ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ || Prema Kosam Rajasabha Varaku Vachhina Alamkaravathi Katha || Episode - 14 || Bhatti Vikramarka Kathalu

Image
  ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ అలంకారవతి చంద్రవర్మను వెంటబెట్టుకొని రాజసభకు వెళ్ళింది. రాజుకు నమస్కరించి అక్కడ నిలబడింది. చంద్రవర్మ ఆ రాజును ఆశీర్వదించాడు. అందగాడైన చంద్రవర్మ గొప్ప తేజస్సుతో, మన్మథుడిలా ప్రకాశిస్తూ ఉండటం చూసి, ఆ పట్టణ ప్రభువైన మహేంద్రవర్మ ఆశ్చర్యపోయాడు. రాజు వారిని కూర్చోమని చెప్పి, వేశ్య కూతురైన అలంకారవతిని చూసి ఇలా అడిగాడు: "ఓ అందగత్తె! నువ్వు ఎవరివి? ఈ నగరంలోనే ఉంటావా? నిన్ను నేనెప్పుడూ చూడలేదే! ఈ బ్రాహ్మణోత్తముడు ఎవరు? ఇతడిని ఇప్పుడు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? మీరు వచ్చిన కారణం ఏంటో వివరించు." అందుకు అలంకారవతి రాజుతో ఇలా అంది: "మహాప్రభూ! నేను ఈ నగరంలోనే పేరుపొందిన ఒక వేశ్య కుమార్తెను. నా పేరు అలంకారవతి. నేను ఒక వ్రతాన్ని నియమంగా పెట్టుకుని, మా వేశ్య కుల మర్యాద అయిన వ్యభిచార వృత్తిని వదిలేశాను. బయటి ప్రపంచానికి కూడా తెలియకుండా ఇప్పటివరకు ఇంట్లోనే కాలం గడిపాను. అందుకే మీరు నన్ను చూసే అవకాశం రాలేదు." ఆ తర్వాత ఆమె తన వ్రతం వివరాలను, ఆ బ్రాహ్మణుడు తన ఇంటికి రావడం, అతడిని చూసి తాను మోహించి, నిద్ర లేపడానికి పడిన తాపత్రయాన్ని, తన మనసులోన...

Brahmaraakshasudu Chandravarnuditho Thana Vrutthantham Cheppadam || Bhatti Vikramarka Kathalu || PART 8

 

బ్రహ్మరాక్షసుడు చంద్రవర్ణుడితో తన వృత్తాంతం చెప్పడం 

బ్రాహ్మణోత్తమా! చంద్రవర్ణా! నేను ఇప్పుడు ఉన్న ఆకృతిని పట్టి నన్ను నీవు మహాత్ముడైన ఋషివర్యుడువి అని అనుకుంటున్నావు కానీ నేను అటువంటి వాడిని కాదు. నా నిజమైన ఆకృతి ఇది కాదు. కామరూపధార శక్తి కలవాడిని కాబట్టి నా నిజమైన స్వరూపం తెలిస్తే నువ్వు భయపడతావని ఇలాంటి మనిషి రూపంలో వచ్చాను. నా స్వరూపం అతి భయంకరమైనది, నేను బ్రహ్మ రాక్షసుడుని. పరకాయ ప్రవేశం లాంటి సకల విద్యలు తెలిసిన మహావిధ్వాంసుడని గర్వించి ప్రసిద్ధులైన పండితులు అందరిని వాద ప్రతివాదాలలో ఓడించి కీర్తి పొందాను. నాకు తెలియని విద్య ఈ లోకమున లేనేలేదు.ఒకనాడు వేదాంతం గురించి ఆలోచిస్తున్న సమయంలో నేను ఒక మహా తపస్వి అయినా మునివరుని ప్రసంగం వినకుండా తిరస్కరించి అతనిని పరిహసించాను.

దానికి అతడు కోపగించి నువ్వు విద్యా గర్వమున తేడా తెలియక నన్ను హేళన చేశావు కాబట్టి నువ్వు ఇక బ్రహ్మ రాక్షసుడువై ఉండు, నీ విద్య నిరుపయోగం అగుగాక అని ఘోరంగా శపించాడు. అంతటా నేను నా అవివేక ప్రవర్తన తెలుసుకొని, బాధపడి, అతనికి నమస్కరించి వినయముతో మహాత్మ నేను ఎంతటి పాండిత్యం కలవాడై ఉండి కూడా తగిన పరిజ్ఞానం లేక తప్పుదారి తొక్కి మిమ్మల్ని నిరాకరించి చులకన చేశాను. ఇది మహా అపరాధమే, కానీ అల్పమైంది కాదు. నా అజ్ఞానానికి తగిన ఫలము దక్కింది. చేసిన పనులకు కర్మఫలం అనుభవించకుండా తప్పించుకొనుట ఎవరికి సాధ్యమవుతుంది? కనుక దీని గురించి చింతించడం వెర్రితనమని మీలాంటి పెద్దలు పలుకుతారు, శపించారు కదా! ఇంకా అయిపోయిన దాని గురించి ఆలోచించిన ఎలాంటి ప్రయోజనం లేదు. అనుభవించక తప్పదు, నా యందు కరుణించి నా శాపం పోయేలాగా నన్ను అనుగ్రహించండి. నా తప్పులను మన్నించండి, మహనీయులైన తమలాంటి వారికి ఎక్కువ క్రోధం కలిగి ఉండదు కదా? అని చాలా విధాలుగా ప్రార్థించాడు.

 దయామయుడైన ఆ తపోధనుడగు ఋషి నా ప్రార్ధనలకు మనసు కరిగి కోపం వీడి కనికరం కలవాడై నన్ను చూసి పోయి నా శాపం తప్పేది కాదు, అనుభవించి తీరాలి. బ్రహ్మ రాక్షసుడువై కొంతకాలం గడిపిన తర్వాత నువ్వు ఉన్నచోటకు తనకు తానే ఒక విద్యార్థి నీ దగ్గరకు రాగలడు. అతనికి నీ చరిత్ర అంతా చెప్పి, నీకు తెలిసిన విద్యా రహస్యాలు అన్ని అతనికి ఉపదేశిస్తే నీ రాక్షసత్వం పోతుంది. అప్పుడు నీకు ఆయుష్షు పూర్తి అవుతుంది, కనుక దివ్య దేహం పొంది స్వర్గానికి వెళ్తావు అని చెప్పి, అతడే ఈ స్థలాన్ని తెలిపి ఇక్కడ ఉండమని చెప్పాడు. పిమ్మట నేను బ్రహ్మ రాక్షసుడునై వచ్చి ఈ చెట్టుపై ఉంటున్నాను. ఇప్పటికీ నేను ఇక్కడికి వచ్చి చాలా సంవత్సరాలు గడిచింది. ఆ ముని చెప్పిన విధంగా బ్రాహ్మణుడు ఎప్పుడు వస్తాడో అని అతని రాక కోసం ఎదురు చూస్తున్నాను. 

నా శాపం తొలిగే సమయం దగ్గర పడడం వల్ల దేవుడు ఇప్పటికీ ఇక్కడికి నిన్ను పంపాడు. బ్రాహ్మణోత్తమా! ఇదే నా చరిత్ర. ఇంక నేను చేయాలి అనుకున్న ఉపకారం చెప్తాను, విను అది ఏంటంటే విద్యాభిలాషి నీకు ఏ రహస్యం తెలుసుకోవాలో అడుగు, అవి అన్ని చెప్తాను

 నేను ఎరుగునది ఏదీ లేదు అని ముని చెప్పాడు కదా! దేనికొరకై నువ్వు దేశ దేశాలు తిరిగి నిరాశ నిరాశ చెంది వ్యర్థ ప్రయత్నం అయిందో ఆ కోరికను నేను నీకు సంపూర్ణంగా చెప్తాను. ఇదే నీకు నేను చేయాలి అనుకున్న ఉపకారం. నీకు విద్యను నేర్పిస్తే నేను నా శాపం వల్ల విముక్తిడిని అవుతాను, నువ్వు నా దగ్గర విద్యాభ్యాసం చేస్తున్నంతకాలం నేను నీకు ఇటువంటి శాంతమైన మనిషి రూపంలోనే కనబడతాను సుమీ అని చెప్పాడు.

 ఆ వృత్తాంతం అంతా విన్న తర్వాత చంద్రవర్ణుడి  మనసులో ఆశ్చర్యం, భయం, సంతోషం అని ఒకదానితో ఒకటి కలిసి వచ్చింది. మంచి కాలం వస్తే అన్ని దానికి అదే వస్తాయి కదా! అని మనసులో అనుకుని ఆ బ్రాహ్మణుడు ఎట్టకేలకు ధైర్యం తెచ్చుకొని వినయముతో బ్రహ్మ రాక్షసుడిని చూసి అయ్యా!  నాకు ఇలా జరగడానికి కారణం ఏమిటి అంటే నా పూర్వకృత పుణ్య విశేషమని అనిపిస్తుంది. నా అపేక్ష తీరదని గట్టిగా అనుకొని నిరాశ పడి పోతున్న నాకు మహాశక్తి సంపన్నులైన తమరు గురువుగా ఏర్పడి కరుణతో విద్యాదానం చేస్తారని వాగ్దానం ఇచ్చారు. ధన్యుడినైతిని, ఇంకా కొరతేముంది?  మీకు శిష్యుడిని అయ్యే భాగ్యం నా వంటి వానికి భగవంతుడు కటాక్షం వలన వచ్చింది. కరుణించి నన్ను కృతజ్ఞతలు చూసి రక్షించాలి అని ప్రార్థించాడు. చంద్రవర్ణుడి సుగుణాలకు తన యందు గల భక్తికి బ్రహ్మ రాక్షసుడు మెచ్చి అతనిని చూసి  చంద్రవర్ణ! నీ యందు నేను మిక్కిలి ప్రీతి గలవాడినే ఉన్నాను. కానీ దానికి ముందు నువ్వు చేయవలసిన పద్ధతులు చెప్తాను అవి ఏమిటంటే,

విద్యాభ్యాసం ఆరంభించిన మొదలు ఆరు నెలలు నువ్వు నిద్రాహారాలు వదిలివేయాలి. ప్రతిరోజు ఒక రావి ఆకుపై నీకు పాఠాలు లిఖించి చెప్తాను, దానిని నువ్వు శ్రద్ధతో పఠించి అప్పగించాలి.ఈ ప్రకారం నువ్వు చేయడం వలన ఆరు నెలలో నువ్వు సర్వ విద్యల యందు పూర్ణ పాండిత్యం కలవాడివి అవుతావు. ఈ నియమాలను నువ్వు పాటించకపోతే నీకు విద్య రాదు.

మహా కఠినమైన ఆ నియమాలు ఆచరించడానికి చంద్రవర్ణుడికి ధైర్యం సరిపోలేదు, ఆరు నెలలు నిద్రాహారాలు లేకుండా ఉండడం ఎవరికీ సాధ్యం? అయ్యో! నా కోరిక తీరుతుందని సంతోషించానే, ఈ అసాధ్యవ్రతమును నేను ఎలా ఆచరించగలను? ఇది ఇదొకటి అడ్డు వచ్చింది, ఏమి చేయాలి? అని బాధపడుతున్నాడు. అతని ఆలోచనను ఆ బ్రహ్మ రాక్షసుడు గ్రహించి చిరునవ్వుతో అతనిని చూస్తూ, చంద్రవర్ణా! ఆహార నిద్రలు లేకుండా ఇవి ఎలా ఆచరించాలి. ఇవి ఆచరించడానికి శక్తి లేని వాడివై భయపడుతున్నావా?వద్దు వద్దు, అధైర్య పడకు. దీనికి నేను తగిన ఉపాయం చెప్పి నీకు కష్టం లేకుండా చేస్తాను అని అతడి బాధను నివారించాడు.




                                                                                                                                          ← PREV || NEXT →

Comments

Popular posts from this blog

Dasarathudu Ayodhyaku Cheratam || దశరథుడు అయోధ్యకు చేరటం || Episode 34 || Ramayanam

Ramayanam || Shiva Dhanassu

Goppa Thyagam || గొప్ప త్యాగం || Moral Stories || నీతి కథలు