ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ || Prema Kosam Rajasabha Varaku Vachhina Alamkaravathi Katha || Episode - 14 || Bhatti Vikramarka Kathalu

Image
  ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ అలంకారవతి చంద్రవర్మను వెంటబెట్టుకొని రాజసభకు వెళ్ళింది. రాజుకు నమస్కరించి అక్కడ నిలబడింది. చంద్రవర్మ ఆ రాజును ఆశీర్వదించాడు. అందగాడైన చంద్రవర్మ గొప్ప తేజస్సుతో, మన్మథుడిలా ప్రకాశిస్తూ ఉండటం చూసి, ఆ పట్టణ ప్రభువైన మహేంద్రవర్మ ఆశ్చర్యపోయాడు. రాజు వారిని కూర్చోమని చెప్పి, వేశ్య కూతురైన అలంకారవతిని చూసి ఇలా అడిగాడు: "ఓ అందగత్తె! నువ్వు ఎవరివి? ఈ నగరంలోనే ఉంటావా? నిన్ను నేనెప్పుడూ చూడలేదే! ఈ బ్రాహ్మణోత్తముడు ఎవరు? ఇతడిని ఇప్పుడు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? మీరు వచ్చిన కారణం ఏంటో వివరించు." అందుకు అలంకారవతి రాజుతో ఇలా అంది: "మహాప్రభూ! నేను ఈ నగరంలోనే పేరుపొందిన ఒక వేశ్య కుమార్తెను. నా పేరు అలంకారవతి. నేను ఒక వ్రతాన్ని నియమంగా పెట్టుకుని, మా వేశ్య కుల మర్యాద అయిన వ్యభిచార వృత్తిని వదిలేశాను. బయటి ప్రపంచానికి కూడా తెలియకుండా ఇప్పటివరకు ఇంట్లోనే కాలం గడిపాను. అందుకే మీరు నన్ను చూసే అవకాశం రాలేదు." ఆ తర్వాత ఆమె తన వ్రతం వివరాలను, ఆ బ్రాహ్మణుడు తన ఇంటికి రావడం, అతడిని చూసి తాను మోహించి, నిద్ర లేపడానికి పడిన తాపత్రయాన్ని, తన మనసులోన...

Droupadiki aiduguru Bhartalu enduku unnaru? || Why Droupadi have 5 husbands?

 ద్రౌపదికి ఐదుగురు భర్తలు ఎందుకు ఉన్నారు?

మనం ఇప్పటికీ చాలాసార్లు మహాభారతం వినే ఉంటాం కదా!
అలాగే మహాభారతం సీరియల్స్ లో కూడా చూస్తుంటాం. 
 సాధారణంగా మహాభారతం అనగానే  గుర్తు వచ్చేది  పాండవులు, కౌరవులు, ద్రౌపది, కురుక్షేత్ర యుద్ధం. 
 ఇప్పుడు మనం ద్రౌపది కి ఎందుకు ఐదుగురు భర్తలు ఉన్నారో  తెలుసుకుందాం!

పూర్వము త్వష్ట ప్రజాపతి పుత్రుడు త్రిశిరుడు. త్రిశిరుడు మాయవి అయి తపస్సు చేస్తుండగా ఆ విషయాన్ని దేవేంద్రుడు తెలుసుకొని త్రిసురుడి తలని తన వజ్రాయుధంతో ఖండించి వేశాడు.

అందువలన ఇంద్రుడికి బ్రహ్మహత్యాపాతకం చుట్టుకుంది, ఆ బ్రహ్మ హత్య వలన ఇంద్రుని తేజస్సు నాలుగు భాగాలుగా విడిపోయింది.
అందులో ఒక భాగము యమధర్మరాజు లో, రెండవ భాగము వాయుదేవుడిలో, మూడు నాలుగు భాగాలు అశ్వినీ దేవతల లో ప్రవేశించింది. తరువాత ఈ 4 తేజస్సులు భూలోకములో కుంతీదేవికి పుత్రులుగా జన్మించారు. వారే ధర్మరాజు, భీముడు, నకులసహదేవులు, దేవేంద్రుడు స్వయముగా అర్జునుడిగా పుట్టాడు. 
 దేవేంద్రుడి భార్య అయిన శచి దేవి ద్రుపద మహారాజు తో చేయబడిన యాగములో అగ్ని గుండం నుంచి ద్రౌపదిగా పుట్టింది, అందుకని ద్రౌపదికి అయిదుగురు భర్తలు ఉన్నారు అంటే కుంతీదేవి యొక్క ఐదుగురు బిడ్డలు ఇంద్రుని రూపాలు కనుక ద్రౌపది ఆ ఐదుగురికి భార్య అయింది. 

 


Prev

Comments

Popular posts from this blog

Dasarathudu Ayodhyaku Cheratam || దశరథుడు అయోధ్యకు చేరటం || Episode 34 || Ramayanam

Ramayanam || Shiva Dhanassu

Goppa Thyagam || గొప్ప త్యాగం || Moral Stories || నీతి కథలు