ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ || Prema Kosam Rajasabha Varaku Vachhina Alamkaravathi Katha || Episode - 14 || Bhatti Vikramarka Kathalu

Image
  ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ అలంకారవతి చంద్రవర్మను వెంటబెట్టుకొని రాజసభకు వెళ్ళింది. రాజుకు నమస్కరించి అక్కడ నిలబడింది. చంద్రవర్మ ఆ రాజును ఆశీర్వదించాడు. అందగాడైన చంద్రవర్మ గొప్ప తేజస్సుతో, మన్మథుడిలా ప్రకాశిస్తూ ఉండటం చూసి, ఆ పట్టణ ప్రభువైన మహేంద్రవర్మ ఆశ్చర్యపోయాడు. రాజు వారిని కూర్చోమని చెప్పి, వేశ్య కూతురైన అలంకారవతిని చూసి ఇలా అడిగాడు: "ఓ అందగత్తె! నువ్వు ఎవరివి? ఈ నగరంలోనే ఉంటావా? నిన్ను నేనెప్పుడూ చూడలేదే! ఈ బ్రాహ్మణోత్తముడు ఎవరు? ఇతడిని ఇప్పుడు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? మీరు వచ్చిన కారణం ఏంటో వివరించు." అందుకు అలంకారవతి రాజుతో ఇలా అంది: "మహాప్రభూ! నేను ఈ నగరంలోనే పేరుపొందిన ఒక వేశ్య కుమార్తెను. నా పేరు అలంకారవతి. నేను ఒక వ్రతాన్ని నియమంగా పెట్టుకుని, మా వేశ్య కుల మర్యాద అయిన వ్యభిచార వృత్తిని వదిలేశాను. బయటి ప్రపంచానికి కూడా తెలియకుండా ఇప్పటివరకు ఇంట్లోనే కాలం గడిపాను. అందుకే మీరు నన్ను చూసే అవకాశం రాలేదు." ఆ తర్వాత ఆమె తన వ్రతం వివరాలను, ఆ బ్రాహ్మణుడు తన ఇంటికి రావడం, అతడిని చూసి తాను మోహించి, నిద్ర లేపడానికి పడిన తాపత్రయాన్ని, తన మనసులోన...

రాముని గుణగణాలు || Ramuni Gunaganalu || Ramayanam || రామాయణం || Episode 35 ||

 

రాముని గుణగణాలు

భరతశత్రుఘ్నులిద్దరూ మేనమామతోపాటు గిరివ్రజపురానికి వెళ్ళారు. అక్కడ మేనమామ వారికి ఏ కొరతా రాకుండా కన్నబిడ్డల్లా అల్లారు ముద్దుగా చూచుకోసాగాడు. అక్కడ ఆనందంగా కాలక్షేపం చేస్తున్నా కూడా, వాళ్ల మనస్సులు వృద్ధుడైన తండ్రిపైన, ప్రేమపాత్రుడైన రాముడి పైనే ఉన్నవి.

దశరథ మహారాజుకు నలుగురు కుమారులు నాలుగు భుజాలవంటివారు. అందరిపట్లా సమానమైన ప్రేమతో మెలగేవాడు. విష్ణు భగవానుడు ప్రాణులన్నిటి పట్లా సమాన ప్రేమ కలిగి ఉన్నా, బ్రహ్మపట్ల విశేష ప్రేమ కలిగి ఉంటాడట. అట్లాగే దశరథుడు కూడా నలుగురు పుత్రుల పట్లా నమానమైన ప్రేమ కలిగి ఉన్నా రాముడంటే ప్రాణం. ఎందుకంటే అతడు రావణ సంహారానికై మానవ రూపంతో వచ్చిన విష్ణుభగవానుడే గదా! రాముని చూసుకొని కౌసల్యాదేవి కూడా ఇంద్రుని చూసుకొని మురిసిపోయే అదితి లాగా మురిసిపోయేది.

రాముని గుణగణాలు వర్ణించి చెప్పడం ఎవరి వల్ల సాధ్యపడుతుంది? తండ్రిలాగానే పరాక్రమవంతుడు, అందగాడు, అసూయ లేనివాడు. మృదువుగాను, మధురంగాను మాట్లాడతాడు. పరుషంగా మాట్లాడటం తనకు చేతకాకపోగా, ఎవరైనా మాట్లాడినా బదులు చెప్పేవాడు కాడు.

రాముడిది ఎంత మంచి మనసంటే, ఏ పాటి చిన్న ఉపకారానికైనా పొంగిపోయేవాడు. ఎంత పెద్ద తప్పుచేసిన వాడినైనా పెద్ద మనస్సుతో క్షమించేవాడు. అందువల్ల అతడి ముఖం ఎప్పుడూ చంద్రుని వెన్నెలలాగా చల్లగా ఉంటూ చూసేవారికి ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉంటుంది.

విలువిద్యలు నేర్చుకుంటూ, విరామ సమయాల్లో, వయస్సులో పెద్దవారిని, గుణశీలురైన వారితో కలసి కూర్చుని సదాచారాల గురించీ, పరంపరాగత సత్సంప్రదాయాల గురించి చర్చించేవాడు. అట్లాగే జ్ఞానవృద్ధులతో కూర్చుని వేదాంత రహస్యాలను గూర్చి అడిగి తెలుసుకునేవాడు.

రాముడు వినయ సంపన్నుడు. ఎవరైనా ఎదురు పడితే ముందుగా తానే పలకరించి మాట్లాడేవాడు. తను ఎంతటి పరాక్ర మశాలి అయినా, తన పరాక్రమాన్ని చూసుకొని గర్వపడే వాడు కాడు.

రాముడికి అన్ని విషయాల్లోనూ విశేష జ్ఞానమున్నది. పెద్దలను ఎల్లప్పుడూ పూజించి గౌరవించేవాడు. ఎల్లప్పుడూ సత్యాన్నే మాట్లాడేవాడు. తాను ప్రజలనెంతగా ప్రేమించే వాడో, ప్రజలు అతడిని అంతకు నూరురెట్లు అధికంగా ప్రేమించే వారు.

రాముడు దీనుల పట్ల దయ కలిగి ఉండేవాడు. బ్రాహ్మణులను పూజించేవాడు.ధర్మాలన్నీ తెలిసినవాడు. కోపమన్నదే ఎరుగని వాడు. పరిశుద్ధమైన ప్రవర్తన కలిగిన వాడు. క్షత్రియ ధర్మాన్ని ఆచరించడంలో, పరిరక్షించడంలో అత్యంత ఆదరం చూపేవాడు. ఆ విధంగా క్షత్రియ ధర్మాన్ని పరిరక్షించడం వల్లనే యశస్సు, స్వర్గం, సౌఖ్యాలు సమకూరుతాయని నమ్మినవాడు.

యుక్తిగాను, చక్కగాను మాట్లాడటంలో బృహస్పతి వంటి పాండిత్యం కలిగినవాడు. సారంలేని మాటలంటే ఇష్టపడేవాడు కాడు. ధర్మబద్ధంకాని, శ్రేయస్కరం కాని పనుల జోలికి పోయేవాడు కాడు. మంచి వాక్చాతుర్యం కలవాడు.

రాముడు అందమైన దేహం కలిగినవాడు. ఏ విధమైన రుగ్మతలూ అతడి సమీపానికి కూడా పోయేవి కావు. ఎప్పుడు, ఏ పని, ఏ విధంగా చేసి సఫలీకృతుడు కావాలో బాగా తెలిసినవాడు. ఎదుటివారి సత్తాని అంచనా వేయడంలో దిట్ట. లోకంలో జన్మించిన ఏకైక సత్పురుషుడు. ఇన్ని శ్రేష్టమైన గుణాలు కలిగిన రాముడంటే ప్రజలందరికీ అమితమైన ప్రేమ. వారందరికీ ఆయన ఆరవ ప్రాణంగా మెలగేవాడు.

రాముడు సాంగ, వేదవిద్యలన్నింటిలోను నిష్టాతుడై, ధనుర్విద్యయందు తండ్రి దశరథుణ్ణే మించిపోయాడు. ధర్మార్థకామాల యథార్థ స్వరూపాన్ని ఎరిగిన వాడు. శాస్ట్రాల సముదాయంలో చెప్పబడిన అర్థాలన్నిటినీ ఒకదానికొకటి చక్కగా సమన్వయపరచడంలో గొప్ప ప్రావీణ్యాన్ని సమపార్డించాడు. ధర్మానికి అర్ధం వివరించాల్సి వచ్చినప్పుడు తగిన జాగ్రత్తలన్నీ తీసుకొని ఆ తరువాతే భోగాలనుభవించేవాడు.

రామునికి అర్థశాస్త్రం చక్కగా తెలుసు. సంపాదించిన ధనాన్ని అయిదు విధాలుగా విభజించేవాడు 1. ధర్మానికి, 2. కీర్తి కొరకు, 3. లౌకిక వ్యవహారాలకు, 4. ఇహానికి 5. పరానికి, సంగీత, నృత్య, సాహిత్యాలను వినోదించటంలో నేర్పుగలవాడు.

రాముడు లోకంలోని ధనుర్వేద వేత్తలలో శ్రేష్టుడు. గుర్రాలను, ఏనుగులను లొంగ తీసుకొని సేనలను నడపడంలో నైపుణ్యం గలవాడు. అతిరథులందరి మెప్పు పొందినవాడు. ఆ నైపుణ్యంతో శత్రుసేనలను నాశనం చేసేవాడు.

రాముడు అసూయను, క్రోధాన్ని జయించాడు. (ఇతరుల గుణాలందు దోషాల నెంచటాన్ని అసూయ అంటారు. ఇతరుల ఉన్నతిని చూసి ఓర్వలేకపోవటాన్ని మత్సరం అంటారు) ఏ ప్రాణినీ అవమానించకుండా, సందర్భాన్ని బట్టి సర్దుకు పోయేవాడు.

రాముడు సహనంలో భూమితో పోల్పదగినవాడు. బుద్ధిలో బృహస్పతితోను, 'పరాక్రమంలో ఇంగ్రునితోను సమానుడు.

దశరథుడు ఇలా తలచాడు: నా రాముడు పరాక్రమంలో దేవేంద్రునితోను, యమునితోను పోల్పదగినవాడు. బుద్ధియందు. బృహస్పతితో సమానుడు... ధైర్యంలో. పర్వతంతో పోల్చదగినవాడు. నాకన్నా అధిక పరాక్రమశాలి.

ప్రజల అభివృద్ధిని కోరుతూ, ప్రజలందరి మన్ననలను పొందినవాడు. ప్రజలు నా కంటే ఎక్కువగా రాముణ్ణి ప్రేమిస్తున్నారు. అలాంటి నా రామునికి రాజ్యాభిషేకం చేయాలని నా మనస్సు తహతహలాడుతున్నది. అంతేకాదు. రాముడు ప్రభువు కావాలని భూదేవియే కోరుకొంటున్నది.

అలాంటి నా కుమారుడు ఈ భూమండలాన్నంతా పరిపాలించడం నా జీవిత కాలంలో చూసి, స్వర్గానికి పోగలనా? నా రామునిలో నేనింతవరకు తలచినవే కాక ఇంకా అనేక శుభగుణాలు ఉన్నవి. అట్టి లోకోత్తరుడైన రాముణ్ణి యువరాజును చేయాలి. మంత్రులందరిని సంప్రదించి రాముని రాజ్యాభిషేకానికి త్వరగా ఏర్పాట్లు చేయించాలి.

అంతట ధర్మాత్ముడైన దశరథ మహారాజు మంత్రులను, రాజులను, నగర పాలకులను, గ్రామాధికారులను అతి త్వరగా సమావేశపరచాడు. రాముని యువరాజు పట్టాభిషేకానికి త్వరపడవలసిన సమయం ఆసన్నమైనదని వివరించాడు. ఆ తొందరలో కేకయరాజుకుగాని, జనక మహారాజుకుగాని వర్తమానం పంపలేదు. కనీసం భరతుణ్ణి కూడా పిలిపించలేదు. రాజ్యాభిషేకం అయిన తరువాత సంతోషపడతారు లెమ్మని తలచాడు.

వచ్చిన అతిథులందరికీ ఉచితరీతిన మర్యాదలు చేసి, వారందరికీ అనేక కానుకలిచ్చి సత్కరించాడు. వారంతా ఆయన సమ్ముఖంలో ఆసీనులై ఉన్నారు.



                                                                                                                                         ← PREV || NEXT →

Comments

Popular posts from this blog

Dasarathudu Ayodhyaku Cheratam || దశరథుడు అయోధ్యకు చేరటం || Episode 34 || Ramayanam

Ramayanam || Shiva Dhanassu

Goppa Thyagam || గొప్ప త్యాగం || Moral Stories || నీతి కథలు