Posts

Showing posts from August, 2024

ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ || Prema Kosam Rajasabha Varaku Vachhina Alamkaravathi Katha || Episode - 14 || Bhatti Vikramarka Kathalu

Image
  ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ అలంకారవతి చంద్రవర్మను వెంటబెట్టుకొని రాజసభకు వెళ్ళింది. రాజుకు నమస్కరించి అక్కడ నిలబడింది. చంద్రవర్మ ఆ రాజును ఆశీర్వదించాడు. అందగాడైన చంద్రవర్మ గొప్ప తేజస్సుతో, మన్మథుడిలా ప్రకాశిస్తూ ఉండటం చూసి, ఆ పట్టణ ప్రభువైన మహేంద్రవర్మ ఆశ్చర్యపోయాడు. రాజు వారిని కూర్చోమని చెప్పి, వేశ్య కూతురైన అలంకారవతిని చూసి ఇలా అడిగాడు: "ఓ అందగత్తె! నువ్వు ఎవరివి? ఈ నగరంలోనే ఉంటావా? నిన్ను నేనెప్పుడూ చూడలేదే! ఈ బ్రాహ్మణోత్తముడు ఎవరు? ఇతడిని ఇప్పుడు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? మీరు వచ్చిన కారణం ఏంటో వివరించు." అందుకు అలంకారవతి రాజుతో ఇలా అంది: "మహాప్రభూ! నేను ఈ నగరంలోనే పేరుపొందిన ఒక వేశ్య కుమార్తెను. నా పేరు అలంకారవతి. నేను ఒక వ్రతాన్ని నియమంగా పెట్టుకుని, మా వేశ్య కుల మర్యాద అయిన వ్యభిచార వృత్తిని వదిలేశాను. బయటి ప్రపంచానికి కూడా తెలియకుండా ఇప్పటివరకు ఇంట్లోనే కాలం గడిపాను. అందుకే మీరు నన్ను చూసే అవకాశం రాలేదు." ఆ తర్వాత ఆమె తన వ్రతం వివరాలను, ఆ బ్రాహ్మణుడు తన ఇంటికి రావడం, అతడిని చూసి తాను మోహించి, నిద్ర లేపడానికి పడిన తాపత్రయాన్ని, తన మనసులోన...

అలంకారవతి చంద్రవర్ణుడికి సేవలు చేయడం || Alamkaravathi Chandravarnudiki Sevalu Cheyadam || Episode 12 || Bhatti Vikramarka Kathalu

  అలంకారవతి చంద్రవర్ణుడికి సేవలు చేయడం ప్రతిరోజు రోజుకు 4 లేక 5 సార్లు అన్న మిశ్రమాన్ని అలంకారవతి చంద్రవర్ణుడికి శరీరానికి పట్టించి పరిచారికలతో బాగా రుద్దిస్తూ ఉండేది. ఈ విధంగా పది రోజులు గడిచిన తర్వాత అన్నరసం రోమ రంధ్రాల నుండి శరీరం లోపలికి ప్రవేశించడం వలన చంద్రవర్ణుడికి అలసట తీరి అటు ఇటు తిరిగి మెల్లగా కన్నులు తెరిచి చూసి తను అక్కడికి రావడం, అరుగు మీద పడుకోవడం అన్ని జ్ఞాపకం వచ్చి లేచి కూర్చున్నాడు. అప్పుడు జగన్మోహిని దేవతలాగా తనకు దగ్గర ఉండి సేవలు చేస్తున్న వేశ్యను చూసి తన అందానికి ఆశ్చర్యపోయి ఇలా తన మనసులో తను ఇలా అనుకున్నాడు: ఆహా! స్వర్గం నుండి దిగివచ్చిన ఇంద్రాణినా? లేక మదనుడు విడిచిపెట్టిన రతి దేవి అయి ఉంటుందా? ఈ అందమైన స్త్రీ ఎవరయి ఉంటారు? పరాయి వారికి ఇలాంటి అందము, మంచి లక్షణాలు ఉంటాయా? అరెరే! రూపాన అధికులని చెప్పబడిన ఎక్కడా కూడా మచ్చ లేనటువంటి వారు ఇలా ఉంటారని తెలియదు. నేను ఈ మందిరానికి వచ్చినప్పుడు ఈ అలివేణిని చూడనే లేదు. ఎక్కడ నుంచి వచ్చిందో నా మీద ఏదో భక్తి ఉన్నట్టు ఈ రకంగా సేవలు చేస్తుంది. తను ఇలా సేవలు చేయడానికి ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది, అది ఏమిటో తననే అడిగి తెలుసుకో...

శ్రీరాముని రాజ్యాభిషేకానికి ఏర్పాట్లు || Sriramuni Rajyabhishekaniki Yerpatlu || Ramayanam || Episode 37

Image
  యువ రాజ్యాభిషేకానికి ఏర్పాట్లు సభలో చెప్పిన మాటలకు దశరథుడు చాలా సంతోషించి ఇలా అన్నాడు : రాజులారా! పట్టణ, గ్రామాధ్యక్షులారా! రాముణ్ణి గూర్చి మీరు పలికిన మాటలన్నీ యథార్థాలే! నాకు కూడా ఇష్టుడైన నా పెద్ద కుమారుడు రాముడి యువరాజ్యాభిషేకానికి ఏర్పాట్లు చేస్తాను. వసిష్ట మహర్షీ! మహర్షులారా! పూజ్యులైన బ్రాహ్మణోత్తములారా! చెట్లు, వనాలు చిగురించే చైత్రమాసంలో రాజ్యాభిషేకానికి ఏర్పాట్లు చేయించండి. వసిష్ట మహర్షీ! పూజ్యుడా! రాముని యువరాజ్యాభిషేకానికి కావలసిన ఏర్పాట్లన్నీ మీరే స్వయంగా చూడండి. అప్పుడు వసిష్టుడు ఇలా పలికాడు: ఓ మంత్రులారా! బ్రాహ్మణులారా! అధికారులారా! 'ఐంగారం, రత్నాలు, అన్ని రకాలైన ధాన్యాలు, నూతన వస్త్రాలు, తేనె, నెయ్యి, పేలాలు, రథాలు, ఆయుధాలు, చతురంగ బలాలను సిద్ధం చేయండి. పట్టపుటేనుగుకు తెల్లని వస్టాలు ధరింపజేయండి; తెల్లని గొడుగును, బంగారు కలశాలను, మేలుజాతి ఎడ్ల కొమ్ములకు బంగారు తాపడలు ధరింపజేసి రాజుగారి యాగశాలకు చేర్చండి. ఏ ఒక్క చిన్న వస్తువు కూడా మరువకుండా అక్కడ సమకూర్చండి. అధికారులారా! నగర ద్వారాలన్నీ చందనపు నీటితో కడగండి. పుష్పమాలలతో అలంకరించండి. కమ్మటి సువాసనలు వెదజల్లే ధూపాలను...

నక్కతోక మహిమ || Nakka Thoka Mahima || Tenali Ramakrishna Stories || తెనాలి రామకృష్ణ కథలు || Episode 8 ||

Image
  నక్కతోక మహిమ "ఎలుగుబంటి మాఁవా, నేను వచ్చింది నీ సాయం కోరడానికి, నీవన్నట్టు నీవు తొక్కిన నక్కతోక మహిమో ఏమో నాకు తెలియదు. ఈ క్షణం నుండి నీవు ఈ కాకుల దూరని కారడవికి కొన్నాళ్లు రాజువు. నేను నా సుపుత్రుని పెళ్లి పని మీద పొరుగు అడవికి వెళ్తున్నాను.”అని కిరీటం ఎలుగుబంటి నెత్తిపై పెట్టి వెళ్లిపోయింది....... ఎలుగుబంటి చిరకాల కోరిక తీరినందుకు అది చాలా ఆనందించింది. పొదలో నక్కిదాక్కున్న నక్క బయటికి వచ్చి “ఏటీ విడ్డూరం నా తోక తొక్కిన ఆ వెర్రి బాపడికి ధనం. రేపో మాపో కాటికి పోయే ఎలుగుబంటికి కిరీటం దక్కాయి. నాకేటి లేదా ?నా  తోక పచ్చి పుండు కావడమేనా ? ఇంక ఎవరికి నా తోక దొరకనీయను." అని ఓ పెద్ద ఎలుకబొరియలోకి తోక పెట్టుకుని శోకాలు తీయసాగింది. పాపం నక్క దురదృష్టం ఆ బొరియలో ఆకలిగొన్న పందికొక్కు అందమైన నక్క తోకను మొదల్లో పుటుక్కున కొరికేసి ఆరగించేసింది. “చచ్చాను దేవుడోయ్ పాడు పందికొక్కు నా తోకను తినేసింది " అంటూ నేలపై గింగరాలు కొట్టి ఏడ్చింది. అడవికి కొత్తరాజు ఎలుగుబంటి నవ్వి "చచ్చిన పీనుగులను తిని బతికే నీలాంటి వాడికి ఆ దేవుడు అదృష్టమైన తోక ఇచ్చాడు. పరోపకారం లేశమైనా లేని నీకు తగిన శాస్...

అలంకారవతి చంద్రవర్ణుడిని మోహించుట || Alamkaravathi Chandravarnudini Mohinchuta || Episode 11 || Bhatti Vikramarka Kathalu

Image
  అలంకారవతి  చంద్రవర్ణుడిని మోహించుట  అలంకారవతి చంద్రవర్ణుడిని మేలుకొలిపి అతని వృత్తాంతం ఏమిటో తెలుసుకోవాలని అనుకుంది. అతనిని చూసిన మొదలు దృఢంగా ఉన్న నా చిత్తం ఇతని యందు లగ్నమై అధికమైన ఇష్టం కలుగుతుంది. సుందరాంగుడైన ఇతనితో సంభాషించకపోతే నేను ఇంకా ఒక్క క్షణము కూడా  నా తనువు నిలవదని అనుకోని, మిక్కిలి మొహంతో అతనిని మేలుకొల్పడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నించింది,  కానీ ఎలాంటి ప్రయోజనం లేదు.ఆరు నెలల నుంచి నిద్ర లేకపోవడం వలన ఆ విప్రుడికి అలంకారవతి నిద్రలేపడానికి చేసిన పనులు ఒక్కటి కూడా తెలియవు. ఆ బ్రాహ్మణుడిని ఎంత పిలిచిన, అతనిని అటూ ఇటూ కదిలించిన, ఏమి చేసినా కానీ అతడు లేవకపోవడం చూసి అలంకారవతి ఇదేమి మాయా? ఇలాంటి నిద్ర కూడా ఉంటుందా? ఇతడు నిజంగా బ్రతికే ఉన్నాడా? ప్రాణాలు ఉంటే ఏమి చేసినా ఎంత పిలిచినా కానీ లేవకుండా ఉండడానికి గల కారణమేమిటి? అయ్యో! ఇంకా నేనేం చేయాలి? ఇతని వృత్తాంతం ఎలా తెలుసుకోవాలి? నాకు ఉన్న ఈ కోరిక ఎలా తొలుతుంది? అని అనుకుంది. హరి హరి! ఇది ఒక ఆటంకం రావాలా? ఓ పాడు నిద్ర! ఎలా దాపరించితివి? జీవించి ఉన్నాడో లేదో అని సందేహించాను కానీ ఉచ్వాస నిశ్వాసములు కలిగి ఉం...