వంతుల శక్తి ఎక్కువ కలిగి ఉంటుంది ఇది ప్రపంచాన్ని నాశనం చెయ్యగల ఒక ఆయుధం.

బ్రహ్మాస్త్రం

 బ్రహ్మాస్త్రం వలన ఇది లక్ష్యాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది.ఇది ఒకేసారి చాలా రాజ్యాలు కూడా నాశనం చేస్తుంది.

గధలు  

ఇది బంతి ఆకారాన్ని కలిగి ఉంటుంది భూమిని దాని అక్షము తిరిగే లాగా సూచిస్తుంది. దీనికి గొప్పశక్తి కలదు ఇది శౌర్యము, ధైర్యం మరియు బలానికి చిహ్నము 

వరుణాస్త్రం 

ఇది ఆగ్నేయాస్త్రం నుంచి కాపాడుకోవటానికి దీనిని ఉపయోగిస్తారు. ఇది నీటి ఆయుధం  వరుణుడు కలిగివున్న నీటి ఆయుధం కాబట్టి   నీటితో సహా ఏ రూపాన్నైనా చేసుకోగలదు.

నారాయణాస్త్రం 

ఇది లక్షలాది బాణాలను విసిరివేస్తుంది. 

నందనం  

దీనినే నందన లేదా నందకి అని కూడా అంటారు ఇది విష్ణువు యొక్క కత్తి.

విశ్వామిత్రుడు  మంత్రములను చదువుతూ ఒకటి వెంట ఒకటి అస్త్రము రామునికి ఇస్తూ ఉంటే ఆ ఆ అస్త్రానికి ఆదిదేవతలు వచ్చి రామును ముందు నిలబడి రామా ఇకనుండి మేము నీ సేవకులం అని పలికారు. రాముడు ఆ అస్త్రాలను చేతితో తాకి ఇప్పటికీ మీరంతా నా మనసులో చేరి  ఉండండి అని చెప్పాడు. తరువాత రాముడు విశ్వామిత్రుడు నుంచి అస్త్రాలను ఉపసంహరించే మంత్రాలను కూడా అడిగి తెలుసుకున్నాడు.

ఉపసంహరించటం అంటే అస్త్రాలను ఒకసారి వదిలిన తర్వాత అది తన లక్ష్యాన్ని ఢీ కొట్టకముందే  వెనక్కి తీసుకోవటం. అంతేకాకుండా ఈ అస్త్రాన్ని కాకుండా పూర్వం భృశాశునిచేసృష్టించబడిన వస్త్రములను అన్నీ అన్నీ రాముడికి చెప్పాడు.

ఆ అస్త్రాల పేర్లు ఏమిటంటే సత్యవంతము, సత్యకీర్తి, ధృష్టము, రభసము, ప్రతీహారతరము, పరాజుముఖం, అవాజుముఖం, లక్షాక్షము, విషమము, దృఢనాభము, మహానాభము, దుందునాభము, సునాభము, జ్యోతిషము, కృశనము, నైరాశ్యము, విమలము, యోగంధరము, హరిద్రము,దైత్యము, ప్రశమనము, సార్చిర్మాలి, ధృతి, మాలి, వృత్తిమంతము, రుచిరము, పితృసౌమనసము, విధూతము, మకరము, కరవీరకరము, ధనము, ధ్యానము, కామరూపము, కామరుచి, మోహము, ఆవరణము, జృంభకము, సర్వానాభము, సంతానము, వరణము.

వీటి పేర్లు చూస్తుంటే ఇవి మానవులు లక్షణములు ఉదాహరణకు మోహము, రుచిరము, విమలము.ఇంకా మానవులకు ఉన్న సంపదలు ఉదాహరణకు సంతానము,అలాగే కొన్ని శాస్త్రములు, ఉదాహరణకు జ్యోతిష్యము.

ఇలాగా అస్త్రములు అంటే కేవలం ఆయుధములు అంటే  కాదు శాస్త్రములు,లక్షణములు వాటి ఉపయోగం అని అర్థం అవుతుంది కదా.

ఇలా రాముడు అన్ని అస్త్రాలు తీసుకున్నాక వారు అక్కడినుంచి బయలుదేరుతారు.అలా వెళుతూ ఉండగా వారికి ఒక అందమైన వనం కనిపిస్తుంది రాముడు ఆ వనాన్ని చూసి  స్వామి ఈ వనం చూస్తే చాలా సంతోషంగా ఉన్నది ఇది ఒక ఆశ్రమం లాగా కూడా ఉన్నది అని ఆ  కథేమిటో చెప్పమని విశ్వామిత్రుని అడిగాడు.



←Prev                                                                                                                                                                                            Next→

Comments

Popular posts from this blog

Dasarathudu Ayodhyaku Cheratam || దశరథుడు అయోధ్యకు చేరటం || Episode 34 || Ramayanam

Ramayanam || Shiva Dhanassu

Goppa Thyagam || గొప్ప త్యాగం || Moral Stories || నీతి కథలు