ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ || Prema Kosam Rajasabha Varaku Vachhina Alamkaravathi Katha || Episode - 14 || Bhatti Vikramarka Kathalu

Image
  ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ అలంకారవతి చంద్రవర్మను వెంటబెట్టుకొని రాజసభకు వెళ్ళింది. రాజుకు నమస్కరించి అక్కడ నిలబడింది. చంద్రవర్మ ఆ రాజును ఆశీర్వదించాడు. అందగాడైన చంద్రవర్మ గొప్ప తేజస్సుతో, మన్మథుడిలా ప్రకాశిస్తూ ఉండటం చూసి, ఆ పట్టణ ప్రభువైన మహేంద్రవర్మ ఆశ్చర్యపోయాడు. రాజు వారిని కూర్చోమని చెప్పి, వేశ్య కూతురైన అలంకారవతిని చూసి ఇలా అడిగాడు: "ఓ అందగత్తె! నువ్వు ఎవరివి? ఈ నగరంలోనే ఉంటావా? నిన్ను నేనెప్పుడూ చూడలేదే! ఈ బ్రాహ్మణోత్తముడు ఎవరు? ఇతడిని ఇప్పుడు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? మీరు వచ్చిన కారణం ఏంటో వివరించు." అందుకు అలంకారవతి రాజుతో ఇలా అంది: "మహాప్రభూ! నేను ఈ నగరంలోనే పేరుపొందిన ఒక వేశ్య కుమార్తెను. నా పేరు అలంకారవతి. నేను ఒక వ్రతాన్ని నియమంగా పెట్టుకుని, మా వేశ్య కుల మర్యాద అయిన వ్యభిచార వృత్తిని వదిలేశాను. బయటి ప్రపంచానికి కూడా తెలియకుండా ఇప్పటివరకు ఇంట్లోనే కాలం గడిపాను. అందుకే మీరు నన్ను చూసే అవకాశం రాలేదు." ఆ తర్వాత ఆమె తన వ్రతం వివరాలను, ఆ బ్రాహ్మణుడు తన ఇంటికి రావడం, అతడిని చూసి తాను మోహించి, నిద్ర లేపడానికి పడిన తాపత్రయాన్ని, తన మనసులోన...

Sivudi nataraja rupam venuka unna charitra emiti?

శివుడి నటరాజ రూపం వెనుక ఉన్న చరిత్ర ఏమిటి?

 ఇప్పుడు మనం శివుడిని నటరాజస్వామి రూపంలో ఎందుకు కొలుస్తారో తెలుసుకుందాం!

పురాణాల ప్రకారం నటరాజస్వామి రూపం గురించి రెండు కధలు ఉన్నాయి,అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా మొదట 
 మనమంతా నటరాజ స్వామి విగ్రహాన్ని చాలాసార్లు చూసే ఉంటాం కదా! కానీ మీరు ఎప్పుడైనా గమనించారా నటరాజస్వామి కుడి కాలు కింద ఒక రాక్షసుడు ఉంటాడు.
 నిజానికి అతను ఎవరో తెలుసుకుందాం నటరాజ స్వామి పాదం కింద ఉండే రాక్షసుడి పేరు అపస్మారుడు, అతనిని ముయలక అని కూడా అంటారు.
అతను ఒక మరుగుజ్జు రాక్షసుడు, ఇతడు అజ్ఞానం అజ్ఞానం మరియు అత్యాశ, స్వార్ధానికి గుర్తు.
అపస్మారుడు తనకు తాను అందరికంటే శక్తివంతమైన వాడి గా ప్రకటించుకున్నాడు అలాగే మిగతా అందరినీ హీనులుగా చూసేవాడు. స్కందపురాణంలో అతను అమరుడు అని చెబుతున్నారు అంటే తనకు చావు లేదు.
ఇతనికి ఒక వరం ఉంది అది ఏమిటంటే ఇతను ఎవరిని అయినా అపస్మారక స్థితిలోకి అంటే స్పృహ లేకుండా చేయగలడు, మరియు వారిని అజ్ఞానులుగా అలాగే మర్చిపోయేలాగా చేయగలడు.
అపస్మారుడి ఈ శక్తి వలన ప్రజలు చాలా బాధపడుతూ ఉండేవారు, దీని వలన ప్రజలు చాలా కష్టాలు అనుభవించే వాళ్ళు ఈ శక్తి వలన చాలా గర్వం ఏర్పడింది, అతను తనను ఎవరూ ఓడించలేరు అని అనుకునేవాడు.
ఇది ఇలా ఉండగా ఒకనాడు కొంతమంది ఋషులు వారి వారి భార్యలతో కలిసి యాగం చేస్తూ ఉన్నారు, వారు ఇంకా ఇలా అనుకున్నారు సృష్టి మొత్తం వారి యొక్క శక్తులు మరియు వారు  చేసే యాగల వల్లనే  నడుస్తోంది అని అనుకుంటు బాగా గర్వంగా ఉన్నారు.
అప్పుడే అక్కడికి పార్వతీపరమేశ్వరులు బిచ్చగాళ్ల రూపంలో అక్కడికి వెళ్తారు. అక్కడికి వారు వెళ్ళాక ఋషుల భార్యలువారికి నమస్కారం చేయడానికి యాగం మధ్యలోనే లేచి వెళ్తారు, ఇది చూసి ఆ ఋషులు బాగా కోపం తెచ్చుకుంటారు.
అప్పుడు ఆ ఋషులు వారికి ఉన్న శక్తులతో బిచ్చగాడి రూపంలో ఉన్న శివుడు పైకి రకరకాల విష సర్పాలను వదులుతారు అప్పుడు వాటిని శివుడు రకరకాల ఆభరణాలుగా ధరిస్తాడు.
తరువాత ఋషులు వారి చేతులతో భయంకరమైన పులిని కూడా పంపారు అప్పుడు శివుడు పులి చర్మాన్ని తేలికగా తన నడుముకి కట్టుకున్నారు.
తరువాత ఆ ఋషులు ఒక ఏనుగును వదిలి పెట్టారు అది బిచ్చగాడి రూపంలో ఉన్న శివుని చేతిలో మరణించింది, తరువాత వారు అపస్మారుడు అనే రాక్షసుడిని వారి పైకి పంపారు,
స్కంద పురాణం ప్రకారం ఆ సాధువులే వారి శక్తులను ఉపయోగించి అపస్మారుడిని సృష్టించారు.
అపస్మారుడు వారిపై దాడి చేస్తాడు ముందుగా పార్వతీదేవి పై దాడి చేసి ,పార్వతీదేవిని స్పృహలో లేకుండా చేస్తాడు.
ఇది చూసి శివుడికి చాలా కోపం వస్తుంది అప్పుడు శివుడు తన డమరుకాన్ని 14 సార్లు మ్రోగించాడు,
ఆ శబ్దానికి తట్టుకోలేక అపస్మారుడు భూమి మీద పడిపోయాడు.
దీని తరువాత శివుడు నటరాజ రూపం ధరించాడు, నటరాజ రూపం ఎలా ఉంటుంది అంటే:
 శివుడు కురులు గాలిలో ఎగురుతూ ఉంటాయి, అవి నలువైపుల కి విసిరేసినట్లు ఉంటాయి.
 కుడివైపున వెనక ఉండి చేతిలో డమరుకం, ముందు ఉండే చేతిలో అభయముద్ర సూచిస్తాయి.
 ఎడమవైపు వెనుక ఉండే చేతిలో అగ్ని, ముందు ఉండే చెయ్యి గజహస్తం ముద్రలలో ఉంటాయి.
జటాజూటంలో గంగా, తలపై చంద్రుడు అర్థచంద్రాకారం లో ఉంటాడు.
 ఈ మొత్తం ఆకారం గుండ్రటి ప్రభావం మండలంలో అమర్చబడి ఉంటుంది,
నటరాజ స్వరూపం ఓంకారాన్ని సూచిస్తుంది. 
పై వరుసలో ఉండే అగ్ని లయానికి గుర్తు,
అగ్ని పై ఉన్న వృత్తం జనన మరణాలకు నెలవైన భూగోళం.
శిరస్సు పై ఉండే తంగేడు పుష్పం ప్రకృతికి చిహ్నం.
జటాజూటం నుండ జాలువారే గంగా పాపాలను హరించే పరమ పావని, నెలవంక సృష్టికి చిహ్నం. చేతిలోని డమరుకం జనన మరణాల క్రమం.
శివుడు నటరాజ స్వరూపాన్ని ధరించి అపస్మారుని తన పాదం కింద నుంచి నాట్యం చేయడం ప్రారంభించాడు. నటరాజ రూపంలో శివుడు ఒక పాదంతో అపస్మారుని తొక్కి తన శక్తులను నాశనం చేశాడు, తరువాత స్థిరంగా ఉండిపోయాడు, దీనినే అంజలి ముద్ర అని కూడా అంటారు.
అపస్మారుడిని ఎందుకు వధించారు అంటే లోకములో అందరూ ఇక చావు లేదు అని అనుకుంటారు అని, దీని వలన అందరికీ ఏదైనా సాధించడం చాలా సులువు అనుకుంటారని మరియు చదువు పై ఉన్న గౌరవం తగ్గిపోతుంది అని అతనిని వధించారు.
తరువాత అక్కడ ఋషులకు
 వాళ్ళ  గర్వము పోయి శివుడిని ప్రార్థించారు, మరియు అలాగే అపస్మారుడిని తొక్కి అలాగే ఉంచమని ప్రార్థించారు ఎందుకంటే భవిష్యత్తులో ఎవరికీ అపస్మారుడి ప్రభావం ఉండకూడదు అని.

అలాగే పురాణాల ప్రకారం నటరాజ రూపం వెనకాల ఇంకో కథ ఉంది అది ఏమిటంటే, ఒకసారి శివుడు మరియు కాళీమాత నాట్య పరీక్షలో పోటీ పెట్టుకున్నారు. దానికి విష్ణువు అధ్యక్షత గా ఉన్నాడు, వారిని నృత్యం చూడటానికి సకల దేవతలు వచ్చి, అందరూ ఏదో ఒక సంగీత పరికరాన్ని మ్రోగిస్తున్నారు. అయితే శివుడు కాళీమాత నాట్యం ఇద్దరు బాగా చేస్తూ ఉన్నారు. అప్పుడు శివుడు పోటీలో ఎవరో ఒకరి గెలవాలని తన ఎడమ కాలిని కుంకుమ కాళీ మాత నుదుటన ఆ బొట్టు పెడతాడు.
 కాళీ మాత ఎంతైనా ఆడది కదండీ మరియు శివుడి భార్య కదా తను అలా చేయలేదు కదా, అందుకని శివుడిని విజేతగా ప్రకటించింది.
అలాగే శివుడు నాట్యానికి అధిపతిగా చేసింది ఆ విధముగా శివుడు నటరాజు అయ్యాడు.
 పురాణాల ప్రకారం నటరాజా రూపం వెనుక ఉన్న చరిత్ర ఇది.




←Prev                                                                                                                                                                                                                                                

Comments

Popular posts from this blog

Dasarathudu Ayodhyaku Cheratam || దశరథుడు అయోధ్యకు చేరటం || Episode 34 || Ramayanam

Ramayanam || Shiva Dhanassu

Goppa Thyagam || గొప్ప త్యాగం || Moral Stories || నీతి కథలు