Posts

Showing posts from July, 2023

ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ || Prema Kosam Rajasabha Varaku Vachhina Alamkaravathi Katha || Episode - 14 || Bhatti Vikramarka Kathalu

Image
  ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ అలంకారవతి చంద్రవర్మను వెంటబెట్టుకొని రాజసభకు వెళ్ళింది. రాజుకు నమస్కరించి అక్కడ నిలబడింది. చంద్రవర్మ ఆ రాజును ఆశీర్వదించాడు. అందగాడైన చంద్రవర్మ గొప్ప తేజస్సుతో, మన్మథుడిలా ప్రకాశిస్తూ ఉండటం చూసి, ఆ పట్టణ ప్రభువైన మహేంద్రవర్మ ఆశ్చర్యపోయాడు. రాజు వారిని కూర్చోమని చెప్పి, వేశ్య కూతురైన అలంకారవతిని చూసి ఇలా అడిగాడు: "ఓ అందగత్తె! నువ్వు ఎవరివి? ఈ నగరంలోనే ఉంటావా? నిన్ను నేనెప్పుడూ చూడలేదే! ఈ బ్రాహ్మణోత్తముడు ఎవరు? ఇతడిని ఇప్పుడు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? మీరు వచ్చిన కారణం ఏంటో వివరించు." అందుకు అలంకారవతి రాజుతో ఇలా అంది: "మహాప్రభూ! నేను ఈ నగరంలోనే పేరుపొందిన ఒక వేశ్య కుమార్తెను. నా పేరు అలంకారవతి. నేను ఒక వ్రతాన్ని నియమంగా పెట్టుకుని, మా వేశ్య కుల మర్యాద అయిన వ్యభిచార వృత్తిని వదిలేశాను. బయటి ప్రపంచానికి కూడా తెలియకుండా ఇప్పటివరకు ఇంట్లోనే కాలం గడిపాను. అందుకే మీరు నన్ను చూసే అవకాశం రాలేదు." ఆ తర్వాత ఆమె తన వ్రతం వివరాలను, ఆ బ్రాహ్మణుడు తన ఇంటికి రావడం, అతడిని చూసి తాను మోహించి, నిద్ర లేపడానికి పడిన తాపత్రయాన్ని, తన మనసులోన...

Ramayanam || Shiva Dhanassu

Image
  శివ ధనస్సు  పూర్వం దక్ష ప్రజాపతి శివుడికి హవిస్సులు ఇవ్వని యాగము ప్రారంభించాడు. శివుడులేని చోట మంగళం ఎలా ఉంటుందని దక్షుని కుమార్తె అయిన సతీదేవి (పార్వతీదేవి); యోగాగ్నిలో శరీరాన్ని వదిలింది. ఆగ్రహించిన శివుడు రుద్రుడయ్యాడు. అసలు ఇలాంటి యాగానికి దేవతలు ఎందుకు వెళ్ళారని ఆయన ధనుస్సు పట్టుకున్నాడు, వెంటనే దేవతలు ప్రార్థించగా ఆయన శాంతించాడు. ఆ ధనుస్సుని జనక మహారాజు వంశములో పుట్టిన దేవరాతుడు అనే రాజు దగ్గర న్యాసంగా (అంటే కొంతకాలం ఉంచారు) ఉంచారు. అప్పుడా దేవరాతుడు ఆ ధనుస్సుని ఒక మంజుషలో (పెద్ద పెట్టె) పెట్టాడు. చక్రాలున్నా ఆ మంజుషలో శివ ధనుస్సు ఉండగా తొయ్యాలంటే దాదాపు 5000 మంది కావాలి. అలా ఆ విదేహ వంశీయులు ఆ శివ ధనుస్సుని రోజు పూజిస్తూ, పరమ పవిత్రంగా చూసుకుంటూ ఉన్నారు. అలాగే నేను ఒకప్పుడు యజ్ఞము చేద్దామని భూమిని దున్నుతున్నాను. అలా దున్నుతున్నప్పుడు నాగటి చాలుకి తగిలి ఒక బాలిక తనంత తానుగా పైకి లేచింది. నాగటి చాలుకి తగిలి పైకి వచ్చింది కనుక, అలాగే భూమికి ఉన్నంత ఓర్పు ఉన్నది కనుక ఆమెని సీతా అని పిలిచాము (జనకుని కూతురు కనుక జానకి, మిథిలానగరంలో పుట్టింది కనుక మైథిలి, దేహం మీద భ్రాంతిలేన...

Moral Stories || Pavuram - Cheema || Neeti Kathalu || పావురం-చీమ

Image
  పావురం-చీమ ఒక రోజున అడవిలోని చిన్న చెరువులో ఒక చీమ పడిపోయింది.  పాపం! దానికి ఈతరాదు. ప్రాణాల్ని కాపాడుకోవాలని ఎంతో తాపత్రయపడుతోంది. ప్రక్కనే చెట్టుపై కూర్చొని ఉన్నా పావురానికి ఆ చీమ కన్పించింది. చీమ పరిస్థితిని చూసి దానికి జాలివేసింది. వెంటనే ఒక ఆకును త్రెంచి చీమకు దగ్గరగా. నీటిలో వేసింది. చీమ దాని పైకి ఎక్కి క్షేమంగా ఒడ్డుకు చేరుకుంది.  ఒక రోజున చీమ అక్కడి పచ్చగడ్డిలో తిరుగాడుతూ, చెట్టు పైన కూర్చొన్న పావురాన్ని చూచి దాన్ని పలకరిద్దాము అనుకొంటుంది. ఇంతలో, దగ్గరలోనే ఒక మనిషి తుపాకితో నిల్చుని ఉండడం చూసింది. అతడు పావురాన్ని చంపడానికి తుపాకి గురి పెడుతున్నాడు. చీమ, పావురాన్ని ఎలాగైనా రక్షించాలనుకొంది. అది వెంటనే వేటగాడి కాలుమీద పుటుక్కున కుట్టింది. ఆ బాధతో “అమ్మో!” అని అరచి, తుపాకిని ప్రక్కన పడేసి వేటగాడు తన కాలును చూచుకొన సాగాడు. వాడి అరుపుకు హడలిపోయిన పావురం ఎగిరిపోయింది. ఇలా చీమ, పావురాన్ని రక్షించి దానికి ప్రత్యుపకారం చేసింది. నీతి:- ఆపదలో ఆదుకొన్నవాడే నిజమైన మిత్రుడు ←Prev || Next →

Ramayanam || Brahmarshi Viswamitra

Image
బ్రహ్మర్షి విశ్వామిత్ర విశ్వామిత్రుడు తన ఆశ్రమానికి వెళ్ళి ఆలోచించాడు, నా శత్రువులు ఎక్కడో లేరు, నాలోనే ఉన్నారు. ఈ కోపము, కామము నాకు కలగడానికి నా మనస్సు కారణం, ఆ మనస్సు నా ఊపిరి మీద ఆధారపడి ఉంది. అందుకని ఊపిరిని తీసి బయటకి వదలను, కుంభకం (యోగాలో ఒక ప్రక్రియ) చేస్తాను. అలాగే ఈ శరీరానికి అప్పుడప్పుడు కోరికలు కలగడానికి కారణం నా శరీరానికి కొంచెం ధృడత్వం ఉండడం వలన, కనుక కుంభకం చేస్తే నా శరీరం ఒక పుల్లలా అవుతుంది అని తూర్పు దిక్కుకి వెళ్ళి బ్రహ్మాండమైన తపస్సు మొదలుపెట్టాడు. అలా వెయ్యి సంవత్సరములు కుంభకంలో ఉండి తపస్సు చేసేసరికి ఆయన శరీరం ఒక పుల్లంత సన్నగా అయ్యింది. తన శరీరాన్ని నిలబెట్టుకోడానికి కొంత కబళాన్ని తిందామని అనుకుంటుండగా ఇంద్రుడు ఒక బ్రాహ్మణ రూపంలొ వచ్చి,  అయ్యా! నాకు బాగా ఆకలిగా ఉంది, మీ దగ్గరున్నది నాకు కొంచెం పెడతారా అన్నాడు. వచ్చిన వాడు ఇంద్రుడని విశ్వామిత్రుడికి అర్ధమయ్యింది, కాని ఈ సారి ఆయన ఇంద్రియాలకి లొంగలేదు.  ఇంద్రుడు తింటే ఏంటి నేను తింటే ఏంటి అనుకొని ఇంద్రుడికి ఆ కబళాన్ని ఇచ్చి మళ్ళి కుంభకంలోకి వెళ్ళి తపస్సు చెయ్యడం ప్రారంభించాడు. అలా విశ్వామిత్రుడు తప...

Viswamithrudu Rambani Enduku Sapinchadu? || Ramayanam

Image
విశ్వామిత్రుడు రంభని ఎందుకు శపించాడు?   ఈసారి ఉత్తర దిక్కుకి వెళ్లి తపస్సు చేయడం ప్రారంభించాడు. ఉత్తర దిక్కున కౌశికి నది పక్కన కూర్చొని ఘోరాతి ఘోరమైన తపస్సు 1000 సంవత్సరాలు చేసాడు. 1000 సంవత్సరాలు తపస్సు చేశాక దేవతలతో కలిసి బ్రహ్మగారు ప్రత్యక్షమై, నేను నీ తపస్సుకి చాలా సంతోషించాను. ఇక నుండి అందరు నిన్ను మహర్షి అని పిలుస్తారు అని అన్నాడు. ఈ మాట విన్న విశ్వామిత్రుడికి బాధ కానీ సంతోషం కానీ కలగలేదు.  ఇన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తే ఇప్పటికి మహర్షిని అయ్యాను. ఇక బ్రహ్మర్షిని ఎప్పుడు అవుతానో అనుకొని బ్రహ్మదేవుడిని నేను నా ఇంద్రియాలను గెలిచానా అని అడిగాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, ఇప్పటికైతే నువ్వు ఇంకా నీ ఇంద్రియాలను గెలవలేదు. ఇంద్రియాలను గెలవడం అంత  అన్నాడు.  మెల్లగా విశ్వామిత్రుడి పగ వశిష్టుడి మీద నుండి తన ఇంద్రియాల మీదకి వెళ్ళింది. తను అనవసరంగా వశిష్టుడి మీద క్రోధాన్ని పెంచోకోవడానికి, మేనకతో కామానికి లొంగడానికి తన ఇంద్రియాలే కారణమని గ్రహించాడు. మళ్ళి ఘోరమైన తపస్సు చెయ్యడం ప్రారంభించాడు. ఈ సారి ఎండాకాలంలో తన చుట్టూ నాలుగు పక్కల అగ్నిని పెట్టుకొని, తల పైకెత్తి సూర్యుడి వం...