ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ || Prema Kosam Rajasabha Varaku Vachhina Alamkaravathi Katha || Episode - 14 || Bhatti Vikramarka Kathalu
బ్రహ్మరాక్షసుడు చంద్రవర్ణుడితో సంభాషించడం
చంద్రవర్ణుడు ఏ చెట్టు నీడలో పడుకున్నాడో ఆ రావి చెట్టుపై చాలా సంవత్సరాల నుండి ఒక బ్రహ్మ రాక్షసుడు నివసిస్తున్నాడు. అతడు ప్రతిరోజు మధ్యాహ్న కాలం దిగివచ్చి మనిషి రూపం దాల్చి ఆ జలాశయంలో స్నానం చేసి అతని నిత్య కృత్యాలు పూర్తి చేసి మరలా తిరిగి ఆ చెట్టు ఎక్కి అతడు తపస్సు చేస్తూ ఉండేవాడు. ఆ రోజు కూడా ఆ బ్రహ్మ రాక్షసుడు తన అలవాటుగా చెట్టుపై నుండి దిగివచ్చి ఆ వృక్షం దగ్గర పడుకుని నిద్రపోతూ ఉన్నా ఆ అందమైన బ్రాహ్మణుని చూసి ఆశ్చర్యపోయాడు, కొంతసేపు అతనినే అలాగే చూస్తూ నిలుచున్నాడు పిమ్మట ఆ జలాశయం లోకి వెళ్లి నిత్య కృత్యాలు చేసి మరల చెట్టు దగ్గరికి వచ్చి గాఢ నిద్రపోతున్న అతని వృత్తాంతం అడిగి తెలుసుకోవాలని అనుకొని అతని తట్టి నిద్రలేపాడు.
అంతలో చంద్రవర్ణుడు టక్కున లేచి కూర్చొని కన్నులు నలుపుకొని తన ముందు నిలుచుని ఉన్న మహా తేజస్వియైన బ్రహ్మరాక్షసుడిని చూసి అంతట నిర్మానుష్యమైన చోట హఠాత్తుగా అతడు కనబడే సరికి ఆశ్చర్యపోయి అతనిని చూసి తనలో తను ఇలా అనుకున్నాడు: ఇతడు ఎవరో మహాత్ముడి లాగా ఉన్నాడు, అని అనుకొని లేచి బ్రహ్మ రాక్షసుడికి నమస్కరించి నిలుచున్నాడు.
అప్పుడు ఆ రాక్షసుడు చంద్రవర్ణుని చూస్తూ ఓయి బ్రాహ్మణుడా! నువ్వు ఎవరు? నీ నివాస స్థానం ఎక్కడ? ఈ నిజ్జన ప్రదేశానికి ఎందుకు వచ్చావు? ఇక్కడ ఎందుకు నిద్రపోతున్నావు? నీ వృత్తాంతం ఏమిటో చెప్పు అని అడిగాడు. చంద్రవర్ణుడు మిక్కిలి వినయముతో మొదటి నుండి తన గురించి చెప్పాలని అనుకుని తన పేరు చంద్రవర్ణుడని అని, విద్యాభ్యాసం కోసం తాను ఇల్లు వదిలి రావడం, దేశ దేశాలు తిరగడం, ఎక్కడ తనకు గురువు లభించకపోవడం, నిరాశపడి తను తిరిగి తన గ్రామానికి తిరిగి బయలుదేరడం, అలసిపోయి ఉన్నతనకు దాహం వేసి ఇక్కడికి నీరు తాగడానికి వచ్చి తృప్తిగా నీరు తాగి చల్లగా ఉండడం వల్ల ఈ చెట్టు నీడలో విశ్రమించాను, హాయిగా వేయడం వల్ల ఇక్కడ నిద్రపోయాను అని చెప్పాడు. మహాత్మా! ఎండ వేడి వలన అలసిపోయి నిద్రపోయాను అందువలన మీ రాకను గుర్తించలేదు, నా అపరాధాన్ని క్షమించాలని కోరుతున్నాను. మీరు తట్టి లేపే వరకు నాకు మెలకువ లేదు అని చెప్పాడు.
బ్రహ్మ రాక్షసుడు అతని చరిత్ర విని అతనికి విద్యపై కలిగి ఉన్న ఆసక్తిని చూసి ఆశ్చర్యపడి శాంతముఖుడై, అతనిని చూసి చంద్రవర్ణా! నువ్వు మిక్కిలి బుద్ధిమంతుడివి. నీకు విద్య మీద ఉన్న ఆసక్తి అధికము, ఎన్నో శాస్త్ర విద్యలను అభ్యసించిన తృప్తి చెందక ఇంకా విశేషాలను గ్రహించాలని ఆపేక్ష కలవాడివై, ఇల్లు వాకిలి వదిలి గురువులు కొరకై నాన్న దేశాలు తిరిగి మహా ప్రయాస చేశావు చెందావు. అవును, విద్యకు అంతం ఎక్కడిది? విద్యాపేక్ష కలవారు కష్టాలను లెక్కిస్తారా? అయినా కూడా ఇన్ని కష్టాలకు లోనైనా నీ కోరిక నెరవేరగలదా? అయ్యో పాపం,నీ కష్టం అంత వ్యర్థమైనది. దీనికై నేను జాలి పడుతున్నాను. నువ్వు నా పట్ల చేసిన అపరాధం ఏదీ లేదు, కావున నిన్ను మన్నించడానికి కారణం ఏమీ లేదు. నిద్రపోతున్న నిన్ను నిద్ర లేపి నేనే తప్పు చేసిన వాడిని అయ్యాను. నువ్వు అడుగుటకు ముందే నా చరిత్ర చెప్పి యోగ్యుడైన నీకు ఒక ఉపకారం చేయాలని అనుకుంటున్నాను. నిన్ను చూసి నీ కథను వినడం వల్ల నా మనసులో జాలి పుట్టింది. అందుకే నేను ఎవరో? నేనిక్కడ ఉండడానికి గల కారణం ఏమిటో ముందు చెప్తాను శ్రద్ధగా విను అని పలికి ఇలా చెప్పడం ప్రారంభించాడు.
Comments