Posts

Showing posts from May, 2024

ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ || Prema Kosam Rajasabha Varaku Vachhina Alamkaravathi Katha || Episode - 14 || Bhatti Vikramarka Kathalu

Image
  ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ అలంకారవతి చంద్రవర్మను వెంటబెట్టుకొని రాజసభకు వెళ్ళింది. రాజుకు నమస్కరించి అక్కడ నిలబడింది. చంద్రవర్మ ఆ రాజును ఆశీర్వదించాడు. అందగాడైన చంద్రవర్మ గొప్ప తేజస్సుతో, మన్మథుడిలా ప్రకాశిస్తూ ఉండటం చూసి, ఆ పట్టణ ప్రభువైన మహేంద్రవర్మ ఆశ్చర్యపోయాడు. రాజు వారిని కూర్చోమని చెప్పి, వేశ్య కూతురైన అలంకారవతిని చూసి ఇలా అడిగాడు: "ఓ అందగత్తె! నువ్వు ఎవరివి? ఈ నగరంలోనే ఉంటావా? నిన్ను నేనెప్పుడూ చూడలేదే! ఈ బ్రాహ్మణోత్తముడు ఎవరు? ఇతడిని ఇప్పుడు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? మీరు వచ్చిన కారణం ఏంటో వివరించు." అందుకు అలంకారవతి రాజుతో ఇలా అంది: "మహాప్రభూ! నేను ఈ నగరంలోనే పేరుపొందిన ఒక వేశ్య కుమార్తెను. నా పేరు అలంకారవతి. నేను ఒక వ్రతాన్ని నియమంగా పెట్టుకుని, మా వేశ్య కుల మర్యాద అయిన వ్యభిచార వృత్తిని వదిలేశాను. బయటి ప్రపంచానికి కూడా తెలియకుండా ఇప్పటివరకు ఇంట్లోనే కాలం గడిపాను. అందుకే మీరు నన్ను చూసే అవకాశం రాలేదు." ఆ తర్వాత ఆమె తన వ్రతం వివరాలను, ఆ బ్రాహ్మణుడు తన ఇంటికి రావడం, అతడిని చూసి తాను మోహించి, నిద్ర లేపడానికి పడిన తాపత్రయాన్ని, తన మనసులోన...

శ్రీరాముని పట్టాభిషేకానికి సదస్యుల హర్షం || Sriramuni Pattabhishekaaniki Sadasyula Harsham || Ramayanam || Episode 36

Image
   శ్రీరాముని పట్టాభిషేకానికి సదస్యుల హర్షం ఆ సభలో దశరథుడు తన సభలో వారిని ఉద్దేశించి ఇలా అన్నాడు : మహాజనులారా! పూజ్యులారా! మా పూర్వీకులంతా ప్రజలను తమ సొంత బిడ్డల్లా చూసుకొని పరిపాలించారు. ఇక్ష్వాకుల రాజవంశంలో జన్మించిన నేను కూడా వారి దారినే అనుసరించాను. లోక కళ్యాణాన్నేవాంఛిస్తూ వచ్చాను. ఈ విధంగా కొన్ని వేల సంవత్సరాలు గడచిపోయాయి. ఫలితంగా నా శరీరమంతా పండి ఒడిలిపోయింది. ఇట్లాగే ఇంకా ఎక్కువ కాలం పరిపాలించలేను. నా శరీరం విశ్రాంతిని కోరుకుంటోంది. నా కుమారుడు రాముడు. దేవేంద్రునితో పోల్చదగిన పరాక్రమవంతుడు,శత్రుభయంకరుడు, సకల గుణాభిరాముడు. నా రాముడు కూడా నా పోలికలనే పుణికి పుచ్చుకున్నాడు. పుష్యమీ నక్షత్రంతో కూడిన చంద్రునిలా చల్లగా ప్రకాశిస్తూ ఉంటాడు. ధర్మసంరక్షకులలో శ్రేష్టుడు. అటువంటి రామునికి రాజ్యాభిషేకం చేయాలని అనుకుంటున్నాను. అతడు మూడు లోకాలనూ మెప్పించగల సమర్థుడూ, యోగ్యుడూ అని అనుకుంటున్నాను. నేనీ రాజ్యభారాన్ని రాముని భుజస్కంధాల మీద ఉంచినట్లయితే లోక అభివృద్ధి జరుగుతుంది. ఏ విధమైన కొరతా లేకుండా నేను విశ్రాంతి తీసుకోగలుగుతాను. ఈ విషయాన్ని అన్ని కోణాలనుంచీ బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసు...

నక్కతోక మహిమ || Nakka Thoka Mahima || Tenali Ramakrishna Stories || తెనాలి రామకృష్ణ కథలు || Episode 7 ||

Image
  నక్కతోక మహిమ ఒకరోజు శ్రీకృష్ణదేవరాయలు చాలా ఉల్లాసంగా ఉన్న వేళ కవులందరిని పిలిపించుకుని భువనవిజయం మందిరంలో సరదాగా గడప సాగాడు. తాను ఇటీవల రచించిన జాంబవతీ కళ్యాణం కావ్యం గురించి ప్రస్తావించాడు. ఈ కావ్యంలో తను జాంబవంతునిలో పరకాయప్రవేశం చేసి మరీ రచించాను అని ఒకవిధంగా గొప్పలకు పోయాడు. కవులందరూ ఉల్లాస భరితంగా వింటూ తెగ ఆనందపడిపోసాగారు. వారిని చూసి మరింత రాయలువారు ఎక్కువ మోతాదులో చెప్పుకుపోతుంటే....... రామలింగకవి చిరునవ్వు మోహముతో వినసాగాడు. ఆకావ్యం గురించి కవుల నుంచి పొగడ్తలు శృతి మించాయి. ఒకవిధంగా ఆకాసానికి ఎత్తేసారు. నాకు ఎంతో ఆనందాన్నిచ్చింది ఆకావ్యం. జాంబవంతుడు అడవిలో సంచరించే ఓ ఎలుగుబంటి. మానవబాష నేర్చుకున్న మహాజ్ఞాని, రామభక్తుడు. అతడికి మానుష్య రూపంలో గల ఓ అందాల అపరంజిబొమ్మ లాంటి కూతురు జాంబవతి. ఆమెకు ద్వారకాపురివాసి శ్రీకృష్ణుడుతో వివాహం జరిపించి ధన్యుడవుతాడు జాంబవంతుడు. ఈ కధనంలో జాంబ వంతుడు మానవభాష నేర్చుకున్నట్టు నేను ఎలుగుబాషను తెలుసుకుని మరీ రాసాను అని రాయలు సంతృప్తిగా నవ్వుతూ చెప్పి కొత్తగా వచ్చిన రామ లింగని వైపు చూసాడు. అతడు ఎలాంటి భావాలను వ్యక్తం చేయకుండా, తనముఖంలో కనిపించ...