ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ || Prema Kosam Rajasabha Varaku Vachhina Alamkaravathi Katha || Episode - 14 || Bhatti Vikramarka Kathalu
పరశురాముడు రామునికి సవాలు విసరడం
పరశురాముడు రాముడితో ఇలా అన్నాడు : రామా! నీవు గొప్ప పరాక్రమవంతుడవని విన్నాను. శివధనుస్సును విరిచావు అంట గదా! అది చాలా గొప్ప విషయమే. ఆశ్చర్యాన్ని కూడా కలిగిస్తోంది. అయితే నీ శక్తి పరాక్రమాలేమిటో స్వయంగా చూడాలని ఒక ధనుస్సును తీసుకొచ్చాను. ఇది నాకు జమదగ్ని మహర్షి అయిన నా తండ్రి నుండి సంక్రమించింది. దీన్ని ఎక్కుపెట్టి బాణం వేస్తే, నేను కూడా నీ పరాక్రమాన్ని మెచ్చుకొని నీతో ద్వంద్వయుద్దానికి అంగీకరిస్తాను. ఎందుకంటే లోకంలో ఇద్దరు రాముళ్ళు ఉండకూడదు. రాముడో, పరశురాముడో ఎవరో ఒక్కరే ఉండాలి.
దశరథ మహారాజు దీనుడై, వాడిపోయిన ముఖం పెట్టుకొని పరశురాముడితో ఓ రామా! క్షత్రియులపై కోపాన్ని తొలగించుకొని చాలాకాలంగా శాంతంగా ఉంటున్నావు గదా? ఉన్నట్లుండి పసిబాలురైన నా కుమారులపై ఎందుకు కోపం ప్రదర్శిస్తున్నావు? నువ్వు భృగువంశీయ బ్రాహ్మణుడవు. దేవేంద్రుని ముందు శపథం చేసి అస్త్రసన్యాసం చేశావు. ఈ భూమినంతా కశ్యపునికి దానం చేసి గొప్ప ధార్మికుడవై, మహేంద్ర పర్వతంపైన తపస్సు చేసుకుంటున్నావు గదా!
ఓ మహామునీ! ఈ రోజు అకారణంగా మా అందరిపైనా ఎందుకు కోపగించుకుంటున్నావు. మా వినాశాన్ని కోరివచ్చావా? రాముడు మరణించిన మేమందరమూ మరణిస్తాం. నా కుమారులకు అభయం ఇవ్వు. నా కోరిక మన్నించు అని అన్నాడు.
అప్పుడు పరశురాముడు రాముడితో ఇలా అన్నాడు : ఓ రామా! నీవు నరశ్రేషుడవైతే, ఇచట రెండు ధనుస్సులు ఉన్నాయి. అవి ఐహుశ్రేష్టమైనవి. వాటిని విశ్వకర్మ నిర్మించాడు. ఇవి దేవలోకానికి చెందినవి. అందులో ఒకటి త్రిపుర వినాశానికి దేవతలు శివునికిచ్చారు. దానిని నీవు విరిచావు. ఇక రెండవది దానిని దేవతలు విష్ణువు కిచ్చారు. ఈ విష్ణు ధనుస్సు కూడా అతి పవిత్రమైనది, దృఢమైనది.
దేవతలందరూ శివ, విష్ణుల బలాబలాలు తెలుసుకోగోరి బ్రహ్మను అడిగారు. అప్పుడు బ్రహ్మ వారిద్దరికీ మిథ్యావైరం కల్పించాడు. వారిరువురూ ఒకరి నొకరు జయించాలనే పట్టుదలతో భయంకరంగా పోరాడారు. విష్ణువు తన శక్తినంతా కూడగట్టుకొని ఒక్క హూంకారం చేశాడు. దాంతో శివధనుస్సు జడమైపోయింది. దాంతోపాటు లోకాలన్నీ చైతన్యాన్ని కోల్పోయి జడమయ్యాయి. ఆ విపరీత పరిణామానికి, దేవతలు, బుషులు, చారణులు తల్లడిల్లిపోయారు. బ్రహ్మాది దేవతలంతా వచ్చి ప్రార్ధించగా వారివురూ శాంతించారు. శివధనుస్సు జడమై పోవటం వలన విష్ణుశక్తియే గొప్పదని తీర్మానించారు. కోపించిన శివభగవానుడు, జడమైపోయిన శివధనుస్సును రాజర్షియెన దేవరాతునకిచ్చాడు.
ఓ రామా! ఈ ధనుస్సు శత్రు వినాశకరమైనది. విష్ణువు, భృగు వంశానికి చెందిన బుచీకునకు న్యాసంగా ఇచ్చాడు. మహాత్ముడూ, కర్మ మార్గావలంబీ అయిన ఆ బుబీకుడు నా తండ్రి అయిన జమదగ్నికి ఇచ్చాడు. మహాతపస్పంపన్నుడైన నా తండ్రి నిరాయుధుడుగా ఉన్నప్పుడు కార్తవీర్యార్డునుడు నా తండ్రిని చంపాడు.
దారుణంగా, అతికిరాతకంగా నా తండ్రిని చంపిన క్రోధంతో నేను అనేక పర్యాయాలు క్షత్రియ జాతియందు పుట్టిన ప్రతివాణ్ణి చంపుతూ వచ్చాను. ఈ భూమినంతా జయించాను. చివరకు మహాత్ముడైన కశ్యపునకు ఈ భూమినంతా దానం చేశాను. పిదప మహేంద్ర పర్వతానికి పోయి తపస్సు చేసుకుంటున్నాను.
పరాక్రమవంతుడవైన ఓ రామా! ఇప్పుడు నీవు శివధనుస్సును విరిచావని తెలిసింది. అందుకే వేగంగా నిన్ను చూచేందుకు వచ్చాను. క్షత్రియుడవైతే, క్షత్రియ ధర్మాన్ని పాటించి శ్రేష్టమైన ఈ విష్ణు ధనుస్సును స్వీకరించు. నారి సంధించు. బాణము నెక్కుపెట్టు. అట్లా చెయ్యగలిగితే నీతో ద్వంద్వయుద్ధం చేస్తాను.
Comments