ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ || Prema Kosam Rajasabha Varaku Vachhina Alamkaravathi Katha || Episode - 14 || Bhatti Vikramarka Kathalu

Image
  ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ అలంకారవతి చంద్రవర్మను వెంటబెట్టుకొని రాజసభకు వెళ్ళింది. రాజుకు నమస్కరించి అక్కడ నిలబడింది. చంద్రవర్మ ఆ రాజును ఆశీర్వదించాడు. అందగాడైన చంద్రవర్మ గొప్ప తేజస్సుతో, మన్మథుడిలా ప్రకాశిస్తూ ఉండటం చూసి, ఆ పట్టణ ప్రభువైన మహేంద్రవర్మ ఆశ్చర్యపోయాడు. రాజు వారిని కూర్చోమని చెప్పి, వేశ్య కూతురైన అలంకారవతిని చూసి ఇలా అడిగాడు: "ఓ అందగత్తె! నువ్వు ఎవరివి? ఈ నగరంలోనే ఉంటావా? నిన్ను నేనెప్పుడూ చూడలేదే! ఈ బ్రాహ్మణోత్తముడు ఎవరు? ఇతడిని ఇప్పుడు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? మీరు వచ్చిన కారణం ఏంటో వివరించు." అందుకు అలంకారవతి రాజుతో ఇలా అంది: "మహాప్రభూ! నేను ఈ నగరంలోనే పేరుపొందిన ఒక వేశ్య కుమార్తెను. నా పేరు అలంకారవతి. నేను ఒక వ్రతాన్ని నియమంగా పెట్టుకుని, మా వేశ్య కుల మర్యాద అయిన వ్యభిచార వృత్తిని వదిలేశాను. బయటి ప్రపంచానికి కూడా తెలియకుండా ఇప్పటివరకు ఇంట్లోనే కాలం గడిపాను. అందుకే మీరు నన్ను చూసే అవకాశం రాలేదు." ఆ తర్వాత ఆమె తన వ్రతం వివరాలను, ఆ బ్రాహ్మణుడు తన ఇంటికి రావడం, అతడిని చూసి తాను మోహించి, నిద్ర లేపడానికి పడిన తాపత్రయాన్ని, తన మనసులోన...

చంద్రవర్ణుడు కన్యాకుబ్జాపురానికి వెళ్లడం || Chandravarnudu Kanyakubjapuraaniki Velladam || Episode 10 || Bhatti Vikramarka Kathalu

 

చంద్రవర్ణుడు కన్యాకుబ్జాపురానికి వెళ్లడం 

బ్రహ్మరాక్షసుడు చంద్రవర్ణుడికి రాసి ఇచ్చిన రావి ఆకులు అన్నిటిని పోగొట్టకుండా భద్రంగా దాచి పెట్టాడు. కనుక ఆకులన్నింటిని చేర్చి మూటగట్టి వెంట తీసుకొని వెళ్ళాడు. ఎంత దూరం ప్రయాణం చేసిన ఏ గ్రామం కనబడలేదు దానితో అతను బాగా అలసిపోయి దప్పికి వేస్తుంది. అలా ప్రయాణం చేస్తున్న అతనికి కన్యాకుబ్జాపురం అనే పేరు గల పట్టణంగా కనిపించింది. ఆ పట్టణంలోకి ప్రవేశించిన తర్వాత ఒక వీధిలో అతనికి రమ్యమైన గృహం ఒకటి కనిపించింది, ఆ గృహం చాలా అందంగా సలక్షణముగా అలంకరించి విశ్రమించడానికి అనువుగా కనపడేసరికి ఆ గృహం ఎవరిది అని విచారించకుండా గొప్ప ధనవంతులు అని అనుకొని, భయం లేకుండా లోపలికి ప్రవేశించి అటూ ఇటూ చూసి అక్కడ ఆ సమయంలో మనుషులు ఎవరూ కనబడకపోవడం వలన తాను తీసుకువచ్చిన ఆకుల మూటను తలగడగా పెట్టుకొని అక్కడ అరుగుపై శయనించాడు.

అతడు శయనించిన తరువాత తనలో తాను ఇలా అనుకున్నాడు: ఇక్కడ చాలా హాయిగా ఉంది. ఇది ఎవరో సంపన్నులు గృహము లాగా ఉన్నది, అయితే ఏంటి? కొంతసేపు పడుకున్న తర్వాత కొంచెం అలసట తీరిన  తర్వాత  చేయవలసిన కర్తవ్యం గురించి ఆలోచిస్తాను అని అనుకొని,ఆ  ఇంటి అలంకార విశేషాలను చూస్తూ ఉన్నాడు. చంద్రవర్ణుడికి ఆరు నెలల నుంచి నిద్ర లేకపోవడం వలన,ఆ ఇంటిలో శయనించడం వలన, చల్లని గాలి వేస్తూ ఉండడం వలన, ప్రయాణంలో అలసిపోయి ఉండడం వలన అధికంగా నిద్ర వచ్చి గాడమైన నిద్రపోయాడు.

భోజరాజా! చంద్రవర్ణుడు శయనించి నిద్రించిన ఆ గృహం ఆ పట్టణంలో ప్రసిద్ధి చెందిన ధనికురాలైన ఒక వేశ్య మందిరం. ఆమె వయస్సులో బాగా డబ్బు సంపాదించి అక్కడ గల తన జాతి వారిలో గొప్పగా ఉండేది. ఆ బ్రాహ్మణుడు అక్కడ చేరిన అక్కడకు చేరిన కాలంలో ఆ వేశ్య వయస్సులో చాలా పెద్దది తనకు ఒక కుమార్తె ఉంది. ఒప్పుల కుప్ప అయిన తన కుమార్తెకి ఆ వేశ్య అలంకారవతి అని పేరు పెట్టి బాగా శ్రద్ధతో పెంచి తనను పెద్ద దానిని చేసింది. అలంకారవతి అసమాన రూప లావణ్య రాశి,రంభ ఊర్వశి వంటి అప్సరసలకు కూడా మించిన అందం కలదని అక్కడ వారు తనను పొగుడుతూ ఉండేవారు. ఆ సౌందర్యానికి తగిన శుభలక్షణాలు కలిగి ఉండడం వలన ఆ కుమార్తె ఆ పొగడ్తలకు అర్హురాలైంది. వేశ్య జాతిలో పుట్టిన కూడా అలంకారవతి సుగుణాలకు పేరు పొందిన, యవ్వన వయసులో ఉన్న తనకు వేశ్య  వృత్తి అంటే తనకు ఇష్టం లేదు. తను దానిని అతి హీనమైన పాప వృత్తిగా భావిస్తుంది. తన తల్లి ధనము ఆశ చూపించి ప్రేరేపించిన కూడా ఒప్పుకోకుండా నిరాకరించి, తనకు ఎవరైనా తగిన పురుషుడు లభించిన సందర్భంలో అతనిని పెళ్లాడి సాధారణమైన గృహిణి ధర్మాన్ని గడుపుతూ తన భర్తతో కలిసి నడవాలనే కోరికతో కాలం గడుపుతుంది.

 అటువంటి ఆ సంకల్పం ఆ రమణిమణికి ఎలా కలిగిందో! అలంకారవతి చక్కగా విద్యాభ్యాసం చేసి,చాలా పాండిత్యంను సంపాదించింది. అందువలన అధికమైన వివేకమును, సద్భావాన్ని, సత్ప్రవర్తనను పొందింది.

తన ఉద్దేశానికి తన కుమార్తె వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న కూడా తన తల్లికి అలంకారవతిపై కోపం వచ్చినా కూడా, తన బిడ్డ అభిప్రాయం తెలుసుకొని తన కూతురికి కలిగిన సత్ప్రవర్తన అభిలాషను గుర్తించి, తన కూతురి ఇష్టానుసారం జరుగుటకు తాను సమ్మతించి తగిన పురుషున్ని వెతుకుతుంది. అటువంటి సమయంలో చంద్రవర్ణుడు వారి గృహానికి వచ్చి శయనించి నిద్రపోతున్నాడు. ఆ బ్రాహ్మణుడు తమ ఇంటికి రావడం కానీ, అరుగుపై శయనించడం కానీ, అలంకారవతికి కాని,ఆమె తల్లికి కాని తెలియదు. వారు లోపల వున్నారు, పరిచారకులు కూడా చూడలేదు. తమ ఇంటికి వచ్చి శయనించి నిద్రించిన పిమ్మట కొంత సమయానికి అలంకారవతి సకల అలంకార శోభితురాలై సంతోషంగా వీధి యందు వస్తు,వెళ్తూ ఉన్న వారిని చూస్తూ ఉన్నది.

అలా చూస్తూ ఆ వన్నెలాడి తమ ఇంటి ముందు గల అరుగుపై శయనించి, గాడ నిద్రపోతూ ఉన్న చంద్రవర్ణుడిని చూసి అతని చక్కని వదనానికి ఆశ్చర్యపడి తనలో తాను ఇలా అనుకున్నది:  ఎంతటి చక్కని వదనాన్ని కలిగిన వాడు ఇతడు? ఎవరై ఉంటారో? కొత్త వాడై ఉండి కూడా నిర్భయంగా లోపలికి ప్రవేశించి శయనించి నిద్రపోతున్నాడు. ఇతడు ఇక్కడికి ఎందుకు వచ్చాడో కారణం తెలియదే, అతని అందం వర్ణించడానికి కష్టంగా ఉంది. ఔరోరా!లోకంలో పురుషుడై జన్మిస్తే ఈ విధంగా కదా పుట్టాలి. ఇటువంటి  సుందరాంగుడిని చేపట్టి కూడా సుఖించి లేని ఏ స్త్రీ జన్మ అయినా ఏమి జన్మా! ఛీ వ్యర్థము ఆ జన్మ. నేను వేశ్య వృత్తిని త్యజించి సంసారిగా బతకడం కోసం, నా ఇష్టం నెరవేరడం కోసం, భగవంతుడు దయచూపి ఇతనిని ఇక్కడికి తెచ్చి విడిచినట్టు  అనిపిస్తుంది. లేకపోతే ఇక్కడికి ఈ పురుషోత్తముడు ఎలా వస్తాడు అని అనుకుంది. 




                                                                                                                                           ← PREV || NEXT→

Comments

Popular posts from this blog

Dasarathudu Ayodhyaku Cheratam || దశరథుడు అయోధ్యకు చేరటం || Episode 34 || Ramayanam

Ramayanam || Shiva Dhanassu

Goppa Thyagam || గొప్ప త్యాగం || Moral Stories || నీతి కథలు