జమదగ్ని మహర్షి మరియు విశ్వామిత్ర మహర్షి జననం
ఇప్పుడు మనం జమదగ్ని మహర్షి మరియు విశ్వామిత్ర మహర్షి జననం గురించి తెలుసుకుందాం!
బ్రహ్మకు కుశుడు అనే కొడుకు గాధి అనే మనమడు ఉన్నారు కదా!
గాధికి ఒక కూతురు ఉంది తన పేరు సత్యవతి, ఋచికా మహర్షి సత్యవతి ని చూసి ఇష్టపడి పెళ్ళి చేసుకోవాలని అనుకొని, సత్యవతిని తనకిచ్చి పెళ్ళి చేయమని కోరాడు.గాధి రాజుు కి యవ్వనవతి మరియు అందమైన తన కూతురిని వృద్ధుడైన మరియు కోపిష్టి అయిన ఋచికా మహర్షికి ఇచ్చి పెళ్లి చేయడం ఇష్టం లేేదు.
అందుకని గాధిరాజు ఋచికా మహర్షి తో ఇలా అన్నాడు: ఏమని అంటే నువ్వు వెయ్యి తెల్ల గుర్రాలు ఇవ్వాలి అయితే తెలుపు గుర్రాలకిి ఒక నలుపు చెవి ఉండాలి అని కోరాడు.
ఇది సాధ్యం కాదు అని అనుకొని గాధిరాజు చాలా ధైర్యంగా ఉన్నాడు.
కానీ ఋచికా మహర్షి వెంటనే తపస్సుచేసి వరుణ దేవుడిని ప్రసన్నం చేసుకుుని, వరుణదేవుడు సహాయంతో గుర్రాలను సంపాదించి వాటిని ఆయన గాధిరాజుకి ఇచ్చి సత్యవతిని పెళ్లిచేసుకున్నాడు. వారు సంతోషంగా ఆశ్రమంలో వారి జీవితాన్ని గడుపుతున్నాారు.
కొన్ని రోజుల తర్వాత సత్యవతి తనకి కొడుకు కావాలని అనుకున్నది, అలాగే సత్యవతి తన తండ్రి రాజ్యం కోసం తన తండ్రికి ఒక కొడుకు కావాలి అని అనుకున్నది.
సత్యవతి తనకు గొప్ప జ్ఞానం ఉన్న మరియు శాంత స్వభావి అయిన వాడిని కొడుకుగా కావాలి అని అనుకుంది కానీ సత్యవతి తల్లి యోధుడి లక్షణాలు మరియు పరాక్రమం ఉన్న వాడిని తన కొడుకుగా కావాలని కోరుకుంది.
ఋచికా మహర్షి గొప్ప శక్తివంతమైన వాడు కదా, అందుకని అతను ఒక యాగం చేసి రెండు గిన్నెల మాయగంజిని తయారు చేశారు, అందులో ఒకటి సత్యవతి కోసం శాంతి స్వభావం కల మంత్రాలను మరియు సత్యవతి తల్లి కోసం చేసిన దానిలో యోధుడు లక్షణాలు ఉన్న మంత్రాలను కలిపి వాటిని తయారు చేశాడు.
కానీ సత్యవతి తల్లి ఏమని అనుకుంది ఏంటే ఋచికా మహర్షి కచ్చితంగా చాలా శక్తివంతమైన గంజి తన భార్యకు ఇచ్చి ఉంటాడు అని అనుకుని ఆ రెండు గిన్నెలు మార్చమని తన కూతురికి చెప్పింది, తల్లి చెప్పినట్టే మార్చింది.
కొన్నిరోజులకు వారు గర్భవతులయ్యారు, కొన్ని రోజుల తరువాత మహర్షికి సందేహం కలిగింది. ఎందుకంటే అది చాలా శక్తివంతముగా ఉన్నది ,అప్పుడుు మహర్షి గర్భం పట్టుకొని జరిగిన విషయం తెలుసుకొని కోపం తెచ్చుకున్నారు.
అప్పుడు మహర్షి సత్యవతితో ఇలా అన్నాడు: నీకు యోధుడైన కొడుకు నీ తల్లికి శాంతి వంతమైన కొడుకు పుడతారు అని చెప్పారు. అంతా తారుమారు అయింది అని గ్రహించి సత్యవతి బాధపడుతూ, క్షమాపణలు కోరి నాకు శాంతంగా ఉండే కొడుకు కావాలి అని కోరింది.
మహర్షి ఒప్పుకొని నీకు శాంత స్వభావి అయిన కొడుకు పుడతాడు అని చెప్పాడు, కానీ నీ మనుమడు యోధుడు అవుతాడు అని చెప్పాడు.
అందువలన సత్యవతికి జమదగ్ని మహర్షి తన తల్లికి విశ్వామిత్ర మహర్షి జన్మించారు.
కుశ వంశంలో జన్మించారు కనుక వీళ్లను కౌశికుడు మరియు కౌశికి అంటారు.
కొంతకాలానికి ఋచికా మహర్షి తన శరీరం విడిచి స్వర్గానికి వెళతాడు, సత్యవతి కుడా ఉండలేక తన శరీరంతో సహా స్వర్గానికి వెళ్లి పోతుంది కాని, సకల లోకాల ఉపయోగం కోసం కౌశికి నదిగా మారి హిమవతి పర్వతంపై ప్రవహిస్తూ ఉంటుంది.
ఈ విధముగా సత్యవతి కౌశికి నది గా మారింది.
Comments