ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ || Prema Kosam Rajasabha Varaku Vachhina Alamkaravathi Katha || Episode - 14 || Bhatti Vikramarka Kathalu
దశరథుడు అయోధ్యకు చేరటం
పరశురాముడు. వెళ్ళగానే రాముడు. విష్ణుధనుస్సును, బాణాలను. వరుణ దేవునికి సమర్పించాడు. దశరథునికి వసిష్టాది. మహర్షులకు నమస్కరించి తండ్రిని వ్యాకులపాటు చెందవలదని ఊరడించాడు.
అప్పుడు రాముడు దశరథుడితో ఇలా అన్నాడు: తండ్రీ! పరశురాముడు వెళ్లిపోయాడు. ఇక నీవు ఆతడిని గూర్చి చింతించటం మాను. మనమందరమూ అయోధ్యకు పోదాం. వాన చినుకులకు ఎదురు చూచే చాతక పక్షులవలె సైన్యమంతా నీ ఆజ్ఞలకై వేచి ఉంది. వారందరికీ అయోధ్య వైపు ప్రయాణానికి అనుమతి ఇవ్వు అని అన్నాడు.
రాముని మాటలు విన్న దశరథుడు స్పృహని తిరిగి పొందాడు. పుత్రుని ప్రేమానురాగాలతో కౌగలించుకున్నాడు. ఆయనకంతా ఒక కలలాగా అనిపించింది. రాముడు పునర్థన్మ ఎత్తినట్లుగా ఆనందపడిపోయాడు.
దశరథుని పరివారమంతా అయోధ్యా నగరం చేరుకున్నారు. నగర వీథులన్నీ నీళ్ళుచల్లి, వీథి వీథికీ తోరణాలు కట్టారు. ప్రజలంతా ఆనందోత్సాహాలతో నాట్యం చేశారు. మంగళవాద్యాలెన్నో మోగించారు. ప్రజలు, మంత్రులు ఎదురు వచ్చి స్వాగత వచనాలు పలికారు.
వారంతా అంతఃపురానికి చేరుకున్నారు. కౌసల్య, సుమిత్ర, కైకేయిలు ఎదురువచ్చి సీత, ఊర్మిళ, మాండవీ, శృతకీర్తులను అనురాగంతో అక్కున చేర్చుకొన్నారు. నూతన వధువులందరూ గృహ ఇలవేల్చులను భక్తితో పూజించారు. తరువాత బ్రాహ్మణులకు గోవులను,
ధనధాన్యాలను దానం చేశారు. వారందరూ భర్తలతో చేరి ఏకాంతంలో ఆనందంగా గడిపారు. రామలక్ష్మణ భరకశత్రుఘ్నులు తల్లిదండ్రులకు సేవలు చేస్తూ వారిని ఆనందపరచసాగారు.
ఇలా కొంతకాలము గడచిపోయింది.
అప్పుడు దశరథుడు భరతుడితో ఇలా అన్నాడు : కుమారా! భరతా! నీ తాతగారు కేకయ మహారాజు నిన్ను చూడవలెనని ముచ్చటపడుచున్నారట. నిన్ను వారి వద్దకు తీసుకొని వెళ్ళేందుకు నీ మేనమామ యాధాజిత్తు మిథిలానగరానికి వచ్చి నన్నా విధంగా ప్రార్థించాడు. నాయనా! నీవు వారితో వెళ్ళి వారికి ఆనందం కలిగించు అని అన్నాడు.
అంతట భరతుడు తండ్రి చెప్పినట్లు మేనమామతో కలసి కేకయ మహారాజును చూసేందుకు శత్రుఘ్మునితో కలసి వెళ్ళే ముందుగా తండ్రిని తల్లులను రామలక్ష్మణులను కౌగలించుకొని వారి వద్ద సెలవు తీసుకొనివెళ్తాడు.
భరతుడు వెళ్ళిన తర్వాత రామలక్ష్మణులు తల్లిదండ్రులకు సేవలు చేస్తూ వారిని ఆనందపరచసాగారు. తండ్రితోపాటు రాచకార్యాలందు సహాయం చేస్తూ, ప్రజాహితులై ప్రజల మన్నలను అందుకొంటూ తల్లులకు, తండ్రికి, గురువులకు ఇంకా ఇతర పెద్దలందరికీ సమయోచితంగా సేవలు చేస్తూ తలలో నాలుకై మెలగసాగారు.
రాముడి మనస్సు ఎప్పుడూ సీత మీదనే ఉండేది. ఆమె సౌజన్యం, సౌందర్యం, సౌశీల్యం వంటి సద్గుణాలన్నీ రాముని ఆకట్టుకున్నాయి. సీతకు కూడా ఎల్లవేళలా మనస్సు రాముని మీదనే ఉండేది. తాను శివధనుస్సును విరిచి వైదేహీయుల మనస్సు దోచుకున్నా, దశరథుడు వచ్చి తన అంగీకారం తెలిపేవరకు రాముడు, సీతను గూర్చి ఆలోచించనైనా లేదు. తండ్రి అంగీకరించిన సంబంధమవటం వలన అతడికి సీతపై మక్కువ వృద్ధి చెందింది. తండ్రి అంగీకరించి చేసిన సంబంధ మవటం వలనా, ఆమె రూప గుణానురాగముల చేతా రామునికి ఆమె యందు అనురాగం వృద్ధి చెందినది. కాని సీత మాత్రం రాముడు తన భర్త అన్న ఒక్క కారణం చేత రాముని ప్రేమిస్తూ ఉండేది. ఒకరికొకరు వారి హృదయాల్లో ఉండే భావాలను సునాయాసంగా గ్రహిస్తూ, ఆ విధంగా నడచుకుంటూ ఉండేవారు. సీతపై రామునికుండే ప్రేమకంటే సీతకు రామునిపై ప్రేమ రెట్టింపు ఉండేది. వారి ప్రేమానురాగాలను కొలిచే సాధనాలు గాని, ఇంత అని చెప్పగలిగేవారు. గాని, భూమండలంలో ఎవరూ లేదు. వారు ఆ విధంగా చాలాకాలం లక్ష్మీడేవితో కూడిన విష్ణుమూర్తివలె ప్రకాశించసాగారు.
Comments