ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ || Prema Kosam Rajasabha Varaku Vachhina Alamkaravathi Katha || Episode - 14 || Bhatti Vikramarka Kathalu
దయ్యాల భవంతిని కొనుగోలు చేయుట (part 1)
విద్యలనగరమైన విజయనగరంలో రామలింగకవి తన భార్య ఇద్దరు పిల్లలతో రాయలు వారు ఇచ్చిన ఓ పురాతనమైన గృహంలో కాపురం పెట్టాడు. రాజాధిరాజు తలుచుకుంటే సౌకర్యాలకు కొదవ ఏముంటుంది.
ఇంటినిండా పప్పులు, బియ్యాలు, పట్టువస్త్రాలు అంగడికి పోయి ఏమైనా కొనుగోలు చేయాలనుకుంటే అందుకు పదింతలు ధనం సమకూర్చ బడింది. తనకొత్త జీవితానికి తనే ఎంతో మురిసిపోతూ ఇంటి అరుగు మీద కూర్చున్నాడు రామలింగడు.
ఇంట్లోంచి కమ్మటి నేతివంటకాల వాసనకు ముక్కుపుటాలు ఎగరేస్తున్న రామలింగని చెవికి ఓ చాటింపు వినిపించింది. "పురజనులకు ఓ ముఖ్యవిన్నపం అయ్యా! నగరంలో అతిపెద్ద నగలవ్యాపారి లింగిశెట్టిగారు తను ఎంతో ముచ్చటపడి నిర్మించుకున్న అత్యాధునిక భవనాన్ని అమ్మేస్తున్నారహో! కొనగల శ్రీమంతులు ఎవరైనా ముందుకు రావచ్చు!" అని అరిచి చెప్తున్నాడు. రామలింగకవి ఆ చాటింపు వేసే వాడిని పిలిచి ఆరా తీసి విషయం తెలుసుకున్నాడు. ఈలోగా అతని భార్య లోపలనుంచి వచ్చి “ఇక్కడైనా కాస్తా బుద్ధిగా ఉండండి. ఏదో రాయలవారి ధర్మమా అని ఓ గొప్ప బ్రతుకుదారి దొరికింది. వీధిగుమ్మంలో కూర్చున్నారంటే నాకు చచ్చేటంత భయం. దారిన పోయే అన్నిటిలో వేలు, చెయ్యిపెట్టకండి. నేను నాపిల్లలు అన్యాయం అయిపోతాం." అని నిష్ఠూరంగా పలికి చరచరా వెళ్లిపోయింది.
రామలింగడు హాయిగా నవ్వుకున్నాడు. ఆ సాయింత్రమే నగల వ్యాపారి ఇంటిని చూడడానికి వెళ్లాడు. అదో రాజభవనంలా ఉంది. చాలా ధనంతో నిర్మించబడింది. లింగిశెట్టి తను ఆ ఇంటిని ఎందుకు అమ్ముతున్నాడో చెప్పాడు, అది విని రామలింగడు అంతులేని ఆశ్చర్యానికి గురయ్యాడు. "అయ్యా! రామ లింగకవిగారూ, ఈ ఇంటిని తమరు కొనలేరు. ఆరువేల వరహాలకు ఒక్క చిల్లి గవ్వ తగ్గించలేం. అయినను తమరు ఈ నగరానికి కొత్తగా వచ్చారు. సంపాదనలో లేరు. కొన్నాళ్ళు పోయాకగాని మీ వలన కాదు. రాయలవారి దయ పొందాలి "అని నసిగాడు.
“ఓ వర్తకుడా, నా కన్నివిధాల ఈ భవనం నచ్చింది. ఇప్పటికే నాకు రాయలవారు చాలా ధనం ఇచ్చి ఉన్నారు. కనుక నాకుఈ భవనాన్ని అమ్మినచో కొనుగోలు చేస్తాను. ఇతర విషయాలు నువ్వు ఆలోచించమాకు. కొంత ధనంఇప్పుడు ఇస్తాను. మిగిలినది ఒక్క నెల గడువులో పూర్తిగా చెల్లించ గలను" అని రామలింగడు తన కోరికను తెలిపాడు.
"చూస్తే నా వంటివాడవు. బ్రాహ్మణుడివి. ఈ ఇంట్లో ఎలా ఉండ గలవు? అసలే దయ్యాలు, పిశాచాలు భవనాన్ని వదలకుండా పట్టిపీడిస్తున్నాయి అని నీకు చెప్పాను కదా!. నా మొత్తం కుటుంబం అంతా కలిసి అరవైమంది వరకు ఉన్నాం. ఏమీ చేయలేక పోయాం. ఎంత మంది భూతవైద్యుల్ని రప్పించినా ఫలితం లేకపోయింది. చివరికి ఎంతో ముచ్చటపడి కట్టుకున్న భవనం అమ్మదలిచాం. ఏ ఒక్కరం ఇక్కడ ఉండడానికి ధైర్యంగాలేము. భయభ్రాంతులైపోయాం. కనుక సాహసించి కొనవద్దయ్యా. నిన్ను చూడగానే విషయం చెప్పిన నువ్వు వినవెందుకు?" అని జాలిగా అడిగాడు లింగిశెట్టి.
“నేను కాళీ ఉపాసకుడను. నాకు చీడపీడలబాద లేదు. ఈ ఇంటిని చాలా కాలంగా అమ్మజూపినా ఎవరూ రాలేదని తెలిసివచ్చాను. నేను ఇష్ట పడుతున్నాను. అమ్ముకో! ”అని భుజం తట్టాడు రామలింగకవి.
లింగిశెట్టి తీవ్రంగా ఆలోచించి సరేనన్నాడు. చివరికి వెయ్యివరహాలు పుచ్చుకుని ఓ పత్రం రాయించుకున్నాడు. ఒకనెల గడువు మాత్రమే ఇచ్చాడు. ఎట్టిపరిస్థితిలో నెలలోపు మిగిలిన చెల్లింపులు చేయాలి లేకుంటే రాయల వారి బాల్యస్నేహితుడను. కనుక రాజతీర్పు పొందగలను. కొత్తగా వచ్చిన వాడవు నీపై రాయలకు చులకన భావం ఏర్పడి అసలకే మోసం రాగలదు. బతుకుచెడి వీధిన పడతావు. "అని సుతిమెత్తగా హెచ్చరించాడు లింగిశెట్టి, రామలింగడు మరోసారి నవ్వుకున్నాడు. అన్నినియమ నిబంధనలకు సై అన్నాడు. తొలి చెల్లింపు ఇచ్చి తృప్తిగా నవ్వుకున్నాడు.
రామలింగడు రాయలిచ్చిన గృహాన్ని వదిలి కొత్తగా కొన్న భవనానికి వెంటనే మారాడు. ఈవిషయం రాయబారుల ద్వారా విన్న రాయలు ఒకింత ఆశ్చర్యపడినా, తనకు మాటమాత్రంగా అయినా చెప్పకుండా ఇంత తొందరగా స్వంతనిర్ణయాలు తీసుకోవడమా? తనకు చెప్పి ఉంటే కొనిపెట్టేవాడ్ని కదా అని పరిపరివిధాలుగా అలోచించాడు. ఆ తరువాత ఏ రోజు చెప్పనే లేదు. మూడునెలలు గడిచాయి.... ఒక విధంగా రాయలు బయటికి కనపడకుండా లోలోపల నొచ్చుకున్నాడు.
రాయలవారు నిండుకొలువులో ఊపిరిసలపనంతా పని ఒత్తిడిలో ఉండగా లింగిశెట్టి వచ్చి పిర్యాదు చేసాడు. ఒక్కసారి సభంతా నిశ్శబ్దం అయిపోయింది. జనులంతా ఖిన్నులై విన్నారు. “సాహితీ సమరాంగన సార్వభౌమా! మీ బాల్యమిత్రుడు ఈ రోజు మీముంగిట తీర్చుకై చేతులు కట్టుకుని నిలుచున్నాడు. నేను విధివశాత్తు ఓ అద్భుతమైన భవనాన్ని నిర్మించాను. అది వెలకట్టలేనిది. కానీ, అందు నివసించలేనిదిగా కొరకరాని కొయ్యిగా నా పాలిటి మిగిలింది. అతి తక్కువ వెలకు కొత్తగా తమ కొలువుకు విచ్చేసిన రామలింగకవిగారికి అమ్మేశాను.
ఆయన నమ్మబలికి మొదట అతి తక్కువ ధనమిచ్చి, నెలగడువులోపు మిగిలినది తప్పక జమచేస్తాను అని చెప్పి ఇప్పుడు మూడునెలలు అయిన పిదప ఇక తాను ఇవ్వవలిసినది ఏమీలేదు అని చెప్తున్నాడు. నాకు తగు న్యాయం చేయవలిసిందిగా కోరుతున్నాను అని మొత్తం వివరించాడు లింగిశెట్టి. రాయలు లోలోపల చాలా బాదపడ్డాడు. ఇదేమీ ఈ కొత్తకవి వింత పోకడలు. వినుటకే చాలా కష్టంగా ఉంది. సరే పిలిపించి విచారిస్తే తెలుస్తుంది. వెంటనే రామలింగకవిని పిలిపించాడు. ఆ రోజు ఆ సభలో దిగ్గజాలవంటి కవులు ఆశీనులైఉన్నారు. సభకు విచ్చేసిన రామలింగకవి సభకు, రాయలవారికి, ప్రముఖులకు నమస్కరించి "రాయలవారితో సభకు తక్షణం పిలిపించడానికి కారణం ఏమిటి? నాకు తెలియకుండా నేనేమైనా తప్పుచేసి ఉన్నానా, తెలుసుకోవాలని కోరుతున్నాను ”అని మిక్కిలి వినమ్రతతో అడిగాడు.
రాయలకు ఎందుకో ఆక్షణం తట్టుకోలేనంత కోపం వచ్చింది. అది గ్రహించిన మహామంత్రి తిమ్మరుసు రాయలకు కనుసైగచేసి ఓపిక పట్టుమన్నాడు. రాయలు మనస్సును కుదుటపరుచుకుని "కొత్తగా మాకొలువుకు విచ్చేసిన ఓ కవి రాజశేఖరా, మీ పై ఈ నగలవర్తకుడు పెద్ద అభియోగం చేసారు. మీరీతన్ని మోసంచేసారని, అయితే పూర్వపరాలు చూడగా మీరు పెద్దతప్పు చేసారనిపిస్తోంది. దీనిపై మీరిచ్చు సమాధానం? ఏదీ దాచకుండా సభకు తెలియపరచండి. నిజాలే ఇక్కడ వింటాం. అబద్దానికి తావులేదు. తప్పుజరిగినట్టు రుజువైనచో తీవ్రదండన తప్పదు." అని మంత్రి రామలింగడితో చెప్పాడు.
Comments