కుమారసంభవం ఎలా జరిగింది?
కుశ వంశం గురించి తెలుసుకున్న రామలక్ష్మణులు ఆనాడు అక్కడే నిద్రపోయి, మరునాడు అందరూ ప్రాతఃకాలమున నిద్రలేచి సంధ్యావందనం చేసి ప్రయాణానికి సిద్ధమయ్యారు, మధ్యాహ్న సమయానికి గంగా నది తీరానికి చేరుకున్నారు.
అందరూ గంగ ని చూసి సంతోషించి అక్కడున్న మునులు పితృదేవతలకు తర్పణాలు చేసి, అగ్నిహోత్రము విశ్వామిత్రుడు చుట్టూ కూర్చున్నారు. అప్పడు శ్రీరాముడు గంగకి త్రిపథగ అన్న పేరు ఎలా వచ్చిందో చెప్పమన్నాడు, అప్పుడు విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు.
పూర్వ కాలములో హిమవంతుడు అనే పర్వతరాజు ఆయన భార్య మనోరమ ఉండేవారు. వాళ్ళ పెద్ద కుమార్తె గంగ రెండవ కుమార్తె ఉమ. స్వేచ్ఛగా ప్రవహించే గలిగి గుణం ఉన్న గంగను స్వర్గలోకానికి పంపిస్తే ఆ నదీ జలాలని ఉపయోగించుకొని మేము తరిస్తాము అని దేవతలు హిమవంతుడిని అడుగగా దైవకార్యం కనుక హిమవంతుడు సరే అన్నాడు. అలా దేవనదిగా గంగ స్వర్గలోకంలో ప్రవహించేది, ఆయన రెండవ కుమార్తె అయిన ఉమా తపస్సు చేత శివుడికి భార్య అయి హైమవతి గా తన తండ్రి పేరు నిలబెట్టింది. పరమ పావని అయిన గంగ ఒకనాడు భూలోకానికి తీసుకురాబడి పాతాళానికి చేరింది, మూడు లోకములలో ప్రవహించింది కనుక గంగను త్రిపథగ అంటారు.
ఇంకా గంగ గురించి చెప్పండి అని విశ్వామిత్రుడిని రాముడు కోరాడు, అప్పుడు విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు మీకు ముందుగా షణ్ముఖ ఉత్పత్తి గురించి చెప్తాను అని ఇలా చెప్పాడు:
పార్వతీపరమేశ్వరులు వివాహం జరిగాక వంద సంవత్సరాలు క్రీడించారు. ఇది తెలుసుకున్న దేవతలు ఇలా అనుకున్నారు, పార్వతీ పరమేశ్వరుల తేజస్సులు అసామాన్యమైనవి కాబట్టి వాళ్ళ కలయిక వలన జన్మించే వారిని మనము తట్టుకోలేము అని అనుకుని దేవతలంతా బయలుదేరి కైలాసానికి వెళ్లి శంకరుడిని ప్రార్ధించారు. అప్పుడు శివుడు బయటికి వచ్చి ఏమైంది అని అడుగగా దేవతలు శివుడితో ఇలా చెప్పారు, మీ ఇద్దరి తేజస్సు కలిస్తే మేము తట్టుకోలేము కనుక మీరు మీ తేజస్సుని మీలోనే పెట్టుకోండి అని అడిగారు.
దానికి శివుడు ఒప్పుకుని అలాగే కానీ ఇప్పటికే నా తేజస్సు కదిలింది, ఇప్పుడు దాన్ని ఎక్కడ వదిలిపెట్టను అని శంకరుడు అడిగాడు. అప్పుడు ఆ దేవతలు భూమి భరిస్తుంది అని చెప్పి మీ తేజస్సుని భూమి మీద వదిలిపెట్టండి అని చెప్పారుు. దేవతలు చెప్పినట్లే శివుడు తన తేజస్సుని భూమి మీద వదిలిపెట్టాడు ఆ తేజస్సు భూమి అంతా వ్యాపించింది. ఇంతలో పార్వతీదేవి బయటకి వచ్చి నాకు బిడ్డ పుట్టకుండా చేసి మీరు శంకర తేజస్సుని భూమి మీద పతనం చేశారు, అని పార్వతీదేవి కోపం తెచ్చుకుని మీరు అంతా కలిసి నాకు పిల్లలు లేకుండా చేశారు కనుక ఎవరికీ మీ భార్యల వలన పిల్లలు పుట్టరు, నా భర్త అయిన శంకరుడి తేజస్సుని భరించడానికి భూమి ఒప్పుకుంది కనుక ఇక నుండి భూమికి అనేక రూపాలు ఉంటాయి, అలాగే ఒకే కాలంలో భూమి కి అనేక మంది భర్తలు ఉంటారు అని శపించింది.ఇది అంతా జరిగాక పార్వతీపరమేశ్వరులు తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతారు.
కానీ భూమి శంకరుడి తేజస్సుని తట్టుకోలేకపోయింది, అప్పుడు దేవతలు అగ్నిదేవుడిని వాయువుతో కలిసి ఈ తేజస్సుని తనయందు పెట్టుకోమన్నారు, అప్పుడు అగ్నిదేవుడు ఆ తేజస్సుని తనలో పెట్టుకున్నాడు.
అదే సమయంలో తారకాసురుడు అనే రాక్షసుడు అతను ఉమాశంకరుల బిడ్డ చేతిలో చనిపోయేలా వరం పొందాడు, ఇది తెలిసిన దేవతలకి ఏమి చెయ్యాలో తెలియక బ్రహ్మ దగ్గరకు వెళ్ళి సలహా అడిగారు. అప్పుడు బ్రహ్మ ఆలోచించి అగ్నిదేవుడు దగ్గర ఉంది కదా! దానిని గంగాదేవి యందు వదిలి పెట్టండి అని చెప్పాడు. గంగాదేవినే ఎందుకు ఎంచుకున్నారు అంటే పార్వతి దేవి అందరి దేవతలకు శాపం ఇచ్చింది కదా! అందుకని ఎంతైనా గంగాదేవి పార్వతి దేవి అక్క కదా అల అయితే పార్వతీదేవి ఏమి అభ్యంతరం చెప్పదు అని గంగాదేవిని ఎంచుకున్నారు.
అప్పుడు డు ఆ దేవతలు గంగమ్మ దగ్గరకు వెళ్లి దైవ కార్యం కోసం నువ్వు అగ్ని నుండి శివ తేజస్సుని స్వీకరించి గర్భం ధరించాలి అన్నారు. దైవ కార్యం కనుక గంగ సరే అన్నది.
అప్పుడు గంగ ఒక అందమైన స్త్రీ రూపం దాల్చి ఆ తేజస్సుని అగ్ని నుండి స్వీకరించింది, కానీ శివ తేజస్సును గంగా కూడా తట్టుకోలేకపోయింది ఈ తేజస్సుని నేను భరించలేను నన్ను ఏమి చెయ్యమంటారు అని దేవతలను అడిగింది. అప్పుడు వాళ్ళు హిమవతపర్వటం కింద వదిలిపెట్టు అన్నారు.
అక్కడ వదిలిపెట్టకా ఆ తేజస్సు కి బంగారం,వెండి, తగరం, సీసం పుట్టాయి. అలాగే రాగి, ఇనుము మరియు ఇంకా ఇతర ఖనిజాలు పుట్టాయి. అలాగే ఒక పిల్లవాడు పుట్టాడు, ఆ పిల్లాడిని చూసుకోవడానికి ఇంద్రుడు కృత్తికలను పంపుతాడు. కృత్తికలు అంటే ముని కన్యలు కానీ ఆ కృత్తికలు ఇతనిని మా కొడుకు గా పిలిస్తేనే మేము ఈ బిడ్డను చూసుకుంటాము అని అంటారు. దేవతలు ఒప్పుకొని అతనిని మీ బిడ్డగా కార్తికేయడుగా పిలుస్తారు అని చెప్తారు.
ఆ పిల్లవాడు 6 ముఖాలతో పుట్టాడు అతడు ఒకే సమయంలో ఆరుగురి కృత్తికల దగ్గరనుండి తన ఆరు ముఖాలతో ఆరుగురు దగ్గర పాలు తాగుతాడు.
దీనినే షణ్ముకోత్పత్తి అంటారు , దీనినే కుమారసంభవం అని కూడా అంటారు.
ఉమాశంకరుల కి బిడ్డ పుట్టాలి అని ఉంటే మామూలుగా కొట్టొచ్చు కదండీ కానీ ఇంతలా జరిగింది కదా, దీని వెనుక ఒక కథ ఉంది అదేసనత్కుమారుడి కథ.
Comments