ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ || Prema Kosam Rajasabha Varaku Vachhina Alamkaravathi Katha || Episode - 14 || Bhatti Vikramarka Kathalu

Image
  ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ అలంకారవతి చంద్రవర్మను వెంటబెట్టుకొని రాజసభకు వెళ్ళింది. రాజుకు నమస్కరించి అక్కడ నిలబడింది. చంద్రవర్మ ఆ రాజును ఆశీర్వదించాడు. అందగాడైన చంద్రవర్మ గొప్ప తేజస్సుతో, మన్మథుడిలా ప్రకాశిస్తూ ఉండటం చూసి, ఆ పట్టణ ప్రభువైన మహేంద్రవర్మ ఆశ్చర్యపోయాడు. రాజు వారిని కూర్చోమని చెప్పి, వేశ్య కూతురైన అలంకారవతిని చూసి ఇలా అడిగాడు: "ఓ అందగత్తె! నువ్వు ఎవరివి? ఈ నగరంలోనే ఉంటావా? నిన్ను నేనెప్పుడూ చూడలేదే! ఈ బ్రాహ్మణోత్తముడు ఎవరు? ఇతడిని ఇప్పుడు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? మీరు వచ్చిన కారణం ఏంటో వివరించు." అందుకు అలంకారవతి రాజుతో ఇలా అంది: "మహాప్రభూ! నేను ఈ నగరంలోనే పేరుపొందిన ఒక వేశ్య కుమార్తెను. నా పేరు అలంకారవతి. నేను ఒక వ్రతాన్ని నియమంగా పెట్టుకుని, మా వేశ్య కుల మర్యాద అయిన వ్యభిచార వృత్తిని వదిలేశాను. బయటి ప్రపంచానికి కూడా తెలియకుండా ఇప్పటివరకు ఇంట్లోనే కాలం గడిపాను. అందుకే మీరు నన్ను చూసే అవకాశం రాలేదు." ఆ తర్వాత ఆమె తన వ్రతం వివరాలను, ఆ బ్రాహ్మణుడు తన ఇంటికి రావడం, అతడిని చూసి తాను మోహించి, నిద్ర లేపడానికి పడిన తాపత్రయాన్ని, తన మనసులోన...

viswamitrunni kousikudu ani enduku antaru?

 విశ్వామిత్రుణ్ణి కౌశికుడు అని ఎందుకు అంటారు?

ఇప్పుడు మనం విశ్వామిత్రుని కౌశికుడు అని ఎందుకంటారో తెలుసుకుందాం! సుబాహు మా రుచులను వధించాక  వారు మిథిలా నగరానికి వెళుతూ ఉంటారు కదా.

 దారి మధ్యలో అక్కడ ఒక దేశం ఉంది కదా,ఆ దేశం ఏమిటి అని రాముడు అడుగుతాడు కదా ఇప్పుడు ఆ దేశం గురించి తెలుసుకుందాం.

విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు ఆ దేశం గురించి ఇలా చెప్తాడు: పూర్వం బ్రహ్మయొక్క కుమారుడు కుశుడు అనే మహా తపస్వీ ఉండేవాడు. ఆయన వైదర్భీ అని రాజు కుమార్తెను వివాహం చేసుకున్నాడు వారికి నలుగురు కుమారులు వారి పేర్లు కుశాంబుడు, కుశనాభుడు, ఆధూర్త రజసుడు,   వసువు.

తరువాత అతను తన రాజ్యాన్ని  తన నలుగురు కుమారులు పంచి న్యాయంగా పరిపాలన చెయ్యాలి అని ఆజ్ఞాపించాడు, వారు తండ్రి మాటను అనుసరించి నాలుగు నగరాలను నిర్మించారు. ఆ నగరాల పేర్లు ఏమిటంటే :

కుశాంబుని  చేత నిర్మించబడిన నగరం కౌశింబి 

కుశనాధునిచేత నిర్మింపబడిన నగరం మహోదయము 

ఆధూర్త రజసుని చేత నిర్మింపబడిన నగర ధర్మారణ్యము

వసువు చేత నిర్మింపబడిన నగరం గిరివజ్రపురం.

మనం ఇప్పుడు ఉన్న ప్రాంతం గిరివజ్రపురం, ఈ దేశం చుట్టూ అయిదు పర్వతాలున్నాయి ఈ శోణానదీ ఆ పర్వతాలలోని పుట్టి ఈ ప్రదేశాన్ని సస్యశ్యామలంగా చేస్తుంది.

కుశుడి కుమారులలో కుశనాభుడు అని వాడు ఉన్నాడు కదా! కుశనాభుడి కి వంద మంది కుమార్తెలు వాళ్లందరూ కూడా ఘృతాచి అనే అప్సరస కి, కుశనాభుడి కి జన్మించారు, వారంతా చాలా అందంగా ఉంటారు.

ఒకనాడు ఆ వంద మంది కన్యలు ఆడుతూ,పాడుతూ ఉల్లాసంగా వనంలో వుండగా వాయు దేవుడు వారిని చూసి ,ఇష్టపడి వారిని పెళ్లాడాలి అని కోరాడు అలా అయితే వారికి ముసలితనము,చావులేకుండా చేస్తాను అని అన్నాడు.

కానీ ఆ నూరుగురు కన్యలు ఒకేసారి నువ్వు ఇలా మాట్లాడడం బాగోలేదు

 మాకు నిన్ను శపించే శక్తి కలదు కానీ మేము మా శక్తిని వృధా చేయము. ఎందుకంటే మేము మా తండ్రి నిర్ణయించిన వారిని తప్ప ఇంకా ఎవ్వరినీ భర్తగా చేసుకోము అని అన్నారు,  దానితో వాయుదేవునికి కోపం వచ్చి వారిని మరుగుజ్జులుగా అంటే వారికి ఏమాత్రం బలం లేకుండా చేశాడు వారు ఎలాగో అంత:పురానికి   వెళ్లి జరిగినది మొత్తం వారి తండ్రి అయినా కుశనాభుడికి చెప్తారు. తన కుమార్తెలు ప్రదర్శించిన  ఐకమత్యము, ఓర్పును చూసి కుశనాభుడు సంతోషించాడు.

ఇక తన కూతుళ్ల పెళ్లి చేయాలని కుశనాభుడు అనుకున్నాడు. ఆ సమయమున చూలీ అనే మహర్షికి, ఊర్మిళల కుమార్తె అయిన సోమద అనే గంధర్వ స్త్రీ సేవలు చేస్తూ ఉండేది. అలా చేస్తూ ఉండగా ఒకనాడు ఆ మహర్షి సోమద తో నేను నీకు ఏమి చేయగలను అని అడిగాడు.

అప్పుడు సోమద నేను ఎవరికీ భార్యను కాను,కానీ అపారమైన తపశ్శక్తి, బ్రహ్మ తేజస్సు కలిగిన మీ వలన శారీరక అనుబంధం లేకుండా మీ తపశ్శక్తి వలన నా కుమారుడు కావాలి అని అడిగింది.

అప్పుడు ఆ చూళీ మహర్షి సంకల్పం చేసి బ్రహ్మదత్తుడు అని పుత్రుణ్ని ప్రసాదించాడు. బ్రహ్మజ్ఞాని అయిన బ్రహ్మదత్తుడు కాంపిల్యా నగరాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు

అతనికి ఇచ్చి కుశనాభుడు తన వందమంది కుమార్తెల వివాహం చేశాడు. వివాహం చెయ్యాలి అంటే  పాణిగ్రహణం చెయ్యాలి కదా అలా ప్రతి కుమార్తెను బ్రహ్మదత్తుడు తాకగానే మరుగుజ్జుతనం పోయి ఇంతకుముందు లాగా అందంగా తయారయ్యారు.

వారిని చూసి సోమద చాలా సంతోషించింది . సోమద తన కొడుకుతో మరియు తన వందమంది కోడళ్లతో కలిసి కాంపిల్యా నగరానికి వెళ్లిపోయింది.

కూతుళ్లకి అందరికీ పెళ్లిచేశాక కుశనాభుడు కొడుకును కోరి పుత్రకామేష్ఠి యాగం చేశాడు ,ఆయన పుత్ర కామేష్ఠి యాగం చేస్తూ ఉండగా కుశనాభుడి తండ్రి అయిన  కుశ మహారాజు వచ్చి నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది, మీకు గాధి అనేవాడు కొడుకుగా జన్మిస్తాడు అని చెప్పి బ్రహ్మలోకానికి వెళ్లిపోతాడు, నేను ఆ గాధి కుమారుణ్ణి అని చెప్పాడు విశ్వామిత్రుడు.

మేము కుశ వంశంలో జన్మించాను కనుక నన్ను కౌశికుడు అని కూడా అంటారు.

 నాకు ఒక అక్క వుంది తన పేరు సత్యవతి. తనుకూడా కుశ వంశంలో జన్మించింది కనుక  తనను కౌశికి అని కూడా అంటారు.

మా అక్క పేరుతో కౌశికీనది ఏర్పడింది, ఆ నది హిమాలయ పర్వత ప్రాంతంలో ప్రవహిస్తూ ఉంటుంది.మా అక్క పై ఉన్న అభిమానంతో నేను ఎక్కువగా హిమాలయ ప్రాంతంలో కౌశికీనది తీరంలో ఉంటాను.యాగం కోసం అని సిద్ధాశ్రమంకి వచ్చాను అని చెప్తాడు.



←Prev                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                Next→                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                  

Comments

Popular posts from this blog

Dasarathudu Ayodhyaku Cheratam || దశరథుడు అయోధ్యకు చేరటం || Episode 34 || Ramayanam

Ramayanam || Shiva Dhanassu

Goppa Thyagam || గొప్ప త్యాగం || Moral Stories || నీతి కథలు