Posts

Showing posts from October, 2025

ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ || Prema Kosam Rajasabha Varaku Vachhina Alamkaravathi Katha || Episode - 14 || Bhatti Vikramarka Kathalu

Image
  ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ అలంకారవతి చంద్రవర్మను వెంటబెట్టుకొని రాజసభకు వెళ్ళింది. రాజుకు నమస్కరించి అక్కడ నిలబడింది. చంద్రవర్మ ఆ రాజును ఆశీర్వదించాడు. అందగాడైన చంద్రవర్మ గొప్ప తేజస్సుతో, మన్మథుడిలా ప్రకాశిస్తూ ఉండటం చూసి, ఆ పట్టణ ప్రభువైన మహేంద్రవర్మ ఆశ్చర్యపోయాడు. రాజు వారిని కూర్చోమని చెప్పి, వేశ్య కూతురైన అలంకారవతిని చూసి ఇలా అడిగాడు: "ఓ అందగత్తె! నువ్వు ఎవరివి? ఈ నగరంలోనే ఉంటావా? నిన్ను నేనెప్పుడూ చూడలేదే! ఈ బ్రాహ్మణోత్తముడు ఎవరు? ఇతడిని ఇప్పుడు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? మీరు వచ్చిన కారణం ఏంటో వివరించు." అందుకు అలంకారవతి రాజుతో ఇలా అంది: "మహాప్రభూ! నేను ఈ నగరంలోనే పేరుపొందిన ఒక వేశ్య కుమార్తెను. నా పేరు అలంకారవతి. నేను ఒక వ్రతాన్ని నియమంగా పెట్టుకుని, మా వేశ్య కుల మర్యాద అయిన వ్యభిచార వృత్తిని వదిలేశాను. బయటి ప్రపంచానికి కూడా తెలియకుండా ఇప్పటివరకు ఇంట్లోనే కాలం గడిపాను. అందుకే మీరు నన్ను చూసే అవకాశం రాలేదు." ఆ తర్వాత ఆమె తన వ్రతం వివరాలను, ఆ బ్రాహ్మణుడు తన ఇంటికి రావడం, అతడిని చూసి తాను మోహించి, నిద్ర లేపడానికి పడిన తాపత్రయాన్ని, తన మనసులోన...

వశిష్ఠాదులు కైకేయి మందిరానికి రావడం || Vasisthadulu Kaikeyi Mandiraniki Raavadam || Ramayanam || Episode - 48

Image
  వశిష్ఠాదులు  కైకేయి మందిరానికి రావడం కైకేయి: మహారాజా! సత్యమనే ఒక్క పదమే బ్రహ్మస్వరూపం, ధర్మం సత్యంపై ఆధారపడి ఉంటుంది. సత్యమే అక్షయవేదాలు. ఎవరైనా సత్యాన్ని ఆచరించటం చేతనే పరమపదాన్ని చేరుకుంటారు. ధర్మవేత్తలైన వారంతా సత్యమే ధర్మమని అంటారు కదా! నేను కూడా సత్యాన్నే ఆశ్రయించి నిన్ను ధర్మాన్ని ఆచరించమని ప్రేరేపిస్తున్నాను. నా కిచ్చిన ప్రతిజ్ఞను (వరములు) గుర్తుచేయగానే మహాపాపం చేసినట్లు దుఃఖీస్తూ నేలపై పడి పొర్లుతున్నావు. ధర్మాన్ని పాటించు. ఆ ధర్మమే నీకు సత్కీర్తిని, ఉత్తమగతుల్ని కలిగిస్తుంది. పూర్వం శిబిచక్రవర్తి తన దేహంలోనుండి మాంసాన్ని డేగకు ఇచ్చి ఉత్తమలోకాలు పొందాడు. మహాతేజశాలియైన అలర్కుడు బ్రాహ్మణుడు వచ్చి అడగ్గానే, తన నేత్రాలను తీసి ఇచ్చివేశాడు. సముద్రుడు కూడా సత్యాన్ని పాటిస్తూ వృద్ధి సమయాల్లో కూడా చెలియలికట్టను దాటిరావడం లేదు. ఓ పురుషశ్రేష్ఠుడా! నీ బుద్ధిని స్థిరంగా ధర్మంపైనే నిలుపు. నాకు ఇచ్చిన వరాలను అమలుచెయ్యి. వరాలిచ్చిన నీకు వాటిని తీర్చడమే ధర్మం. అది నెరవేర్చమని నిన్ను ప్రేరేపిస్తున్నాను. ముమ్మాటికీ రాముణ్ణి అడవులకు పంపమని చెబుతున్నాను. నాథా! నువ్వు వరాలు ఇవ్వకుండా అసత్...