Posts

Showing posts from June, 2021

ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ || Prema Kosam Rajasabha Varaku Vachhina Alamkaravathi Katha || Episode - 14 || Bhatti Vikramarka Kathalu

Image
  ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ అలంకారవతి చంద్రవర్మను వెంటబెట్టుకొని రాజసభకు వెళ్ళింది. రాజుకు నమస్కరించి అక్కడ నిలబడింది. చంద్రవర్మ ఆ రాజును ఆశీర్వదించాడు. అందగాడైన చంద్రవర్మ గొప్ప తేజస్సుతో, మన్మథుడిలా ప్రకాశిస్తూ ఉండటం చూసి, ఆ పట్టణ ప్రభువైన మహేంద్రవర్మ ఆశ్చర్యపోయాడు. రాజు వారిని కూర్చోమని చెప్పి, వేశ్య కూతురైన అలంకారవతిని చూసి ఇలా అడిగాడు: "ఓ అందగత్తె! నువ్వు ఎవరివి? ఈ నగరంలోనే ఉంటావా? నిన్ను నేనెప్పుడూ చూడలేదే! ఈ బ్రాహ్మణోత్తముడు ఎవరు? ఇతడిని ఇప్పుడు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? మీరు వచ్చిన కారణం ఏంటో వివరించు." అందుకు అలంకారవతి రాజుతో ఇలా అంది: "మహాప్రభూ! నేను ఈ నగరంలోనే పేరుపొందిన ఒక వేశ్య కుమార్తెను. నా పేరు అలంకారవతి. నేను ఒక వ్రతాన్ని నియమంగా పెట్టుకుని, మా వేశ్య కుల మర్యాద అయిన వ్యభిచార వృత్తిని వదిలేశాను. బయటి ప్రపంచానికి కూడా తెలియకుండా ఇప్పటివరకు ఇంట్లోనే కాలం గడిపాను. అందుకే మీరు నన్ను చూసే అవకాశం రాలేదు." ఆ తర్వాత ఆమె తన వ్రతం వివరాలను, ఆ బ్రాహ్మణుడు తన ఇంటికి రావడం, అతడిని చూసి తాను మోహించి, నిద్ర లేపడానికి పడిన తాపత్రయాన్ని, తన మనసులోన...

Goutama Maharshi indrudiki, Ahalya ki Emani Saapalu Ichadu?

Image
గౌతమ మహర్షి ఇంద్రుడికి,అహల్యకి ఏమని శాపాలు ఇచ్చాడు? ఇప్పుడు మనం రామలక్ష్మణులు ఆశ్రమం గురించి విశ్వామిత్రుని అడుగుతారు కదా దాని గురించి తెలుసుకుందాం! విశ్వామిత్రుడు రామలక్ష్మణులకి ఇలా చెబుతాడు. ఇది గౌతమ మహర్షి ఆశ్రమం, ఆయన దర్శనం కోసం దేవతలు ఈ ఆశ్రమానికి వచ్చే వారు. ఆ గౌతముడు తన భార్య అయిన అహల్యతో కలిసి తాపసిగా ఇక్కడ నివసించేవాడు. అహల్య బ్రహ్మదేవుడి మానస పుత్రిక, అద్భుతమైన సౌందర్యం కలిగినది. ఇంద్రుడికి అహల్య మీద కోరిక వలన ఒకరోజు ఉదయాన్నే గౌతమ మహర్షి సంధ్యావందనం కోసం నది కి వెళ్ళిన సమయంలో,  గౌతమ మహర్షి వేషంలో ఇంద్రుడు ఆయన ఇంటిలోకి ప్రవేశించాడు. ఇంటిలోకి ప్రవేశించి అహల్యతో నేను నీ సంగమాన్ని కోరుకుంటున్నాను అని అన్నాడు. అహల్య కి  వచ్చింది గౌతముడు కాదని తెలుసు, ఇంద్రుడు అని కూడా తెలుసు. కానీ ఆమె కన్యగా ఉన్నప్పుడు ఇంద్రుడి మీద మనసులో కోరిక ఉంది, అందువలన ఇంద్రుడితో సంగమించింది. అహల్య తరువాత ఇంద్రుడితో ఇలా పలికింది, నేను నీతో సంగమించి చాలా ఆనందం పొందాను. నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో గౌతముడు నుండి నిన్ను నువ్వు రక్షించుకో అని చెప్పింది. ఇంద్రుడు ఒక నవ్వు నవ్వి నేను నేను చాలా ఆనందం పొందాన...

Indrudu diti Kadupuloni Pindanni enduku Khandinchadu?

Image
  ఇంద్రుడు దితి కడుపులోని పిండాన్ని ఎందుకు ఖండించాడు? ఇంతకు ముందు దితి కశ్యపుడిని ఇంద్రుడిని చంపగలిగే వాడిని కొడుకుగా ప్రసాదించమని వరం అడుగుతుంది కదా! అప్పుడు కశ్యపుడు ఏమన్నాడో ఇప్పుడు తెలుసుకుందాం! అప్పుడు కశ్యపుడు ఇప్పుడు నీవు కనక 1000 సంవత్సరాలు మానసికంగా కానీ, శారీరకంగా కానీ ఎలాంటి దోషం లేకుండా తపస్సు చేయగలిగితే నీకు ఈ లోకాన్ని శాసించగల, అలాగే ఇంద్రుని సంహరించగలదు కొడుకు పుడతాడు అని కశ్యపుడు చెప్పి దితిని ఆశీర్వదించి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతాడు. దితి సరే అని శుక్ల పవనం అనే ప్రదేశానికి వెళ్లి తపస్సు చేడం ప్రారంభించింది. అలా తపస్సు చేసుకుంటున్న దితి దగ్గరికి ఇంద్రుడు వచ్చి నేను నీకు సేవ చేస్తాను అని అన్నాడు, దితి సరే అనడంతో ఇంద్రుడు కావాల్సినవన్నీ, అలాగే అన్ని రకాల సేవలు చేసేవాడు. ఆమె అలసిపోతే పాదాలు పట్టే వాడు, అలా 990 సంవత్సరాలు పూర్తయ్యాయి. దేవేంద్రుడు చేసిన సేవలకు సంతోషించిన దితి, ఓ  దేవేంద్ర!  నేను పరాక్రమవంతుడైన కొడుకు కోసం నీ తండ్రిని వరం అడిగాను. 1000 సంవత్సరాల తరువాత నాకు కుమారుడు కలుగుతాడు అని కశ్యపుడు వరమిచ్చాడు, ఇంకో పది సంవత్సరాలలో నీకు సోదరుడు ప...

Ksheera sagara Madhanam enduku jarigindi?

Image
  క్షీరసాగర మధనం ఎందుకు జరిగింది? గంగావతరణం గురించి తెలుసుకున్నాక తర్వాతి రోజు వారు ఒక నగరానికి వెళ్తారు, ఆ నగరం గురించి చెప్పమని రామలక్ష్మణులు విశ్వామిత్రుని అడుగుతారు అప్పుడు విశ్వామిత్రుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు:  పూర్వం కృతయుగం(సత్యయుగం)లో కశ్యప ప్రజాపతి ఇరువురి భార్యలైన  అదితి మరియు దితి వారి పుత్రులు అయినా దేవతలు, రాక్షసులు ఎంతో సఖ్యతగా కలిసిమెలిసి జీవించేవారు. అలా కొంత కాలం అయ్యాక వారికి శాశ్వతంగా జీవించాలి అని కోరిక పుట్టింది దానితో వారు క్షీర సాగరాన్ని మధిస్తే అమృతం వస్తుంది. దానితో మనకు ఆకలి ఉండదు, వృద్ధాప్యం ఉండదు అని క్షీరసాగరాన్ని మధించాలి అని నిర్ణయించుకున్నారు.  దానికోసం మంధర పర్వతాన్ని  పెకళించి తీసుకువచ్చి క్షీరసాగరం లో పడివేశారు. వాసుకిని తాడుగా ఆ పర్వతానికి చుట్టారు. మందర పర్వతం కవ్వముగా, వాసుకి తాడుగా క్షీరసాగరాన్ని చిలక సాగారు. అలా చిలుకుతుండగా 1000 సంవత్సరాలు తరువాత అందులోనుంచి ముందుగా హాలాహలం పుట్టింది. దానితో ఆ హాలాహలం రాక్షసులని, దేవతలను, మనుషులను అలాగే లోకం మొత్తం నాశనం అవ్వడం మొదలయింది. అప్పుడు దేవతలంతా రక్షించమని మహేశ్వరుని ప్రార్థ...

Bhagirathudu Gangani Bhumi Medaku Ela tesukuvachhadu?

Image
  భగీరథుడు గంగని భూమి మీదకు ఎలా తీసుకు వచ్చాడు? గరుత్మంతుడు ప్రత్యక్షమవుతాడు అని చెప్పాను కదా! గరుక్మంతుడు ప్రత్యక్షమయ్యాక అంశుమంతుడి తో ఇలా అంటాడు, ఈ భూమిలోని ఏ జలంతో జల తర్పణ చేసిన నీ పినతండ్రులు స్వర్గానికి వెళ్ళరు, వారు స్వర్గానికి వెళ్లాలి అంటే నీవు స్వర్గంలో ఉండే గంగా జలముతో ఆ భస్మాన్ని తడపాలి అని అలాగే దానికోసం ప్రయత్నించు అని  చెబుతాడు. తరువాత అంశుమంతుడు యాగాశ్వాన్ని తీసుకెళ్ళి యాగం పూర్తి చేశాడు. తన 60 వేల కొడుకులు భస్మం అయ్యారు అని తెలుసుకొని సగరుడు చాలా బాధపడ్డాడు. తరువాత కొన్ని సంవత్సరాలు సగరుడు రాజ్యపాలన చేసి తన శరీరాన్ని వదిలాడు.  తరువాత సగరుడి మనుమడైన అంశుమంతుడు రాజ్యపాలన చేశాడు, ఆయన 32 వేల సంవత్సరాలు తపస్సు చేసి తపస్సు లోనే శరీరాన్ని వదిలి వేసాడు. తరువాత అంసుమంతుడి కుమారుడైన దిలీపుడు రాజ్యపాలన చేశాడు. అతడు గంగను భూమి మీదకు తీసుకు రాలేకపోయాడు, తరువాత   దిలీపుడి కుమారుడైనా భగీరథుడు రాజ్యాన్ని మంత్రులకు అప్పచెప్పి గోకర్ణ క్షేత్రంలో వెయ్యి సంవత్సరాలు తపస్సు చేయగా, ఆయనకు బ్రహ్మదేవుడు దర్శనమిచ్చాడు. అప్పుడు భగీరథుడు నాకు సంతానం లేదు కాబట్టి మా వంశ...

Kapila Maharshi enduku sagaraputrulanu bhasmam chesadu?

Image
 కపిలమహర్షి ఎందుకు సగరపుత్రులను భస్మం చేసాడు? విశ్వామిత్రుడు కుమారస్వామి జననం గురించి చెప్పాక రామలక్ష్మణులకి గంగావతరణ కథ చెబుతాడు, ఆ గంగావతరణ కథ చెబుతాను తెలుసుకోండి! ఈ కథను మనం చిన్నప్పుడు చదివిన కథే అండి అదేనండి భగీరథుడు తపస్సు చేసి గంగాదేవిని భూమి మీదకు తీసుకు వస్తాడు కదా అదే కదా అని వివరంగా చెప్తాను: సగరుడు అయోధ్య నగరాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు, అతనికి ఇద్దరు భార్యలు వారి పేర్లు కేశిని, సుమతి. సుమతి గరుక్మంతుడు సోదరి, సగరుడు తనకు పిల్లలు కలగడం కోసం తన ఇద్దరు  భార్యలతో కలిసి హిమాలయాల్లో ఉన్నా భృగు శ్రవణం దగ్గరకు వెళ్లి వంద సంవత్సరాలు తపస్సు చేశాడు, వారి తపస్సుకు సంతోషించి భృగు మహర్షి సగరుడితో ఇలా అన్నాడు: నీకు ఉన్న ఇద్దరి భార్యలలో ఒకరికి ఒక కుమారుడు, ఇంకొకరికి అరవై వేల కుమారులు పుడతారు అని వరమిస్తాడు. అది విన్న కేశిని, సుమతి ఎవరికి ఎవరు అని మహర్షిని అడిగితే అది మీ ఇద్దరూ కోరుకున్నట్లుగా జరుగుతుంది అని చెబుతాడు.  అప్పుడు పెద్ద భార్యైనా కేశిని తనకు వంశోద్ధారకుడు అయినా కొడుకు కావాలి అని అడిగింది, రెండవ భార్య 60 వేల కుమారులు కావాలి అని అడిగింది, దానికి భృగుమహర్షి సరే అన్నాడ...