Posts

Showing posts from January, 2025

ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ || Prema Kosam Rajasabha Varaku Vachhina Alamkaravathi Katha || Episode - 14 || Bhatti Vikramarka Kathalu

Image
  ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ అలంకారవతి చంద్రవర్మను వెంటబెట్టుకొని రాజసభకు వెళ్ళింది. రాజుకు నమస్కరించి అక్కడ నిలబడింది. చంద్రవర్మ ఆ రాజును ఆశీర్వదించాడు. అందగాడైన చంద్రవర్మ గొప్ప తేజస్సుతో, మన్మథుడిలా ప్రకాశిస్తూ ఉండటం చూసి, ఆ పట్టణ ప్రభువైన మహేంద్రవర్మ ఆశ్చర్యపోయాడు. రాజు వారిని కూర్చోమని చెప్పి, వేశ్య కూతురైన అలంకారవతిని చూసి ఇలా అడిగాడు: "ఓ అందగత్తె! నువ్వు ఎవరివి? ఈ నగరంలోనే ఉంటావా? నిన్ను నేనెప్పుడూ చూడలేదే! ఈ బ్రాహ్మణోత్తముడు ఎవరు? ఇతడిని ఇప్పుడు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? మీరు వచ్చిన కారణం ఏంటో వివరించు." అందుకు అలంకారవతి రాజుతో ఇలా అంది: "మహాప్రభూ! నేను ఈ నగరంలోనే పేరుపొందిన ఒక వేశ్య కుమార్తెను. నా పేరు అలంకారవతి. నేను ఒక వ్రతాన్ని నియమంగా పెట్టుకుని, మా వేశ్య కుల మర్యాద అయిన వ్యభిచార వృత్తిని వదిలేశాను. బయటి ప్రపంచానికి కూడా తెలియకుండా ఇప్పటివరకు ఇంట్లోనే కాలం గడిపాను. అందుకే మీరు నన్ను చూసే అవకాశం రాలేదు." ఆ తర్వాత ఆమె తన వ్రతం వివరాలను, ఆ బ్రాహ్మణుడు తన ఇంటికి రావడం, అతడిని చూసి తాను మోహించి, నిద్ర లేపడానికి పడిన తాపత్రయాన్ని, తన మనసులోన...

Seetharamula Upavasa Deeksha || సీతారాముల ఉపవాస దీక్ష || Ramayanam || Episode 39

Image
                                                                 సీతారాముల ఉపవాసదీక్ష తన దగ్గరనుండి రాముడు వెళ్లి పోయిన తరువాత దశరథుడు తన పురోహితుడు వసిష్టుని పిలిపించాడు. ఆయనతో ఇలా  అన్నాడు: “ఓ వసిష్ట మహామునీ! రేపే రామునికి యువరాజ్య వట్టాభిషేకము నిశ్చయించాము కదా. అందుకని మీరు రాముని  మందిరమునకు వెళ్లి, రాజ్యము, యశస్సు, సంపదలు కలిగేటట్లు రామునితో, సీతతో ఈ రోజు ఉపవాసవ్రతము చేయించండి.” అని  అన్నాడు. దశరథుని ఆదేశానుసారము వసిష్టుడు రాముని మందిరమునకు వెళ్లాడు. తన మందిరమునకు వచ్చిన వసిష్టునికి రాముడు ఎదురు వచ్చి, స్వాగత సత్కారములు చేసాడు. ఉచితాసనము మీద కూర్చో పెట్టాడు. అప్పుడు వసిష్టుడు రామునితో ఇలా అన్నాడు. “రామా! రేపు ఉదయము నీకు యువరాజ్య పట్టాభిషేకము చేయవలెనని నీ తండ్రి దశరథుడు సంకల్పించాడు. ఆ సందర్భంలో నీవు ఈ రోజు రాత్రి నీ భార్య సీతతో సహా ఉపవాస వ్రతము చేయాలి” అని అన్నాడు. రాముడు సరే అన్నాడు. వసిష్టుడు రామునితో స...

అలంకారవతి చంద్రవర్ణుడిని పెళ్లాడమని ప్రార్థించుట || Alamkaaravathi Chandravarnudini Pelladamani Prarthinchuta || Episode 13 || Bhatti Vikramarka Kathalu

Image
  అలంకారవతి చంద్రవర్ణుడిని పెళ్లాడమని ప్రార్థించుట   నిన్ను మేలుకొలిపి నా కోరిక మీకు తెలియజేయాలి అని అనుకోని నీకు మెలకువ కలిగించడం కోసం నేను పడిన కష్టం ఇంతింత కాదు. దేవుని కృపవలన నీతో మాట్లాడే భాగ్యం నాకు కలిగింది. ఇప్పుడేమీ మించిపోలేదు, నువ్వు కూడా అవివాహితుడివి, నేను అలాంటి దానిని వేశ్య గర్భంలో జన్మించిన నా ఆలోచన వేరు. పడుపు వృత్తి చేయడానికి నా మనసు ఎప్పుడూ ఒప్పుకోలేదు, భగవంతుడి సాక్షిగా ఈ క్షణం వరకు నామీద ఎలాంటి కళంకం కలగదని ప్రమాణ పూర్వకంగా చెపుతున్నాను. నేను ఒక ఉత్తమునికి భార్యనై సుఖపడడానికి నిర్ణయించుకున్నాను. నా పూర్వకృత పుణ్యం మంచిది అవడం వలన ఉత్తమ కులంలో జన్మించిన నీవు నా పతి అవడం జరుగుతుంది. నేను నిన్ను వరించి మానసికంగా నీకు భార్యను అయ్యాను.  పదిమందికి తెలిసేలాగా నన్ను పెళ్లాడి నా తోడుతో ఇష్ట సుఖాలను అనుభవించండి. మహా మొహంతో వలచి వేడుకుంటున్న ఈ ప్రార్థనను నిరాకరించకుండా అంగీకరించండి అని వినయంతో పలికింది. ఆ ప్రకారం ఆ కన్య చెప్పిన మాటల విని రెండు చేతులతో తన రెండు చెవులు మూసుకుని చంద్రవర్ణుడు హరిహరీ! ఇదేమి కోరిక?  ఇవి ఏమి మాటలు? నేనెవరిని? నువ్వు ఎవరు? బ్రాహ్మణ...

మనిషి బుద్ధిగల చిలుక || Manishi Buddhigala Chilaka || Tenali Ramakrishna Stories || తెనాలి రామకృష్ణ కథలు || Episode - 9

Image
మనిషి బుద్ధిగల చిలుక "ప్రభూ! రామలింగకవి వద్ద మాట్లాడే రామచిలుకకు తెలియని శాస్త్రమే లేదంటే అతిశయోక్తి కాదేమో ! ఆ పిట్ట ఆ కవికి ఎవరో మహనీయుడు ఇవ్వగా లభించిందట. అట్టి పక్షిని అతను కేవలం పండ్లు పెట్టి పెంచగలడు. అదే మనమందిరంలో ఉంటే ఎలా ఉంటుంది? బంగారు పంజరంలో తియ్యని పండ్లు, అడవి తేనె, సామాన్యులకు దొరకని అరుదైన కాయధాన్యాలు ఆ పక్షికి పెట్టి సాకగలం. దానికి మరింత మేథస్సు పెరగగలదు" అని పట్టపురాణి రాయలవారి దృష్టికి తీసుకువెళ్లింది. ఎలాగైనా ఆ రామచిలుకను తను పెంచాలనే కోరికతో ఓ రాత్రి తన మందిరంలో రాయలవారిని కోరింది. "మహారాణీ ! ఆ కవి వద్దనున్న చిలుక ఎందుకు? అంతకంటే మరింత అందమైనవి తెప్పించి ఈ మందిరం నింపగలను. ఆ కవి ఒకరకంగా తిక్కమనిషి :ఏమాత్రం భయపడకుండా ఇవ్వనని మొండికేసిన మనమేమి చేయలేం" అని మహారాణికి నచ్చజెప్పచూసాడు రాయలు. “మన్నించండి మహారాజా! ఆ చిలుక పలు శాస్త్రములను వల్లెవేసినది అని విన్నప్పటినుంచి దానిని పెంచవలెనని దానితో సరదాగా గడపాలని ఆశ పడ్తున్నాను. నా ఈ చిన్నికోరిక తీర్చండి" అని వేడుకుంది పట్టపురాణి. రాయలు ఆలోచించి చివరికి పట్టపురాణి చిరు కోరిక కాదనలేక సరేనని మరుసటి ...