ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ || Prema Kosam Rajasabha Varaku Vachhina Alamkaravathi Katha || Episode - 14 || Bhatti Vikramarka Kathalu

Image
  ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ అలంకారవతి చంద్రవర్మను వెంటబెట్టుకొని రాజసభకు వెళ్ళింది. రాజుకు నమస్కరించి అక్కడ నిలబడింది. చంద్రవర్మ ఆ రాజును ఆశీర్వదించాడు. అందగాడైన చంద్రవర్మ గొప్ప తేజస్సుతో, మన్మథుడిలా ప్రకాశిస్తూ ఉండటం చూసి, ఆ పట్టణ ప్రభువైన మహేంద్రవర్మ ఆశ్చర్యపోయాడు. రాజు వారిని కూర్చోమని చెప్పి, వేశ్య కూతురైన అలంకారవతిని చూసి ఇలా అడిగాడు: "ఓ అందగత్తె! నువ్వు ఎవరివి? ఈ నగరంలోనే ఉంటావా? నిన్ను నేనెప్పుడూ చూడలేదే! ఈ బ్రాహ్మణోత్తముడు ఎవరు? ఇతడిని ఇప్పుడు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? మీరు వచ్చిన కారణం ఏంటో వివరించు." అందుకు అలంకారవతి రాజుతో ఇలా అంది: "మహాప్రభూ! నేను ఈ నగరంలోనే పేరుపొందిన ఒక వేశ్య కుమార్తెను. నా పేరు అలంకారవతి. నేను ఒక వ్రతాన్ని నియమంగా పెట్టుకుని, మా వేశ్య కుల మర్యాద అయిన వ్యభిచార వృత్తిని వదిలేశాను. బయటి ప్రపంచానికి కూడా తెలియకుండా ఇప్పటివరకు ఇంట్లోనే కాలం గడిపాను. అందుకే మీరు నన్ను చూసే అవకాశం రాలేదు." ఆ తర్వాత ఆమె తన వ్రతం వివరాలను, ఆ బ్రాహ్మణుడు తన ఇంటికి రావడం, అతడిని చూసి తాను మోహించి, నిద్ర లేపడానికి పడిన తాపత్రయాన్ని, తన మనసులోన...

కుంటోడిపై పదవి ప్రభావం || Kunthodipai Padavi Prabhavam || Tenali Ramakrishna Stories || తెనాలి రామకృష్ణ కథలు || Part 5

 

కుంటోడిపై పదవి ప్రభావం


ఒక రోజు రాయలు కొంతమంది సైన్యంతో అర్ధరాత్రి దొంగలను పట్టుకునేందుకు బయలుదేరాడు. దొంగలు అంతా కలిసి ఇరవై మంది వరకు ఉన్నారని గూఢచారులు ద్వారా తెలుసుకున్న రాయలు రెండు వందల మంది సైన్యాన్ని తీసుకుని నగరం దాటుతుండగా, రామలింగడు గుర్తుకురాగా, అతని ఇంటి తలుపు తట్టాడు. తలుపు తెరిచి బయటికి వచ్చాడు రామలింగడు. ఎదురుగా మారువేషంలో ఉన్నరాయలను చూసి క్షణంలో గుర్తుపట్టి లోపలికి రండి ప్రభూ! అని ఆహ్వానించాడు.

నేను దొంగలను పట్టుకునేందుకు వెళ్తున్నాను. నీవు రాగలవా? దొంగలను తలచుకుని భయపడేలా అయితే వద్దు అని అన్నాడు. 

తమరు పిలవడం నేను రాకపోవడమా! గండర గండనితో ఉంటే నాకేమి భయం ? తక్షణం బయలు దేరగలను అని చెప్పి తను మారువేషంలో అనుసరించాడు. అలా కొండలలోకి వెళ్లిపోయారు. తెలతెలవారుతుండగా రాయలు తన సైన్యాన్ని వెనుకనుంచి రమ్మనమనిచెప్పి రామలింగనితో తను బయలుదేరాడు. ఇద్దరూ చాలా దూరం వెళ్లాక ఒక్కసారి దొంగలు చుట్టుముట్టి కత్తులు చూపారు. రాయలు అవకాశం లేనందున వారిపై కత్తిదూయలేక పోయాడు. ఆ దొంగలనాయకుడు ఎగాదిగా చూసి ఎవర్రా మీరు? ఈ ఎర్రకొండలలోకి వచ్చారంటే ప్రాణాలపై ఆశ ఏమీలేనట్టున్నారు. మీరా కవులను వెంటేసుకుని తిరిగే కృష్ణదేవరాయల గూఢచారులా? నిజం చెప్పండి అని ఉరిమాడు ఓ దొంగ.

మేము దేశదిమ్మరులం! మాకు ఎవరి కొలువు సరిపడదు. దారితప్పి ఇటు వచ్చాం అని భయంగా చెప్పాడు రామలింగకవి. రాయలు ఎరుపెక్కిన కళ్లతో దొంగలవైపు కోపంగా చూసాడు.

మీరు చెప్పింది నమ్మబుద్దిగా లేదు. మీసంగతి అటునుంచి వచ్చాక తేల్చగలను. రేయ్ ఈ ఇద్దరిని ఆ కొండగుహలో ఉన్న చెరసాలలో పడేయండిరా! అని తన అనుచరులకు ఆదేశించి కొద్దిదూరంలో కనిపించే తుంగభద్రనది వైపు సాగిపోయాడు ఆ దొంగల గుంపు నాయకుడు.

దొంగలు ఆ ఇద్దరిని పెడరెక్కలు విరిచి పట్టుకుని ఎదురుగా కనిపించే గుహలోకి ఈడ్చుకుపోయారు. ఓ చెరసాలగదిలోకి నెట్టి ఇనుపగజాల తలుపును వేసి పెద్దతాళం వేసి నదివైపు సాగిపోయారు.

రామలింగా !నువ్వు ఆదొంగలతో అబద్దమే చెప్పావా, లేక నిజమే చెప్పావా! దేశదిమ్మరులం మాకు ఎవరి కొలువు సరిపడదు అని అన్నావు. నీవు నిజంగా ఏదో ఒక రోజు నా కొలువు వదిలిపోతావా? అని అతని కళ్ళలోకి సూటిగా చూసి అడిగాడు రాయలు.

ప్రభూ అలాఎందుకు అనుకుంటారు. నేను మిమ్మల్ని వదిలి వెళ్ళను. దొంగలు కదా వారి వలన ఏదైనా ముప్పువాటిల్లుతుందేమోనని అలా చెప్పాను. అన్నట్టు ఇది మనకంటే బలమైన చెరసాలలా ఉందే ఇందులోంచి ఎలా తప్పించుకోగలం ? చూసారా, రాతిని దొలిచిన గుహ పైగా ఇనుప చువ్వలకు నా తలకంటే పెద్ద తాళం వేసి మరీ వెళ్లారు. మనసైన్యం ఎక్క డుందో? మనం ఈ గుహలో బందీలయ్యాం అని గుర్తుపట్టగలరా ?

రామలింగడు చెప్తుండగా గుహలోకి ఓకుంటివాడు వచ్చాడు. వాడిని చూడగానే రాయలు గుర్తుపట్టి రేయ్ కుంటి చాకలి ఇటు రారా! అని పిలిచాడు. ఆ గొంతు గతంలో విన్నట్టు గిరుక్కున ఇటు తిరిగాడు,చాకలి తిప్పడు.

తమరు ఎవురు ? ఆ గొంతు వింటుంటే మా రాయలు వారి గొంతులా ఉందే. కొంపదీసి మా మారాజువా? ఏంటికథా .! ఈముదనష్ట గుంపుకు సిక్కిపోయినారా ? దొంగలదొర సానా చెడ్డవాడు. మీకాడ దండిగా ఉంటే దోసుకుని ఒదిలేస్తాడు. ఉందేమిటి ఏదైనా మూట అని తిప్పడు చేతిలో బట్టలమూట పడేసి నేలమీద కూలబడిపోయి మరీ అడిగాడు.

రేయ్ తిప్పా! నీవనుకున్నట్లు నేను మీమహారాజునే. నువు భయంకరమైన నేరం చేస్తున్నావు. నీకు రాజదుస్తులు ఉతికేందుకు బాగానే ముడుతోంది కదా మరి ఇక్కడకు వచ్చి ఈ దొంగలబట్టలుతికి నగర విశేషాలు ఎప్పటికప్పుడు దొంగలకు చెప్పి నగరం దోపిడికి గురవడానికి కారకుడవవుతున్నావు అని కన్నెర్ర చేసాడు రాయలు.

మారాజా మన్నించండి. నేను కావాలని ఇక్కడకు రాలేదు. ఈ దొంగలు నన్ను ఎత్తుకొచ్చి నానావిధాలుగా సావబాదినారు కనుక ఒప్పుకోక తప్పింది కాదు. పైగా నా కొడుకులను సంపేత్తామన్నారు. భయపడిపోయి ఈ ఊడిగం చేస్తున్నా. ఇంతకుమించి నా వలన ఎలాంటికీడు మన నగరానికి లేదు మారాజా అని  నెత్తినోరు బాదుకుని మరీ చెప్పాడు. మద్యలో రామలింగడు అందుకుని ఓయి, ముందు మాకీ చెర నుంచి విముక్తి కలిగించు. అదిగో ఆ బండతో తాళం పగులగొట్టు. బయటపడ్డాక నేను నీకు ఏదండన లేకుండా కాపాడుతాను. నన్ను నమ్మి ముందాపనిచెయ్.

అమ్మో ఆదొంగలు అసలే పరమ మూర్ఖులు. నా ప్రాణం తీయకుండా వదలరు. నా పిల్లాపాపల్ని సంపేత్తారు. నేనాపని నా నిలువెత్తు బంగారం నా మీద పోసినా సెయ్యలేను. కావాలంటే దొంగలకు సెప్పమంటే సేప్పేస్తాను. మీరు బందిఖానాలోకి నెట్టింది ఎవరో కాదు మామారాజు అని దాంతో ఆ బుద్దిలేని పశువులు తెగబయపడిపోయి వదిలేస్తారు. ఆపని సెయ్యమంటారా? తలమీద ఓ మొట్టు కొట్టుకుని గొప్ప తెలివిగా చెప్పాను కదా అన్నట్లు చూసాడు.

రేయ్ తిప్పా ! ఇది రాజాజ్ఞ మీరావంటే శిరచ్చేదమే ముందు తాళం పగులగొట్టు అని రాయలు కోపంగా ఆదేశించాడు.



                                                                                                                       ← PREV || NEXT →

Comments

Popular posts from this blog

Dasarathudu Ayodhyaku Cheratam || దశరథుడు అయోధ్యకు చేరటం || Episode 34 || Ramayanam

Ramayanam || Shiva Dhanassu

Goppa Thyagam || గొప్ప త్యాగం || Moral Stories || నీతి కథలు